ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్

(ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ నుండి దారిమార్పు చెందింది)

ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, దార్శనికుడు, గొప్ప దాత. గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక వెలుగులు నింపి వేలాది మంది యువతకు ఉపాధి బాట చూపిన మహా మనీషి. తూర్పు గోదావరి జిల్లా, కపిలేశ్వరపురం మండలం , పెదపట్నం (మామిడికుదురు) లో 1921, జూలై 8 న జమీందారీ వంశములో, ముళ్ళపూడి తిమ్మరాజు, వెంకటరమణమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన తణుకు లో ఫోర్త్‌ ఫోరం వరకూ చదివారు.

ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్
ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్
జననంముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్
1921, జూలై 8
తూర్పు గోదావరి జిల్లా, పెదపట్నం (మామిడికుదురు)
మరణం2011, సెప్టెంబరు 3
హైదరాబాదు
ఇతర పేర్లుముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్
ప్రసిద్ధిప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, దార్శనికుడు, గొప్ప దాత
భార్య / భర్తచంద్రమతీదేవి
పిల్లలుఐదుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు.
తండ్రిముళ్ళపూడి తిమ్మరాజు
తల్లివెంకటరమణమ్మ

ఆంధ్రా సుగర్స్

మార్చు

హరిశ్చంద్ర ప్రసాద్ గారు పాఠశాల విద్య (ఎస్ ఎస్ యల్ సి) పూర్తి చేసిన వెలగపూడి రామకృష్ణ గారి ప్రోద్బలంతో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ అయిన పంచదార తయారికి పునుకున్నాడు. దేశానికి స్వాతంత్ర్యము రావడానికి నాలుగు రోజుల ముందు (1947 ఆగస్టు 11) తణుకులో ఆంధ్రా సుగర్స్ స్థాపించాడు. అంచలంచెలుగా విస్తరింపబడిన ఈ పరిశ్రమ ఒరవడి కాస్టిక్ సోడా, కాస్టిక్ పొటాష్, క్లోరీన్, హైడ్రోజెన్, సల్ఫ్యూరిక్ ఆమ్లము, సూపర్ ఫాస్ఫేట్, రాకెట్ ఇంధనము మొదలగు ఉత్పత్తులకు దారి తీసింది.

అప్పట్లో జనసంచారంలేని ఆ ప్రాంతాన్ని పరిశ్రమ స్థాపనకు ఎన్నుకోవడం ఒక సాహసం. మొదట్లో రోజుకు 600 టన్నుల క్రషింగ్‌ సామర్థ్యంతో స్థాపించిన కర్మాగారం అంచెలంచెలుగా ఎదిగి 6 వేల టన్నులకు చేరేలా కృషి చేశారు. ప్రారంభంలో 350 మందితో ప్రారంభించిన ఆంధ్రా షుగర్స్‌ నేడు వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ అభివృద్ధి పథంలో మరింతగా సాగుతోంది. ఆ తర్వాత కాస్టిక్‌ సోడా, కాస్టిక్‌ పొటాష్‌, క్లోరిన్‌, హైడ్రోజన్‌ తయారీ ప్లాంటును 1960లో స్థాపించారు. సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌, సూపర్‌ ఫాస్ఫేట్‌ ప్లాంటులను 1960లో స్థాపించారు. 1984లో తణుకులోనే ర్యాకెట్‌ ఇంధన ప్లాంటును అప్పటి ఉప రాష్ట్రపతి శంకర్‌ దయాల్‌ శర్మ చేతుల మీదుగా ప్రారంభింప చేసి పారిశ్రామిక ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లారు. గుంటూరులో ఆయన నూనె గింజలు, బియ్యం, తవుడు ముడిపదార్థాలుగా తయారు చేసే నూనెలు, హైడ్రోజనేట్‌ అయిల్స్‌ తయారుచేసే ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఆంధ్రా బిర్లాగా ప్రఖ్యాతి చెందిన డాక్టర్‌ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ పల్లెటూరి రైతువారీ పెద్దమనిషిగా, సాదాసీదాగా కనిపిస్తారు. 24 ఏళ్ల వయసులో ఆంధ్రాషుగర్స్‌ స్థాపించినప్పుడు ఆయన ఎంత ఉత్సాహంగా ఉండేవారో 91 ఏళ్ల వృద్ధాప్యంలోనూ అంతే ఆసక్తితో పనిచేస్తూ వచ్చారు. హరిశ్చంద్రప్రసాద్‌ ఏక సమయంలో వివిధ ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య సంఘాలల్లో సభ్యులుగా కొనసాగుతూనే ఉన్నారు.

ఈ పరిశ్రమతోపాటు ఆయన గుంటూరులో నూనెలు, హైడ్రాజినేటెడ్ నూనెలు తయారీ. తాడువాయి, భీమడోలు, కొవ్వూరు, సగ్గొండ లలో వివిధ కర్మాగారాలు స్థాపించారు.

రాజకీయ ప్రస్థానం

మార్చు

పారిశ్రామిక దిగ్గజంగా పేరుగాంచిన ముళ్లపూడి రాజకీయాల్లోనూ సేవలందించారు. మొదట్లో కాంగ్రెస్‌వాదిగా పేరొందిన ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉండగానే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం 1955-67లో మధ్య రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తణుకు గ్రామ పంచాయతీ సర్పంచిగా పనిచేసిన ఆయన 1981లో తణుకు మున్సిపాల్టీగా ఏర్పడిన తర్వాత తొలి మున్సిపల్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతర కాలంలో ఆయన తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు.

సేవాకార్యక్రమాలు

మార్చు

ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ కేవలం పారిశ్రామిక రంగానికే పరిమితం కాలేదు. తణుకులో ఆయన వివిధ సేవాకార్యక్రమాలు చేపట్టారు. పాలిటెక్నిక్‌ కళాశాల, ట్రస్ట్‌ ఆసుపత్రి, ముళ్లపూడి తిమ్మరాజు మెమోరియల్‌ లైబ్రరీ స్థాపించారు. రంగరాయ వైద్య కళాశాల ఏర్పాటులో ఆయన కృషి ప్రశంసనీయం. ధార్మికరంగంలో విజయవాడ తపోవనం, జూబ్లీహిల్స్‌లో శ్రీసీతారామస్వామి ధ్యాన మందిరం, భద్రాచలంలో సీతారామస్వామి దేవస్థానం, నరసాపురంలోని హిందూ స్త్రీ పునర్వివాహ సహాయక సంఘం, విశాఖపట్నం ప్రేమ సమాజం వంటి ధార్మిక సంస్థలకు ఆయన అధ్యక్షునిగా, పాలకమండలి సభ్యునిగా పనిచేసి ఆ సంస్థల ద్వారా పలు ధార్మిక కార్యక్రమాలు చేపట్టారు. తణుకు వెంకట్రాయపురంలో ముళ్లపూడి వెంకటరమణమ్మ స్మారక ఆసుపత్రి, కంటి ఆసుపత్రిని నిర్మించి ఎందరో పేదలకు వైద్య సేవలందిస్తున్నారు.

ప్రత్యేకతలు

మార్చు
  • అంధ్ర పారిశ్రామిక రంగానికి ఆద్యుడు.
  • గ్రామీణ ప్రాంతములో, విద్యుత్ లేని కాలములో జనరేటర్ సాయముతో స్థాపించబడిన పరిశ్రమ.
  • గత 63 సంవత్సరాల కాలంలో ఆంధ్రా సుగర్స్ లో ఒక్క రోజు కూడా సమ్మె జరగలేదు.
  • 12,000 ఉద్యోగులు.
  • 1947లో రోజుకి 600 టన్నుల చెరకు ఒత్తబడితో మొదలయ్యి ప్రస్తుతము 10,000 టన్నులు చేరింది.
  • రాష్ట్ర ప్రభుత్వమునకు అత్యధిక పన్ను చెల్లించు పరిశ్రమ.
  • దేశ రాకెట్ ప్రయోగాలకు అవసరమగు ఇంధనము తయారు చేయు ఏకైక సంస్థ.
  • ప్రపంచములో రాకెట్ ఇంధనము తయారు చేయు 5 దేశములలో భారత దేశాన్ని చేర్చిన ఘనత.
  • భారతదేశములో యాస్పిరిన్ తయారు చేసిన తొలి కర్మాగారము.

