కృష్ణకాంత్

పదవ భారతీయ ఉపరాష్ట్రపతి

కృష్ణకాంత్ (Krishan Kant (28 ఫిబ్రవరి 1927 – 27 జూలై 2002) భారత ఉపరాష్ట్రపతి గాను, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గాను వివిధ ఉన్నత పదవులు నిర్వహించిన రాజకీయ నాయకుడు.

కృష్ణకాంత్
కృష్ణకాంత్


పదవీ కాలం
21 ఆగష్టు 1997 – 27 జూలై 2002
రాష్ట్రపతి కె. ఆర్. నారాయణన్
ముందు కె. ఆర్. నారాయణన్
తరువాత భైరాన్ సింగ్ శేఖావత్

పదవీ కాలం
22 డిసెంబర్ 1996 – 25 జనవరి 1997
ముందు మర్రి చెన్నారెడ్డి
తరువాత ఫాతిమా బీవి

పదవీ కాలం
7 ఫిబ్రవరి 1990 – 21 ఆగష్టు 1997
ముందు కుముద్బెన్ జోషి
తరువాత జి. రామానుజం

వ్యక్తిగత వివరాలు

జననం (1927-02-28)1927 ఫిబ్రవరి 28
మరణం 2002 జూలై 27(2002-07-27) (వయసు 75)
రాజకీయ పార్టీ జనతా దళ్ (1988–2002)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెసు (Before 1977)
జనతా పార్టీ (1977–1988)
జీవిత భాగస్వామి శ్రీమతి సుమన్
పూర్వ విద్యార్థి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం
వృత్తి శాస్త్రవేత్త
సంతకం కృష్ణకాంత్'s signature

కృష్ణకాంత్ రాజకీయ జీవితం లాహోర్లో విద్యార్థిదశలో క్విట్ ఇండియా ఉద్యమంతో మొదలయింది. యువకునిగా భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొని తర్వాత రాజకీయాలలో ప్రవేశించాడు. ఇందిరా గాంధీ హయాంలో భారత జాతీయ కాంగ్రెస్లో ప్రవేశించి యంగ్ టర్క్ బ్రిగేడ్ లో పాల్గొన్నాడు. భారత పార్లమెంట్ లోను కాంగ్రెస్లో వివిధ పదవులు నిర్వహించి తర్వాత కాలంలో జనతా పార్టీ, జనతా దళ్లో చేరారు.[1] He was a member of the Executive Council, for several years, of the Institute for Defence Studies and Analyses.

కృష్ణకాంత్ పౌరహక్కుల సంఘానికి వ్యవస్థాపక జనరల్ సెక్రటరీగా జయప్రకాష్ నారాయణ్ ప్రెసిడెంట్ గా 1976లో పనిచేశారు. అత్యవసర పరిస్థితిని ఎదిరించినందుకు 1975లో భారత జాతీయ కాంగ్రెసు నుండి బహిష్కరించబడ్డాడు. తర్వాత 1980 సంవత్సరం వరకు లోక్ సభ సభ్యునిగా పనిచేశారు.[1] ఇతడు రైల్వే రిజర్వేషంస్, బుకింగ్స్ కమిటీకి ఛైర్మన్ గా 1972 -1976 ల మధ్య పనిచేశాడు.

మధులిమాయెతో కలిసి 1979లో మొరార్జీ దేశాయి ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు.[2]

ఇతడు భారత అణువిధానాలను తీవ్రంగా సమర్ధించాడు.[1]

కృష్ణకాంత్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా వి.పి.సింగ్ ప్రభుత్వం 1989లో నియమించింది. ఇతడు ఆ పదవిలో అత్యంత ఎక్కువకాలం అనగా ఏడు సంవత్సరాలు ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డ వరకు కొనసాగాడు.

ఇతడు కాంగ్రెస్, యునైటెడ్ ఫ్రంట్ ఉమ్మడి అభ్యర్థిగా భారత పార్లమెంటుకు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు. ఇతడు కొత్తఢిల్లీలో పదవిలో ఉండగానే పరమపదించాడు.

ఇతర వివరాలు మార్చు

2007లో స్థాపించబడిన యునైటెడ్ ఉమెన్ ఫ్రంట్ పార్టీకి ఇతని భార్య సుమన్ కృష్ణకాంత్ పార్టీ జాతీయ అధ్యక్షురాలుగా పనిచేసింది.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 http://rajyasabha.nic.in/rsnew/chairman/kant.asp
  2. "In Pursuit of Lakshmi: The Political Economy of the Indian State", By Lloyd I. Rudolph and Susanne H. Rudolph, University of Chicago Press, 1987. pp 457-459.

బయటి లింకులు మార్చు