పుష్పగిరి ఆలయ సముదాయం

(పుష్పగిరి ఆలయ సముదాయము నుండి దారిమార్పు చెందింది)

పుష్పగిరి ఆలయ సముదాయం ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా, చెన్నూరు మండలంలోని పుష్పగిరి గ్రామం లో ఉంది.[1] [2] కడప జిల్లా కేంద్రం కడప పట్టణానికి 16 కిలోమీటర్ దూరములో ఉంది. అనేక శైవవైష్ణవాలయాల సముదాయం పుష్పగిరి.[3]

Pushpagiri Temple complex
Religious Complex
In the order from top left to bottom left, Vaidyanatheswara Swamy temple, Reliefs on the temple walls of Chennakesava Swamy, A panoramic view of Pushpagiri overlooking the river Penna, Indranatheswara Swamy temple, Trikuteswara Swamy temple
In the order from top left to bottom left, Vaidyanatheswara Swamy temple, Reliefs on the temple walls of Chennakesava Swamy, A panoramic view of Pushpagiri overlooking the river Penna, Indranatheswara Swamy temple, Trikuteswara Swamy temple
Pushpagiri Temple complex is located in Andhra Pradesh
Pushpagiri Temple complex
Pushpagiri Temple complex
Location in Andhra Pradesh, India
Coordinates: 14°35′41″N 78°45′47″E / 14.594749°N 78.763004°E / 14.594749; 78.763004
CountryIndia
StateAndhra Pradesh
RegionRayalaseema
DistrictKadapa
Area
 • Total7.5 km2 (2.9 sq mi)
Elevation
380 మీ (1,250 అ.)
Population
 (2001)
 • Total500 (approx)
Languages
 • OfficialTelugu
Time zoneUTC+5:30 (IST)
PIN
516162
Telephone code+91 - 8562
Vehicle registrationAP04

నామం మార్చు

పుష్పగిరి అనే పేరు ఈ గ్రామానికి రావటం వెనుక పురాణాలలో ఉటంకింపబడిన ఒక గాథను పేర్కొంటారు.

కశ్యప మహర్షికి ఇరువురు భార్యలు. వినత, కద్రువ. వినత, కద్రువ ఇరువురూ గర్భముదాల్చి ఉండగా ఒకనాడు వినత కద్రువతో ఆడిన ఆటలో ఓడి, కద్రువకు, కద్రువ సంతతియైన సర్పములకు దాస్యము చేయుటకు అంగీకరించును. తదుపరి వినత వైనతేయుడైన గరుత్మంతునికి జన్మమివ్వగా, గరుత్మంతుడు ఒకనాడు తన తల్లిని గూర్చి తమ దాస్యమునకు కారణమును అడిగెను. దానికి ఆమె ఇచ్చిన సమాధానమును విన్న గరుత్మంతుడు కద్రువను చేరి తమ్మిరువురనూ దాస్యవిముక్తులు గావింపమని ప్రార్థించగా కద్రువ, తనకూ, తన బిడ్డలకూ అమృతమును స్వర్గమునుండి తెచ్చి ఇచ్చిన దాస్యము తొలగునని తెలిపెను. దానికి సమ్మతించిన గరుత్మంతుడు, దేవేంద్రునితో విరోధించి అమృతభాండమును స్వర్గమునుండి తెచ్చుసమయమున ఆ పాత్రనుండి ఒలికిన రెండు అమృతబిందువులు ఈ ప్రదేశములోని ఒక సరస్సులో జారిపడెను. తన్నిమిత్తముగా ఆ సరోవరమునందు స్నానమాచరించిన వారు నిత్యయవ్వనులై, జరామృత్యుభయము లేక ఉండిరి.[4][5]

ఈ విషయమును గమనించిన దేవతలు, మానవులు మృత్యుహీనులగుదురేని సృష్టిక్రమమునకు విరోధమగునని భావించి శ్రీమహావిష్ణువును శరణు వేడగా విష్ణువు గరుత్మంతుని ఆ సరోవరమును ఒక పర్వతభాగముతో కప్పివేయమని ఆజ్ఞాపించెను. కానీ అమృతబిందు మహత్యము వలన ఆ పర్వతభాగము సరోవరమునందు పుష్పమువలె తేలియాడెను. ఆ నాటినుండి ఈ ప్రదేశానికి పుష్పగిరి అను నామము సార్థకమాయెనని లోకోక్తి.[4]

ఈ విచిత్రమును గమనించిన దేవతలు, మరలా మహావిష్ణువును శరణు కోరగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ పాదములతో ఆ పర్వతమును అణచివేసిరి. ఈనాటికీ పుష్పగిరి గ్రామ సమీపమందు విష్ణుపాదము, రుద్రపాదము అను నామములతో వారి పాదముద్రలు ఉన్నాయి.

