పెదపూడి నాగశ్రీ ప్రవల్లిక
పెదపూడి నాగశ్రీ ప్రవల్లిక, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, కొల్లూరు మండలం, కొల్లూరు గ్రామంలో 2003, జూన్ 13న జన్మించింది. తల్లిదండ్రులు గోవిందమ్మ, శ్రీనివాసరావు. ప్రవల్లిక తండ్రి శ్రీనివాసరావు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా, తల్లి గోవిందమ్మ ఆరోగ్యశాఖలో స్టాపునర్సుగా పనిచేస్తున్నారు. ప్రవల్లిక కూచిపూడి నర్తకి.ప్రస్తుతం చెరుకుపల్లిలోని ఆర్.కె. కళాశాలలో 12వ తరగతి (2019-20) చదువుతుంది.ఈమె హాబీలు శాస్త్రీయ నృత్యం, జానపద నృత్యం, పుస్తక పఠనం.ప్రవల్లిక ఏడవ సంవత్సరం వయస్సు నుండే కూచిపూడి నృత్య అభ్యాసం ప్రారంభించింది.ఈమె తొలిగురువు ఓంకారేశ్వరి నడుపుచున్న శ్రీ సోమేశ్వర విఘ్నేశ్వరాయ కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, చెరుకుపల్లిలో నాలుగు సంవత్సరాలు అభ్యసించింది.ఆ తరువాత ఈమె నాట్య విజ్ఞాన్,నాట్య కళా మాణిక్యం బిరుదాంకితులు కాజ వేంకట సుబ్రమణ్యం నడుపుచున్నశ్రీ సాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడెమీ,గుంటూరులో నాలుగు సంవత్సరాలకు పైగా శిక్షణపొంది, కూచిపూడి నాట్యంలో మెళుకువలు తెలుసుకుని అభ్యసించింది.నాగశ్రీ ప్రవల్లిక చిన్నతనంలోనే ఇప్పటివరకు దేశ విదేశాలలో సుమారు 450 పైగా నృత్య ప్రదర్శనలు చేసింది.[1] జాతీయస్థాయి అవార్డులు ఇప్పటివరకు 50 పైగా అందుకుంది.దేశంలోని 15 రాష్ట్రాలలోని నగరాలు, పట్టణాలలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేసింది.ప్రవల్లిక కూచిపూడి శాస్త్రీయ నృత్యంతోపాటు,సెమీ క్లాసికల్, జానపద నృత్యాలలో కూడా నైపుణ్యాన్ని కలిగిఉంది.ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఆహ్వానం మేరకు ఆయా పాఠశాలల వార్సికోత్సవ వేడుకలలో ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చి విద్యార్థులను కూచిపూడి నృత్యానికి ఆకర్షితులయ్యేలా చేస్తోంది. నాటక కళాపరిషత్తుల ఆహ్వానం మేరకు, పరిషత్ నాటకోత్సవాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చి పెద్దల ఆశీస్సులు పొందింది. అంతేగాదు అనేక గ్రామాలు, పట్టణాలలోని దేవతామూర్తుల బ్రహ్మోత్సవాలలో ప్రవల్లిక కూచిపూడి నృత్యప్రదర్శనల ద్వారా కూచిపూడి నాట్య వైభవం మరుగున పడకుండా తనవంతు చిరు సహాయం చేస్తోంది. 2014 నుండి ఇప్పటివరకు జరిగిన అన్ని జన్మభూమి/ మనఊరు, నవనిర్మాణ దీక్ష కృష్ణాపుస్కరాలు మొదలగు కార్యక్రమాలలో పాల్గొని ప్రదర్శనలు ఇచ్చింది.
