మరాఠ్వాడా, అనేది భారతదేశం, మహారాష్ట్ర రాష్ట్రం లోని ఒక భౌగోళిక ప్రాంతం. ఇది ప్రతిపాదిత రాష్ట్రం. ఇది నిజాం పాలనలో ఏర్పడింది. అప్పటి హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఈ భౌగోళిక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ డివిజన్‌తో సమానంగా ఉంటుంది. ఇది కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంది. విదర్భకు పశ్చిమాన, మహారాష్ట్రలోని ఉత్తర మహారాష్ట్ర ప్రాంతాలకు తూర్పున ఉంది. మరాఠ్వాడాలో అతిపెద్ద నగరం శంభాజీనగర్. దాని ప్రజలు మరాఠీ మాట్లాడతారు.

Marathwada
Location of Marathwada in Maharashtra
Clockwise from top : Bibi Ka Maqbara, Aundha Nagnath Temple, Kailasa Temple, Shri Hazoor Sahib Gurudwara, Chaitya Griha or prayer hall at Ajanta Caves
DistrictsAurangabad,
Beed,
Hingoli,
Jalna,
Latur,
Nanded,
Osmanabad,
Parbhani
Largest cityAurangabad
DivisionAurangabad division
Area64,590 కి.మీ2 (24,940 చ. మై.)
Population (2011)18,731,872[1]
Density (per km²)354[1]
Literacy76.27%[1]
Sex Ratio932[1]

వ్యుత్పత్తి శాస్త్రం

మార్చు

మరాఠ్వాడా అనే పదానికి మరాఠీ మాట్లాడే ప్రజల ఇల్లు అని అర్థం. ఇది నిజాం పాలన కాలంలో మాజీ హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ మాట్లాడే జనాభాచే ఆక్రమించబడిన భౌగోళిక ప్రాంతం. ఈ పదాన్ని 18వ శతాబ్దానికి చెందిన హైదరాబాద్ నిజాం రాష్ట్ర రికార్డులనందు గుర్తించవచ్చు.[2]

జనాభా గణన

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 1,87,31,872 మంది జనాభాను కలిగిఉంది.[3] [a] మరాఠ్వాడా మొత్తం వైశాల్యం 64590 చ.కి.మీ.

మరాఠ్వాడా ప్రజల భాషలు 2011

  మరాఠీ (77.98%)
  ఉర్దూ (9.56%)
  హిందీ (6.49%)
  లంబాడీ (3.20%)
  ఇతర భాషలు (2.77%)

2011 భారత జనాభా లెక్కల సమయంలో, మరాఠ్వాడా భూభాగంలో వివిధ భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు.మొత్తం జనాభాలో 77.98% మంది మరాఠీ, 9.56% మంది ఉర్దూ, 6.49% మంది హిందీ, 3.20% మంది లంబాడీ వారి మొదటిభాషగా ఉంది.[4]

నిజాం పాలనలో

మార్చు

హింగోలి, ఔరంగాబాద్ ప్రాంతం నిజాం కాలంలో అలాగే బ్రిటిష్ పాలనలో సైనిక స్టేషన్లు, డిపోలకు ప్రధాన కేంద్రంగా ఉంది.అలాగే హైదరాబాద్ రాష్ట్రం ప్రత్యేకంగా ఔరంగాబాద్‌లో డ్యామ్‌లను నిర్మించడానికి, ప్రస్తుత నీటి అడుగున వ్యవస్థను సవరించడానికి, పునరుద్ధరించడానికి ప్రత్యేక పనిని చేపట్టింది. హైదరాబాద్ నగరాన్ని ఔరంగాబాద్ మీదుగా బొంబాయి (ప్రస్తుతం ముంబై)కి కలుపుతూ నిర్మించిన రైల్వేలు (నిజాం హామీ రాష్ట్ర రైల్వే) కోసం ప్రధాన పనులు చేపట్టారు.ఔరంగాబాద్ సమీపంలోని కాగ్జిపురాలో చేనేత, పేపర్ ఫ్యాక్టరీలు స్థాపించబడ్డాయి.ఖుల్దాబాద్‌లో మతపరమైన ప్రదేశాలు అభివృద్ధి చేయబడ్డాయి. ప్రస్తుతం నాందేడ్‌లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న అతిథి గృహాలు ఆ కాలంలో సిక్కు భక్తుల కోసం తాత్కాలిక అతిథి గృహాలుగా నిర్మించబడ్డాయి. అహ్మదాబాద్‌కు అనుసంధానించే రహదారులను కూడా ఆ కాలంలో ప్రారంభించారు.

