నాయుడుబావ

1978లో విడుదలైన తెలుగు సినిమా

నాయుడుబావ కౌముదీ పిక్చర్స్ బ్యానర్‌పై ఎం.ఎస్.రెడ్డి నిర్మించిన తెలుగు సినిమా. పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా 1978, జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలయ్యింది.[1]

నాయుడుబావ
(1978 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం శోభన్ బాబు,
జయసుధ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ కౌముది పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు సవరించు

సాంకేతిక వర్గం సవరించు

పాటలు సవరించు

ఈ చిత్రంలోని పాటలను మల్లెమాల రచించగా సత్యం సంగీతం సమకూర్చాడు.

పాటల వివరాలు[2]
క్ర.సం. పాట పాడినవారు
1 డీ డిక్కుం, డీ డీ డిక్కుం నాయుడుబావా! నేను ఢీ అంటే ఎదురు నిలిచి ఢీ కొడతావా! లేక తోకముడిచి మేక లాగ పరిగెడతావా? పి.సుశీల
2 నెల్లూరి చేలలో పిల్లగాలికి ఊగే వరి వెన్నులాంటిది మల్లి సొగసు అది వద్దన్నా దోస్తుంది నా మనసు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
3 డీ డిక్కుం, డీ డీ డిక్కుం బస్తీ బొమ్మా! నేను ఢీ కొడితే నీ దిమ్మ తిరిగేనమ్మా! ఆ దెబ్బతో తలదిమ్ము వదిలేనమ్మా! ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
4 ఎ బి సి డి ఎక్స్ లైఫ్ ఈజ్ ఫుల్ల్ ఆఫ్ సెక్స్ ఎంజాయ్ ఎంజాయ్ ఎల్.ఆర్.ఈశ్వరి
5 హరిహరి నారాయణా ఆది నారాయణా ఆడదా ఇది కాదు అంబుజోదరుడా? ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
6 పాలూ చక్కెర కలిశాయి ఆలూ మగలై వెలిశాయి పి.సుశీల
7 నా పేరే హడల్ మాటే సవాల్ ఆకలి గొన్న బెబ్బులికైనా అలికిడి వింటే హడల్ హడల్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
8 దిక్కుల్లో మొదటిది తూరుపు దిక్కు దిక్కులేని వారికి దేవుడే దిక్కు పి.సుశీల

సంక్షిప్త కథ సవరించు

రాజు పట్నంలో పాలు విక్రయిస్తాడు. ఒక రోజు పల్లెకు తిరిగి వస్తుండగా రైలులో దీప అనే అల్లరిపిల్ల తారసపడుతుంది. రాజుకు నాయుడుబావ అని పేరుపెడుతుంది. రాజు అంటే అతని మేనత్త కూతురు మల్లికి పంచప్రాణాలు. తన తాతయ్య పురుషోత్తమరావు ప్రాణాలు కాపాడటం కోసం దీప, రాజును బ్రతిమలాడి, అతనికి ఆధునిక వేషం వేసి తన ప్రియుడిగా పరిచయం చేస్తుంది. రాజు ఆడిన నాటకం అతడి తల్లి మరణానికి దారితీస్తుంది. దీప రాజుని తప్ప మరొకరిని పెళ్ళి చేసుకోనంటుంది. ఎస్టేటు మేనేజర్ సూర్యం బారినుండి దీపను రక్షించిన రాజుకు దీపకు వివాహం అవుతుంది. దీప మల్లిని కూడా తమ ఇంటికి తీసుకువెళుతుంది. కానీ కొన్ని పరిణామాలు సంభవిస్తాయి. [3]

మూలాలు సవరించు

  1. వెబ్ మాస్టర్. "Nayudu Bava (P. Chandrasekhara Reddy) 1978". ఇండియన్ సినిమా. Archived from the original on 16 April 2021. Retrieved 2 September 2022.
  2. వెబ్ మాస్టర్. "Nayudu Bava (1978)-Song_Booklet". ఇండియన్ సినిమా. Archived from the original on 2 September 2022. Retrieved 1 September 2022.
  3. వెంకట్రావు (22 January 1978). "చిత్ర సమీక్ష: నాయుడుబావ" (PDF). ఆంధ్రపత్రిక దినపత్రిక. Archived (PDF) from the original on 2 September 2022. Retrieved 2 September 2022.

బయటి లింకులు సవరించు