భౌగోళిక స్థితి మార్చు

భౌగోళికముగా పుష్పగిరి ఆలయ సముదాయము సముద్రమట్టానికి రమారమి 380 metres (1,000 ft) ఎత్తులో ఉంది. ఈ ఆలయ సముదాయము ఇంచుమించు 7.5 చ.కి.మీ విస్తీర్ణములో వ్యాపించి ఉంది. ప్రక్కనే ఉన్న పెన్నానది మూలముగా సంవత్సర పర్యంతమూ వరిచేలతో ఇక్కడి పొలాలు కళకళలాడుతూ ఉంటాయి. కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో నీటి ఎద్దడి ఉన్నా కూడా, ఇక్కడ మాత్రము భూగర్భజలాలు పుష్కలముగా ఉంటాయి.[6]

ఋతుపవనాల కాలములో వర్షాల తరువాత మామూలుగా ఎక్కువగా ఉన్న ఉష్ణోగ్రతలు చల్లబడుతాయి. పినాకినీ నదితో ఇక్కడ నాలుగు ఉపనదులు సంగమించినందువల్ల ఈ ప్రదేశమును పంచనదీ సంగమమని, పంచ ప్రయాగ అని పిలుస్తారు. పినాకినీ నదితో కలిసే మిగిలిన నాలుగు నదులు: కుముద్వతి, బాహుదా, మందాకినీ, పాపాఘ్ని. పినాకినీ నది కర్ణాటక దేశములోని నందికొండలలో పుట్టి ఇక్కడ పెద్దగా పెరిగి చూపరులను ఆకట్టుకునేలా ఉంటుంది. పెన్నా పూర్వగామిని. కానీ ఈ ప్రదేశములో కొద్దిగా దిశ మార్చుకొని దక్షిణాభిముఖముగా ప్రయాణించి పుష్పగిరి తరువాతి శివాలపల్లె అను గ్రామం వద్ద తిరిగి తూర్పుకు మళ్ళి ప్రవహిస్తుంది.[7][8]

వాతావరణం మార్చు

పుష్పగిరి ఉష్ణోగ్రతలు కడపజిల్లాలోని సాధారణ ఉష్ణోగ్రతలనే పోలి ఉంటుంది ఎండాకాలములో వేడి ఎక్కువగా ఉండి పెన్నానది లోని నీరు కూడా అడుగంటి కొన్ని నీటి గుంటలలో మాత్రమే ఉంటాయి. సాధారణ ఉష్ణోగ్రత ఎండాకాలములో 37°C నుండి 45°C మధ్యలో ఉంటుంది. సాధారణంగా ఎండాకాలము మార్చి నెల నుండి జూలై నెల వరకూ ఉంటుంది.[9][10][11]

జూన్, జూలై మాసాలలో ఋతుపవనాలు మొదలైన తరువాత ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గుముఖం పడతాయి. సాధారణ వర్షాలతో పాటు చుట్టూ కొండలు ఉండటం వల్ల వాయుగుండాల వల్ల వచ్చే వర్షాలతో నది పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. సెప్టెంబరు నుండి మార్చి వరకు ఉష్ణోగ్రతలు చాలా మటుకు తగ్గి వాతావరణము ఆహ్లాదముగా ఉంటుంది. డిసెంబర్ నెల మామూలుగా మిగిలిన అన్ని నెలల కన్నా చల్లని నెల. సాధారణ ఉష్ణోగ్రతలు 17°C నుండి 23°C వరకు ఉండి, ఆలయాలను దర్శించడానికి వచ్చే యాత్రికులకు అనుకూలముగా ఉంటుంది.[12] [12][10][11]

