వి. వి. వినాయక్

సినీ దర్శకుడు
(వి.వి. వినాయక్ నుండి దారిమార్పు చెందింది)

వి. వి. వినాయక్ తెలుగు సినిమా దర్శకుడు. 2002లో వచ్చిన ఆది సినిమాతో దర్శకుడిగా మారాడు. తెలుగులో మాస్ కమర్షియల్, కామెడీ సినిమాలను రూపొందించడంతో పేరుపొందాడు.[1][2]

వి. వి. వి.నాయక్
అమ్మమ్మగారిల్లు (2018) టీజర్ విడుదల కార్యక్రమంలో వినాయక్
జననం
గండ్రోతు వీర వెంకట వినాయకరావు

అక్టోబరు 9, 1974
ఇతర పేర్లునాని
వృత్తిసినిమా దర్శకుడు
జీవిత భాగస్వామిలక్ష్మి

జీవిత విషయాలు

మార్చు

వినాయక్ 1974, అక్టోబరు 9న పశ్చిమ గోదావరి జిల్లా, చాగల్లు గ్రామంలో జన్మించాడు. ఇంటికి ఈయనే పెద్ద కొడుకు. తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు, ముగ్గురు చెల్లెళ్ళు పుట్టారు. చిన్నప్పుడు ఇతన్ని నాని అని పిలిచేవారు. భార్య పేరు లక్ష్మి.

సినిమారంగం

మార్చు

2002లో జూనియర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ఆది సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం మంచి సమీక్షలను అందుకోవడమేకాకుండా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.[3][4] వినాయక్ ఈ చిత్రానికి ఉత్తమ తొలిచిత్ర దర్శకుడిగా రాష్ట్ర నంది అవార్డును అందుకున్నాడు. ఈ చిత్రం తమిళంలో జై పేరుతో రిమేక్ చేయబడింది.[5] 2003లో దిల్, చిరంజీవి నటించిన ఠాగూర్ వంటి అనే రెండు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. దుబాయ్‌లో జరిగిన 2006 ఐఫా అవార్డుల కార్యక్రమంలో ఠాగూర్ సినిమా ప్రదర్శించబడింది.[6] 2013లో అవయవ దానాన్ని ప్రోత్సహించడానికి ఒక లఘుచిత్రానికి దర్శకత్వం వహించాడు.[7]

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నితిన్, ప్రభాస్ వంటి నటులకు విజయవంతమైన సినిమాలు అందించాడు. దిల్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నిర్మాత దిల్ రాజును పరిచయం చేసాడు. 2006లో వచ్చిన చిత్రం లక్ష్మి సినిమా వెంకటేష్‌కు మాస్ హీరోగా మళ్ళీ గుర్తింపును ఇవ్వడమేకాకుండా, వెంకీ కెరీర్‌లో హిట్‌ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 2007లో ప్రభాస్ హీరోగా వచ్చిన యోగి చిత్రం పరాజయంకాగా, 2008లో రవితేజ హీరోగా వచ్చిన కృష్ణ సినిమా విజయం సాధించగా, ఈ సినిమాతో వినాయక్ రొమాంటిక్ కామెడీ దర్శకుడిగా గుర్తింపు పొందాడు. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమాకు దర్శకత్వం వహించగా, ఆ సినిమా కూడా విజయం సాధించింది. వివి వినాయక్ మొదటిసారిగా సీనయ్య అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.[8]

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా ఇతర వివరాలు
2002 ఆది నంది ఉత్తమ నూతన దర్శకుడు
చెన్నకేశవరెడ్డి
2003 దిల్
ఠాగూర్
2004 సాంబ
2005 బన్నీ
2006 లక్ష్మి
2007 యోగి
2008 కృష్ణ
2010 అదుర్స్
2011 బద్రీనాధ్
2013 నాయక్
2014 అల్లుడు శీను
2015 అఖిల్
2017 ఖైదీ నెంబర్ 150
2018 ఇంటిలిజెంట్ [9]

అవార్డులు

మార్చు

నంది అవార్డులు

ఇతర అవార్డులు

  • సంతోషం ఉత్తమ కమర్షియల్ దర్శకుడు - కృష్ణ (2008)[11]

మూలాలు

మార్చు
  1. "Vinayak to direct Chiranjeevi". Deccan Chronicle.
  2. "Samantha's next with V.V. Vinayak". Deccan Chronicle. Archived from the original on 2019-01-27. Retrieved 2020-06-22.
  3. "Interview : V.V.Vinayak – I want to give Pawan Kalyan a bubbly characterization - 123telugu.com". 123telugu.com.
  4. "Chitchat with V.V.Vinayak : NTR is interested in Adhurs 2 - 123telugu.com". 123telugu.com.
  5. "V V Vinayak picks debutant". Deccan Chronicle.
  6. "A Rs 100-crore budget film in pipeline?". Deccan Chronicle.
  7. Staff Reporter. "Short film to promote organ donation". The Hindu.
  8. తెలుగు ఫిల్మీబీట్, సెలబ్రిటీలు. "వి వి వినాయక్ బయోగ్రఫీ". www.telugu.filmibeat.com. Retrieved 22 June 2020.
  9. మన తెలంగాణ, సినిమా (27 January 2018). "ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకుడు వి.వి. వినాయక్". Archived from the original on 22 June 2020. Retrieved 22 June 2020.
  10. "Telugu cinema Article - Nandi Jury choices and Jeevi Reviews". idlebrain.com.
  11. "Santosham Film Awards Gallery - Telugu Cinema, Tollywood". ragalahari.com.

ఇతర లంకెలు

మార్చు