చిలకలూరిపేట
చిలకలూరిపేట ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడు జిల్లాకు చెందిన ఒక పట్టణం. త్రికోటేశ్వర స్వామి వెలసిన కోటప్ప కొండ ఇక్కడికి 16.కి మీ దూరంలో ఉంది.
పట్టణం | |
Coordinates: 16°05′21″N 80°10′02″E / 16.0892°N 80.1672°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు జిల్లా |
మండలం | చిలకలూరిపేట మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 18.13 కి.మీ2 (7.00 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 1,01,398 |
• జనసాంద్రత | 5,600/కి.మీ2 (14,000/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1020 |
ప్రాంతపు కోడ్ | +91 ( 8646 ) |
పిన్(PIN) | 522616 |
Website |
చరిత్ర
మార్చుచిలకలూరిపేటను పూర్వం పురుషోత్తమ పట్నం అని, చిలకల తోట అని, రాజాగారి తోట అని, చిలకలూరిపాడు అని, పిలిచే వారు. పురుషోత్తమ పట్నం అనేది ప్రస్తుతం పట్టణ శివారులో ఉన్న ఒక గ్రామం. బ్రిటిషు వారు దీనిని చిక్‌పేట అని పిలిచే వారు. ఇక్కడి పండ్ల తోటల వలన చిలుకలు ఎక్కువగా వచ్చేవి, అందుచేత దీనిని చిలకలూరు అని జమీందార్ల కాలంలో అనేవారు.
ఈ ప్రాంతాన్ని పాలించిన జమిందారులు ప్రజలతో ఉదారంగ ఉండే వారు. పన్ను రాయితీలు ఇస్తూ ప్రజలకు భారం తక్కువగా ఉండేలా చూసేవారు. పిండారీలు చిలకలూరిపేటపై దాడి చేసినపుడు, జమీందార్లు సమర్ధంగా వ్యవహరించి ఆ ముఠాలను వెళ్ళగొట్టారు. 1818లో జమీందార్లు గోపురం గుర్తుతో తమ స్వంత నాణేలను (పగోడాలు) ముద్రించుకున్నారు. వారికి మంచి పరిపాలనా దక్షులుగ ఈష్టిండియా కంపెనీ ప్రభుత్వం నుండి బహుమతి వచ్చింది.
భౌగోళికం
మార్చుగుంటూరుకు దాదాపు 40 కి మీల దూరంలో ఉంది. [2]
జనగణన గణాంకాలు
మార్చు2011 జనగణన ప్రకారం పట్టణ జనాభా 1,01,398. పట్టణ విస్తీర్ణం 18.13 చ.కి.మీ.[3]
పరిపాలన
మార్చుచిలకలూరిపేట పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా సౌకర్యాలు
మార్చుపట్టణం జాతీయ రహదారి 16 (భారతదేశం) పై వుంది. సమీప రైల్వే స్టేషన్ నరసరావుపేట లో వుంది.
పరిశ్రమలు
మార్చుపట్టణంలో ధాన్యం మిల్లులు, పత్తి జిన్నింగు మిల్లులు, నూనె మిల్లులు, వాహనాల మరమ్మత్తు సంస్థలున్నాయి. చిలకలూరిపేట వాహన నిర్మాణం, మరమ్మత్తులకు పేరు పొందిన స్థలం. వాహనాల బాడీ నిర్మాణానికి ఇది పెట్టింది పేరు.
కళలు
మార్చు- ఇస్మాయిల్ అనే శిల్పి కారణంగా పురుషోత్తమపట్నం/చిలకలూరిపేటకి ప్రపంచ ప్రఖ్యాతి వచ్చింది. శిల్పకళను మైలాపూరులో తన గురువైన షణ్ముగాచారి వద్ద నేర్చుకున్న ఇతను ఊరిలో స్థిరపడ్డాడు. అతను చెక్కిన శిల్పాలు దేశంలోని పలు ప్రాంతాలలో ప్రతిష్ఠించ బడ్డాయి. అతని పేరు "Reference Asia" అనే పుస్తకంలో చేర్చబడింది.
- 2008లో iskcon వారిని ఈ కొండవీటి ప్రాంతానికి తీసుకువచ్చి చెంఘిజ్ ఖాన్పేటలో గల వెన్నముద్ద స్వామిని దర్శింపచేసి ఈ ప్రాంత అధ్యాత్మిక అభివృద్ధికి దోహదం చేసింది శివలోకం ప్రాజెక్ట్ అధ్యక్షులు బందినేని రామకృష్ణ. dr ఈమని శివనాగిరెడ్డి ప్రముఖ స్థపతిని చిలకలూరిపేట తీసుకువచ్చి పురావస్తుశాఖ ద్వారా 1100సంవత్సరాలనాటి వేలూరు శివాలయాన్ని జీర్నోద్ధారణ గావించారు.
- 2011నుండి ఆయుర్వేదంపై పరిశోధన నిర్వహించడం ద్వారా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్న ఇర్లపాడు గ్రామంలో జన్మించిన రాయసం పేరయ కొండవీటి రెడ్డి రాజుల ఆస్థానవైద్యాధికారిగా ఉండేవారు. రాయసం పేరయ రచించిన నవనాధ సిద్ధసారము వైద్య గ్రంధాన్ని బందినేని రామకృష్ణ నేత్రుత్వం లోని కుర్రా జితేంద్రబాబు ఒక బృందంగా ఏర్పడి పరిశోధించి ఆయుర్వేద పుస్తకాన్ని ప్రకటించారు. ఈ గ్రంధం తెలుగులో ప్రకటించబడిన మొట్టమొదటి ఆయుర్వేద వైద్య గ్రంధం. ప్రచురుంచిన సంస్థ భారతీయ సంస్కృతి ఆయుర్వేద వికాస పరిషద్. దీనిని 2018లో ప్రచురించారు.
2023లో శ్రీ నటరాజ సంగీత నృత్య కళాశాల స్థాపించడం ద్వారా అనేక మంది విద్యార్థులకు కర్ణాటక సంగీతం, కూచిపూడి, కోలాటం తదితర కళలలో శిక్షణ నిర్వహిస్తున్నారు. భారతీయ సంస్కృతి ఆయుర్వేద వికాస పరిషత్ భూమిక గా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ఆలయ నిర్మాణం అనే వాస్తు గ్రంధం ప్రచురించింది.
పర్యాటక ఆకర్షణలు/దేవాలయాలు
మార్చు- శ్రీ భూనిళా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి దేవాలయం: ఈ ఆలయం చిలకలూరిపేట పట్టణ పరిధిలో ఉన్న కొమరవల్లిపాడులో ఉంది. సా.శ. 1712 లో చిలకలూరిపేట జమీందారు రాజమానూరి వేంకటకృష్ణరాయణం బహద్దూర్ ఈ ఆలయాన్ని నిర్మించాడు. చిలకలూరిపేట ప్రక్కనే ఉన్న పసుమర్రు గ్రామంలో ఒక మహమ్మదీయుని ఇంటిలో కాకరపాదు త్రవ్వుచుండగా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి విగ్రహం లభించింది. రాజా వారు, ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ నిమిత్తం చంఘిజ్ ఖాన్ పేటకు తరలించుచుండగా ఓంకార నది ఒడ్డునగల కొమరవల్లిపాడుకు రాగానే విగ్రహం కదలలేదట. ఆ రాత్రి స్వామివారు జమీందారుగారికి కలలో సాక్షాత్కరించి, అక్కడనే ప్రతిష్ఠించమని కోరగా, అదే విధంగా దైవానుసారం, జమీందారు కొమరవల్లిపాడు లోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర కథనం. స్వామివారు వామాంకమున లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకొని నేత్రపర్వంగా భక్తుల అభీష్టాలు నెరవేర్చుచున్నారని ప్రతీతి.
- కోటప్ప కొండ: ఇక్కడికి 13 కి మీ దూరంలో ఉంది.
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
- ↑ "Adminsistrative divisions of Guntur district" (PDF). guntur.nic.in. Archived from the original (PDF) on 26 June 2014. Retrieved 16 January 2015.
- ↑ "District Census Handbook - Guntur" (PDF). Census of India. p. 14,46. Retrieved 18 January 2015.