పెరిశేపల్లి (ఆంగ్లం: Perisepalli), కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

పెరిశేపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
పెరిశేపల్లి is located in Andhra Pradesh
పెరిశేపల్లి
పెరిశేపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°18′11″N 81°00′52″E / 16.303003°N 81.014375°E / 16.303003; 81.014375
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పామర్రు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521157
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామ భౌగోళికం మార్చు

సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

పామర్రు నుండి జుజ్జవరం, మీదుగా పసుమర్రు గ్రామం తరువాత పెరిశేపల్లి ఉంది. పామర్రు నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో సుమారు 75 ఇండ్లు ఉన్నాయి.

సమీప గ్రామాలు మార్చు

గుడివాడ, పెడన, మచిలీపట్నం, తెనాలి

సమీప మండలాలు మార్చు

పామర్రు గుడ్లవల్లేరు, ఘంటసాల, మొవ్వ

రవాణా సౌకర్యాలు: మార్చు

పామర్రు, గుడివాడ నుండి రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 54 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, పెరిశేపల్లి

గ్రామంలో మౌలిక వసతులు మార్చు

త్రాగునీటి సౌకర్యం మార్చు

గ్రామంలోని చెరువు నీటిని శుద్ధిచేసి, త్రాగునీటిగా గ్రామస్థులకు అందించుటకై, ఈ గ్రామ దత్తత స్వీకర్త చెరుకూరి కృష్ణమూర్తి, 13 లక్షల రూపాయల వ్యయంతో, గ్రామంలో ఒక నీటిశుద్ధికేంద్రాన్ని ఏర్పాటు చేసారు. ఈ కేంద్రాన్ని 2017 ఫిబ్రవరి 27న ప్రారంభించారు. [5]

గ్రామ పంచాయతీ మార్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్ చట్టం 3 (2) (ఇ) ప్రకారం, కాపవరం పంచాయతీ పేరును, ఇటీవల, పెరిశేపల్లి పంచాయతీగా పేరు మార్పుచేస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది వరకు కాపవరం పంచాయతీ పరిధిలో ఉన్న మల్లవరం, సఫ్తార్ ఖాన్ పాలెం, పెరిశేపల్లి గ్రామాలు ఇకపై పెరిశేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోనికి వచ్చును. [2]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో చాపరాల నాగవల్లి సర్పంచిగా ఎన్నికైంది. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ అలివేలు మంగా, పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం మార్చు

ఈ ఆలయంలో స్వామివారి పవిత్రోత్సవాలు 2016 మార్చి 10 నుండి 13 వరకు నిర్వహించారు. [3] ఈ ఆలయ రజతోత్సవాలు 2017 ఫిబ్రవరి 19వ తేదీ ఆదివారంనాడు, రామానుజ జియ్యర్‌స్వామి పర్యవేక్షణలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటిరోజు విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మత్స్య సంగ్రహణం, అంకురార్పణ జరిపించారు. రెండవ రోజైన సోమవారంనాడు యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ఠ నిర్వహించారు. మూడవరోజైన మంగళవారంనాడు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం యాగశాలలో ద్వారా తోరణం, ధ్వజ, కుంభ, అగ్ని ఆరాధన నిర్వహించారు. అనంతరం హోమం, ఆరగింపు, నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, స్వామివారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలను స్వీకరించారు. ఈ ఆలయ రజతోత్సవాలలో భాగంగా 22వ తేదీ బుధవారంనాడు, శ్రీ ఆంజనేయస్వామి, గరుడాళ్వార్ల విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారలను దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ రజతోత్సవాలు 24వ తేదీ శుక్రవారంతో ముగిసినవి. [4] ఈ ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు 2017 ఫిబ్రవరి 24వ తేదీ శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైనవి. ఈ సందర్భగా అంకురార్పణ, నిత్యహోమాలు నిర్వహించారు. 27న శ్రీవారి కళ్యాణం, 28న గరుడోత్సవం, మార్చి 1న అన్నసమారాధన, 2న తెప్పోత్సవం నిర్వహించారు. [4]&[6]

గ్రామంలో ప్రధానమైన పంటలు మార్చు

వరి, పత్తి. అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం ప్రధానవృత్తి.

గ్రామ ప్రముఖులు మార్చు

  • ఈ గ్రామాన్ని 2016లో హైదరాబాద్‌కు చెందిన విష్ణు కెమికల్స్‌ సంస్థ అధినేత చెరుకూరి కృష్ణమూర్తి దత్తత తీసుకున్నారు.[1] అలాగే స్వగ్రామం పై మమకారంతో కృష్ణం అనే ఓల్డేజ్‌ హోమ్‌ సకల సదుపాయాలతో నిర్మించారు.[1]
  • వడ్డెర చండీదాస్ ప్రముఖ రచయిత అసలు పేరు చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఇతని తండ్రి చెరుకూరి చంద్రమౌళి తన కలంపేరులో వడ్డెరను పేద వృత్తికులమైన వడ్డెర ప్రజల నుండి, చండీదాస్ అన్న పేరును 15వ శతాబ్దపు విప్లవాత్మక బెంగాలీ కవి నుండి స్వీకరించాడని కథనం. చండీదాస్ తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయములో తత్త్వశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసి విరమించారు. చండీదాస్ 2005 జనవరి 30న మరణించాడు.
  • ప్రముఖ వికీపీడియన్ గుళ్ళపల్లి నాగేశ్వరరావు ఈ వూరివారే.
  • మహీజా ఫిల్మ్స్ బ్యానర్‌ అధినేత, ప్రముఖ సినీ నిర్మాత చెరుకూరి ప్రకాశరావు పెరిశేపల్లి’లో 1926 ఏప్రిల్ 22న జన్మించారు.

గ్రామ విశేషాలు మార్చు

 
కృష్ణమ్‌ ఓల్డేజ్‌ హోమ్‌

ఈ గ్రామానికి చెందిన శ్రీ గొట్టిపాటి వెంకటేశ్వరరావు అను రైతు 2016 సంవత్సరానికి గాను, మండలంలో ఉత్తమ రైతు పురస్కారానికి ఎంపికైనారు. వీరు ఈ పురస్కారాన్ని 2016 జనవరి 12న పామర్రులో నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో అందుకున్నారు. వీరు 2015లో కూడా ఉత్తమ రైతు పురస్కారాన్ని అందుకున్నారు. వీరు 2012లో నేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ రైతు క్లబ్ అధ్యక్షులుగా జిల్లాస్థాయి ఉత్తమ పురస్కారం అందుకున్నారు.[1] ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న చెరుకూరి కృష్ణమూర్తి పెరిశేపల్లిని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతున్నారు.[5]

గ్రామం దృశ్యమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "అన్ని సౌకర్యాలతో పెరిశేపల్లిలో 'కృష్ణమ్‌' ఓల్డేజ్‌హోమ్‌". EENADU. Retrieved 2022-10-05.

వెలుపలి లింకులు మార్చు

[1] ఈనాడు అమరావతి; 2016,జనవరి-15; 28వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-3; 17వఫేజీ. [3] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మార్చ్-5; 2వపేజీ. [4] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,ఫిబ్రవరి-25; 1వఫేజీ. [5] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,ఫిబ్రవరి-28; 2వఫేజీ. [6] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,మార్చ్-3; 2వపేజీ.