బాలినేని శ్రీనివాస‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు

బాలినేని శ్రీనివాస రెడ్డి (జ. 1964 డిసెంబరు 12) భారతీయ రాజకీయ నాయకుడు. అతను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వై.యస్.జగన్మోహనరెడ్డి ప్రభుత్వంలో శక్తి వనరులు, అడవులు పర్యావరణం, శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖకు కేబినెట్ మంత్రిగా ఉన్నాడు. అతను ఒంగోలు శాసనసభ నియోజకవర్గం నుండి 2019 లో ఎన్నికయ్యాడు. ఒంగోలు నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా 1999 నుండి 2014 వరకు ఐదు పర్యాయాలు వరుసగా గెలుపొందాడు. తరువాత 2014లో అదే నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా గెలుపొందాడు.[3] 1999, 2004, 2009 లలో జరిగిన శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ తరపున శాసనసభ్యునిగా గెలుపొందాడు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్థనరావుపై గెలుపొందాడు. 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయాడు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో దామచర్ల జనార్థనరావుపై గెలుపొందాడు.

బాలినేని శ్రీనివాస‌రెడ్డి

క్యాబినెట్ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పదవీ కాలం
8 జూన్ 2019[1] – 2022 ఏప్రిల్ 10[2]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 మే 2019
ముందు దామచర్ల జనార్థనరావు
నియోజకవర్గం ఒంగోలు శాసనసభ నియోజకవర్గం
పదవీ కాలం
1999 – 2014
నియోజకవర్గం ఒంగోలు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1964-12-12) 1964 డిసెంబరు 12 (వయసు 59)
ఒంగోలు, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి శచీదేవి
సంతానం బి.ప్రణీత్ రెడ్డి
నివాసం ఒంగోలు

అతను 2009లో వై.యస్.రాజశేఖర రెడ్డి రెండవ కేబినెట్ లో గనులు, భూగర్భశాస్త్రం, చేనేత వస్త్రాలు, వస్త్రాలు, స్పిన్నింగ్ మిల్లులు, చిన్న తరహా పరిశ్రమల శాఖా మంత్రిగా ఉన్నాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

అతని తండ్రి బాలినేని వెంకటేశ్వర రెడ్డి. అతను పార్లమెంటు సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి సోదరి శచీదేవిని వివాహం చేసుకున్నాడు. వారి కుమారుడు బి. ప్రణీత్ రెడ్డి.[4]

నిర్వహించిన పదవులు

మార్చు
 • జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రకాశం జిల్లా
 • గనుల మంత్రిత్వ శాఖ
 • చేనేత వస్త్రాలు, వస్త్రాలు, స్పిన్నింగ్ మిల్లులు, చిన్న తరహా పరిశ్రమల శాఖా మంత్రి
 • శాసనసభ్యుడు, ఒంగోలు
  • 1999 - 2004 (భారత జాతీయ కాంగ్రెస్)శాసనసభ్యుడు, ఒంగోలు
  • 2004 - 2009 (భారత జాతీయ కాంగ్రెస్) శాసనసభ్యుడు, ఒంగోలు
  • 2009 - 2012 (భారత జాతీయ కాంగ్రెస్) శాసనసభ్యుడు, ఒంగోలు
  • 2012– 2014 (వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ) శాసనసభ్యుడు, ఒంగోలు
  • 2014-2019 (వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ) ఓడిపోయాడు.
  • 2019-2024 (వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ) శాసనసభ్యుడు, ఒంగోలు
 • వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు.
 • 2019 శక్తి వనరులు, అడవులు పర్యావరణం, శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖకు కేబినెట్ మంత్రి [1]

మూలాలు

మార్చు
 1. 1.0 1.1 TV5 News (8 June 2019). "ఏపీ మంత్రుల ప్రొఫైల్." (in ఇంగ్లీష్). Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 2. Prajasakti (10 April 2022). "రాజీనామాలను ఆమోదించిన గవర్నర్". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
 3. http://helloap.com/profile-of-balineni-srinivasa-reddy–ongole/
 4. Sakshi (18 March 2019). "ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలు". Archived from the original on 16 September 2021. Retrieved 17 September 2021.