నగరాలు, జిల్లాలు

మార్చు

మరాఠ్వాడా ప్రాంతంలోని ప్రధాన నగరాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం దిగువన ఉన్న అన్ని నగరాల్లో 1,00,000 కంటే ఎక్కువ జనాభా ఉన్నారు.2011 జనాభా లెక్కల ప్రకారం ఔరంగాబాద్‌లో 1.1 మిలియన్ల జనాభా ఉంది.

జిల్లాలు

మార్చు

మరఠ్వాడాలో విభాగంలో ఔరంగాబాద్ నగరపాలక సంస్థ,[5] నాందేడ్-వాఘాలా నగరపాలక సంస్థ,[6] లాతూర్ నగరపాలక సంస్థ,పర్భాని నగరపాలక సంస్థ అనే నాలుగు నగరపాలక సంస్థలు ఉన్నాయి.[7]

పర్యాటక ప్రదేశాలు

మార్చు
 
ఎల్లోరా గుహలలోని శివాలయం
 
గుహ సంఖ్య 26లోని అజంతా గుహల వద్ద చైత్య గృహం లేదా ప్రార్థనా మందిరం
 
బీబీ కా మక్బారా, మినీ తాజ్ మహల్ అని కూడా అంటారు
 
హజూర్ సాహిబ్ నాందేడ్

రాష్ట్ర ప్రభుత్వం ఔరంగాబాద్‌ను "మహారాష్ట్ర పర్యాటక రాజధాని"గా గుర్తించింది.[8] ఔరంగాబాద్‌లో వివిధ పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.

ముఖ్య పర్యాటక ప్రదేశాలు

చదువు

మార్చు

మరాఠ్వాడాలో నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి.ఇవి ఔరంగాబాద్, లాతూర్, నాందేడ్, అంబజోగైలో ఉన్నాయి.ఈ ప్రాంతంలోని నాందేడ్ నగరంలో శ్రీ గురు గోవింద్ సింగ్‌జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఔరంగాబాద్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల వంటి మంచి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఔరంగాబాద్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయం, పర్భానిలోని వసంతరావ్ నాయక్ మరాఠ్వాడా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాందేడ్‌లోని స్వామి రామానంద తీర్థ మరాఠ్వాడా విశ్వవిద్యాలయం వంటి మూడు ప్రధాన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 

హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠ్వాడా ప్రాంతంలో వ్యవసాయ పరిశోధనలకు పునాది హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ద్వారా 1918లో పర్భానీలో ప్రధాన ప్రయోగాత్మక వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించింది.నిజాం పాలనలో వ్యవసాయ విద్య హైదరాబాద్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. జొన్న, పత్తి, పండ్ల కోసం పంట పరిశోధనా కేంద్రాలు పర్భానిలో ఉన్నాయి. స్వాతంత్ర్యం తరువాత,ఈ సదుపాయాన్ని భారత ప్రభుత్వం మరింత అభివృద్ధి చేసింది. దీని పేరును 1972 మే 18 న మరాఠ్వాడా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మార్చారు [9] ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ముంబై (గతంలో యుడిసిటి అని పిలుస్తారు) 2018లో స్థాపించబడిన జల్నాలో శాటిలైట్ మకాంను కలిగి ఉంది.

కరువు, రైతుల ఆత్మహత్యలు

మార్చు

మరాఠ్వాడా వర్షాకాలంలో వర్షపాతంలో తరచుగా ఏర్పడే క్రమరాహిత్యాల వల్ల ప్రభావితమవుతుంది.ఇది వార్షిక వర్షపాతంలో దాదాపు 80 శాతం వాటాను కలిగి ఉంటుంది.ఈ విభాగంలో సగటు వార్షిక వర్షపాతం 882 మి.మీ. ఉంటుంది.మరాఠ్వాడా విభాగం దాదాపు మూడు వంతులు వ్యవసాయ భూములతో నిండి ఉంది.అందువల్ల, కరువు రైతుల జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.[10] కొన్ని మరఠ్వాడా జిల్లాల్లో పునరావృతమయ్యే కరువుల కారణంగా ప్రజలు బోర్‌వెల్‌ పంపుల నుండి ఫ్లోరైడ్-కలుషితమైన భూగర్భజలాలను తాగవలసి వస్తుంది.ఇది చాలా మందికి బలహీనపరిచే ఫ్లోరోసిస్‌ను కలిగించింది.[11]

ఈ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయ. ప్రభుత్వ రికార్డుల ప్రకారం, 2014లో మరాఠ్వాడాలో 422 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.ఇది పంట నష్టాలను భరించలేక, నీటి కొరత, వ్యవసాయ సంక్షోభం కారణంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగా జరిగింది.[12] 2014 తక్కువ వర్షపాతం, లేదా అకాల వర్షపాతం వరుసగా మూడు సంవత్సరాలు సంభవించినప్పుడు అది కొన్నిసార్లు త్రీవంగా పంటలను దెబ్బతీసింది. 422 ఆత్మహత్యల్లో 252 కేసులు వ్యవసాయ రుణాలు చెల్లించలేకపోవడం వల్లే జరిగాయి. 2017 మొదటి రెండు నెలల్లో 117 కంటే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయి.[12] ఐఐటి, బాంబే అధ్యయనం ప్రకారం, గత కొన్ని దశాబ్దాలుగా మరాఠ్వాడాలోని ప్రధాన ప్రాంతాలలో తీవ్రమైన లేదా తీవ్ర కరువులు తరచుగా సంభవించాయి.[13]

ఇది కూడ చూడు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "District wise Demography". Census 2011. Retrieved 23 May 2015.
  2. Kate, P. V. (1987). Marathwada under the Nizams, 1724-1948. Delhi, India: Mittal Publications. p. 3. ISBN 978-8170990178.
  3. "Maharashtra Population Census data 2011". Government of India. Retrieved 11 April 2015.
  4. 2011 Census of India, Population By Mother Tongue
  5. "Archived copy". Archived from the original on 29 March 2015. Retrieved 7 January 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  6. "NWCMC Home Page". Nwcmc.gov.in. Retrieved 2015-05-29.
  7. "Index of /".
  8. "World News Headlines". Newkerala.com. Retrieved 2015-05-29.
  9. "MAU". mkv. Archived from the original on 18 May 2015. Retrieved 24 May 2015.
  10. . "Application of SPI, EDI and PNPI using MSWEP precipitation data over Marathwada, India".
  11. "Marathwada's troubled waters harm your bones". People's Archive of Rural India.
  12. 12.0 12.1 Jog, Sanjay (2014-12-05). "422 farmer suicides in 2014 in Marathwada gives BJP govt the jitters | Business Standard News". Business Standard India. Business-standard.com. Retrieved 2015-05-29.
  13. Swain, S; et al. (2017). "Application of SPI, EDI and PNPI using MSWEP precipitation data over Marathwada, India". IEEE International Geoscience and Remote Sensing Symposium (IGARSS). 2017: 5505–5507. doi:10.1109/IGARSS.2017.8128250. ISBN 978-1-5090-4951-6. S2CID 26920225.
  1. Marathwada is not separate political or administrative entity so there is no reference of population by name of "Marathwada", population has been calculated by adding population of 8 districts of Marathwada.

వెలుపలి లంకెలు

మార్చు