ప్రియ ఆనంద్

భారతీయ నటి, మోడల్
(ప్రియా ఆనంద్ నుండి దారిమార్పు చెందింది)

ప్రియ ఆనంద్ ఒక భారతీయ నటి. ఈమె తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, తెలుగు చిత్రాలలో నటించింది. అమెరికాలో ఉన్నత చదువులు ముగించిన తర్వాత ఈమె 2008లో నటనా వృత్తిని చేపట్టింది. ఈమె తొలిసారి తమిళ యాక్షన్ థ్రిల్లర్ వామనన్ చిత్రంలో తెరపై కనిపించింది.[1] తరువాత ఆమె తెలుగు సినీరంగ ప్రవేశం లీడర్ అనే సినిమాతో మొదలయ్యింది.[2] 2012లో ఈమె బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో ప్రారంభమైన ఈమె హిందీ సినిమా ప్రస్థానం ఫూక్రే, రంగ్రేజ్, ఫూక్రే రిటర్న్స్ సినిమాల వరకూ కొనసాగింది. తెలుగులో ఈమె రామ రామ కృష్ణ కృష్ణ, 180, కో అంటే కోటి అనే సినిమాలలో కూడా నటించింది.

ప్రియ ఆనంద్
ప్రియ ఆనంద్
జననం
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2009–ప్రస్తుతం

ప్రారంభ జీవితం

మార్చు

ప్రియ 1986, సెప్టెంబర్ 17న చెన్నై నగరంలో రాధ, భరద్వాజ్ ఆనంద్ దంపతులకు జన్మించింది.[3] ఈమె తండ్రి తెలుగు మరాఠీ మూలాలను కలిగి ఉన్నాడు. కుటుంబ నేపథ్యం కారణంగా ఈమె బాల్యం హైదరాబాదు, చెన్నైలలో గడిచింది. ఈ కారణం వల్ల ఈమెకు తెలుగు, తమిళ భాషలలో ప్రావీణ్యం లభించింది.[3] వీటితో పాటు ఈమెకు ఇంగ్లీషు,[4] బెంగాలీ, హిందీ, మరాఠీ, స్పానిష్ భాషలలో ప్రవేశం ఉంది.[3]

ఈమెకు బాల్యం నుండే సినిమాల పట్ల వ్యామోహం ఉంది. సినిమా నిర్మాణంలో సాంకేతిక రంగాలలో పనిచేయాలన్న కలలు కనేది. కాని నటినవుతానని ఎన్నడూ ఊహించలేదు.[3][4] ఈమె తన ఉన్నత విద్యాభ్యాసం కొరకు అమెరికా వెళ్ళింది.[4] తన కలలు కన్న భవిష్యత్తు కోసం ఆమె కమ్యూనికేషన్స్, జర్నలిజంలలో ఉన్నత చదువులు చదువుకుంది.[3] అమెరికాలో చదువు ముగిసిన తర్వాత ఈమె 2008లో భారతదేశానికి తిరిగి వచ్చి చెన్నైలో తన తాత, అమ్మమ్మల వద్ద నివసించింది. ఈమె మొదట మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి "న్యూట్రిన్ మహా లాక్టో", "ప్రిన్స్ జ్యువెలరీ", "క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్" వంటి వ్యాపార ప్రకటనలలో నటించింది.[3]

వృత్తి

మార్చు

ఈమె "పుగైప్పదం" అనే తమిళ సినిమా ద్వారా సినిమా రంగ ప్రవేశం చేయాల్సి ఉంది. ఆ సినిమాలో నటించడానికి ముందుగా అంగీకారం కుదుర్చుకున్నా ఆ సినిమా విడుదల ఆలస్యం కావడంతో "వామనన్" ఈమె నటించిన తొలి సినిమాగా పరిగణించ బడుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో ఈమె సరసన జై అనే తమిళ నటుడు నటించాడు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు ముందే మంచి పేరు తెచ్చుకుంది.[5][6]

తరువాత ఈమె 23కు పైగా సినిమాలలో నటించింది. ఈమె హరీష్, దగ్గుబాటి రానా, రిచా గంగోపాధ్యాయ, అర్జున్ సర్జా, సిద్ధార్థ్, నిత్యా మీనన్, శ్రీదేవి, శర్వానంద్, శ్రీహరి, జక్కీ భగ్నాని, పుల్కిత్ సామ్రాట్, శివ కార్తికేయన్, శివ, విక్రమ్‌ ప్రభు, జె.డి.చక్రవర్తి, అథర్వ, విమల్, గౌతం కార్తీక్, జి.వి.ప్రకాష్ కుమార్, సిమ్రాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, పునీత్ రాజకుమార్, అశోక్ సెల్వన్, నివిన్ పౌలీ వంటి నటీనటులతో కలిసి నటించింది. ఐ.అహ్మద్, రాజేష్ లింగం, శేఖర్ కమ్ముల, శ్రీవాస్, జయేంద్ర పంచాపకేశన్, గౌరీ షిండే, అనీష్ కురువిల్లా, ప్రియదర్శన్, మృగదీప్‌ సింగ్ లాంబా, ఆర్.ఎస్.దురై సెంథిల్ కుమార్, కిరుతిగ ఉదయనిధి, ఆనంద్ శంకర్, యువరాజ్ బోస్, ఆర్.కన్నన్, ఐశ్వర్య ధనుష్, అధిక్ రవిచంద్రన్, జయ్ కె., రాజదురై, సంతోషం ఆనంద్రం, టి.జె. జ్ఞానవేల్, రోషన్ ఆండ్రూస్, ప్రశాంత్ రాజ్ మొదలైన దర్శకులు, దిల్ రాజు వంటి నిర్మాతలు, యువన్ శంకర్ రాజా, గంగై అమరన్, ఎం.ఎం.కీరవాణి, శివమణి, దేవీశ్రీ ప్రసాద్ మొదలైన సంగీత దర్శకులు పనిచేసిన సినిమాలలో ఈమె నటించింది.