పెదపూడి నాగశ్రీ ప్రవల్లిక | |
---|---|
జననం | ప్రవల్లిక 2003 జూన్ 13 కొల్లూరు, కొల్లూరు మండలం, గుంటూరు జిల్లా |
నివాస ప్రాంతం | చెరుకుపల్లి, గుంటూరు జిల్లా |
ఇతర పేర్లు | పెదపుడి నాగశ్రీ ప్రవల్లిక |
వృత్తి | కూచిపూడి నృత్యకళాకారిణి |
ప్రసిద్ధి | ప్రవల్లిక |
మతం | హిందూ |
తండ్రి | శ్రీనివాసరావు |
తల్లి | గోవిందమ్మ |
పురస్కారాలు | నాట్య చంద్రిక, నృత్య నివేదిఠా సమ్మాన్, నాట్య రంజిత, నవరస భారతీ, నాట్య మయూరి, నర్తన బాల, నాట్య కిశోరి, నృత్య జ్వోతి శుక్ల సమ్మాన్, బాలనృత్య రత్న, ప్రజ్ఞా బారతీ, తెలుగు తేజం, శ్రీ కృష్ణదేవరాయ గోల్డ్ మెడల్ అవార్డు |
వెబ్‌సైటు | |
ప్రవల్లిక వెబ్‌సైట్ |
తొలి ప్రదర్శన ఆరంగేట్రం
మార్చువిజయదశమి పండుగ సందర్భంగా చెరుకుపల్లి గ్రామంలో దేవీచౌక్ వద్ద దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో 2012 అక్టోబరు 24న ప్రవల్లిక తొలి ప్రదర్శన ఇచ్చింది.
ప్రథమ బహుమతి
మార్చుఉత్రప్రదేశ్ రాజధాని లక్నోలో 2020 జనవరి 12 నుండి 16 వరకు జరిగిన 23వ జాతీయ యువజనోత్సవాలలో 14న కూచిపూడి శాస్త్రీయ నృత్య విభాగంలో ప్రవల్లిక చేసిన నాట్యప్రదర్శన ప్రథమ బహుమతి పొందింది.16న జరిగిన ముగింపు కార్యక్రమంలో ఉత్రరప్రదేశ్ రాష్ట్ర గవర్నరు ఆనందీ బెన్ పటేల్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య చేతులుమీదుగా ఆమె ప్రధమ బహుమతి అందుకుంది.[2]ప్రవల్లిక తన తొలి ప్రయత్నంలోనే జాతీయ యువజనోత్సవాలలో ప్రధమ బహుమతి సాధించటం విశేషం.
ప్రతిష్ఠాత్మక ప్రదర్శనలు
మార్చు2016
మార్చు- శ్రీశైలంలో 2016 మార్చి 06న జరిగిన శ్రీశైల మల్లిఖార్జునుని శివరాత్రి బ్రహ్మోత్సవాలలో.
- కృష్ణా పుష్కరాలలో భాగంగా 2016లో పెనుమూడి ఘాట్ వద్ద ప్రభుత్వం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంనందు.
- శ్రీసాయి మంజీరా కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, గుంటూరువారిచే నిర్వహించబడిన అంతర్జాతీయ నృత్యోత్సవాల నందు. (2016 నుండి వరుసగా 2019 వరకు ప్రదర్శనలు చేసింది.)
- డిల్లీలోని యమునా నదితీరంలో జరిగిన 'వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ - 2016 లో కూచిపూడి మహాబృంద నాట్యంలో చేసిన ప్రదర్శన.
2017
మార్చు- 2017లో మహారాష్ట్రలోని థానే నగరంలో 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఆధ్వర్యంలో నిర్వహించిన టైమ్స్ సంస్కృతి ఆర్ట్ ఫెస్టివల్ నందు.
- రవీంద్ర కళాక్షేత్ర, బెంగుళూర్ లో సృష్టి డాన్స్ ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్ -2017 కార్యక్రమంలో చేసిన ప్రదర్శనలు (2019లో జరిగిన కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చింది)
- తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలనందు అచ్యుత మానస బృందంతోపాటు చేసిన ప్రదర్శన
2018
మార్చు- కర్నూలు పట్టణంలో 2018 జూలై 1న జరిగిన నాట్యకళా నీరాజన మహాబృంద నాట్య కార్యక్రమం నందు.
- చెన్నైలో త్యాగయ్య టి.వి.ఛానెల్ వారు 2018 నవంబరు 18న విర్వహించిన 'నాట్యసాగర్ డాన్స్ ఫెస్టివల్' లో ఇచ్చిన ప్రదర్శన.