చరిత్ర మార్చు

పూర్వ రాజుల కాలం మార్చు

పుష్పగిరి ఆలయ సముదాయము గురించి అతి విలువైన చారిత్రిక ఆధారాలు, చరిత్ర ఉంది.[13] పుష్పగిరి గురించిన మొట్టమొదటి ప్రస్తావన స్కంద పురాణములోని శ్రీశైలఖండములో ఉంది.[14] అదే విధముగా సత్యనాథుడు రాసిన రసరత్నకారములో కూడా పుష్పగిరి యొక్క ప్రస్తావన ఉంది. ఇక్ష్వాకు రాజుల శాసనాలలో శ్రీశైలమల్లికార్జున జ్యోతిర్లింగక్షేత్రానికి దక్షిణ ద్వారముగా పుష్పగిరి వర్ణింపబడింది.[15] పూర్వ చోళుల వంశానికి చెందిన కరికాళచోళుని శాసనములో ఈ స్థలము అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడింది.[16]

పుష్పగిరిలోని అనేక భవనములు, దేవస్థానములు చోళ చాళుక్య శిల్పకళా వైభవానికి అద్దముపట్టినట్టుగా ఉంటాయి. అదే విధముగా తరువాతి తరపు రాజులు చేసిన మార్పులు, చేర్పుల మూలముగా వారి వారి శిల్ప వాస్తు కళా సంపాదన చేర్చుకొనినాయి.

 
శ్రీవైద్యనాథస్వామి దేవస్థానం ఎదురుగానున్న 15వ శతాబ్దపునాటి రాతి శాసనము

పినాకినీ నది గురించి ఇక్కడ ఒక్క ప్రస్తావన చేసితీరాలి. కర్ణాటకలోని నందికొండలలో వెలసియున్న భోగనందీశ్వరస్వామి దేవస్థానము వద్ద మూడు నదుల ఆవిర్భావమున్నది. అందులో ఒకటి పినాకినీ కాగా, మిగిలిన రెండు ఆర్కావతి మఱియు పాలారు. అందు ఆర్కావతి, పాలారు క్రమముగా దేశగర్భములో కలిసిపోయినా, పినాకినీ ఒక్కటీ దేశములన్నీ దాటి కడపను ప్రవేశించింది. ఒక నానుడి ప్రకారము, పరమేశ్వరుడు చేసిన ఆనందతాండవ ఫలితముగా ఉద్భవించిన నందికొండలలో పినాకినీ ఈశ్వరుణ్ణి తన జన్మకారణమడిగి దిశానిర్దేశము చేయమనినప్పుడు ఈశ్వరుడు తన చేతిలోని ధనస్సుతో భూమిమీద ఒక రేఖ వ్రాసి దానిని అనుసరించమని ఆ నదీమతల్లిని ఆజ్ఞాపించినాడని, ఆ నది ఆ మార్గము గుండా వెళ్ళగా పుష్పగిరి దగ్గర చతుర్నదులు అందులో సంగమించి ఇప్పటి పెన్నా నది అయినదని లోకోక్తి.[17]

శివుని ధనుస్సు పేరు పినాకము అయినందువలన ఆ నది పినాకినీ అయినదని పద వ్యుత్పత్తి.

పూర్వ కాలపు రాజులు ఎందఱో ఈ క్షేత్రమును ఆరాధించి, పునరోద్ధారణ గావించి మడులు, మాన్యాలు సమర్పించి ధన్యులయినారు.

మధ్యమ యుగపు రాజులు, పాలేగాళ్ళు మార్చు

రాజులూ, రాజ్యాలు చేతులు మారినా పుష్పగిరి ప్రభావము తగ్గలేదు. ఎందఱో రాజులు, వారి పాలేగాళ్ళు ఇక్కడి వైద్యనాథ, చెన్నకేశవ మూర్తులను ఆరాధించి, సేవించి, మాన్యములు సమర్పించారు.

