పట్నం నరేందర్ రెడ్డి
పట్నం నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, కొడంగల్ శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1][2] అతను భారత్ రాష్ట్ర సమితి పార్టీకి చెందినవాడు.[3]
పట్నం నరేందర్ రెడ్డి | |||
| |||
పదవీ కాలం 2018- ప్రస్తుతం | |||
ముందు | రేవంత్ రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | కొడంగల్ శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జనవరి 22, 1970 గొల్లూరుగూడ, షాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | మల్లారెడ్డి - రుక్కమ్మ. | ||
జీవిత భాగస్వామి | శృతి | ||
బంధువులు | పట్నం మహేందర్ రెడ్డి (అన్న) పట్నం సునీతా రెడ్డి (వదిన) | ||
సంతానం | ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు | ||
నివాసం | కొడంగల్, తెలంగాణ |
జీవిత విశేషాలు
మార్చుపట్నం నరేందర్ రెడ్డి 1970, జనవరి 22న తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలంలోని గొల్లుర్‌దుర్గ గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి మల్లారెడ్డి, తల్లి రుక్కమ్మ. అతను ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుండి ఎన్నికై మంత్రిగా పనిచేసిన పట్నం మహేందర్ రెడ్డి అతని సోదరుడు.[4] తెలంగాణ ఆవిర్భావం తరువాత అతను కొడంగల్ నుండి మరలా శాసనమండలి సభ్యునిగా ఎన్నికైనాడు.
1991 బి.ఎస్సీ(అగ్రికల్చర్) ను మహారాష్ట్రలోని అకోలా లో ఉన్న పి.కె.వి. విశ్వవిద్యాలయం నుంచి చేసాడు.
వ్యక్తిగత జీవితం
మార్చునరేందర్ రెడ్డికి శృతితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు హితీశ్ రెడ్డి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రాజకీయ జీవితం
మార్చునరేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 2009 మే 2 నుండి 2014 జూన్ 1 వరకు కొడంగల్ నుండి టీడీపీ తరపున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా, 2014 జూన్ 2 నుండి 2015 మే 1 వరకు తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా పనిచేసాడు. ఆయన 2017లో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శిగా నియమితుడయ్యాడు.[5] నరేందర్ రెడ్డి 2016 జనవరి 5నుండి 2018 డిసెంబరు 11 వరకు తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా పనిచేసి 2018లో శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి పోటీ చేసాడు.[6] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డిపై 9,319 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అనంతరం తన ఎం.ఎల్.సి పదవికి రాజీనామా చేసాడు.[7]
ఆరోపణలు
మార్చుఅతను తెలంగాణ షాబాద్ లో నరేందర్ రెడ్డి పేరు మీద పెట్రోల్ పంపు ఉందని, తనకు పెట్రోల్ పంపు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొనకుండా నరేందర్ రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారని రేవంత్ రెడ్డి స్పష్టం చేసాడు. ఎన్నికల ఖర్చులకు విదేశాల నిధులు తీసుకోవడం నిషేధం. ఆ విరాళాలు తీసుకున్నట్లయితే పోటీ కి వాళ్ళు అనర్హులు. అమెరికా నుంచి ఎన్నికల ఖర్చుకోసం 5లక్షలు వచ్చినట్లు అఫిడవిట్ లో చూపించాడు. ఈ ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకుని నరేందర్ రెడ్డి ని అనర్హుడిగా ప్రకటించాలని రేవంత్ రెడ్డి కోరాడు.[8]
ఇతర వివరాలు
మార్చునేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదలైన దేశాలు సందర్శించాడు.
మూలాలు
మార్చు- ↑ "Kodangal election 2018 results: Patnam Narendra Reddy of TRS defeats A Revanth Reddy of Congress". www.cnbctv18.com (in ఇంగ్లీష్). 2018-12-11. Retrieved 2021-10-05.
- ↑ Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
- ↑ "Patnam Narender Reddy(TRS):Constituency- KODANGAL(VIKARABAD) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2020-06-22.
- ↑ "రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?". Asianet News Network Pvt Ltd. Retrieved 2020-06-22.
- ↑ Sakshi (10 October 2017). "67 మందితో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గం". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
- ↑ "Patnam Narender Reddy | MLA | TRS | Kodangal | Vikarabad | Telangana". theLeadersPage | the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-05-05. Retrieved 2020-06-22.
- ↑ shivakumar (2019-02-24). "స్థానిక 'మండలి' పోరుకు వేళాయె". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-06-25. Retrieved 2020-06-22.
- ↑ Harikrishna (2019-01-24). "పట్నం నరేందర్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలి..! హైకోర్ట్ లో రేవంత్ రెడ్డి పిటీషన్..!!". telugu.oneindia.com. Retrieved 2020-06-22.