మేఘాలయ జానపద నృత్యాలు

మేఘాలయ సంస్కృతి యొక్క ముఖ్యమైన భాగాలలో ఒకటి మేఘాలయ జానపద నృత్యం. సంగీతం, నృత్యం లేకుండా మేఘాలయలో వేడుకలు అసాధ్యంగా అనిపిస్తాయి. మేఘాలయ సమాజంలో నృత్యం ప్రధాన భాగం. జననాలు, వివాహాలు, వార్షికోత్సవ వేడుకలు అన్ని కూడ సంగీతం, నృత్యం లేకుండా జరగవు.మేఘాలయ జానపద నృత్యాలు పలు వైవిద్యాలతో ఉన్నాయి (షాడ్ సుక్మిసిమ్, షాద్ నాంగ్‌క్రెమ్, డెరోగట, దోడ్రూసువా, లాహో, మొదలైనవి).మేఘాలయలోని మెజారిటీ తెగ అయిన ఖాసీ ప్రజలు తమ దేశీయ పండుగ లను సాంప్రదాయ సంగీతం, ఆనందంతో జరుపు కుంటారు.వారి సంగీతంలో కొన్ని జలపాతం, పక్షుల శబ్దాలు, కీటకాల శబ్దాలు, సందడి చేసే తేనెటీగ లు వంటి మరెన్నో ప్రకృతి ధ్వనులను కలిగి ఉంటాయి.నియామ్ ఖాసీ,( క్రైస్తవ పూర్వ ఖాసీ మతం)మతం ప్రకృతిలో ఏకేశ్వరోపాసన కలిగి ఉంది. నియామ్ ఖాసీలకు చర్చి, దేవాలయం లేదా మసీదు వంటి స్థిరమైన ప్రార్థనా స్థలాలు లేవు. నియామ్ ఖాసీ ప్రకారం, ప్రకృతిలోని ప్రతి అంశంలో భగవంతుడు ఉంటాడు.[1]

మేఘాలయ యొక్క అత్యంత ప్రసిద్ధ జానపద నృత్యాలు

మార్చు
  • బెహ్డియెంఖ్లామ్
  • నాంగ్క్రెమ్ నృత్యం
  • షాద్ సుక్ మైన్సీమ్
  • వంగల నృత్యం
  • డోర్సెగట నృత్యం .
  • లాహో నృత్యం