  1. వైదుంబ వంశానికి చెందినా సోమదేవుడు ఈ క్షేత్రమును సేవించాడు.
  2. చోళుల నుండి రాజ్యాధికారమును స్వాదీనపరచుకొన్న పల్లవరాజు చిద్దన దేవరాజు ఈ క్షేత్రమునకు మాన్యములు సమర్పించినట్టు చారిత్రక ఆధారములు లభ్యమవుతున్నాయి.
  3. కేశవంశపు యాదవ సింగన ఇక్కడి వైద్యనాథేశ్వరున్ని పూజించాడు
  4. రాష్ట్రకూట చక్రవర్తియైన కృష్ణవల్లభుడు వైద్యనాథలింగమునకు నిత్యపూజావరసమై మాన్యములు సమర్పించినట్టు శాసనములు చెపుతున్నాయి. ఈ మేరకు ఒక రాతి శిలాఫలకమును భారతీయ పురాతత్వ సంస్థకనుగొన్నది[5]
  5. కాకతీయుల కాలమునాటి పాలేగాళ్ళు అయిన గంగయ సాహిణి మఱియు అంబదేవుడు ఇక్కడి దేవతామూర్తులను కొలవడమే కాక అత్యంత మనోహరమైన దేవస్థానములను తమ భార్యల, కూతుళ్ళ పేర్లతో నిర్మించి, వాటికి మాన్యములిచ్చి పోషించారు.[18]
  6. విజయనగర సామ్రాజ్యపు పాలేగాళ్ళు అయిన ముసునూరి నాయకులు ప్రస్తుత చెన్నకేశవస్వామి దేవస్థానమును నిర్మించారు.
  7. పుష్పగిరిలో దొరికిన ఒక రాతి శాసనము మూలముగా ఒక తంత్రవేత్త అయిన 'అఘోరశివాచార్యులు' అను సాధువు చెన్నకేశవస్వామి దేవస్థాన ముఖద్వారమును, మూలగోపురమును నిర్మించినాడని తెలుస్తున్నది.[16]

సంస్కృతి మార్చు

 
లకులీశుని విగ్రహము - వైద్యనాథస్వామి దేవస్థానము, పుష్పగిరి

తెలుగు జనబాహుళ్యముచేత మాట్లాడబడు భాష. కానీ ఏటేటా జరిగే జాతరకు కర్ణాటకాంధ్రప్రదేశములనుండి విరివిగా జనులు ఇక్కడికి వస్తారు. ప్రాచీనకాలమునుండి ఇక్కడ వివిధమైన సంస్కృతులు ఉన్నట్టు ఇక్కడి శిల్పముల ద్వారా తెలుస్తున్నది.

నేపాళదేశములో బహుళ ప్రాచుర్యమున్న వీరపాశుపతం ఇక్కడ కూడా పాటించినట్టు కొన్ని శిల్పాలద్వారా బహిర్గతమవుతుంది. పెన్నానది ఒడ్డున ఉన్న శ్రీవైద్యనాథేశ్వరస్వామి దేవస్థానములోని నకులీశుని (లకులీశుడని కూడా అంటారు) శిల్పము ఇక్కడ వీరపాశుపతం ప్రాచుర్యములో ఉన్నదనడానికి సాక్ష్యం.

ఆ కాలములో దేశ సంచారము చేయుచుండిన సాధువులు, అఘోరాలు ఇక్కడ శాక్తేయ పద్ధతులను సాధన చేసేవారు.

శ్రీఆదిశంకరభగవత్పాదాచార్యుల వారు దేశ సంచారము చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడి వైద్యనాథస్వామివారి దేవస్థానములోని కామాక్షి అమ్మవారి విగ్రహము ఎదుట శ్రీచక్రమును స్థాపించారు. ఆ దేవస్థానముకు అనుబంధముగా ఒక మఠమును కూడా స్థాపించారు.

బ్రిటీష్ కాలమునాటి కైఫియత్తుల ప్రకారము శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబికా క్షేత్రము ఈ మఠము వ్యాప్తి కిందికి వస్తుందని ఆచార్యులవారు నిర్దేశించినారని తెలుస్తుంది.

ఎఱ్ఱగుడిపాడు, చింతలపత్తూరు గ్రామాలలో బయల్పడిన శాసనాల మూలముగా కూడా ఇక్కడ వివిధ వామాచార, దక్షిణాచార పద్ధతులను అవలంబించినారని తెలుస్తుంది.

