బాల (పత్రిక)

తెలుగు మాసపత్రిక

తెలుగులో పిల్లల పత్రికలు రావడం 1940 లలో ప్రారంభమైన "బాల"తో మొదలయిందని చెప్పవచ్చు. రేడియో అన్నయ్యగా పిలవబడే న్యాయపతి రాఘవరావు ఈ పత్రిక వ్యవస్థాపకుడు, సంపాదకుడు. వీరు 1945 సంవత్సరంలో దీనిని మొదలుపెట్టారు.

బాల
అక్టోబర్ 1945 సంచిక ముఖచిత్రం
సంపాదకుడున్యాయపతి రాఘవరావు
వర్గాలుబాలసాహిత్యం
తరచుదనంమాసపత్రిక
ముద్రణకర్తన్యాయపతి రాఘవరావు
మొదటి సంచిక1945 ఆగస్ట్
దేశంభారత దేశము
కేంద్రస్థానంమైలాపూర్, మద్రాసు
భాషతెలుగు

విషయాలు

మార్చు

ఈ పత్రికలో గేయాలు, వైజ్ఞానిక అంశాలు, బాలసంఘాల వార్తలు, నాటుకథలు, వివిధ దేశాల జానపదకథలు, నాటికలు, మేజిక్కు ట్రిక్కులు, బాలల రచనలు, బొమ్మలు, పొడుపు కథలు, చిక్కుప్రశ్నలు, ఆలిండియా రేడియో మద్రాసు కేంద్రం తెలుగు పిల్లల ప్రోగ్రాముల వివరాలు మొదలైనవి ప్రచురింపబడ్డాయి. ఈ పత్రిక మొదటి సంపుటం, మూడవ సంచిక అక్టోబర్ 1945సంచికలో ఈ క్రింది శీర్షికలు ఉన్నాయి.

  • సంపాదకీయం
  • అప్పుడు - ఇప్పుడు
  • అక్కతో 5 నిముషాలు
  • సరళా - విరళా
  • జేజిమామయ్య పాటలు
  • నానమ్మ పాటలు
  • తెలుగు వెలుగు
  • ఆరోగ్య వాచకము
  • ఇంపులూ సొంపులూ

రచయితలు

మార్చు

ఈ పత్రికలో రచనలు చేసిన కొందరు రచయితలు: కె.సభా, చింతా దీక్షితులు, సి.హెచ్.ఆచార్య, కుచ్చు సుబ్రహ్మణ్యం, మాగంటి బాపినీడు, సూరపురాజు సత్యనారాయణ, శ్రీవాత్సవ, పాలంకి వెంకట రామచంద్రమూర్తి, శ్రీరంగం నారాయణబాబు, రాయవరపు రామస్వామి, పోలాకి శ్రీనివాసరావు, అడపా రామకృష్ణారావు, మారిశెట్టి సాంబశివరావు, పన్యాల రంగనాథరావు, ముళ్ళపూడి వెంకటరమణ, గిడుగు సీతాపతి,దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి (బుజ్జాయి),జొన్నాడ సావిత్రమ్మ, మానేపల్లి సంగమేశ్వరరావు, పెనుమాక రాధాకృష్ణమూర్తి, వారణాశి సుబ్రహ్మణ్యం, వేలూరి సహజానంద, వేటూరి ప్రభాకరశాస్త్రి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, గరిమెళ్ల సత్యనారాయణ, పమ్మి వీరభద్రరావు,వెల్దుర్తి మాణిక్యరావు, శిష్ట్లా ఉమామహేశ్వరరావు, చాడ విశ్వేశ్వరరావు, కవికొండల వెంకటరావు, వేలూరి శివరామశాస్త్రి మొదలైనవారు.

ఇతర విశేషాలు

మార్చు

ఈ పత్రిక ద్వారా బాపు, బుజ్జాయి వంటి బాలచిత్రకారులకు ప్రోత్సాహం లభించింది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

బయటిలింకులు

మార్చు