సేవా కార్యక్రమాలు

మార్చు

2011, జూన్ 20వ తేదీన ఈమెను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తరఫున సేవ్ ది చిల్డ్రన్ కార్యక్రమం ప్రచారానికై బ్రాండ్ అంబాసిడార్‌గా నియమించారు.[7]

ఫిల్మోగ్రఫీ

మార్చు
కీ
ఇంకా విడుదల కాని చిత్రాన్ని సూచిస్తుంది.
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాష వివరణ
2009 వామనన్ దివ్య తమిళం
2010 పుగైప్పాదం షైనీ జార్జ్ తమిళం
లీడర్ రత్నప్రభ తెలుగు
రామ రామ కృష్ణ కృష్ణ ప్రియ తెలుగు
2011 నూట్రెంబదు రేణుకా నారాయణన్ తమిళం
180 తెలుగు
2012 ఇంగ్లీష్ వింగ్లీష్ రాధ హిందీ ప్రతిపాదన - జీ సినీ అవార్డ్ ఉత్తమ సహాయనటి
ప్రతిపాదన - స్టార్ గిల్డ్ అవార్డ్ ఉత్తమ సహాయనటి
కో అంటే కోటి సత్య తెలుగు
2013 రంగ్రేజ్ మేఘా జోషి హిందీ
ఫుక్రే ప్రియ హిందీ
ఎథిర్ నీచల్ గీతా తమిళం
వణక్కమ్‌ చెన్నై అంజలీ రాజమోహన్ తమిళం
2014 అరిమ నంబి అనామికా రఘునాథ్ తమిళం
ఇరుంబు కుతిరై సంయుక్తా రామకృష్ణన్ తమిళం
ఒరు ఊర్ల రెండు రాజ ప్రియ తమిళం
2015 వయ్ రాజా వయ్ ప్రియ తమిళం
త్రిష ఇల్లన నయనతార రైలు ప్రయాణీకురాలు తమిళం అతిథి పాత్ర
2017 ఎజ్రా ప్రియ మలయాళం
ముత్తురామలింగం విజి తమిళం
రాజకుమార నందిని కన్నడ
కూటతిల్ ఒరుతన్ జనని తమిళం
ఫూక్రే రిటర్న్‌స్ ప్రియ హిందీ
2018 కాయకులం కొచ్చున్ని జానకి మలయాళం నిర్మాణంలో ఉంది
ఆరెంజ్[8]
2019 కోడతి సమక్షం బాలన్ వకీల్ టీనా శంకర్ మలయాళం [9]
ఎల్‌కేజీ సరళ మునుస్వామి (సారా ఎం. సామి) తమిళ్
ఆదిత్య వర్మ ప్రియా మీనన్
2021 సుమో పోస్ట్ -ప్రొడక్షన్ [10]
జేమ్స్ కన్నడ Filming[11]
ఆర్ డి ఏక్స్ షూటింగ్ లో ఉంది [11]
అందగన్ తమిళ్ షూటింగ్ లో ఉంది [12]

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర ఇతర విషయాలు మూలాలు
2022 మా నీళ్ల ట్యాంక్ సురేఖ [13]

మూలాలు

మార్చు
  1. Settu Shankar Priya Anand debuts through Vaamanan Archived 2014-02-22 at the Wayback Machine. OneIndia.in. 8 September 2008
  2. Prakash, BVS (19 April 2010). "T-town's lucky debutants". Times of India. Archived from the original on 11 ఆగస్టు 2011. Retrieved 13 May 2010.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "Interview with Priya Anand".
  4. 4.0 4.1 4.2 Rajamani, Radhika (5 February 2010). "'I had to audition thrice for Leader'". Rediff.com. Retrieved 13 May 2010.
  5. Moviebuzz (24 June 2009). "Vaamanan to release on July 3". Sify.com. Archived from the original on 3 ఏప్రిల్ 2015. Retrieved 13 May 2010.
  6. Moviebuzz (9 July 2009). "Will it be Jai Ho this Friday?". Sify.com. Archived from the original on 12 జూలై 2009. Retrieved 13 May 2010.
  7. Actor Priya Anand announces support for Save the Children Archived 2011-08-01 at the Wayback Machine. Savethechildren.in. 20 June. Retrieved on 2012-02-04.
  8. "It's Priya Anand for Orange". The New Indian Express. Archived from the original on 8 మార్చి 2018. Retrieved 8 March 2018.
  9. "Dileep-B Unnikrishnan movie titled Kodathi Samaksham Balan Vakeel - Times of India". Retrieved 27 October 2018.
  10. "Agila Ulaga Superstar returns after Thamizh Padam 2! - Tamil News". IndiaGlitz.com. 6 November 2019. Retrieved 11 November 2019.
  11. 11.0 11.1 "Priya Anand: I have been spoilt in the Kannada film industry". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-03-02. Retrieved 2021-05-13.
  12. "Priya Anand and Vanitha Vijayakumar in Prashanth's Andhagan". The Times of India. 18 March 2021. Retrieved 18 March 2021.
  13. "Maa Neella Tank : పూజా హెగ్డే చేతులు మీదుగా సుశాంత్ 'మా నీళ్ల ట్యాంక్' ట్రైలర్‌ విడుదల.. జూలై 15 నుంచి స్ట్రీమింగ్." News18 Telugu. Retrieved 2022-07-13.

బయటి లింకులు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు