పైడి లక్ష్మయ్య
పైడి లక్ష్మయ్య (Paidi Lakshmayya) (1904 - 1987) ప్రజా సేవకులు, విద్యా సంపన్నులు, పరిపాలనా దక్షులు.
పైడి లక్ష్మయ్య | |||
పైడి లక్ష్మయ్య
| |||
పార్లమెంటు సభ్యుడు
| |||
తరువాత | తరిమెల నాగిరెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | అనంతపురం నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1904 కల్యాణదుర్గం, అనంతపురం జిల్లా | ||
మరణం | 1987 | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
జీవిత భాగస్వామి | లక్ష్మమ్మ | ||
సంతానం | 3; 2 కొడుకులు పైడి వెంకటేశ్వర్లు, పి.ఎల్.సంజీవరెడ్డి, 1 కుమార్తె | ||
మతం | హిందూమతం | ||
వెబ్‌సైటు | [1] |
జీవిత విశేషాలుసవరించు
లక్ష్మయ్య ఏప్రిల్ 26, 1904 తేదీన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో పేరూరి అచ్చంపల్లి గ్రామంలో ముసలప్ప, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య ముగించి అనంతపురంలోని దత్తమండల కళాశాలలో 1932లో తెలుగు ప్రధానాంశంగా బి.ఏ. డిగ్రీ పొందారు. మద్రాసులో న్యాయశాస్త్ర పట్టాను సంపాదించి 1937లో న్యాయవాదవృత్తిని స్వీకరించాడు.
వీరు స్థానిక పరిపాలనా రంగంలో ప్రజా ప్రతినిధిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.1942 నుండి 1947వరకు అనంతపురం జిల్లా బోర్డు అధ్యక్షులుగా వుండి జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. 1952 సంవత్సరంలో అనంతపురం లోకసభ నియోజకవర్గం నుండి మొదటి లోక్‌సభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.[1] పార్లమెంటులో వివిధ విషయాలపై చర్చలలో పాల్గొని నిర్మాణాత్మకమైన సూచనలు చేసి ఉత్తమ రాజకీయవేత్తగా పేరుపొందారు.1956లో రష్యా దేశంలో పర్యటించి భారతదేశంలో వ్యవసాభివృద్ధికి కొన్ని సూచనలు ఇచ్చారు. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యులుగా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సిండికేట్ సభ్యులుగా వుండి ఉన్నత విద్యావ్యాప్తికి తమవంతు కృషి చేశారు[2].
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1957లో వీరిని హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖకు కమీషనరుగా నియమించారు. ఆ కాలంలో వివిధ దేవాలయాల పునరుద్ధరణకు కృషిచేశారు. ముఖ్యంగా శ్రీశైల క్షేత్రంలో ఆలయ, మండపాదుల పునర్నిర్మాణానికి ఎంతో కృషిచేశారు. శ్రీశైల దేవస్థాన పాలకమండలి అధ్యక్షులుగా కూడా కొంతకాలం పనిచేశారు. అనంతపురం జిల్లా రచయితల సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు.
రచనలుసవరించు
నాటకాలుసవరించు
- మార్కండేయ విజయం
- మహాత్మ కబీర్
- సంసార నౌక
- సాయి లీలలు
- హేమారెడ్డి మల్లమ్మ లేక శ్రీశైలమల్లికార్జున మహాత్మ్యము
- శ్రీశైలీయము
- శ్రీరామాశ్వమేధము
- లుబ్ధాగ్రేసర
- తారాశశాంక
శతకముసవరించు
- సద్గురు శ్రీ సోమనాథ శతకము
స్వీయ చరిత్రసవరించు
- జ్ఞాపకాలు - వ్యాపకాలు
బిరుదములుసవరించు
- ఆంధ్ర విశ్వకళా పరిషత్తు వీరికి కళా ప్రపూర్ణ గౌరవం ఇచ్చి సత్కరించింది.
- కవిచకోరచంద్రోదయ అనే బిరుదును శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ప్రదానం చేశారు.
మరణంసవరించు
వీరు ఏప్రిల్ 28, 1987లో పరమపదించారు.
మూలాలుసవరించు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-03-22. Retrieved 2013-05-06.
- ↑ బత్తుల, వేంకటరామిరెడ్డి (14 January 1979). "కళాప్రపూర్ణ "శ్రీ పైడి లక్ష్మయ్య"". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 65, సంచిక 280. Retrieved 8 December 2017.[permanent dead link]
- రాయలసీమ రచయితల చరిత్ర రెండవ సంపుటి - కల్లూరు అహోబలరావు- శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం