బడిపంతులు (1972 సినిమా)

బడిపంతులు 1972లో విడుదలైన తెలుగు చలనచిత్రం. జెమినీ గణేశన్ నటించిన ఒక తమిళ చిత్రం ఆధారంగా ఈ చిత్రం నిర్మింపబడింది. ఇదే తరహా కథతో అమితాబ్ బచ్చన్, హేమా మాలినితో 'బాగ్ బన్' చిత్రం ఇటీవలే హిందీలో నిర్మించబడింది.

బడిపంతులు (1972 సినిమా)
(1972 తెలుగు సినిమా)
Badi Pantulu.jpg
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం నందమూరి తారక రామారావు,
అంజలీదేవి,
బేబి శ్రీదేవి,
కొంగర జగ్గయ్య,
జి. రామకృష్ణ,
రాజబాబు,
రమాప్రభ
సంగీతం కె.వి.మహదేవన్,
పుహళేంది
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల
గీతరచన ఆరుద్ర,
దాశరథి
నిర్మాణ సంస్థ త్రివేణి ప్రొడక్షన్స్.
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

చిత్రకథసవరించు

ఎన్.టి.రామారావు ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. భార్య అంజలీదేవి. నిజాయితీతో విలువలతో కూడిన జీవితం గడుపుతూ ఉంటాడు. కృష్ణంరాజు,జి. రామకృష్ణలు ఆయన కుమారులు. మాష్టారు కష్టపడి ఒక ఇల్లు నిర్మించుకుంటాడు. పదవీ విరమణ తరువాత దంపతులు పిల్లల పంచన ఉండవలసి వస్తుంది. తల్లితండ్రులను చూడటానికి పిల్లలు వంతులు వేసుకుని తల్లినొకరు తండ్రినొకరు ఉంచుకుంటారు. భార్య దగ్గరనుండి వచ్చిన ఉత్తరాన్ని చదవడానికి కళ్ళజోడు పగిలిపోవడంతో పగిలిన అద్దంముక్కతో ప్రయత్నిస్తాడు. మరో కొడుకు ఇంట్లో మనవరాలి (శ్రీదేవి) సాయంతో అంజలి భర్తతో ఫోనులో మట్లాడగలుగుతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని ప్రయత్నంలో ఉండగా పోలీసు అధికారి (జగ్గయ్య) కలుస్తాడు. అతడు మాస్టారి సాయంతో చదువుకున్న విద్యార్థి. మాస్టారి పాత ఇల్లు తిరిగికొని వారికి బహూకరిస్తాడు. కన్నబిడ్డలకన్నా, సాయం పొందిన బైటవారే మానవత్వంతో వ్యవహరిస్తారని తెలియజేస్తుంది చిత్రకథ.అమ్మ నాన్నలను బిడ్డలు చెరొక చోటకు విడదీసి పెట్టిన హింసలు చూసి ఎన్నోసార్లు మనము దుఖిస్తాము.వృద్ధుల సమస్యలపై ఎన్నో సంఘటనలతో రూపు దిద్దిన బడిపంతులు ఎప్పటికీ చూడదగ్గ సినిమా.

నటవర్గంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

పాటలుసవరించు

పాట రచయిత సంగీతం గాయకులు
భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికీ జేజేలు ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల, బృందం
పిల్లలము బడి పిల్లలము చేతులు కలిపి నడిచాము పిడికిలి బిగించి కదిలాము ఆత్రేయ కె.వి.మహదేవన్ పి.సుశీల, బృందం
బూచాడమ్మా బూచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడు కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెబుతాడు ఆరుద్ర కె.వి.మహదేవన్ పి.సుశీల
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు ఈ సూత్రముతో ఈ కుంకుమతో ననుకడతేరి పోనిండు ఆత్రేయ కె.వి.మహదేవన్ పి.సుశీల
ఎడబాటెరుగని పుణ్యదంపతుల విడదీసింది విధి నేడు దాశరథి కె.వి.మహదేవన్ ఘంటసాల
ఏవని ఏవని చెప్పను ఏవని ఏవని చెప్పను ఓ లమ్మో వాడు ఎన్నెన్ని సి.నా.రె. కె.వి.మహదేవన్ పి.సుశీల బృందం
ఓరోరి పిల్లగాడా వగలమారి పిల్లగాడా నీ ఉరకలు ఊపులు ఆత్రేయ కె.వి.మహదేవన్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల
రాక రాక వచ్చావు రంభలాగ ఉన్నావు ఆరుద్ర కె.వి.మహదేవన్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల

దేశ భక్తి గేయంసవరించు

పల్లవి: భారత మాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల
జీవధాత్రికీ జేజేలు

చరణం 1: త్రివేణి సంగమ పవిత్రభూమి
నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి
పంచశీల బోధించిన భూమి

చరణం 3: సహజీవనము సమభావనము
సమతావాదము వేదముగ
ప్రజాక్షేమము ప్రగతి మార్గము
లక్ష్యములైన విలక్షణ భూమి

మూలాలుసవరించు

  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.