పరిశ్రమలు

మార్చు
  • మానేజింగ్ డైరెక్టర్, ఆంధ్ర షుగర్స్ సముదాయము
  • ఎక్సిక్యూటివ్ డైరెక్టర్, ఆంధ్రా పెట్రో కెమికల్స్, విశాఖపట్నం.
  • మానేజింగ్ డైరెక్టర్, ఆంధ్ర కెమికల్స్ కార్పొరేషన్
  • హిందూస్తాన్ ఎలైడ్ కెమికల్స్
  • డైరెక్టర్, ఎమ్ ఎ ఎలికాన్ ఇంజినీరింగ్ కంపెనీ, వల్లభనగర్, గుజరాత్
  • డైరెక్టర్, ఆంధ్రా ఫౌండ్రీ, మెషీన్స్, హైదరాబాదు
  • ఛైర్మన్, జోసిల్ లిమిటెడ్, డోకిపర్రు.
  • ఛైర్మన్, సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్, వెంకటరాయపురం.
  • జయలక్ష్మీ ఫెర్టిలైజర్స్, వెంకటరాయపురం.
  • ఛైర్మన్, శ్రీ అక్కమాంబ టెక్స్ టైల్స్ లిమిటెడ్, వెంకటరాయపురం.
  • ఆంధ్రా ఫారం కెమికల్స్ కార్పొరెషన్ లిమిటెడ్, కొవ్వూరు.

బాధ్యతలు

మార్చు
  • తణుకు గ్రామ పంచాయతీ సర్పంచ్
  • తణుకు మునిసిపల్ ఛైర్మన్
  • ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసన మండలి సభ్యుడు
  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు
  • అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ఫ్యాప్సీ.
  • ఛైర్మన్, నబార్డ్ అగ్రి బిజినెస్

పురస్కారాలు

మార్చు
  • ఉత్తమ యాజమాన్య అవార్డ్ - 1973.
  • చక్కెర కళాప్రపూర్ణ, అనకాపల్లి చెరకు పరిశోధనా కేంద్రము - 1981.
  • ఉత్తమ సాంకేతిక అభివృద్ధి అవార్డ్ - 1985.
  • ఇంధన పొదుపులో జాతీయ అవార్డ్ - 1991.
  • ఉత్తమ మార్కెటింగ్ కంపెనీ అవార్డ్ - 1992.
  • ప్రశంసా పత్రము, ఇస్రో
  • వృక్షమిత్ర పురస్కారము
  • హైదరాబాదు మేనేజ్ మెంట్ అసోసియేషన్ జీవిత సాఫల్య పురస్కారము
  • నాగార్జున విశ్వవిద్యాలయము గౌరవ డాక్టరేట్.

దాతృత్వము, ప్రజాసేవ

మార్చు
  • ముళ్ళపూడి తిమ్మరాజు స్మారక గ్రంథాలయము
  • విజయవాడ తపోవనం.
  • శ్రీ సీతారామస్వామి ధ్యాన మందిరం, జూబిలీ హిల్స్
  • హిందూ స్త్రీ పునర్వివాహ సహాయక సంఘం, నరసాపూర్
  • ప్రేమ సమాజం, విశాఖపట్నం.
  • ముళ్ళపూడి వెంకటరమణమ్మ స్మారక వైద్యశాల, తణుకు.
  • కంటి వైద్యశాల, తణుకు
  • రంగరాయ వైద్య కళాశాల, కాకినాడ.

మరణము

మార్చు

హరిశ్చంద్ర ప్రసాద్ సెప్టెంబరు 3, 2011 న హైదరాబాదులోని బంజారా కేర్ వైద్యశాలలో మరణించాడు.[1]

మూలాలు

మార్చు
  1. "Mullapudi Harischandra Prasad dead". The Hindu (in Indian English). Special Correspondent. 2011-09-04. ISSN 0971-751X. Retrieved 2020-06-15.{{cite news}}: CS1 maint: others (link)