వేదం క్రిష్ దర్శకత్వంలో 2010 లో విడుదలైన సినిమా.[1][2] ఇందులో అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్, మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలు పోషించారు.

వేదం
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం క్రిష్
నిర్మాణం దేవినేని ప్రసాద్,
యార్లగడ్డ శోభు
తారాగణం అల్లు అర్జున్
అనుష్క శెట్టి
మంచు మనోజ్
దీక్షా సేథ్
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ ARCA
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం

చక్రవర్తి (మంచు మనోజ్) బెంగళూరు ఒక ధనిక సైనిక కుటుంబానికి చెందిన యువకుడు. యుద్ధంలో తండ్రిని పోగొట్టుకున్న చక్రవర్తికి సైన్యంలో చేరటం ఏ మాత్రం ఇష్టం ఉండదు. కాని తన తల్లి సైన్యం లో చేరమని బలవంత పెడుతూ ఉంటుంది. చక్రవర్తికి రాక్ స్టార్ కావాలనే కోరిక ఉంటుంది. చాలా అభ్యాసం తర్వాత హైదరాబాదు లో ఒక ప్రదర్శన ఇచ్చే అవకాశం దొరుకుతుంది. మరుసటి రోజు ప్రొద్దుటే తన సహ గాయకులతో విమానంలో హైదరాబాదు చేరాలి. ఎలాగైనా తను ఎంచుకున్న సంగీతరంగంలోనే మంచి పేరు సాధించాలని అతని కోరిక.

సిరిసిల్ల గ్రామంలో రాములు అనే వృద్ధుడు చేనేత కార్మికుడు. కొడుకు పోవటంతో కోడలు పద్మ తో సహా నేత పనిని చేస్తూ తెలివిగల, చదువంటే ఆసక్తి గల మనవడిని పాఠశాలలో చదివిస్తూ ఉంటాడు. పటేల్ వద్ద రూ.50,000/- అప్పు తీసుకొనటం మూలాన అప్పు తీర్చమని బాధిస్తూ ఉంటాడు పటేల్. అడిగిన సమయానికి అప్పు తీర్చలేదని, మనవడిని వెట్టి చాకిరీకి తీసుకెళతాడు పటేల్.

అమలాపురం లో సరోజ (అనుష్క) ఒక వేశ్య. తన యజమానురాలు సరిగా డబ్బు ఇవ్వటం లేదని భావించిన సరోజ హైదరాబాద్ వెళ్ళిపోయి సొంత వేశ్యా గృహం స్థాపించాలని కలలు కంటూ ఉంటుంది. ఆమె సహాయకుడుగా కర్పూరం.

రహీముల్లా ఖురేషీ (మనోజ్ బాజ్ పాయి) పాత బస్తీలో వినాయక నిమజ్జనంలో జరిగిన అల్లర్ల వల్ల తన భార్య గర్భంలో ఉన్న కవల పిల్లలను పోగొట్టుకొంటాడు. పోలీసులు న్యాయం చేయక పోగా తనే ఒక తీవ్రవాది అనే ముద్ర వేసి నిత్యం అవమాన పరుస్తుంటారు. ప్రశాంతంగా బ్రతకాలనే ఉద్దేశ్యంతో షార్జా వెళ్ళటానికి వీసా సంపాదిస్తాడు ఖురేషీ.

జుబిలీ హిల్స్ బస్తీలో కేబుల్ ఆపరేటర్ కేబుల్ రాజు (అల్లు అర్జున్). పుడితే డబ్బున్న వాడిగానే పుట్టాలని భావించే చదువుకొన్న యువకుడు. డబ్బు సొంతమవాలనే అత్యాశతో ఓ గొప్పింటి అమ్మాయి (దీక్షా సేథ్) ని ప్రేమలో పడేస్తాడు. ఒక హోటల్ లో జరిగే నూతన సంవత్సర వేడుకలో తన తల్లికి అతడిని పరిచయం చేస్తానని, వాటికి పాస్ లని తెప్పించమని రాజుని కోరుతుంది. వాటి ఖరీదు రూ. 40,000/- అవ్వటంతో ఆ డబ్బుని ఎలా సంపాదించాలో ఆలోచనలో పడతాడు.

