భారతదేశంలో రైల్వే ప్రమాదాలు, సంఘటనల జాబితా
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
భారతదేశంలోని రైల్వే వ్యవస్థ చాలా పెద్దది. తరచుగా అవి ప్రమాదాల పాలు అవుతున్నాయి. భారీ ప్రాణ నష్టం జరుగుతుంది. గాయాల పాలు అయిన వారి సంఖ్య కూడా ఎక్కువే. గాయపడిన వారిలో చాలామంది, అంగ వైకల్యం పొంది, జీవితంలో నిరాశ్రయులు అవుతున్నారు. ఈ గాయ పడిన వారు తొందరగానే మరణిస్తున్నారు. ఈ మరణాలు మనకి లెక్కలోకి రావటం లేదు. తేదీల వారీగా జరిగిన ప్రమాదాలు ఈ దిగువ చూడండి.
ముఖ్యమైన ప్రమాదాలు
మార్చు- 19 జూలై 2010: సోమవారం తెల్లవారు ఝామున సీల్దా వెళుతున్న ఉత్తర్బంగా ఎక్ష్స్ప్రెస్ భీర్భూమి జిల్లాలోని సైంతియా స్టేషను దగ్గర ఉన్న వనాచల్ ఎక్స్‌ప్రెస్‌ని గుద్దింది. 62మంది మరణించారు. 157 మంది గాయపడ్డారు.
- 28 మే 2010: నక్సలైట్లు చేసిన పనివలన, జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి 14మంది మరణించారు.
- 16 జనవరి 2010: ఉత్తర ప్రదేశ్‌లో రెండు రైళ్ళు (కాళింది ఎక్స్‌ప్రెస్ - శ్రమ శక్తి ఎక్స్‌ప్రెస్) పొగమంచు వలన దారి కనిపించక గుద్దుకోవటం వలన ముగ్గురు మరణించారు. పన్నెండు మంది గాయపడ్డారు.
- 2 జనవరి 2010: దట్టమైన పొగమంచు వలన ఐదు రైళ్ళు మూడు ప్రమాదాలను చేసి పదిహేను మంది మరణానికి కారణమయ్యాయి.
- 21 అక్టోబరు 2009:ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర రైల్వేకి చెందిన మథుర-బృందావనం మార్గంలోని బంజన అనే చోట గోవా ఎక్స్‌ప్రెస్ - మేవార్ ఎక్స్‌ప్రెస్ గుద్దుకోవటం వలన 22 మంది మరణించారు. 26 మంది గాయపడ్డారు.
- 14 నవంబరు 2009: ఢిల్లీ వెళ్ళీ మండోర్ ఎక్స్‌ప్రెస్ జైపూర్ దగ్గర బస్సి అనే చోట పట్టాలు తప్పటం వలన ఏ.సి. కంపార్ట్‌మెంటు విడిపోయి ఏడుగురు మరణించారు. 60 మంది గాయపడ్డారు.
- 1 డిశంబరు 2006: బీహార్ రాష్ట్రం, భాగల్పూరు జిల్లాలో, కూల గొట్టటానికి సిద్ధంగా ఉన్న 150 సంవత్సరాల నాటి పాత రైలు వంతెన మీద పెళ్ళుతున్న రైలు, రైలు వంతెన కూలిపోవటంతో, 35మంది మరణించారు. 17 మంది గాయపడ్డారు. రైలు దారుల్లో ఉన్న పాత వంతెనల మీద పత్రికలలో, టి.వి.లలో, సభలలో దేశవ్యాప్తంగా చాలా చర్చలు జరిగాయి.
- 9 నవంబరు 2006: పశ్చిమ బెంగాల్‌కి 40 కి.మీ. దూరంలో జరిగిన రైలు ప్రమాదంలో 40మంది మరణించారు. 15 మంది గాయపడ్డారు.
- 18 ఆగష్టు 2006: చెన్నై- హైదరాబాదు ఎక్ష్స్ప్రెస్లోని రెండు బోగీలకు సికింద్రా బాద్ రైలు స్టేషను దగ్గరగా నిప్పు అంటుకుంది.
- 29 అక్టోబరు 2005: వలిగొండ వద్ద రైలు ప్రమాదంలో సుమారు 100 మందికి పైగా దుర్మరణం.
