పి.టి.ఉష

కేరళ కు చెందిన అథ్లెట్ క్రీడాకారిణి
(పి.టి ఉష నుండి దారిమార్పు చెందింది)

కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా పయోలీలో జన్మించిన పి.టి.ఉష 1976లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన క్రీడా పాఠశాలలో కోజికోడ్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించి, అందులో చేరింది. ఆ సమయంలో ఆమెకు మాసమునకు కేరళ ప్రభుత్వం చెల్లించిన డబ్బు రూ.250/-

పీటీ ఉష

2022లో రాజ్యసభకు పీటీ ఉష నామినేట్ అయింది. అంతేకాదు వైస్‌ ఛైర్‌పర్సన్స్‌ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ లేని సమయంలో 2023 పిబ్రవరి 9న ఆమె సభాపతిగా వ్యవహరించింది.[1] భారత ఒలంపిక్ సంఘం ( ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ - ఐ ఓ ఏ ) తొలి మహిళ అధ్యక్షురాలిగా పి.టి.ఉష 2022 డిసెంబర్ 10వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నికయింది.

క్రీడా జీవితం

మార్చు

1979లో ఉష జాతీయ స్థాయి పాఠశాల క్రీడలలో పాల్గొంది. అప్పుడే ఆమె లోని నైపుణ్యాన్ని కోచ్ ఓ. నంబియార్ పసిగట్టాడు. అప్పటి నుంచి ఆమెకు చాలా కాలం వరకు అతడే కోచ్ గా శిక్షణ ఇచ్చాడు. ఆ సమయంలో దేశంలో మహిళా అథ్లెట్ల సంఖ్య చాలా తక్కువ. అథ్లెటిక్ సూట్ ధరించి ట్రాక్ పై పరుగెత్తడం అరుదుగా జరిగేది. 1980 రష్యా ఒలింపిక్స్ లో పాల్గొన్ననూ ఆమెకు అది అంతగా కలిసిరాలేదు. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో 100 మీ. 200 మీటర్ల పరుగులో రజత పతకం పొందింది. 1985లో కువైట్లో జరిగిన ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలలో ఉష బంగారు పతకం పొందడమే కాకుండా, కొత్త ఆసియా రికార్డును సృష్టించింది. 1983 నుంచి 1989 మధ్యకాలంలో ఉష ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్స్ పోటీలలో 13 స్వర్ణ పతకాలను సాధించింది. 1984లో అమెరికా లోని లాస్ ఏంజిల్స్లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో ఉష సెమీఫైనల్స్ లో పథమస్థానంలో వచ్చిననూ పైనల్స్ లో వెంట్రుకవాసిలో పతకం పొందే అవకాశం కోల్పోయింది. సెకనులో వందోవంతు తేడాతో కాంస్యపతకం పొందే అవకాశం జారవిడుచుకున్ననూ, ఒలింపిక్ క్రీడల అథ్లెటిక్స్ లో పైనల్స్ చేరిన తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. 1960లో ప్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్ కు కలిగిన దురదృష్టమే పి.టి.ఉషకు కూడా కలిగింది.

1986లో దక్షిణ కొరియా రాజధాని సియోల్లో జరిగిన 10 వ ఆసియా క్రీడలలో పి.టి.ఉష 4 బంగారు పతకాలను సాధించడమే కాకుండా అన్నిట్లోనూ ఆసియా రికార్డులు సాధించడం విశేషం. అదే ఆసియాడ్ లో మరో రజత పతకం కూడా సాధించింది. 1985లో జకార్తాలో జరిగిన 6 వ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్ షిప్ పోటీలలో ఈమె 5 బంగారు పతకాలను సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. అంతర్జాతీయ క్రీడాజీవితంలో మొత్తం మీద ఈమె 101 స్వర్ణ పతకాలను సాధించింది.

