పాగోలు

భారతదేశంలోని గ్రామం

పాగోలు, కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం : 521126 , ఎస్.టీ.డీ.కోడ్ : 08671.

పాగొలు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం చల్లపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ పైడిపాముల వెంకటేశ్వరరావు
జనాభా (2011)
 - మొత్తం 2,950
 - పురుషులు 1,473
 - స్త్రీలు 1,477
 - గృహాల సంఖ్య 949
పిన్ కోడ్ 521126
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

చల్లపల్లి మండలంసవరించు

చల్లపల్లి మండలంలోని చల్లపల్లి, చిడెపూడి, పాగోలు, నడకుదురు, నిమ్మగడ్డ, యార్లగడ్డ, వక్కలగడ్డ, వెలివోలు, పురిటిగడ్డ, లక్ష్మీపురం, గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[2] సముద్రమట్టానికి 10 మీ.ఎత్తు.

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో మేకావారిపాలెం, పురిటిగడ్డ, నిమ్మగడ్డ, నడకుదురు, యార్లగడ్డ, వేములపల్లి గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

ఘంటసాల, మోపిదేవి, మొవ్వ, అవనిగడ్డ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

  1. M.P.U.P school. Most of the students studied in that school and present they are in best position. The school teachers are very dedicative and very talented persons. They behave like friends.
  2. మహాబడి పాఠశాల .

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

పాగోలులో రెండు రోడ్లు ఉన్నాయి . ఒకటి నరకుదురుడు రోడ్డు మరొకటి చల్లపల్లి రోడ్డు . పాగోలులో ఆటోలు ,రిక్షాలు ఉన్నాయి . బస్సు సౌకర్యం కూడా ఉంది.

మోపిదేవి, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 60 కి.మీ

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

  1. In Pagolu, water is highly available. In pagolu drinking water is super. Other villagers come to pagolu and take drinking water from pagolu. The A.P Governmet Built bath rooms.
  2. Pammaja Modern Rice MILL.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు


గ్రామ పంచాయతీసవరించు

  1. పంచాయతీ కార్యాలయము
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ పైడిపాముల వెంకటేశ్వరరావు సర్పంచిగా, 241 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ పర్వతవర్ధనీసమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయంసవరించు

ఈ అలయానికి వెళ్ళేటందుకు,దాత శ్రీ మేకా దశరథరామయ్య, 2.40 లక్షల విరాళంతో నిర్మించిన సిమెంటు రహదారిని,2020,అక్టోబరు-5న ప్రారంభించినారు. ఆలయ ఆవరణలో మొక్కలు నాటినారు. [5]

బుద్ధవిహార్సవరించు

ఇక్కడ 2014,మే-14న (వశాఖ పౌర్ణమి నాడు) బుద్ధ జయంతి సందర్భంగా, 2558వ బుద్ధ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. [3]

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంసవరించు

ఈ అలయ వార్షిక ఉత్సవాలను, 2015,జూన్-21వ తేదీ ఆదివారంనాడు, ఘనంగా నిర్వహించారు. అనంతరం 500 మందికి అన్నదానం నిర్వహించారు. [4]

హోలీ ఫైర్ చర్చిసవరించు

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, చెరకు, మినుము, పెసర, మొక్కజొన్న, అరటి, పసుపు, ప్రొద్దుతిరుగుడు, కంద.

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

In Pagolu main Occupancies Are 1.Carpenting 2.ClothWashing 3.Agriculture 4.Weighting NOTHING

గ్రామ ప్రముఖులుసవరించు

శ్రీ తోట నరసయ్య నాయుడుసవరించు

స్వాతంత్ర్యసమరంలో ప్రముఖ పాత్ర పోషించిన వీరు, పాగోలు గ్రామంలో 1899,అక్టోబరులో జన్మించారు. వీరు బందరులో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1930,మే-6న స్వతహాగా మల్లయోధులైన వీరు, బందరులోని కోనేరు సెంటరులోని థోరన్ హిల్ స్మారక స్తంభం పైకి ఎక్కి, బ్రిటిష్ పోలీసుల అసంఖ్యకమైన లాఠీదెబ్బలకు ఏ మాత్రం వెరవకుండా జాతీయజండా ఎగురవేసినారు. ఈ సందర్భంగా వీరు కారాగార శిక్షనుగూడా అనుభవించారు. వీరి త్యాగానికి మురిసిన గాంధీజీ, మచిలీపట్నం వచ్చినప్పుడు వీరిని ప్రత్యేకంగా అభినందించడం విశేషం. వీరి సేవలకు గుర్తించిన భారత ప్రభుత్వం, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947,ఆగస్టు-15న బందరులోని కోనేరు సెంటరులోని థోరన్ హిల్ స్మారక భవనం మీదనే వీరిచేత జెండాను ఎగురవేయించడం పురజనులందరినీ ఆకట్టుకున్నది. అప్పటినుండి వీరు ఆ ప్రాంతంలో జెండా వీరుడు గా వినుతికెక్కినారు. ఈ వీరుడు 1966,సెప్టెంబరు-12న దైవసన్నిధికి చేరుకున్నాడు. 2016,సెప్టెంబరు-12న, వీరి వర్ధంతి సందర్భంగా, విజయకృష్ణ జనజాగృతి సంస్థ అను పేరుతో అనేకమంది పురజనులు, సీనియర్ సిటిజన్లు, స్వాతంత్య్ర సమరయోధులూ బందరులోని జిల్లా గ్రంథాలయం వద్ద సమావేశమై వీరికి శ్రద్ధాంజలి ఘటించారు. వీరి త్యాగాలను మరొకసారి గుర్తుచేసుకున్నారు. [5]

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3226. ఇందులో పురుషుల సంఖ్య 1620, స్త్రీల సంఖ్య 1606,గ్రామంలో నివాస గృహాలు 864 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 726 హెక్టారులు.
జనాభా (2011) - మొత్తం 2,950 - పురుషుల సంఖ్య 1,473 - స్త్రీల సంఖ్య 1,477 - గృహాల సంఖ్య 949

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Challapalli/Pagolu". Retrieved 25 June 2016. External link in |title= (help)CS1 maint: discouraged parameter (link)

[1]

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్ద; 2013; ఆగస్టు-1; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014; మే-15; 1వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015; జూన్-22; 1వపేజీ. [5] ది హిందూ ఆంగ్ల దినపత్రిక; 2016; సెప్టెంబరు-12; 3వపేజీ.

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-09.
"https://te.wikipedia.org/w/index.php?title=పాగోలు&oldid=3045643" నుండి వెలికితీశారు