నాంచారిమడూర్

తెలంగాణ, మహబూబాబాదు జిల్లా, తొర్రూర్ మండలం లోని గ్రామం
(నాంచారిమాదూర్ నుండి దారిమార్పు చెందింది)

నాంచారిమడూర్, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు  జిల్లా, తొర్రూరు మండలంలోని గ్రామం.

నాంచారిమడూర్
—  రెవిన్యూ గ్రామం  —
నాంచారిమడూర్ is located in తెలంగాణ
నాంచారిమడూర్
నాంచారిమడూర్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°37′11″N 79°36′20″E / 17.619685°N 79.605661°E / 17.619685; 79.605661
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబాబాదు
మండలం తొర్రూర్
ప్రభుత్వం
 - సర్పంచి గుంటుక యాదలక్ష్మి
పిన్ కోడ్ 506317
Area code(s) 08719
ఎస్.టి.డి కోడ్ గ్రామీణ వికాస్ బ్యాంక్

ఇది మండల కేంద్రమైన తొర్రూరు నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన వరంగల్ నుండి 46 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [1]

నాంచారిమడూర్ గ్రామ దేవత బొడ్రాయి.

గణాంకాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 872 ఇళ్లతో, 3551 జనాభాతో 1309 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1751, ఆడవారి సంఖ్య 1800. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 647 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 678. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 578525[2].పిన్ కోడ్: 506317.ఓటర్లు: 2600.[3]

గ్రామ చరిత్ర

మార్చు

తెలంగాణా సాయుధ పోరాటం రోజుల్లో నిజాం కాలంలో ఈ గ్రామంలోని వారు కొందరు చావుదెబ్బలు తిన్నారు.కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణా అన్ని గ్రామాల్లో లాగే ఈ గ్రామంలోను, పెద్ద పెద్ద గుడులు, తెలంగాణ గడీలు దొరలవి, బురుజు ఉన్నాయి.ఐతే వారి ప్రతిభా సామర్థ్యాలకు తగినంత గుర్తింపు రాకపోవడానికి నాటి సాంఘిక పరిస్థితులే కారణం.తెలంగాణ ఉద్యమంలో అనేకమైన పోరాటలు చేసిన నేల ఈ గ్రామం.

గ్రామం పేరు వెనుక చరిత్ర

మార్చు

నాంచారిమడూర్ సుమారు 1000 ఏండ్ల పైన చరిత్ర ఉన్న గ్రామం. కాకతీయులు కట్టించిన శివాలయం దీనికి సాక్షం... ఈ ఊరి మద్యలో ఉంది.కాకతీయులు తోవ్వించిన సుమారు 400 ఎకరాల విస్తీర్నంలో 13 అడుగుల లోతు ఉన్న ఊర చెరువు ఉంది.

 
ప్రస్తుత శివాలయం
నాంచారిమడూర్

ఈ గ్రామం సా.శ.పూ. ముందు చిన్న పల్లెటూరు. మడూగూర్ అంటే గ్రామం పక్కనే నీళ్లతో నిండి ఉండే (మడుగు, చెరువు, కొలను, బొంద,) ప్రదేశం అని అర్ధం.పూర్వం కాలంనుండి ఆదే మడుగులోని మంచి నీరే ఈ ఊరికి ఆధారం. వానాకాలంలో డయేరియా, కలరా వస్తే ఆరోజుల్లో "ఘత్తర" లేసింది అనేవారు. గ్రామంలోని వారు వాన నీరుతో నిండిన ఆ మడుగు నీరు త్రాగడం వలన కలరా సోకి ఊరిలో చాలా మంది చనిపోయేవారు.. గ్రామ పెద్దలు ఊరును మరో ఏరియాకు "హనుమంతుని మిట్ట" అనే ప్రాంతానికి, పాతగ్రామానికి తూర్పుగా 0.5 కి.మీ. దూరం తరలించారు. మరి కొద్ది రోజులకు "అంగడి చింత" అనే ప్రాంతానికి, పాత గ్రామానికి దక్షిణంగా 0.5 కి.మీ. దూరం తరలించారు. అయినా కలరా వ్యాధి బారినపడి పిల్లలు, యువకులు చనిపోవుచున్నారు. అప్పుడు భీభీ నాంచారి వారసురాలు "నాంచారమ్మ" అనే ఎరుకల సాని "సోది (జాతకం) చెప్పుతాను అంటూ ఈ గ్రామం లోకి వచ్చింది. గ్రామ పెద్దలు ఆమెతో “ ఊరిలో చాలా మంది పిల్లలు, యువకులు వ్యాధి బారిన పడి చనిపోవుచున్నారు. దానికి కారణం ఏమిటి? నివారణ కూడా నీవే చెప్పమన్నారు. అందుకు ఆమె ఈ గ్రామానికి రెండు సమస్యలు ఉన్నవని, ఒకటి ఈ గ్రామానికి బొడ్ర్రాయి లేదు. నాపేరు కలిపి "నాంచారి మడూగూర్" అని పెట్టుకుంటే మరో సమస్యకు నివారణ చెప్పూతానంది. గ్రామ పెద్దలు, ప్రజలు అందరు సరేన్ననారు. కొన్నాళ్లకు ఆమె చేతనే బొడ్ర్రాయి వేయించారు. ముఖ్యమైన గ్రామ పెద్దలు మరో సమస్యకు నివారణ చెప్పూ అన్నారు " ఓ నిండు గర్భవతి అయిన మహిళను ఓ గోతిలో (గుంట, రంద్రం, బోంద) సజీవంగా పాతిపెట్టాలని ఆ తరువాత ఓ మేకను కూడ బలి ఇవ్వాలని గ్రామంలోని అందరు గోతిని దాటినచో ఈ గ్రామంలో అందరు సుఖసంతోషాలతో ఉంటారని" చెప్పింది నాంచారమ్మ. మేకలను బలి ఇవ్వడం సాదరణ విషయమే కానీ, ఆడపిల్ల అందులోను నిండు గర్భవతి అయిన మహిళను అనగానే గ్రామ పెద్దలు కొంత సమయం కావాలన్నారు. అప్పటికి ఇంకా కలరా వ్యాధి బారినపడి మరి కొందరు పిల్లలు, యువకులు చనిపోవుచున్నారు. అప్పుడు గ్రామంలోని గిరిజన పెద్దలు నాంచారమ్మ చెప్పింది చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అందులో ముఖ్యమైన అతను భూక్యా సూర్య నాయక్ నాంచారమ్మను కలిసి గ్రామం పక్కన ఉన్న మా తండాలో నువ్వు చెప్పినట్లూ చేస్తాం. రేపు రాత్రికి నువ్వు దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని జరిపించాలని నాంచారమ్మను అడిగాడు.

అనుకున్నట్టు మరసటి రోజు రాత్రికి దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని జరిపించాలని నాంచారమ్మ తండాలోని సూర్య నాయక్ ఇంటికి వచ్చింది. ఆమె చెప్పినట్టు గోతిని ఆరు అడుగులు తవ్వుచున్నారు.బానోత్ హరిచంద్రు నాయక్, హీరానాయక్, మాన్ సింగ్ నాయక్, లాల్ సింగ్ నాయక్ (ఇందులో గూగులోతు వంశం వారు). మేకను పక్కన కట్టేసి, పసుపు కుంకుమ సిద్దంగా ఉంచారు. నాంచారమ్మ " నిండు గర్భవతి అయిన మహిళను తీసుకువచ్చారా" అని అడిగింది "తీసుకువచ్చాం, పక్కన ఇంట్లో ఉంది. తీసుకురాగానే అరుస్తుంది. ఆమెను సజీవంగా పాతి పెట్టేది ఆమెకు తెలియదని, పనులు అయ్యాకా తీసుకువస్తాం ఆగమని" నమ్మబలికాడు సూర్య నాయక్. ఆమె చెప్పినట్టు గోతిని ఆరు అడుగులు తోవ్వుడు అయిపోయింది.

పాతి పెట్టే మహిళను తీసుకురమ్మని చెప్పింది నాంచారమ్మ. తీసుకువస్తాం కాని ఏలా పడుకో పెట్టాలని అడిగాడు సూర్య నాయక్. "తూర్పుగా తల పెట్టించి వెళ్లికిలా పడుకో పెట్టాలని చెప్పింది నాంచారమ్మ. అర్ధం కావడం లేదు పాతి పెట్టే మహిళను తీసుకురాగానే అరుస్తుంది, ముందు ఏలా పడుకో పెట్టాలో చూపించు అని నాంచారమ్మను అడిగాడు సూర్య నాయక్.నాంచారమ్మ మెల్లిగా గోతిలోకి దిగి ఏలా పడుకో పెట్టాలో చూపిస్తూ పడుకుంది. సూర్య నాయక్ మట్టి పోయాలని అందరికి అరిచి చెప్పాడూ అక్కడ ఉన్న వారికి.... అప్పుడు అర్ధం అయింది నాంచారమ్మకు నేను నిండు గర్భవతి కదా పాతి పెట్టే మహిళను నేనే అని.