సాధించిన విజయాలు

మార్చు
  • 1980 : మాస్కో ఒలింపిక్స్ లో పాల్గొంది. అదే సం.లో కరాచి ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ మీట్ లో 4 బంగారు పతకాలను కైవసం చేసుకుంది.
  • 1981 : పుణే అంతర్జాతీయ మీట్ లో 2 బంగారు పతకాలను గెల్చింది. హిస్సార్ అంతర్జాతీయ మీట్ లో ఒక బంగారు పతకం సాధించింది. లూధియానా ఇంటర్నేషనల్ మీట్ లో 2 బంగారు పతకాలు సాధించింది.
  • 1982 : సియోల్లో జరిగిన ప్రపంచ జూనియర్ మీట్ లో ఒక స్వర్ణం, ఒక కాంస్య పతకం లభించింది. ఢిల్లీ ఆసియా క్రీడలలో 2 రజత పతకాలు లభించాయి.
  • 1983 : కువైట్లో జరిగిన ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలలో ఒక స్వర్ణం, ఒక రజతం గెల్చింది. ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ మీట్ లో 2 స్వర్ణాలు గెల్చింది
  • 1984 : అమెరికా లోని ఇంగిల్వూడ్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్విటేషనల్ మీట్ లో ఒక స్వర్ణం గెల్చింది. అదే సం.లో లాస్ ఏంజిల్స్ లో జరి గిన ఒలింపిక్స్ లో కొద్ది తేడాతో కాంస్యం చేజారింది. సింగపూరులో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్విటేషనల్ మీట్ లో 3 స్వర్ణాలు కైవసం చేసుకుంది.
  • 1985 : చెక్ రిపబ్లిక్ లోని ఒలోమోగ్ లో జరిగిన ప్రపంచ రైల్వే మీట్ లో 2 స్వర్ణాలు, 2 రజత పతకాలు సాధించి, ఉత్తమ రైల్వే అథ్లెట్ గా ఎంపికైంది. ఈ ఘనత సాధించిన తొలి రైల్వే వ్యక్తి ఉష.
  • 1986 : సియోల్ ఆసియా క్రీడలలో 4 బంగారు, ఒక రజత పతకం సాధించింది. మలేషియన్ ఓపెన్ అథ్లెటిక్స్ పోటీలలో ఒక స్వర్ణ పతకం సాధించింది. ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ మీట్ లో 2 బంగారు పతకాలు సాధించింది.
  • 1987 : సింగపూరులో జరిగిన ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలలో 3 స్వర్ణ, 2 రజత పతకాలను కైవసం చేసుకుంది
  • 1988 : సింగపూరు ఓపెన్ అథ్లెటిక్ మీట్ లో 3 స్వర్ణాలు సాధించింది.
  • 1989 : ఢిల్లీలో జరిగిన ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలలో 4 స్వర్ణ, 2 రజత పతకాలు సాధించింది.
  • 1990 : బీజింగ్ ఆసియా క్రీడలలో 3 రజత పతకాలు సాధించింది.
  • 1994 : హీరోషిమా ఆసియా క్రీడలలో ఒక రజత పతకం గెల్చింది.
  • 1995 : చెన్నైలో జరిగిన దక్షిణాసియా ఫెడరేషన్ గేమ్స్ లో ఒక కాంస్యం సాధించింది
  • 1999 : కాఠ్మండులో జరిగిన దక్షిణాసియా ఫెడరేషన్ గేమ్స్ లో ఒక స్వర్ణం, 2 రజత పతకాలు గెల్చింది.

అవార్డులు, గౌరవాలు

మార్చు
 
పద్మశ్రీ పురస్కారం
Medal record
Women's athletics
Asian Games
స్వర్ణము 1986 Seoul 200 metres
స్వర్ణము 1986 Seoul 400 metres
స్వర్ణము 1986 Seoul 400 metres hurdles
స్వర్ణము 1986 Seoul 4x400 metres relay
రజతం 1982 New Delhi 100 metres
రజతం 1982 New Delhi 200 metres
రజతం 1986 Seoul 100 metres
రజతం 1990 Beijing 400 metres
రజతం 1990 Beijing 4x100 metres relay
రజతం 1994 Hiroshima 4x400 metres relay
  • 1984 : అర్జున అవార్డుతో సత్కారం
  • 1984 : భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదంతో సత్కరించింది
  • 1985 : జకర్తా అథ్లెటిక్ మీట్ లో గొప్ప మహిళా అథ్లెట్ గా పరిగణన
  • 1984, 1985, 1986, 1987, 1989 లలో ఆసియా అవార్డులో అత్తమ అథ్లెట్ గా అవార్డు
  • 1984, 1985, 1989, 1990 లలో ఉత్తమ రైల్వే క్రీడాకారులకు ఇచ్చే మార్షల్ టిటో అవార్డు
  • 1986 : సియోల్ ఆసియా క్రీడలలో ఉత్తమ అథ్లెట్ కు ప్రధానం చేసే అడిడాస్ గోల్డెన్ షూ అవార్డు
  • అథ్లెటిక్స్ లో ఉత్తమ ప్రదర్శనకు 30 అంతర్జాతీయ అవార్డులు
  • 1999 కేరళ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అవార్డు
  • 1985, 1986 లలో ఉత్తమ అథ్లెటకు ఇచ్చే వరల్డ్ ట్రోఫీ అవార్డు

మూలాలు

మార్చు
  1. "PT Usha: రాజ్యసభ సమావేశాలను నిర్వహించిన పీటీ ఉష". web.archive.org. 2023-02-10. Archived from the original on 2023-02-10. Retrieved 2023-02-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

Death of birth

మార్చు

Deadth

"https://te.wikipedia.org/w/index.php?title=పి.టి.ఉష&oldid=4301573" నుండి వెలికితీశారు