బెహ్డియెంఖ్లామ్

మార్చు
 
బెహ్డియెంఖ్లామ్ వేడుకలు

జైంతియా హిల్స్‌లోని జోవైలో ప్రతి జులైలో జరిగే "జైంతియాస్" ఉత్సవంలో బెహ్డియెంఖ్లామ్ ప్రధాన నృత్యం. ఈ పండుగ ప్రధానంగా ఆరోగ్యకరమైన పంట కోసం, వ్యాధులు, తెగుళ్ళను అరికట్టడానికి సృష్టికర్త యొక్క ఆశీర్వాదాలను పొందటానికి నిర్వహిస్తారు.[1]ప్నార్లలో అత్యంత వేడుకగా,అట్టహాసంగా జరుపుకునే సాంస్కృతిక ఉత్సవం బెహ్డియెంక్లామ్ పండుగ. బెహ్డియెన్‌ఖ్లామ్ (కలరా రాక్షసుడిని తరిమికొట్టడం) అనేది జైంతియా తెగల యొక్క అత్యంత ముఖ్య మైన నృత్య ఉత్సవం. విత్తనాలకాలం తర్వాత ప్రతి సంవత్సరం జూలై లో జరుపుకుంటారు. ఈ పండుగ దేవుడి కృప, ఆశీర్వాదాన్ని కోరుతూ, పంటలు బాగా పండాలని కోరుతూ భగవంతుని వేడుకుంటుచెసే నృత్య ఉత్సవం.జోవాయిలో జరిగే ఉత్సవం మేఘాలయలో అత్యంత ప్రసిద్ధ, వినోద పండుగలలో ఒకటి. మతపరమైన ఆచారాల నిర్వహణను దలోయి (మతపెద్ద/పూజారి). బెహ్డియెన్‌ ఖ్లామ్ సాంస్కృతిక పండుగ ఉత్సవ సమయంలో, యువకులు ప్రతి ఇంటి పైకప్పును వెదురు కర్రలతో కొట్టడం ద్వారా దుష్ట ఆత్మ, ప్లేగు, ఇతర వ్యాధులను తరిమికొట్టడానికి ప్రతీకాత్మక మైన సంజ్ఞ గా, పత్రీకగా చేస్తారు.వేడుక యొక్కపతాక సన్నివేశం అనేది ఒకరికొకరు వ్యతిరేకతతో రెండు సమూహాల ప్రజలుపోరాటం(కొట్టుకోవడం)చెయ్యడం అనే పోటీ.ఈ పొటీ,తోపులాట వాహ్-ఈత్-నార్ అని పిలువబడే బురద గుంటను దాటడానికి ప్రత్నించడంతో తోపులాటకు దారితీస్తుంది.ఈ పోటీ లో పాల్గొనేవారు ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటుఆడతారు.బెహడియంఖ్లామ్ పండుగ,వేడుక, ఆచారా న్ని మూడు రోజుల పాటు నిర్వహిస్తారు.చివరి రోజు, మధ్యాహ్నం ప్రజలు ఐత్నార్ అనే ప్రదేశంలో గుమి కూడుతారు. యువకులు, పెద్దలు ఇద్దరూ పాటలకు నృత్యం చేస్తారు.నృత్యానికి అనుబంధం గా బూరలు/కొమ్ము వాద్యం/నాద స్వరం(pipes), డోలు (drums)తో సంగీతాన్ని లయ బద్ధంగా అందిస్తారు.పండుగ రోజున వర్షాలు కురవడం అభిలషణీయం. ఈశాన్య భారతదేశంలోని ఈ ప్రసిద్ధ పండుగ యొక్క క్లైమాక్స్ ఏమిటంటే, ప్రజలు తమ అత్యుత్తమ దుస్తులు ధరించి, లాకోర్ అని పిలువబడే ఫుట్‌బాల్ మాదిరిగానే ఆడే ఆటను చూసేందుకు మైంథాంగ్ అనే ప్రదేశానికి వచ్చి గుమి కూడుతారు.ఉత్తరాదివారు, దక్షిణాది వారితో చెక్క బంతితో ఆట ఆడతారు. అందులోని ఒక పక్షం మరొక/ఎదుటి వారివైపు బరిలో బంతిని ఉంచడం ద్వారా జట్టు మ్యాచ్‌ను గెలుస్తుంది,అలా గెలవడం వల్ల ఆ తర్వాతి సంవత్సరంలో ఆ నిర్దిష్ట ప్రాంతంలో సమృద్దిగా పంట పండుతుందని విశ్వాసం.[2]

నాంగ్క్రెమ్ నృత్యం

మార్చు
 
నాంగ్క్రెమ్ నృత్యం

సాధారణంగా దీనిని "కా పాంబ్లాంగ్ నాంగ్‌క్రెమ్" అని పిలుస్తారు, ఇది "ఖాసీల" యొక్క అత్యంత ముఖ్యమైన నృత్యం. ఇది శరదృతువు ఋతువులో జరుపుకుంటారు, తప్పనిసరిగా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతుంది.[1]ఖాసీ కొండల సాంస్కృతిక కేంద్రమైన స్మిత్‌లో శరదృతువు సమయంలో నోంగ్‌క్రెమ్ నృత్య ఉత్సవం జరుపుకుంటారు. ఇది ఖాసీల ఐదు రోజుల సుదీర్ఘ మతపరమైన పండుగ. కా పాంబ్లాంగ్ నాంగ్‌క్రెమ్ నృత్యం నాంగ్‌క్రెమ్ నృత్యంగా ప్రసిద్ధి చెందింది. మేఘాలయలోని అన్ని ఇతర పండుగల మాదిరిగానే, నాంగ్‌క్రెమ్ నృత్య పండుగను, ప్రజలు సమృద్ధిగా పంటపండాలని, అందరి శ్రేయస్సు కోసం అత్యంత శక్తివంతమైన దేవత ‘’’కా బ్లీ సిన్‌షార్‌ ‘’’ను ప్రసన్నం జేయడానికి నిర్వహిస్తారు.

నోంగ్క్రెమ్ నృత్యం ఫెస్టివల్ యొక్క ఆచారాలు ప్రధాన పూజారితో పాటు ఖైరిమ్ యొక్క సైమ్, పాంబ్లాంగ్ వేడుకను నిర్వహిస్తాడు. అతను లీ షిల్లాంగ్‌కు నైవేద్యాన్ని అందజేస్తాడు. ఒక బలి ఇవ్వడం ద్వారా షిల్లాంగ్ శిఖరం యొక్క దేవుడు సంతృష్టి చెందుతాడని వాళ్ళ నంబిక.ఈ పండుగలో ముఖ్యమైన భాగం పాంబ్లాంగ్ (మేకలను బలి ఇవ్వడం). పండుగ యొక్క మతపరమైన భాగం నృత్యాలకు ముందు ఉంటుంది, ఇందులో పెళ్లికాని బాలికలు వారి అన్ని ఆకర్షణీయమైన రంగురంగు దుస్తులు ధరించి ఈ వేడుకలో పాల్గొంటారు.పురుషుల నృత్యం సహజంగా మరింత ఉల్లాసంగా , శక్తివంతంగా ఉంటుంది.వారు తమ కుడ చేతిలో కత్తిని పట్టుకుంటారు, సాధారణంగా వారి ఎడమ చేతిలో తెల్లటి జడల బర్రె/చమరి మృగం వెంట్రుకలతో అల్లిన కొరడా పట్టుకిని ఉంటారు.నృత్య సమయంలో మారుతున్న డోలు మోగింపు, టాంగ్మూరి లేదా ఊదు బుర్ర/ కొమ్ము ఊదటం లోని వేగాన్ని బట్టి తదనుగుణంగా నృత్యం వేగం మారుతూ వుంటుంది. [3]

షాద్ సుక్ మైన్సీమ్

మార్చు
 
షాద్ సుక్ మైన్సీమ్ నృత్యం

షాద్ సుక్ మైన్సీమ్ అనేది వార్షిక వసంత నృత్యం, ఇది పంట అందిన రోజునుండి మళ్ళి విత్తనాలు నాటే బుతువు వరకు జరుపుకుంటారు. ఇందులో పాల్కోనే నృత్యకారుల అబ్బాయిలు రంగురంగుల దుస్తులు ధరిస్తారు,అమ్మాయిలు అందమైన దుస్తులు, నగలు ధరించిఈనృత్య వేడుకల్లోపాల్కొంటారు.సంగీత వాయిద్యాల రాణి "టాంగ్మూరి" అని పిలువబడే డోలు/డ్రమ్ములు, వేణువులతో సంగీతం చెవుల కింపు గా జాలువారుతుంది.అవివాహిత కన్య అమ్మాయిలు మాత్రమే ఈ నృత్యం చేయడానికి అనుమతిం చబడతారు.ఇది ఖాసీ కొండలలో వసంత రుతువులో జరిగే దేవునికి కృతజ్నతలు తెలిపే రంగుల నృత్య వేడుక.[1]ఖాసీ కొండలపై శీతాకాలపు చలి తగ్గుముఖం పట్టి, వసంతకాలం శోభ సంతరించుకుంటుండగా, జరుపుకునే అతిపెద్ద పండుగలలో ఒకటిగా గుర్తించబడింది. షాద్ సుక్ మైన్సీమ్ వేడుకను ఎటువంటి ఇబ్బందులు,నష్టాలు లేకుండా సమృద్ధిగా పంటలను అందించినందుకు సృష్టికర్తకు వారి కృతజ్ఞతలు తెలిపే వేడుక,పండుగ ఇధి.[4]