భూక్యా సూర్య నాయక్ నమ్మించి ఇంటికి వచ్చిన నిండు గర్భవతిని పాతి పెట్టిన మీ వంశం ఒక చెట్టుకు ఒకటీ, రెండు పిట్టల్లా (ఒక చోట కొన్నిమాత్రమే ఎక్కువ కుటుంబాలుగా ఒకే చోట ఉండలేరని) భూక్యా వంశాన్ని శపించింది.ఆమెకు అర్ధం అయింది. ఈ గ్రామం నా బలిదానంతో "నాంచారి మడూగూర్"గా శాశ్వతంగా ఉంటుంది. ప్రతి ఏడూ "శ్రావణమాసం" (జూన్ - జూలై) లో ఏదో ఒకరోజులో ప్రతి గిరిజన తండాలో మేకలను బలి ఇవ్వాలని, ఆ గ్రామంలోని అందరు గోతిని దాటినచో ఆ గ్రామంలో అందరు సుఖసంతోషాలతో ఉంటారని" చెప్పింది నాంచారమ్మ.

ఆ ఆనవాయితి గా "దాటుడు పండుగ "శ్రావణమాసం" (జూన్ - జూలై) లో ఏదో ఒకరోజులో ప్రతి గిరిజన తండాలో మేకలను బలి ఇచ్చి పండుగ చేసుకుంటున్నారు.గ్రామం పేరు కాల గమనంలో నాంచారి మడూగూర్ కాస్తా నాంచారి మడూర్ అయింది.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ఐదుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల తొర్రూరులోను, ఇంజనీరింగ్ కళాశాల బొల్లికుంటలోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల బొల్లికుంటలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు వరంగల్లోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం తొర్రూరులోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల వరంగల్ లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

నాంచారిమాడూర్లో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో6 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఆరుగురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

నాంచారిమాడూర్లో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 24 గంటల పాటు వ్యవసాయానికి, 24 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

నాంచారిమాదూర్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 75 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 111 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 138 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 171 హెక్టార్లు
  • బంజరు భూమి: 1 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 810 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 695 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 288 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

నాంచారిమాదూర్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 257 హెక్టార్లు* చెరువులు: 31 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

నాంచారిమాడూర్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

వరి, ప్రత్తి, మొక్కజొన్న,పత్తి, వరి, పసుపు, ఉల్లిగడ్డ, మొక్కజొన్న, కందులు, జొన్నలు, మిరప, పెసాల్లు, కూరగాయలు, ఆకుకూరలు మెదలగునవి.

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం ప్రధానం. ఇంకా కులవృత్తులు గౌడుల కుటుంబాలు కళాలి (119) తాళ్ళూ యెక్కి కల్లుగీయడం, యాదవులు (60) గొర్లు కాస్తారు, వ్యాపారం కొద్ది మంది చేస్తారు.

డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు

మార్చు

పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకంలో భాగంగా నిర్మించిన 30 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను 2022, నవంబరు 25న తేదీన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించి, లబ్ధిదారులకు అందించాడు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, జెడ్పీటీసి మంగళపల్లి శ్రీనివాస్, సర్పంచ్ గుంటక యాదలక్ష్మి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[4]

గ్రామ భౌగోళికం

మార్చు

సమీప గ్రామాలు

మార్చు

సమీప మండలాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. డర్ ూ"ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-08-02. Retrieved 2017-06-11.
  4. telugu, NT News (2022-11-25). "ప్రజల కోసం కేసీఆర్‌ చేసినన్ని పనులు మరే ముఖ్యమంత్రి చేయలేదు: మంత్రి ఎర్రబెల్లి". www.ntnews.com. Archived from the original on 2022-11-25. Retrieved 2022-11-25.

వెలుపలి లంకెలు

మార్చు