ప్రహ్లాదపురం

విశాఖపట్నం నగర శివారు ప్రాంతం

ప్రహ్లాదపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.[1] విశాఖ మహా నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో విశాఖపట్నం నుండి 14 కి.మీ.ల దూరంలో ఉంది.

ప్రహ్లాదపురం
సమీపప్రాంతం
ప్రహ్లాదపురం is located in Visakhapatnam
ప్రహ్లాదపురం
ప్రహ్లాదపురం
విశాఖట్నం నగర పటంలో ప్రహ్లాదపురం స్థానం
Coordinates: 17°45′44″N 83°13′17″E / 17.762084°N 83.221263°E / 17.762084; 83.221263
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530047
Vehicle registrationఏపి-31

భౌగోళికం

మార్చు

ఇది 17°45′44″N 83°13′17″E / 17.762084°N 83.221263°E / 17.762084; 83.221263 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

సమీప ప్రాంతాలు

మార్చు

ఇక్కడికి సమీపంలో వేపగుంట, సింహాచలం, ఎన్.ఎ.డి. కాలనీ, కాకాని నగర్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి. ప్రహ్లాదపురంకు దక్షిణ దిశలో గాజువాక మండలం, తూర్పు వైపు విశాఖపట్నం మండలం, దక్షిణ దిశలో పెదగంట్యాడ మండలం, పశ్చిమాన సబ్బవరం మండలం ఉన్నాయి.[2]

రవాణా

మార్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రహ్లాదపురం మీదుగా రామకృష్ణ బీచ్, గాజువాక, ఎన్ఏడి ఎక్స్ రోడ్, ద్వారక బస్సు స్టేషన్, సింహాచలం, జగదాంబ సెంటర్, కంచరపాలెం, గోపాలపట్నం, టౌన్ కొత్తరోడ్, శ్రీహరిపురం, మాల్కాపురం, వెంకోజిపాలెం, మద్దిలపాలెం మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో పెందుర్తి, సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి.[3]

ప్రార్థనా మందిరాలు

మార్చు
  1. చండీ పరమేశ్వరి పీఠం
  2. పైడితల్లి అమ్మవారి దేవస్థానం
  3. వెంకటేశ్వర స్వామి దేవాలయం
  4. వెంకటేశ్వర స్వామి దేవాలయం
  5. తసీన్ మసీదు
  6. మసీదు అల్ ఖాదీర్

మూలాలు

మార్చు
  1. "Prahaladapuram Village". www.onefivenine.com. Retrieved 9 May 2021.
  2. "Prahaladapuram Locality". www.onefivenine.com. Retrieved 9 May 2021.
  3. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 9 May 2021.