నాగపూర్ హైదరాబాద్ బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వే
నాగ్‌పూర్-హైదరాబాద్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వే, ప్రతిపాదిత 1,100 కి.మీ. (680 మై.) పొడవైన, ఎనిమిది లేన్ల, గ్రీన్‌ఫీల్డ్ యాక్సెస్-నియంత్రిత ఎక్స్‌ప్రెస్‌వే. దీనిని నాగ్‌పూర్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వే అని కూడా అంటారు. ఇది మహారాష్ట్రలోని మూడవ అతిపెద్ద నగరమైన నాగ్‌పూర్‌ను కర్ణాటక రాజధాని బెంగళూరుతో కలుపుతుంది. హైదరాబాద్, కర్నూలు గుండా వెళ్తుంది. ఇది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గుండా వెళుతుంది. దీనివలన ప్రయాణ సమయం, దూరం రెండూ తగ్గుతాయి. ప్రస్తుతమున్న 24 గంటల ప్రయాణ సమయం కేవలం 12 గంటలకు, దాదాపు 1,200 కి.మీ. (750 మై.) దూరం 1,100 కి.మీ. (680 మై.) కూ తగ్గుతాయి. ఇందులో రెండు విభాగాలు – నాగ్‌పూర్ నుండి హైదరాబాద్ వరకు, హైదరాబాద్ నుండి బెంగళూరు వరకు - ఉంటాయి. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్మించి, నిర్వహిస్తుంది.[1] ఈ ప్రాజెక్టును ₹ 35,000 కోట్ల (US$ 4.2 బిలియన్) అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు.[2] 2030 లోపు పూర్తి చేయాలని భావిస్తున్నారు.
నాగపూర్-హైదరాబాద్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వే | |
---|---|
మార్గ సమాచారం | |
నిర్వహిస్తున్న సంస్థ భారత జాతీయ రహదారుల అధికార సంస్థ (NHAI) | |
పొడవు | 1,100 కి.మీ. (680 మై.) |
Existed | ~2030 (అంచనా)–present |
ముఖ్యమైన కూడళ్ళు | |
నుండి | 1. నాగపూర్ 2. హైదరాబాదు |
వరకు | 1. హైదరాబాదు 2. బెంగళూరు |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక |
Major cities | నాగపూర్, హింగన్‌ఘాట్, పంధార్‌కవాడా, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, హైదరాబాదు, మహబూబ్‌నగర్, కర్నూలు, గుత్తి, అనంతపురం, హిందూపురం, చిక్కబళ్ళాపూర్, బెంగళూరు |
రహదారి వ్యవస్థ | |
చరిత్ర
మార్చుజమ్మూ కాశ్మీర్‌లోని ఉరి నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు వెళ్లే జాతీయ రహదారి 44 (నార్త్-సౌత్ కారిడార్) (NH-44)పై పెరుగుతున్న ట్రాఫిక్ ఒత్తిడి కారణంగా, ఈ రహదారి భవిష్యత్తులో ట్రాఫిక్‌ను తట్టుకోలేకపోతుంది. మొత్తం మార్గమంతా చాలా వరకు నాలుగు-వరుసలుగా ఉన్నప్పటికీ, ముఖ్యంగా నాగ్‌పూర్ నుండి బెంగళూరు వరకు ఉన్న నగరాల పెరుగుతున్న జనాభా కారణంగా ట్రాఫిక్ పెరుగుతుంది. కాబట్టి, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) 2017 లో హైదరాబాద్ మీదుగా ఆ రెండు నగరాల మధ్య ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించాలని యోచిస్తోంది.[3] ఇది NH-44కి ప్రత్యామ్నాయంగా ఉంటూ, ట్రాఫిక్‌ను, దానిపై పెరుగుతున్న ఒత్తిడినీ తగ్గిస్తుంది. ఈ రహదారి వలన దాదాపు 23-24 గంటల ప్రయాణ సమయం కేవలం 11-12 గంటలకు, సుమారుగా 1,200 కి.మీ దూరం 1,100 కి.మీ. కూ తగ్గుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో ఆరు వరుసలు ఉంటాయి. భవిష్యత్తులో వీటిని మరిన్ని వరుసలకు విస్తరించవచ్చు. 2018 మేలో డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)ని తయారు చేయడానికి ఒక ప్రైవేట్ సంస్థను ఎంపిక చేయగా, ఈ పని ఇంకా కొనసాగుతోంది. [4] ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి తొలుత ₹ 35,000 కోట్ల (US$ 4.2 బిలియన్) అంచనా వ్యయంతో 2025 నాటికి పూర్తి చేయాలని భావించారు. అయితే, నిర్మాణ-పూర్వ, నిర్మాణ పనుల కోసం సన్నాహాలలో జాప్యం కారణంగా, ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రస్తుతం 2030 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు.
ఇవి కూడా చూడండి
మార్చు- భారతదేశం యొక్క ఎక్స్‌ప్రెస్‌వేలు
- భారతదేశ జాతీయ రహదారులు
- ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ వే
- బెంగళూరు చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే
మూలాలు
మార్చు- ↑ Anparthi, Anjaya (28 August 2017). "Now, drive from Nagpur to Bengaluru in just 12 hrs". Times of India. Archived from the original on 31 May 2018. Retrieved 31 May 2018.
- ↑ Ramakrishnan, N (3 January 2018). "Feedback Infra pitches for a big role in designing greenfield expressways". Business Line. Archived from the original on 31 May 2018. Retrieved 31 May 2018.
- ↑ Anparthi, Anjaya (28 August 2017). "Now, drive from Nagpur to Bengaluru in just 12 hrs". Times of India. Archived from the original on 31 May 2018. Retrieved 31 May 2018.
- ↑ Ramakrishnan, N (3 January 2018). "Feedback Infra pitches for a big role in designing greenfield expressways". Business Line. Archived from the original on 31 May 2018. Retrieved 31 May 2018.