- 68వ రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా ఎ.పి.భవన్, ఎర్రకోట వద్ద జరిగిన 'భారత్ పర్వ్' ఉత్సవాలలో కోకా విజయలక్ష్మి నేతృత్వంలో జరిగిన ప్రదర్శన
- తిరుమలలో 2018 జనవరి 28న వేంకటేశ్వరుని సన్నిధిలో యస్.వి.బి.సి.వారి నాథనీరాజనం కార్యక్రమంలో
- కేరళ రాష్ట్రంలోని గురువాయూరులో గురువాఐరోపాపన్ దేవాలయంలో తన బృందంతో ప్రదర్శన
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నిర్వహించబడిన లేపాక్షి ఫెస్టివల్ లో అచ్యుత మానస ఎన్సెంబుల్ 'పంచతత్వ' ప్రదర్శనలో
- విశాఖపట్నంలో జరిగిన సి.ఐ.ఐ. సమ్మిట్ లో అచ్యుత మానస ఎన్సెంబుల్ ప్రదర్శనలో
- 2018లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మాయాపూర్ లో శ్రీ సరస్వతీ గౌరియా శ్రమణ్ మఠంనందు కృష్ణాష్టమి కల్చరల్ ఫెస్టివల్ లో జరిగిన ప్రదర్శన
- ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో భగవంతీ విద్యాకళాశాల, కైలాష్ సరస్వతీ ఇంటర్ కళాశాలలలో నవంబరు 29, 30 తేదీలలో జరిగిన ప్రదర్శనలు
2019
మార్చు- జనవరి 5న బెంగుళూర్ నగరంలో కె.వి.సుబ్రహ్మణ్యం నేత్రుత్వంలో నాట్య నినాద అకాడెమీ, బెంగుళూరు వారి 4 వ వార్షికోత్సవం కార్యక్రమం బాల త్రిపుర సుందరి కూచిపూడి నృత్యోత్సవంలో ప్రదర్శన.
- జనవరి 15న దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో అచ్యుత మానస బృందంచే ప్రదర్శితమైన 'గోదా కళ్యాణం' నత్యరూపక ప్రదర్శనలో
- ఫిబ్రవరి 2న గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ లో శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంనందు జరిగిన 'జావళి ఉత్సవ్' ప్రదర్శనలో
- ఫిబ్రవరి 3న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్,అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుుడుల సమక్షంలో అచ్యుత మానస బృందంతో ప్రదర్శనలో
- ఫిబ్రవరి 23న విజయవాడ నగరంలో గోకరాజు కళావేదికపై ఐ.సి.సి.ఆర్., ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ వారి కార్యక్రమంలో
- ఏప్రియల్ 28న వారణాసి పుణ్యక్షేత్రంలో పవిత్ర గంగానది ఒడ్డున అస్సీ ఘాట్ వద్ద "సుబహ్-ఎ- బనారస్' వేదికపై 'ఘాట్ సంధ్యా' కార్యక్రమంలో
- మే 26న ఉజ్జయిని పుణ్యక్షేత్రంలో శ్రీకృష్ణ సాందీపని మహోత్సవంలో
- జూన్ 8న మహారాష్ట్రలోని నాంధేడ్ నగరంలో ఐదవ సప్తరంగ్ కల్చరల్ ఫెస్టివల్ లో ప్రదర్శన
- జులై 14న అస్సాం రాష్ట్రంలోని బేమో పట్టణంలో జరిగిన సర్గం - 2 లో ప్రత్వేక అతిధిగా ప్రదర్శన ఇచ్చింది.
- జులై 29న తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలోగల ఏకాంబరేశ్వర దేవాలయంలో హిడెన్ ఐడల్ వారి ప్రదోషం కార్యక్రమంలో
- ఆగస్టు 17న అస్సాం రాష్ట్రంలోని గౌహతీ నగరంలో కామాఖ్యాదేవీ ఆలయంలో హిడెన్ ఐడల్ వారి ఆధ్వర్యంలో జరిగిన దాది ఫెస్టివల్ లో ప్రదర్శన
అందుకున్న తొలి, ద్వితీయ అవార్డులు
మార్చు- హైదరాబాదులోని త్యాగరాయ గానసభలో చేసిన ప్రదర్శనకు శ్రీ వైష్ణవి ఆర్టు ధియేటర్స్ వారిచే 'నాట్య చంద్రిక' మొదటి అవార్డును 2013 డిశెంబరు 12న అందుకుంది.
- చిలకలూరిపేట కళానిళయం వారిచే 'నాట్య మయూరి' ద్వితీయ అవార్డును 2015 మే 19న అందుకుంది.
అందుకున్న మరికొన్ని ముఖ్య అవార్డులు
మార్చు2016
మార్చు- రాయలసీమ రంగస్థలి,తిరుపతి వారిచే జనవరి 29న 'నాట్యరంజిత' అవార్డు.
- పురవై సాంస్కృతిక కళావికాస్,కలకత్తా వారిచే మే 18న 'నృత్యశుక్లజ్వోతి సమ్మాన్' అవార్డు.