ఈ ఆలయ సముదాయములో వివిధ శైవవైష్ణవసంప్రదాయములకు చెందినా దేవస్థానములు ఉన్నాయి. శైవవైష్ణవవిభేదాలు మిన్నంటిన కాలములో కూడా ఇక్కడ ఆ రెండు ఆచారాలు సామరస్యముగా ఉండడము విశేషము. దీనికి నలువైపులా కొండలు నదులతో కూడి ఉన్న కడపజిల్లా భౌగోళికస్థితి కూడా ఒక కారణము కావచ్చును.

వాస్తు శిల్ప కళ మార్చు

పుష్పగిరిలోని వాస్తు శిల్పకళారీతులు ఇక్ష్వాకుల కాలము మొదలు విజయనగర సామ్రాజ్యపు రాజుల రీతుల వరకు ఉన్నాయి. చుట్టూ కొండలు, నదులతో ఉన్న కడప జిల్లా భౌగోళిక పరిస్థితులు చాలా మటుకు ఇతర సామ్రాజ్యాలను నిలువరించగలిగినాయి. దీని మూలాన స్థానిక పరిస్థితులు స్వతంత్ర చిన్న రాజ్యాలకు, దొరలకు వీలు కల్పించినాయి. ఈ పరిస్థితులు బహు కాలము కొనసాగినాయి. ఇందువల్ల ఇక్కడి దేవస్థానములలో చాలా మటుకు ఇక్ష్వాకుల కాలమునుండి స్థానిక జమీందారుల కాలము వరకు శాసనములు కనపడుతాయి. ఉదాహరణకు ఇక్ష్వాకుల, పల్లవుల, చోళుల, చాళుక్యుల, రాష్ట్రకూటుల, వైదుంబుల, కాయస్థుల, విజయనగర సామ్రాజ్యపు అవశేషాలు ఇంకా ఇక్కడి రాళ్ళలో కనపడుతాయి.[19][20]

వైద్యనాథస్వామి దేవస్థానము ఒక్క అద్భుతమైన శిల్పకళా విశేషము. ఇందులో లెక్కకు మీరి దేవతామూర్తి ప్రతిమలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యముగా కామాక్షి అమ్మవారి గుడిలోని శ్రీచక్రము ఒక విశేషము. దేవస్థానములో రెండు గర్భగృహములున్నవి. ఒకటి స్వామివారికి కాగా రెండవది అమ్మవారిది. చుట్టూ ఉన్న అనేక దేవతాప్రతిమలు ఇప్పుడు భారతీయ పురాతత్వ శాఖ పర్యవేక్షణలో ఉన్నాయి.

శైవ - వైష్ణవ విభేదాలు మిన్నంటుతున్నటువంటి కాలములోనే కడపజిల్లాలో మతసామరస్యం పరిఢవిల్లింది, ముఖ్యముగా పుష్పగిరి పరిసర ప్రాంతములలో ఈ ధోరణి కనపడుతుంది. శైవ-వైష్ణవ ఆలయములు పక్క పక్కన ఉండి కూడా భావ విరోధమూ లేకుండా ఆలయాలకు ఎటువంటి నష్టం కలగించకుండా ఉండడం చెప్పుకోదగ్గ విషయం. వీటిలో రెండు దేవస్థానములు కేవలం 2 కి.మీ. దూరములో ఉండి ఈ భావ సారూప్యానికి సాక్ష్యం చెపుతున్నాయి.[21] ప్రధాన వైష్ణవాలయమైన చెన్నకేశవ స్వామి దేవస్థానం చుట్టూ ఇంద్రనాథేశ్వర దేవస్థానము, భీమేశ్వర, త్రికూటేశ్వర మఱియు వైద్యనాథేశ్వర దేవస్థానములు ఉన్నాయి.[22] పెన్నానది తూర్పు తీరములో పశ్చిమదిక్కు వైపు తిరిగి ఉన్న చెన్నకేశవ స్వామి దేవస్థానము శిఖరము చూపరులును ఆకట్టుకుంటుంది. ఇంద్రనాథస్వామి దేవస్థానము నదీ తీరమునకు ఉత్తరదిక్కున ఉంది.[23][24] ఈ దేవస్థానమునకు చెందిన అతి ప్రాచీనమైన శాసనము 1076 C.E నాటిది. వైదుంబ వంశమునకు చెందిన అల్లమదేవుడనే రాజు దేవస్థానమునకు ఇచ్చిన కొన్ని భూమి మాన్యముల గురించి ఈ శాసనము ప్రస్తావిస్తుంది.[25]

పుష్పగిరిలోని శిల్ప సంపద మార్చు

పుష్పగిరిలోని కొన్ని అపూర్వ శిల్పకళా రీతులు క్రింది చిత్రపటములలో చూడవచ్చును.

