మూటకొండూరు

తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా, మోటకొండూరు మండలం లోని గ్రామం

మూటకొండూరు. తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, మూటకొండూరు మండలానికి చెందిన గ్రామం.[1]

మూటకొండూరు
—  మండలం  —
[[Image:
శివాలయం
|250px|none|]]
మూటకొండూరు is located in తెలంగాణ
మూటకొండూరు
మూటకొండూరు
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°32′46″N 79°03′01″E / 17.545994°N 79.050318°E / 17.545994; 79.050318
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి - భువనగిరి జిల్లా
మండలం యాదగిరిగుట్ట
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,954
 - పురుషుల సంఖ్య 3,014
 - స్త్రీల సంఖ్య 2,940
 - గృహాల సంఖ్య 1,557
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది సమీప పట్టణమైన భువనగిరి నుండి 24 కి. మీ. దూరంలో ఉంది.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

మార్చు

2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లా లోని యాదగిరిగుట్ట మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన మూటకొండూరు మండలం లోకి చేర్చారు.[2]

గణాంక వివరాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1557 ఇళ్లతో, 5954 జనాభాతో 4276 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3014, ఆడవారి సంఖ్య 2940. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 585 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 44. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576529[3].పిన్ కోడ్: 508286.

గ్రామ చరిత్ర

మార్చు

యాదాద్రి - భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలంలోని మూటకొండూరు ప్రాచీనగ్రామం.ఇక్కడ నవీన శిలాయుగంనాటి ఆదిమానవుల సమాధులున్నాయి. చారిత్రక కాలంలో ఇక్కడ యుద్ధాలు జరిగివుండవచ్చు అని విజ్ఞుల అభిప్రాయం.అందుకనే కావొచ్చు పదులకొద్ది వీరగల్లులున్నాయి.ఇక్కడ.ఒక వీరగల్లు మీద వున్న తెలుగులిపి కాలం 7,8 శతాబ్దాలనాటిది. వీరగల్లులను ఇక్కడి శివాలయం ముందర చేర్చినట్టుంది.పెద్ద శివాలయం వెనక మరొక చిన్నశివాలయం కూడా వుంది, శివాలయం ముందరి ద్వారమంటపం రెండంతస్తుల్లో ఉంది.ఇట్లాంటి మంటపాలు అరుదుగా ఉన్నాయి. వలిగొండ నాగారం శంకరంగుట్ట దగ్గర పంచలింగేశ్వరాలయం ముందర, మెదక్ జిల్లాలోని దుద్దెడ, సిద్దిపేటల్లో ఇటువంటి ద్వారా మంటపాలను చూడవచ్చు.విష్ణుకుండినుల కాలంలో రామలింగేశ్వరాలయాలు నిర్మించబడ్డవని చరిత్ర చెపుతున్నది.ఈ శివాలయనిర్మాణం కూడా పురాతనమైనదే.కాని చాలాసార్లు పునరు ద్దరించ బడ్డట్లుంది.ఆలయానికి అర్ధమంటపం చిన్నదిగా ఉంది.ముఖమంటపద్వారానికి ఇరు వైపుల పూర్ణకుంభాలున్నాయి.లోపల అర్ధమంటపంలో రంగమంటపం ఉంది.ఎనిమిది స్తంభా లున్నాయి.అంతరాళద్వారానికి రెండువైపుల సర్పాలు, గదలను (లగుడాలా?) ధరించిన రెండు చేతులున్న ద్వారపాలకులుండడం విశేషం.గర్భగుడిలో చతురస్రాకారపు పానవట్టం మీద శివలింగం ప్రతిష్ఠితమై ఉంది.గుడిముందర పూర్తిగా చెక్కని నల్లరాతినంది ఉంది. దేవాలయ ప్రాంగణంలో చతురస్రాకారపు పానవట్టం మీద చిన్నశివలింగం, కొన్ని నాగశిల్పాలున్నాయి. గుడివెనక నాలుగడుగుల ఎత్తున్న శివునిగుడిలో రెండడుగుల ఎత్తున్న శివలింగం, చతుర స్రాకారపు పానవట్టంపై ప్రతిష్ఠించింది.గర్భగుడి తప్ప వేరే నిర్మాణం లేదు.