భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు
శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో 2019లో విడుదలైన తెలుగు కామెడీ సినిమా
భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు, 2019 డిసెంబరు 6న విడుదలైన తెలుగు కామెడీ సినిమా. ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానరులో హాస్యనటుడు శ్రీనివాస రెడ్డి తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, సత్య, శకలక శంకర్ తదితరులు నటించగా,[1][2] సాకేత్ కొమండూరి సంగీతం సమకూర్చాడు.
భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు | |
---|---|
దర్శకత్వం | శ్రీనివాస రెడ్డి |
రచన | పరమ సూర్యాన్షు |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | భరణి కె ధరణ్ |
కూర్పు | ఆవుల వెంకటేష్ |
సంగీతం | సాకేత్ కొమండూరి |
నిర్మాణ సంస్థ | ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్టైన్మెంట్ |
విడుదల తేదీ | 6 డిసెంబరు 2019 |
సినిమా నిడివి | 130 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- శ్రీనివాస రెడ్డి (శ్రీను)
- సత్య (జోజో)
- షకలక శంకర్ (పీటర్)
- వెన్నెల కిశోర్ (పోలీస్ ఆఫీసర్)
- డోల్లీ షా
- సత్యం రాజేష్
- వైవా హర్ష
- చిత్రం శ్రీను
- హైపర్ ఆది (మహేష్)
- ప్రవీణ్
- ఝాన్సీ (బతుకు ఎడ్ల బండి యాంకర్)
- సుమన్ శెట్టి
- రఘుబాబు
- రచ్చ రవి
- గెటప్ శ్రీను
నిర్మాణం
మార్చుసినీ హాస్యనటులైన శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్, సత్యం రాజేష్, సప్తగిరి, ధన్‌రాజ్, వేణు, ప్రవీణ్, తాగుబోతు రమేష్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. సినీ హాస్యనటుడు శ్రీనివాస రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. 2019, సెప్టెంబరు 28న ఫస్ట్ లుక్ విడుదలయింది.[3]
స్పందన
మార్చుటైమ్స్ ఆఫ్ ఇండియా ఈ సినిమాకి 1.5/5 రేటింగ్ ఇచ్చింది. "ఈ చిత్రంలోని చాలా పాత్రలు తమ ఇష్టానుసారంగా వస్తాయి, వెళ్తాయి" అని రాశారు.[4]
మూలాలు
మార్చు- ↑ "Bhagya Nagar Veedhullo Gammathu to hit screens on Dec 6". Telangana Today.
- ↑ https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/bhagyanagara-veedullo-gammathu-trailer-out-and-out-comedy-entertainer/articleshow/72154269.cms
- ↑ "Comedian Srinivas Reddy turns into a producer-cum-director for Bhagya Nagara Veedhullo Gammathu - Times of India". The Times of India.
- ↑ "Bhagya Nagara Veedhullo Gammathu Movie Review {1.5/5}: Critic Review of Bhagya Nagara Veedhullo Gammathu by Times of India" – via timesofindia.indiatimes.com.