సూచిక మార్చు

  1. "Wikimapia". Wikimapia.org. Archived from the original on 2016-09-13.
  2. "Pushpagiri Temple Complex - Wikimapia". wikimapia.org. Retrieved 2015-04-28.
  3. Subramanyam, M. V. (August 3, 2012). "Rope suspension bridge at Pushpagiri". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 2015-04-28.
  4. 4.0 4.1 "VAISHNAVA TEMPLES IN INDIA: Shri Chenna-Kesava Temple, Pushpagiri. Andhra Pradesh". vaishnavatemple.blogspot.in. Archived from the original on 2015-05-22. Retrieved 2015-04-28.
  5. 5.0 5.1 A. Umamaheswara Shastry - A thesis on the inscriptions of Cuddapah district (కడప జిల్లా శాసనాలు)
  6. "Kadapa river map".
  7. "Ground Water Brochure, Kadapa, Andhra Pradesh" (PDF). Central Ground Water Board. GOI. Archived from the original (PDF) on 2016-03-28. Retrieved 2016-09-09.
  8. "Cuddapah District Administration". Cuddapah District Administration Website. Government of Andhra Pradesh. Archived from the original on 2016-09-08. Retrieved 2016-09-09.
  9. "Current weather in kadapa: Weekly forecast for kadapa, andhra pradesh". www.skymetweather.com. Archived from the original on 2016-03-09. Retrieved 2015-04-28.
  10. 10.0 10.1 "Weather in Kadapa, India | 14 day weather outlook of Kadapa". www.worldweatheronline.com. Archived from the original on 2015-03-11. Retrieved 2015-04-28.
  11. 11.0 11.1 "KADAPA Weather, Temperature, Best Season, Kadapa Weather Forecast, Climate". www.mustseeindia.com. Archived from the original on 2016-03-04. Retrieved 2015-04-28.
  12. 12.0 12.1 "Climate-Watch, October 2001" (PDF). www1.ncdc.noaa.gov. Archived from the original (PDF) on 2016-02-22. Retrieved 2015-04-28.
  13. Ray, Himanshu Prabha. "The Archaeology of Seafaring in Ancient South Asia". N. Fagin Books. Archived from the original on 2016-03-04.
  14. "Srisailam". Srisailam. Archived from the original on 2016-12-30.
  15. "Welcome to Mana Kadapa". Welcome to Mana Kadapa. Archived from the original on 2016-03-05. Retrieved 2016-09-09.
  16. 16.0 16.1 "అన్వేషి: పుష్పగిరి". Archived from the original on 2016-03-06.
  17. "Nandi Hills | Nandi Betta". Archived from the original on 2016-09-20.
  18. The History of Andhra Country, 1000 A.D.-1500 A.D. by Yashoda Devi; ISBN 8121204380
  19. Ganapathi, Racharla (2000-01-01). Subordinate Rulers In Medieval Deccan. Bharatiya Kala Prakashan. ISBN 9788186050538. Retrieved 2015-05-02.
  20. R, Ganapathi. Inscriptions of AndhraPradesh- Kadapa District, Part-I.
  21. The Asiatic journal and monthly register for British and foreign India, China and Australasia. Allen. 1840. Retrieved 2015-05-02.
  22. "Pushpagiri,Religious Travel in Andhra Pradesh,Pushpagiri Temples,India". www.indiantravelportal.com. Archived from the original on 2015-09-24. Retrieved 2015-05-02.
  23. "Caste System in Medieval Kadapa Region of Andhradesa (1100-1600 AD)" (PDF). www.arcjournals.org. Archived from the original (PDF) on 2016-03-05. Retrieved 2015-05-02.
  24. "South Indian Inscriptions Volume_9 - Rashtrakutas Inscriptions @ whatisindia.com". Archived from the original on 2013-05-09. Retrieved 2016-09-09.
  25. A, Gurumurthy. "Temples of Cuddapah District". {{cite journal}}: Cite journal requires |journal= (help)

వెలుపలి లంకెలు మార్చు