సంక్రాంతి (2005 సినిమా)
2005 సినిమా
సంక్రాంతి 2005లో ముప్పలనేని శివ దర్శకత్వంలో విడుదలై విజయం సాధించిన తెలుగు చిత్రం. ఎస్. ఎ. రాజ్‌కుమార్ స్వరపరిచిన సంగీతం కూడా ఈ చిత్రవిజయంలో ప్రధాన పాత్ర పోషించింది.
సంక్రాంతి (2005 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ముప్పలనేని శివ |
---|---|
నిర్మాణం | ఆర్. బి. చౌదరి |
రచన | లింగుస్వామి |
తారాగణం | వెంకటేష్ స్నేహ ఆర్తీ అగర్వాల్ మేకా శ్రీకాంత్ సంగీత శివ బాలాజి రతి చంద్రమోహన్ శారద ప్రకాష్ రాజ్ శర్వానంద్ సుధాకర్ తనికెళ్ళ భరణి వేణు మాధవ్ ఎ.వి.ఎస్. దువ్వాసి మోహన్ సునీల్ శెట్టి |
సంగీతం | ఎస్. ఎ. రాజ్‌కుమార్ |
నృత్యాలు | రాజు సుందరం,సుచిత్ర చంద్రబోస్,నోబుల్ |
గీతరచన | వేటూరి,సిరివెన్నెల సీతారామశాస్త్రి,చంద్రబోస్,కులశేఖర్ |
సంభాషణలు | పరుచూరి బ్రదర్స్ |
ఛాయాగ్రహణం | బి.బాల మురుగన్ |
కూర్పు | నందమూరి హరి |
నిర్మాణ సంస్థ | సూపర్ గుడ్ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చుజానకమ్మ, రామచంద్రరావు దంపతులకు నలుగురు పిల్లలు. రాఘవేంద్ర, విష్ణు, చిన్నా, వంశీ. రాఘవేంద్రకు వయసు మీద పడుతున్నా సరైన పెళ్ళి సంబంధం కుదరకుండా ఉంటుంది. అదే సమయంలో అతని మేనమామ కూతురు వాళ్ళ ఇంటికి వస్తుంది. రాఘవేంద్ర ఆమె ఒకరినొకరు ఇష్టపడతారు. పెళ్ళికి సిద్ధ పడుతుండగా రాఘవేంద్ర కుటుంబ వ్యాపారం ఇబ్బందుల్లో పడుతుంది. కుటుంబంతో రోడ్డు మీద పడాల్సి వస్తుంది.
నటవర్గం
మార్చు- నలుగురు అన్నదమ్ముల్లో పెద్దవాడు రాఘవేంద్ర గా వెంకటేష్
- మొదటి తమ్ముడు విష్ణు గా శ్రీకాంత్
- రాఘవేంద్ర భార్య అంజలి గా స్నేహ
- విష్ణు భార్య కల్యాణి గా సంగీత
- రాఘవేంద్ర తల్లి జానకమ్మ గా శారద
- రాఘవేంద్ర తండ్రి రామచంద్రరావు గా చంద్రమోహన్
- రెండో తమ్ముడు చిన్నా గా శివ బాలాజీ
- మూడవ తమ్ముడు వంశీ గా శర్వానంద్
- చిన్నా ప్రేయసి కావేరి గా రతి
- కావేరి తండ్రి గోవర్ధన్ చౌదరి గా ప్రకాష్ రాజ్
- దొంగగా వచ్చి పనిమనిషిగా కుదురుకునే అంజి గా సుధాకర్
- తనికెళ్ళ భరణి
- వేణు మాధవ్
- ఎ. వి. ఎస్
- దువ్వాసి మోహన్
పాటల జాబితా
మార్చు- అందాల శ్రీమతికి, రచన: ఇ. ఎస్. మూర్తి, గానం. హరి హరన్, శ్రేయా ఘోషల్
- ఆడే పాడే , రచన: పోతుల రవికిరణ్ , గానం.కార్తీక్, చిత్ర
- ఆశ ఆశగా , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- చిలకా , రచన: భాస్కర భట్ల, గానం.శంకర్ మహదేవన్, సుజాత
- డోలే డోలి , రచన: ఇ.ఎస్ మూర్తి , శంకర్ మహదేవన్, ఎస్.ఎ.రాజ్.కుమార్, కె ఎస్ చిత్ర, కల్పన
- పెళ్లి పాట రచన: ఇ.ఎస్.మూర్తి,, గానం. పార్ధసారథి, మురళీ.
- ఎలా వచ్చేనమ్మా, రచన: ఇ.ఎస్.మూర్తి , గానం.ఉదిత్.నారాయణ్ , సాధనా సర్గo