చక్రవర్తి తన ప్రదర్శనని హైదరాబాదులో ఇచ్చాడా? రాములు రూ.50,000/- ని ఎలా పుట్టించాడు? హైదరాబాద్ వెళ్ళిన సరోజ ఎటువంటి పరిస్థితులని ఎదుర్కోవలసి వచ్చింది? రహీముల్లా ఖురేషీ షార్జా వెళ్ళాడా? కేబుల్ రాజు రూ. 40,000/- ఎక్కడి నుండి తెచ్చాడు? ఈ ప్రశ్నలకి సమాధానమే సినిమాలోని మిగతా ఇతివృత్తం.

తారాగణం

మార్చు

పాటలుజాబితా

మార్చు
  • ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, సునీత, గీతా మాధురి, కీరవాణి
  • రూపాయి ,కీరవాణి
  • నౌ ఆర్ నెవర్ , బెన్నీ దయాళ్, గీతా మాధురి, దీప్తి
  • వేదం , కార్తీక్
  • ప్రపంచం నావెంట వస్తుంటే, అల్లు అర్జున్ , అనుజ్ గురువార, ఆచు రాహూల్ , చిత్ర
  • ఏ చీకటి చేరనీ , కీరవాణి
  • ఏమి తెలిసి నన్ను మోహిస్తివి , పద్మ, పూర్ణిమ , మంజు, సుధాకృష్ణన్
  • మళ్లీ పుట్టని , కీరవాణి
  • అలలై కమ్మని కలలై , ఇ. ఎస్. మూర్తి
  • నువ్వు ముందని నేనూ ముందని , కాలభైరవ
  • కాటర్ పిల్లర్ , కీరవాణి
  • ఓనేనేస్ , కీరవాణి

విశేషాలు

మార్చు

సంభాషణలు

మార్చు
  • తనలో పాట హృదయాంతరాలలో నుండి కాకుండా పెదవుల పై నుండి మాత్రమే వస్తుంది అని చక్రవర్తికి తన ప్రేయసి చెప్పే సంభాషణ: A song is a lyric told musically (పాట అంటే సంగీత పరంగా చెప్పబడే గీతం).
  • లంచాలకి అలవాటు పడ్డ పోలీసు అధికారిని సరోజ ప్రశ్నించే సమయంలో చెప్పే సంభాషణ: "మేం బట్టలు విప్పి అమ్ముడు పోతాం, మీరు బట్టలు వేసుకొని అమ్ముడు పోతారు!"
  • దొంగ తనాలకి పాల్పడుతున్న రాజు కి భంగ్ కాలుస్తున్న ఒక స్వామీజీ (క్రిష్) "మనిషి దొంగ నోట్లను చేస్తే నోటు మనిషిని దొంగ చేస్తుంది. గొప్పదనం అన్నది డబ్బులో కాదు నాయనా, హృదయంలో ఉంటుంది" అని చెప్పటం, దానికి రాజు, "పెరుగువడలో పెరుగు ఉంటుంది, కానీ పులిహోరలో పులి ఉండదు. అది కాలిస్తే ఇటువంటివి నేను కూడా ఇంకో నాలుగు మాటలు చెప్తా!" అని బదులివ్వటం.
  • నీ గురించి నలుగురికి ఏం చెప్పాలని తల్లి అడిగితే.... ఏదో ఒక రోజు నా గురించే నీకంతా గొప్పగా చెబుతారు అని చక్రవర్తి (మంచు మనోజ్ కుమార్) సమాధానమిస్తాడు.... సినిమా చివర్లొ చక్రవర్తి మరణం తర్వాత..... ఆయన తాత, తండ్రి మిలటరీలో దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే... ఇతడు సైతం కన్నీళ్ళు మిగిల్చి ప్రాణాలు అర్పించాడు అన్న టీవీ రిపోర్టర్ మాటల్ని తల్లి వినడం.

సమాచార మూలాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. జీవి. "వేదం సినిమా సమీక్ష". idlebrain.com. జీవీ. Retrieved 20 October 2016.
  2. "Vedam Review". indiaglitz.com. Retrieved 20 October 2016.

బయటి లింకులు

మార్చు