బ్రూస్ లీ (సినిమా)

బ్రూస్ లీ శ్రీను వైట్ల దర్శకత్వంలో 2014 December 3 రం విడుదలైన తెలుగు సినిమా. రాం చరణ్ తేజ, రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో ప్రధాన పాత్రధారులు.

బ్రూస్ లీ - ద ఫైటర్
దర్శకత్వంశ్రీను వైట్ల
రచనశ్రీను వైట్ల
కోన వెంకట్
గోపీమోహన్
నిర్మాతడి.వి.వి. దానయ్య
తారాగణంబ్రహ్మానందం
రాం చరణ్ తేజ
రకుల్ ప్రీత్ సింగ్
కృతి కర్బంద
అరుణ్ విజయ్
ఛాయాగ్రహణంమనోజ్ పరమహంస
కూర్పుఎం. ఆర్. వర్మ
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
3 డిసెంబరు 2014 (2014-12-03)
దేశంభారత్
భాషతెలుగు
బడ్జెట్370 మిలియన్లు[1]

చిన్నప్పటి నుంచి బ్రూస్ లీ పోరాటాలు చూసి ఆకర్షితుడైన కథా నాయకుడు కార్తీక్ (రాం చరణ్ తేజ) తన పేరును కూడా బ్రూస్ లీగా మార్చేసుకుంటాడు. కార్తీక్ ది అందమైన కుటుంబం అమ్మ (పవిత్ర లోకేష్), నాన్న రామచంద్రరావు (రావు రమేష్), అక్క (కృతి కర్బంద). కార్తీక్ తండ్రి, జయరాజ్ (సంపత్), వసుంధర (నదియా)కు చెందిన వసుంధర పరిశోధనాశాలలో పనిచేస్తుంటాడు. అదే సమయంలో కార్తీక్ కూడా స్టంట్ మాస్టర్ గా పనిచేస్తూ తండ్రికి సహాయపడుతుంటాడు. వీడియో గేమ్ డెవలపర్ రియా (రకుల్ ప్రీత్ సింగ్)కు పోలీస్ నే పెళ్ళి చేసుకోవాలనే కోరిక ఉంటుంది. అయితే అదే సమయంలో కార్తీక్ ను చూసిన రియా తొలిచూపులోనే ఇష్టపడుతుంది. కార్తీక్ నే కథా నాయకుడుగా పెట్టి ఓ గేమ్ డెవలప్ చేస్తుంది. అదే సమయంలో పోలీస్ నే పెళ్ళి చేసుకోవాలనే తన పిచ్చి వల్ల అనుకోని సమస్యలను ఎదుర్కొంటుంది. ఆ సమస్యల నుంచి రియాను కాపాడాలనుకున్న కార్తీక్, దీపక్ రాజ్ (అరుణ్ విజయ్) ముఠాతో గొడవ పడతాడు.

వసుంధర పరిశోధనాశాలలో పనిచేస్తున్న రామచంద్రరావు కూతురు కృతిని ఆ కంపెనీ యజమాని జయరాజ్ తన కోడలిగా చేసుకోవాలనుకుంటాడు. ఆ సమయంలో జయరాజ్ కు సంబంధించి కొన్ని నిజాలు బయటికి వస్తాయి. ఒకేసారి జయరాజ్, దీపక్ రాజ్ ల నుంచి కార్తీక్ కుటుంబానికి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యల నుంచి కార్తీక్ అలియాస్ బ్రూస్ లీ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు, అసలు ప్రతినాయకులతో బ్రూస్ లీకి ఉన్న శతృత్వం ఏంటి. అన్నదే మిగతా కథ.

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

మూలాలు

మార్చు
  1. Anjuri, Pravallika (21 May 2015). "Ram Charan Impresses With New Strategy". Oneindia Entertainment. Archived from the original on 27 మే 2015. Retrieved 3 December 2014.

బయటి లంకెలు

మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో బ్రూస్ లీ