- 15 డిశంబరు 2004: పంజాబ్ లోని జలంధర్ దగ్గర స్థానిక రైలును అహమ్మదాబాద్ వెళుతున్న జమ్ము-తావి ఎక్స్‌ప్రెస్ గుద్దింది. 34 మంది మరణించారు. 50 మంది గాయపడ్డారు.
- 27 ఫిబ్రవరి 2004: గౌహతి వెళుతున్న కాంచనగంగ ఎక్స్‌ప్రెస్ పశ్చిమ బెంగాల్‌లోని దీనజ్‌పూర్ జిల్లాలో కాపలా లేని లెవెల్ క్రాసింగు దగ్గర ఒక ట్రక్కును గుద్దింది. 30మంది మరణించారు.
- 2 జూలై 2003: వరంగల్లు దగ్గర ఉన్న ఒక రైలు వంతెన మీదనుంచి, రైలు ఇంజను, దానికి దగ్గరలో ఉన్న రెండు బోగీలు పడిపోయాయి. 18మంది మరణించారు. ఇది తెల్లవారు ఝామున జరిగింది.
- 22 జూన్ 2003: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని వైభవ్ వాడి స్టేషను దాటిన తరువాత ముంబై సెంట్రల్ హాలిడే స్పెషల్ రైలు పట్టాలు తప్పటం వలన 53 మంది మరణించారు 25 మంది గాయపడ్డారు.
- 15 మే 2003: అమృతసర్ వెళుతున్న ఫ్రాంటియర్ మెయిల్‌కి మూడు బోగీలకి నిప్పు అంటుకోవటం వలన, 38 మంది మరణించారు. 13 మంది గాయపడ్డారు.
- 10 సెప్టెంబరు 2002: బీహార్‌లోని ఒక వంతెన వద్ద పట్టాలు తప్పటం వలన కోల్‌కత- న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురై 120 మంది మరణించారు. అంతకు ముందు రోజే, బీహారర్లో ప్రమాదం జరిగింది.
- 9 సెప్టెంబరు 2002: బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలోని ధావె నదిలో హౌరా-ఢిల్లీ రాజధాని ఎక్ష్క్ప్రెస్ బోగి ఒకటి పడిపోయింది. 100 మంది మరణించారు. 150 మంది గాయపడ్డారు.
- 4 జూన్ 2002: కాస్గుంజ్ ఎక్ష్క్ప్రెస్స్ రైలు క్రాసింగు దగ్గర ఒక బస్సును డీ కొట్టింది. 34 మంది ప్రాణాలు పోయాయి.
- 12 మే 2002: ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ దగ్గర న్యూఢిల్లీ-పాట్నా శ్రమజీవి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. 12మంది మరణించారు.
- 23 మార్చి 2002: పాట్నా నుంచి ముంబై వెళుతున్న లోకమాన్య తిలక్ సూపర్‌పాస్ట్ ఎక్స్‌ప్రెస్ మధ్యప్రదేశ్‌లోని నర్సింగపూర్ దగ్గర 13 బోగీలు పట్టాలు తప్పాయి. ఏడుగురు మరణించారు.
- 5 జనవరి 2002: సికింద్రాబాదు - మన్మాడ్ ఎక్స్‌ప్రెస్ రైలు, మహారాష్ట్రలోని ఘట్నందూరు స్టేషన్లో ఆగి ఉన్న గూడ్సు రైలును ఢీ కొట్టింది. 21 మంది మరణించారు. 41 మంది గాయపడ్డారు.
- 22 జూన్ 2001: మంగుళూరు - చెన్నై మెయిల్ కేరళలోని కొజికోడ్ దగ్గర కదలుండి నదిలో పడిపోయింది. 40 మంది మరణించారు.
- 3 డిశంబరు 2000: పంజాబ్‌లోని సరాయ్ బంజారా, సాధుగరర్ల మధ్య పట్టాలు తప్పిన గూడ్సు బండిని హౌరా-అమృతసర్ మెయిల్ ఢీ కొట్టింది. 46మంది మరణించారు. 130 మంది గాయపడ్డారు.
- 2023 ఒడిశా రైలు ప్రమాదం