దేవాలయద్వారానికి ఇరువైపుల ద్వారబంధాలపై వున్న కలశాలు ఇది జైనమని చెప్పడానికి నిదర్శనం. ఈ గుడిలో శివలింగ ప్రతిష్ఠ తర్వాతికాలంలో జరిగినట్టు తెలుస్తున్నది. ఈ దేవాలయాల ప్రాంగణానికి ఈశాన్యాన మరో రెండు దైవస్థానాలున్నాయి.ఒకటి విశ్వ కర్మమందిరం.మరొకటి అమ్మదేవతలప్రాంగణం.అర్ధగోళాకారపుగోడలో ఏర్పరిచిన తట్టులో ఐదుశిల్పాలున్నాయి.ఎడమనుండి కుడికి ఒక శైవాచార్యుని (?) విగ్రహం, రెండోది ముంగిస వాహనం, చతుర్భుజి, ఖడ్గం, ఢమరుకం, త్రిశూలం, పానపాత్రలతో ఎడమపాదం భూమికానించిన ఆసనస్థితిలో వున్న అమ్మదేవత చండిక, మూడోది నక్కవాహనం, చతుర్భుజి, ఖడ్గం, ఢమరుకం, త్రిశూలం, పానపాత్రలతో కుడిపాదం నేలకానించిన ఆసనస్థితిలో చాముండ, నాలుగోది ఏనుగు వాహనం, చతుర్భుజి, ఖడ్గం, ఢమరుకం, త్రిశూలం, పానపాత్రలతో ఎడమపాదం నేలకానించిన ఆసనస్థితిలో ఐరావతి, ఐదోది చతుర్భుజుడు, బలిఖడ్గం, ఢమరుకం, త్రిశూలం, కపాలపాత్రలతో నగ్నభైరవుడున్నారు.ఈ విగ్రహాలు ఆనాటిప్రజల విశ్వాసాలను ప్రతిఫలించే మూర్తిమత్వాలు. అవి శక్త్యారాధన, భైరవారాధనలకొరకు అప్పటి వారు జైన, బౌద్ధమతాలకు ప్రతిగా, వ్యతిరేకంగా నెలకొల్పిన ఆరాధనాస్థలాలు.అందుకే జైనబసదులు శివాలయాలుగా పరివర్తింప బడ్డాయి. ఇక్కడ గ్రామం మధ్యలో వందేళ్ళకిత్రం కట్టిన రామాలయం ఉంది.చెరువు దగ్గర శిథిలవిగ్రహాలు పోగులుపడివున్నాయి.మూటకొండూరు కాటేపల్లిల నడుమ చిన్నఒర్రెఒడ్డున గాజులపరిశ్రమ ఆనవాళ్ళున్నాయని గ్రామస్థులు చెప్పారు.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి యాదగిరిగుట్టలో ఉంది.సమీప జూనియర్ కళాశాల యాదగిరిగుట్టలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు భువనగిరిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల హైదరాబాదులోను, పాలీటెక్నిక్‌ యాదగిరిగుట్టలోను, మేనేజిమెంటు కళాశాల భువనగిరిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం భువనగిరిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల హైదరాబాదు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

మోటకొండూరులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు, ఒక నాటు వైద్యుడు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి. ఆయుర్వేదిక్ మందులు లభించును.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

మోటకొండూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ట్రాక్టరు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 8 గంటల పాటు వ్యవసాయానికి, 7 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

మోటకొండూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 314 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 267 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 109 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 285 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 743 హెక్టార్లు
  • బంజరు భూమి: 1138 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1420 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 2934 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 367 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

మోటకొండూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 367 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

మోటకొండూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

వరి, ప్రత్తి, కంది

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

మార్చు