- హైదరాబాదులోని త్యాగరాయ గానసభలో చేసిన ప్రదర్శనకు శిఖరం ఆర్ట్ ధియేటర్, హైదరాబాదు వారిచే జూలై 12న 'ప్రజ్ఞా భారతి' అవార్డు.
- ఏలూరు YMHA హాలులో చేసిన ప్రదర్శనకు జూలై 16న అభినయ నృత్యభారతీ వారిచే 'నర్తనబాల' అవార్డు.
- షిమ్లాలో ధారోహోర్-2016 కార్యక్రమంలో USSNA, డెహ్రాడూన్ వారిచే జూలై 24న 'కళాకుంజ్ సమ్మాన్' అవార్డు.
- మైసూరు జగన్మోహన్ ప్యాలెస్ లో చేసిన ప్రదర్శనకు కల్ఫశ్రీ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ట్రస్ట్, బెంగళూరు వారిచే ఆగస్టు 26న 'నాట్యశారద' అవార్డు.
- ఉత్కల్ యువ సాంస్కృతిక్ సంస్థ,కటక్ (ఒడిషా) వారిచే సెప్టెంబరు 4న 'నేషనల్ నృత్య భారతీ' అవార్డు.
- ఊర్మిళా ఉన్నీస్ ఇంటర్నేషనల్ కల్చరల్ ఓకాడెమీ,కొచ్చిన్ (కేరళ) వారిచే సెప్టెంబరు 18న 'బాలనర్తకి' అవార్డు.
- ది సొసైటీ ఆఫ్ ట్రాఫిక్ అవేర్‌నేస్ అండ్ రీసెర్చ్, గుంటూరు వారిచే అక్టోబరు 5న 'ఆంధ్ర నాట్యరత్న' అవార్డు.
- శ్రీ లలితా కామేశ్వరీ నృత్యసదనం, ఏలూరు వారిచే అక్టోబరు 28న 'నిక్కణ్ మణి' అవార్డు.
- నృత్యతి కళాక్షేత్రం,భిలాయ్ (ఛత్తీస్‌ఘడ్) వారిచే నవంబరు 20న 'నృత్య కళా బాలశ్రీ' అవార్డు.
- శిఖరం ఆర్ట్ థియేటర్స్,హైదరాబాద్ వారిచే డిశెంబరు 8న 'తెలుగుతేజం' అవార్డు.
- దుర్గా సాస్కృతిక కళా కేంద్రం,ఆలీఘర్ (ఉత్తరప్రదేశ్) వారిచే డిశెంబరు 16న 'దుర్గారత్న' అవార్డు.
- కళానిలయం,చిలకలూరిపేట వారిచే ---- న 'రాజహంస' అవార్డు.
- కీ.శే.గుర్రం జాషువా స్మారక కళా పరిషత్,దుగ్గిరాల వారిచే ------ న ఉగాది పురస్కారంతో పాటు 'బాలనృత్యరత్న' అవార్డు.
- కల్పశ్రీ పెర్ఫార్మింగ్ ఆర్ట్ ట్రస్ట్, బెంగళూర్ (కర్నాటక) వారిచే తిరుపతిలో డిశెంబరు 25న 'నాట్య కిశోరి' అవార్డు.
- పురవై సాంస్కృతిక కళా వికాస్ కేంద్ర,కలకత్తా వారిచే డిశెంబరు 29న 'నృత్య సువర్ణ సమ్మాన్' అవార్డు.
2017
మార్చు- రాయలసీమ రంగస్థలి తిరుపతి వారిచే జనవరి 20న 'శ్రీ కృష్ణదేవరాయ గోల్డ్ మెడల్' అవార్డు,మే 28న 'నాట్య తరంగణి చైల్డ్' అవార్డు
- పురవై సాంస్కృతిక కళావికాస్ కేంద్రం,కోల్‌కతా, (పశ్చిమబెంగాల్) వారిచే ఏప్రియల్ 7న 'నృత్యకనక ప్రభా సమ్మన్' అవార్డు.
- శ్రీ లలిత కామెశ్వరి నృత్యసదనం,ఏలూరు వారిచే ఏప్రియల్ 14న 'వేంగీ నృత్య కళా జ్వోతి సమ్మాన్' అవార్డు.
- ఊర్మిళా ఉన్నీస్ ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడెమీ,కొచ్చిన్ వారిచే ఏప్రియల్ 18న 'గురువాఐరోపాపన్' పురస్కారం.
- శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చారిటబుల్ ట్రష్టు,తెనాలి వారిచే ఏప్రియల్ 20న ఉగాది పురస్కారంతో పాటు 'అమరావతి నాట్యసుందరి' అవార్డు.
- శ్రీ సాయి మంజీరా కూచిపూడి ఆర్ట్ అకాడెమీ,గుంచూరు వారిచే నవంబరు 13న బాల కళా రత్న అవార్డు.
- శ్రీ నటరాజ నృత్య కళా మందిర్,కర్నూలు వారిచే జూన్ 4న 'కళా సౌరభ-అభినయ శ్రీ' అవార్డు.
- శిఖరం ఆర్ట్ ధియేటర్స్,హైదరాబాద్ వారిచే జూన్ 29న పి.వి.నరసింహారావు మెమోరియల్ ఎక్స్‌లెన్సీ పురస్కారం.
- హచ్.ఎ.యమ్ సొసైటీ ఆఫ్ ఇండియా,భిలాయ్ (చత్తీస్‌ఘడ్) వారిచే అక్టోబరు 3న 'కళా తిలక్' అవార్డు.
- అభినయ కల్చరల్ సొసైటీ,భద్రాచలం వారిచే డిశెంబరు 2న 'టాలెంట్' అవార్డు.
- సత్యాంజలి అకాడెమీ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్,కొచ్చి,కేరళ వారిచే మే 26న 'సింహపురి నాట్య బాలరత్న' అవార్డు
2018
మార్చు- బి.వి.ఆర్. కళాకేంద్రం,తాడేపల్లిగూడెం వారిచే మార్చి 18న ఉగాది పురస్కారంతోపాటు 'నాట్యరవళి' అవార్డు.
- మోహన్ అభినయ కల్చరల్ అకాడెమీ,మధుర (ఉత్తరప్రదేశ్) వారిచ్ జూలై 29న 'బ్రిజ్ మాధిరీ' అవార్డు.
- బి.కె.దాస్ కల్చరల్ అకాడెమీ, భారత కళా కేంద్రం (వెస్ట్ బెంగాల్) వారిచే ఆగస్టు 5న 'నేషనల్ భారత్ భూషణ్' అవార్డు.
- హెచ్.ఎ.యమ్. సొసైటీ ఆఫ్ ఇండియా, భిలాయ్ (చత్తీస్‌ఘడ్) వారిచే అక్టోబరు 24న 'కళా సంస్కృతి సమ్మాన్' అవార్డు.
- కృష్ణప్రియ కథక్ కేంద్రం, భిలాయం వారిచే --------- 'నిపుణ్ కళావంత్ సమ్మాన్' అవార్డు.
2019
మార్చు- ఉత్కళ్ యువ సాంస్కృతిక్ సంఘ్, కటక్ (ఒడిషా) వారిచే జనవరి 3న 'కోణార్క్ నృత్యాంగన' అవార్డు.
- శ్రీకృష్ణ కల్చరల్ ఫౌండేషన్,నాగ్‌పూర్ (మహారాష్ట్ర) వారిచే మార్చి 18న 'గురు శిష్య పరంహా' అవార్డు.
- భారత్ కళాకేంద్ర, బిష్ణుపూర్ (పశ్చిమ బెంగాల్) వారిచే మార్చి 29న 'భారత్ కళా నృత్య ప్రజ్వలితా సమ్మాన్' అవార్డు
- సేవా యూత్ గిల్డ్ కలకత్తా వారిచే మార్చి 31న 'స్వామీ వివేకానంద ఎక్సెలెంట్' అవార్డు
- ఇంద్రప్రస్థ ఎడ్వుకేషనల్ రీసెర్చ్ అండ్ ఛారిటబుల్ ట్రష్టు, యూత్ డెవలప్మెంట్ బోర్డు ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ వారిచే ఏప్రియల్ 14న 'ఇండియాస్ రైజింగ్ స్ఠార్ - 2019' అవార్డు.
- శిఖర్ సాంస్కృతిక సంస్థ, ఉజ్జయిని (మధ్యప్రదేశ్) వారిచే మే 26న 'శిఖర్ నృత్య శిరోమణి' అవార్డు
- లయ పెర్ ఫార్మింగ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్, నాందేడ్ (మహారాష్ట్ర) వారిచే జూన్ 8న 'సప్తరంగ్ కళాశ్రీ' అవార్డు
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-09-08. Retrieved 2019-09-08.
- ↑ ఈనాడు దినపత్రిక గుంటూరు రూరల్ 2020 జనవరి 18 పేజీ సంఖ్య 8 -9