ఉషశ్రీ

రచయిత, రేడియోలో ప్రవచనకర్త
(పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు నుండి దారిమార్పు చెందింది)

ఉషశ్రీ (మార్చి 16, 1928 - సెప్టెంబరు 7, 1990) అసలు పేరు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు అగ్రహారంలో 1928 (ప్రభవ తెలుగు సంవత్సరం) సంవత్సరం మార్చి 16 (ఫాల్గుణ బహుళ త్రయోదశి) న జన్మించారు. తండ్రి పురాణపండ రామూర్తి. తండ్రి ఆయుర్వేద వైద్యుడు, తల్లి కాశీ అన్నపూర్ణ. జాతీయోద్యమ సమయంలో కాకినాడలో కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా పనిచేశాడు. ఆ తరువాత పురాణపండ రామూర్తి ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక వేదికల మీద రామాయణం, మహాభారతం మహాభాగవతం ప్రవచనం చేశాడు. ఉషశ్రీ ఆకాశవాణి విజయవాడ కేద్రంలో అనేక సంవత్సరాలు పనిచేశాడు. ఆ కాలంలో ఆయన నిర్వహించిన "ధర్మ సందేహాలు" కార్యక్రమము చాలా పేరు పొందినది. ఆ తరువాత వారం వారం రామాయణ మహా భారతాలను ఆకాశవాణి నుండి ప్రవచనం చేశారు. 1973 లో రేడియోలో భారత ప్రవచనం ప్రారంభించాడు. అప్పట్లో, దూరదర్శన్ లేదు. ఉషశ్రీ పురాణ ప్రవచనాలు వారానికి ఒకసారి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేది. శ్రోతలు రేడియోల ముందు మూగేవారు. ఆ అరగంటసేపు బయట ప్రపంచాన్ని మరచి ఆ పురాణ గాథలలో మునిగి తేలేవారు.

పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు
ఉషశ్రీ
జననంపురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు
మార్చి 16, 1928
పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు
మరణంసెప్టెంబరు 7, 1990
ఇతర పేర్లుఉషశ్రీ
వృత్తిజాతీయోద్యమ సమయంలో కాకినాడలో కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధి
ఆకాశవాణి విజయవాడ కేద్రం
ప్రసిద్ధిరేడియో వ్యాఖ్యాత, సాహిత్య రచయిత
తండ్రిపురాణపండ రామమూర్తి
తల్లికాశీ అన్నపూర్ణ
ఉషశ్రీ చిన్నతనంలో

ఈ విధంగా ప్రఖ్యాతి గాంచిన రేడియో వ్యాఖ్యాత, సాహిత్య రచయిత. ఉషశ్రీ గారు తన రామాయణ భారత ప్రవచనాల ద్వారా తెలుగునాట అందరికీ సుపరిచితులు. ఆప్పట్లో ఆయన గొంతుని, మాట సరళిని తెలుగు శ్రోతలు బాగా గుర్తు పట్టేవారు.

భీమవరంలో డిగ్రీ పూర్తి కాబోయే సంవత్సరంలో ఆయన మిత్రుడైన రామానుజాచార్యులు ఆయనచే పునర్జన్మ అనే నాటకంలో ఒక పాత్ర వేయించాడు. అందులో ఉషశ్రీ తండ్రి పాత్ర పోషించగా రామానుజాచార్యులు విలన్ పాత్ర పోషించాడు.

రచనలు

మార్చు

1979 లో పి.వి.ఆర్.కె ప్రసాద్ తి.తి.దేకి కార్యనిర్వహణాధికారిగా ఉన్నపుడు ఆయనచే భాగవతం రాయించి పాతికవేల కాపీలు ముద్రింప జేసి అతి తక్కువ ధరలో భక్తులకు అందించాడు.[1] అయితే ఆయన రెండున్నర రూపాయలకు విడుదల చేసిన పుస్తకాన్ని తరువాత వచ్చిన వారు తొమ్మిది రూపాయలు చేశారు. భారతం, రామాయణాలు కూడా పదివేల ప్రతులు ముద్రించి కృష్ణా పుష్కరాల సమయంలో విడుదల చేశారు. ఉషశ్రీ రచనలలో ఉషశ్రీ మహాభారతం (4 సంపుటాలు), సుందరకాండ, శ్రీకృష్ణావతారం, ఇంటిటా ఉండవలసిన ఉషశ్రీ రచనలు, ధర్మ సందేహాలు మొదలైన పుస్తకములు ఉన్నవి.[2]

ప్రత్యేకత

మార్చు

ఉషశ్రీ ప్రవచనాలకు రేడియో శ్రోతల నుంచి మంచి స్పందన ఉండేది. భగవద్గీతనీ, సుందరాకాడనీ సామాన్యులకు కూడా అర్థమయ్యేలా ఉండేవి. ఆయన ప్రవచనం ఆద్యంతం ప్రత్యక్షరం స్పష్టంగా, సూటిగా ఉండేది. అతని వ్యాఖ్యానాలలో వీరకాకాని అంతిమయాత్ర, గోదావరి నదిపై రోడ్డు రైలు వంతెన ప్రారంభం, భద్రాద్రి శ్రీరామనవమి కల్యాణం, కృష్ణాపుష్కరాల ప్రత్యక్ష వ్యాఖ్యానం (1980) కీర్తి కిరీటంలో కలికితురాళ్లు. సందర్భోచిత వ్యాఖ్యలు, ఆయన ఉపన్యాసాలని శ్రోతలను మళ్లీమళ్లీ వినేలా చేస్తాయి.[3]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-01-14. Retrieved 2008-04-25.
  2. "Amazon.in". www.amazon.in (in Indian English). Retrieved 2021-09-02.
  3. "తెలుగు శ్రోతలను ఉర్రూతలూగించిన గళ గంధర్వుడు ఉషశ్రీ". Samayam Telugu. Retrieved 2021-09-02.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఉషశ్రీ&oldid=4292152" నుండి వెలికితీశారు