ఉడుతా సరోజిని

(బేబి సరోజిని నుండి దారిమార్పు చెందింది)

తెలుగు సినిమా నటిగా, గాయనిగా పేరుగన్న ఉడుతా సరోజిని అసలు పేరు మల్లెబోయిన సరోజిని. ఈమె ఎక్కువగా చిన్నపిల్లల పాటలకు గాత్రం అందంగా అమరుతుందని భావించేవారు.

ఉడుతా సరోజిని
జననంమల్లెబోయిన సరోజిని
1937
ప్రసిద్ధిసినీ నేపథ్య గాయిని
మతంహిందూ
భార్య / భర్తఆర్.శ్రీనివాసరావు
పిల్లలు3

ఈమె 1937లో జన్మించింది. పదేళ్ళు నిండకుండానే బేబి సరోజినిగా భరణీ పిక్చర్స్ వారి రత్నమాల (1947) చిత్రంలో తొలిసారిగా దారి తెలియదాయే అమ్మా అనే పాటను గానంచేసి సినీరంగ ప్రవేశం చేసింది.

ఈమె పాడిన పాటలలో దేవదాసులోని ఓ దేవదా చదువూ యిదేనా, మాంగల్య బలంలో హాయిగా ఆలూమగలై కాలం గడపాలి, పెళ్ళిచేసి చూడు లోని అమ్మా నొప్పులే, వెలుగు నీడలులో శివగోవింద గోవింద చెప్పుకోదగ్గవి. శభాష్ రాముడు చిత్రంలోని జయమ్ము నిశ్చయమ్మురా అనే సందేశాత్మక గీతాన్ని ఉత్తేజం కలిగించేలా పాడారు.

ఈమె యోగి వేమన (1947), బాలరాజు (1948) చిత్రాల్లో నటించి ఆ పాత్రలకు స్వయంగా పాడుకున్నారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణతో కలిసి వీరాంజనేయ చిత్రంలో రామ నామమే మధురం పాటను, ఎస్. వరలక్ష్మితో కలిసి సతీ సావిత్రితో నమ్మితినే జననీ పాటలను ఆలపించారు.

ఇంకా ఈమె పల్లెటూరి పిల్ల (1950), సంసారం (1950),దీక్ష (1951), బ్రతుకుతెరువు (1953), తోడికోడళ్ళు (1957), బంగారు పంజరం (1968) రాజయోగం (1968) మొదలైన చిత్రాలలో పాటలు పాడింది.

బాలాంత్రపు రజనీకాంతారావు గారి ప్రోత్సాహంతో కొన్ని రేడియో గీతాలను పాడారు; కొన్ని సంగీత కచేరీలలో పాల్గొన్నారు. 1954లో ఈమెకు ఆర్.శ్రీనివాసరావుతో వివాహమయ్యింది. వీరికి ముగ్గురు పిల్లలు.