భైరాన్‌సింగ్ షెకావత్
(బైరాన్ సింగ్ షెకావత్ నుండి దారిమార్పు చెందింది)
భైరాన్‌సింగ్ షెకావత్,1923, అక్టోబరు 23 న జన్మించాడు. షెకావత్ భారతదేశపు మాజీ ఉప రాష్ట్రపతి, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి. కృష్ణకాంత్ మరణానంతరం 2002 ఆగస్టులో నిర్వహించిన ఉప రాష్ట్రపతి ఎన్నికలలో గెల్చి 2007 జూలై 21 వరకు రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికలలో ప్రతిభా పాటిల్ చేతిలో ఓడి రాజీనామా సమర్పించే వరకు ఆ పదవిలో కొనసాగాడు. ఇతను భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. 1977 నుంచి 1980, 1990 నుంచి 1992, 1993 నుంచి 1998 వరకు 3 పర్యాయాలు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అధికారం ఉన్నాడు. తన హయంలో ప్రారంభించిన పేదరిక నిర్మూలన కార్యక్రమమైన అంతోద్యయ పథకం ఆయనకు ఎంతో కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది.87 సంవత్సరాల వయస్సులో శ్వాససంబంధ సమస్యలతో 2010, మే 15 న జైపూర్లో మరణించాడు.
Bhairon Singh Shekhawat | |
---|---|
11th Vice President of India | |
In office 19 August 2002 – 21 July 2007 | |
అధ్యక్షుడు | A. P. J. Abdul Kalam |
ప్రధాన మంత్రి | Atal Bihari Vajpayee Manmohan Singh |
అంతకు ముందు వారు | Krishan Kant |
తరువాత వారు | Mohammad Hamid Ansari |
8th Chief Minister of Rajasthan | |
In office 4 December 1993 – 1 December 1998 | |
అంతకు ముందు వారు | President's rule |
తరువాత వారు | Ashok Gehlot |
In office 4 March 1990 – 15 December 1992 | |
అంతకు ముందు వారు | Hari Dev Joshi |
తరువాత వారు | President's rule |
In office 22 June 1977 – 16 February 1980 | |
అంతకు ముందు వారు | Hari Dev Joshi |
తరువాత వారు | Jagannath Pahadia |
11th Chairperson of Rajya Sabha | |
In office 19 August 2002 – 21 July 2007 | |
అధ్యక్షుడు | A. P. J. Abdul Kalam |
ప్రధాన మంత్రి | Atal Bihari Vajpayee Manmohan Singh |
అంతకు ముందు వారు | Krishan Kant |
తరువాత వారు | Mohammad Hamid Ansari |
7th Leader of the Opposition, Rajasthan Legislative Assembly | |
In office 8 January 1999 – 18 August 2002 | |
Chief Minister | Ashok Gehlot |
అంతకు ముందు వారు | Parasram Maderna |
తరువాత వారు | Gulab Chand Kataria |
Member of the Rajasthan Legislative Assembly | |
In office 1993–2002 | |
అంతకు ముందు వారు | Amrat lal |
తరువాత వారు | Pushpendra Singh |
నియోజకవర్గం | Bali |
In office 1990–1993 | |
అంతకు ముందు వారు | Vasundhara Raje |
తరువాత వారు | Banwari lal Sharma |
నియోజకవర్గం | Dholpur |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Khachariyawas, Rajputana Agency, British India (present-day Rajasthan, India) | 1923 అక్టోబరు 23
మరణం | 2010 మే 15 Jaipur, Rajasthan, India | (వయసు 86)
జాతీయత | Indian |
రాజకీయ పార్టీ | Bharatiya Janata Party |
జీవిత భాగస్వామి | Suraj Kanwar |
సంతానం | Ratan Rajvi |
పురస్కారాలు | Padma Bhushan (2003) |
సంతకం |
నిర్వహించిన అధికార పదవులు
మార్చు- 1952 నుంచి 1972 : రాజస్థాన్ శాసనసభ సభ్యుడు, ప్రతిపక్ష నేతగా ఉన్నాడు.
- 1974 నుంచి 1977 : మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
- 1977 నుంచి 2002 : రాజస్థాన్ శాసనసభ సభ్యుడిగా ఉన్నాడు.
- 1977 నుంచి 1980 : రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నాడు.
- 1980 నుంచి 1990 : రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
- 1990 నుంచి 1992 : రాజస్థాన్ ముఖ్యమంత్రిగా రెండో పర్యాయం అధికారంలో ఉన్నాడు.
- 1993 నుంచి 1998 : రాజస్థాన్ ముఖ్యమంత్రిగా మూడవ పర్యాయం అధికారం నిర్వహించాడు.
- 1998 నుంచి 2002 : రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్షనేతగా వ్యవహరించారు.
- 2002 నుంచి 2007 : భారత ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించారు