రాఖీ (2006 సినిమా)
రాఖీ 2006 లో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, ఇలియానా ప్రధాన పాత్రలు పోషించారు. తన చెల్లెలికి జరిగినటువంటి అన్యాయం మాత్రమే కాక మరేవిధమైనటువంటి అన్యాయమూ మరే ఆడపిల్లకూ జరగకూడదని రామకృష్ణ అనే యువకుడు సమాజం మీద జరిపిన పోరాటమే చిత్రకథ.
రాఖీ Rakhi (2006 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కృష్ణవంశీ |
---|---|
నిర్మాణం | డా,కె.ఎల్.నారాయణ |
కథ | రాధాకృష్ణ |
చిత్రానువాదం | కృష్ణవంశీ |
తారాగణం | ఎన్.టి.ఆర్,ఇలియానా, ఛార్మీ కౌర్, చంద్రమోహన్, బ్రహ్మాజీ, సాయాజీ షిండే, తనికెళ్ళ భరణి, సుహాసిని, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం,కృష్ణ భగవాన్ |
సంగీతం | దేవీశ్రీ ప్రసాద్ |
నృత్యాలు | రాజు సుందరం |
గీతరచన | సిరివెన్నెల, సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్ (రచయిత) |
ఛాయాగ్రహణం | ఎస్.గోపాలరెడ్డి |
కూర్పు | శంకర్, నవీన్ |
నిర్మాణ సంస్థ | దుర్గా ఆర్ట్స్ |
విడుదల తేదీ | 22-12- 2006 |
భాష | తెలుగు |
కథాగమనం
మార్చుఒక స్టేషను మాస్టారికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉంటారు. పెద్దకొడుకు బ్రహ్మాజీ ఉద్యోగస్తుడు. చిన్నకొడుకు రామకృష్ణకు తన చెల్లెలు అంటే ఎంతో ప్రేమ. రామకృష్ణను అందరూ రాఖీ అని పిలుస్తుంటారు. రాఖీ, ఒక టీ.వీ చానల్లో పని చేసే రిపోర్టర్ ప్రేమించుకొంటారు. కూతురు పెళ్ళి కోసం చంద్రమోహన్ తన ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ డబ్బులను దాస్తాడు. చెల్లెలికి అమెరికా సంబంధం వస్తే ఆ డబ్బును బ్రహ్మాజీ తన స్వార్థానికి వాడేసుకొంటాడు. దాంతో చంద్రమోహన్ చెల్లెలు తన కూతురు పెళ్ళి కోసం దాచిన డబ్బు సర్దుతాననీ అందుకు ప్రతిగా రాఖీ తన కూతురు గౌరిని పెళ్ళి చేసుకోవాలనీ కోరుకుంటుంది. అందుకు సరేనని ఒప్పుకొని చెల్లెలు పెళ్ళి జరుపుతాడు రాఖీ. తరువాత బావ విదేశ ప్రయాణం కోసం తన ఉద్యోగాన్ని ఐదు లక్షలకు అమ్మేసి ఆ డబ్బు తెచ్చి బావకిస్తాడు రాఖీ. తన కొడుక్కి కోటి రూపాయల కట్నం వస్తుందని తెలుసుకొని గాయత్రి అత్తింటివారు మూడునెలల గర్భవతి అయిన గాయత్రిని కిరోసిన్ పోసి చంపేస్తారు. పోలీస్ స్టేషను వద్దా, కోర్టులోనూ రామకృష్ణ కుటుంబానికి న్యాయం దొరకదు. గర్భవతి అయిన తన చెల్లెను డబ్బుపిచ్చితో కాల్చి చంపినా కోర్టులో కేసుకొట్టేయడం చూసిన రాఖీ తన చెల్లి అత్తింటి వారందరినీ కారుతో సహా పెట్రోల్ పోసి తగులబెడతాడు. తన చెల్లెలు కేసుకు వ్యతిరేకంగా వాదించిన ప్లీడరునూ, దొంగ సాక్ష్యం ఇచ్చిన డాక్టరునూ, పోలీసాఫీసరులనూ కూడా పెట్రోల్ పోసి తగులబెడతాడు. అక్కడనుండి మాయమయిపోయిన రాఖీ ఎక్కడ ఏ ఆడపిల్లను ఎవరు వేధించినా వాళ్ళని పెట్రోల్ పోసి తగులబెడుతుంటాడు. ఆ క్రమంలో రాష్ట్రమంత్రి షాయాజీ షిండే కొడుకునుకూడా తగులబెట్టేస్తాడు. రాఖీని పట్టుకోడానికి స్పెషల్ ఆఫీసరుగా వస్తుంది మీనాక్షీ అయ్యర్. ఈ హత్యలు అన్నిటినీ ఏ తీవ్రవాదో చేస్తున్నాడని స్టేట్‌మెంట్ ఇవ్వడం చూసిన రాఖీ తనే ఈ హత్యలన్నీ చేస్తున్నానని టీ.వీలో చెప్తాడు. ఆమె చెప్పిన దానికి ఒప్పుకొని చట్టానికి లొంగిపోతాడు రాఖీ. కాని రాఖీని తనకప్పగించమని అధికారులందరి ముందు ఆమెను కొడతాడు మంత్రి షిండే. మరొక వైపు ఆడవాళ్ళంతా రాఖీని విడుదల చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంటారు. జైల్లో ఉన్న రాఖీని అందరితో మాట్లాడేందుకు బయటకు తీసుకొస్తారు. బావను కలుసుకోవాలని గాయత్రి కూడా స్వీట్స్ తీసుకొని వస్తుంది. రాఖీని చంపేందుకు ఆమె టిఫిన్ క్యారియర్ లో బాంబ్ పెడతారు షిండే మనుషులు. బాంబ్ పేలినపుడు రాఖీకి ఏమీకాదు కాని గాయత్రితో సహా అక్కడికొచ్చిన అనేకమంది విద్యార్థినులు మరణిస్తారు. దాంతో మీనాక్షి అయ్యర్ షిండేను చంపేందుకు రాఖీని వదిలేస్తుంది. తరువాత అతడే పెట్రోల్ పోసి అందరినీ చంపాడని నిరూపించలేని కారణంగా రాఖీని వదిలేస్తారు.
నటవర్గం
మార్చుసాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: కృష్ణవంశీ నిర్మాత: గోపాల్ రెడ్డి సి, నారాయణ కె ఎల్ సంగీత దర్శకత్వం: దేవిశ్రీ ప్రసాద్ పాటల రచయిత: సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, సిరివెన్నెల సీతారామశాస్త్రి
పాట | సంగీత దర్శకుడు | రచయిత | గాయకులు |
---|---|---|---|
"నిన్ను చూస్తే గుండె జారే నిన్ను చూస్తే కన్ను జారే నిన్ను చూస్తే చేయి జారే నిన్ను చూస్తే" | దేవిశ్రీ ప్రసాద్ | చంద్రబోస్ | శంకర్ మహదేవన్ |
"ఓయ్ వస్తావా వస్తావా రమ్మన్నా చోటకి వస్తావా హే ఇస్తావా ఇస్తావా ఇమన్న వన్నీ ఇస్తావా" | జెస్సీ గిఫ్ట్, శ్రీలేఖ | ||
"రాఖీ రాఖి నా కవాసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్నె తుపాకీ" | సిరివెన్నెల | దేవిశ్రీ ప్రసాద్, మమతా మోహన్‌దాస్ | |
"జర జర జర జర జర జర జర జర లుక్ ఇన్ టూ మై అయిస్" | ఆండ్రియా జర్మియా |