వంగల నృత్యం

మార్చు
 
వంగల నృత్య నర్తకుడు
 
వంగల నృత్యం

వంగల నృత్యం తప్పనిసరిగా మేఘయాలయ జనులు చేసుకునే పండుగలలో ఒక భాగం. ఇది పంట కాలం తర్వాత శరదృతువులో జరిగే గారోల ప్రధాన పండుగ.ఈ పండుగలో "పటిగిప రారొంగిప" అనే దేవతను ప్రసన్నం చేసుకునే వేడుకలు ఉంటాయి,ఇవి అన్ని గ్రామాలలో జరుగుతాయి.నాలుగు పగళ్ళు , రాత్రులు చెసే ఈ పండుగ నృత్యం తో ఉల్లాసంగా పూర్తవుతుంది.విశేషం ఏమిటంటే, యోధుల నృత్యం - "నూరు డ్రమ్స్ నృత్యం" - చివరి రోజు జరుగుతుంది , ఈ వందడోలుల/ డ్రమ్స్ తో వాయిద్యం, నృత్యం చూడటానికి అద్భుతమైన దృశ్యం.[1]వంగలను వంద డ్రమ్స్ పండుగ అని కూడా పిలుస్తారు, డ్రమ్స్, గేదె కొమ్ములతో చేసిన ఆదిమ వేణువుపై జానపద పాటల కనుగుణ్యంగా వాయించే సంగీత వైవిధ్యంతో మిళితం చేసి వివిధ రకాల నృత్యాలతో వేడుక జరుపుకుంటారు.ఈ పండుగ సూర్య భగవానుని గౌరవార్థం జరుపుకుంటారు, సుదీర్ఘ పంట కాలం ముగింపును సూచిస్తుంది.ఈ పండుగ మేఘాలయలోని గారో తెగకు ముఖ్య మైనది.ఈ పండుగ అనేది వారి సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవడానికి, ప్రోత్సహించడానికి ఒక మార్గం .మరియు వారు తమ వేడుకలలో తమ సంప్రదాయాన్ని ప్రదర్శిస్తారు.[5]

గారో సమాజిక వర్గంఎవరు? తమను తాము అ'చిక్స్ అని పిలుచుకునే గారోలు మేఘాలయలో రెండవ అతిపెద్ద తెగ(మేఘాలయలోని ఇతర రెండు ప్రధాన తెగలు ఖాసీ ప్రజలు, జైంతియా తెగ).గారోలు టిబెట్ నుండి వచ్చిన బలమైన సంప్రదాయాన్ని కలిగి ఉన్నవారు . వారికి అనేక మాండలికాలు, సాంస్కృతిక సమూహాలు ఉన్నాయి. వారిలో ప్రతి ఒక్కరు మొదట గారో హిల్స్, బయటి మైదాన భూములలో ఒక నిర్దిష్ట ప్రాంతంలో స్థిరపడ్డారు.అయినప్పటికీ, ఆధునిక గారో సమాజం యొక్క సంస్కృతి, క్రైస్తవ మతంచే బాగా ప్రభావితమైంది. ఆధునిక తల్లిదండ్రులు అన్ని పిల్లలకు సమాన సంరక్షణ, హక్కులు, ప్రాముఖ్యతను ఇస్తారు.గారో వివాహం రెండు ముఖ్యమైన చట్టాల ద్వారా నియంత్రించబడు తుంది, అవి ఎక్సోగామి, అ'కిమ్, ఎక్సోగామివారు ప్రకారం. ఒకే వంశంలో వివాహాలు అనుమతించబడవు.అ-కిమ్ చట్టం ప్రకారం, ఒకసారి వివాహం చేసుకున్న పురుషుడు లేదా స్త్రీ అతని/ఆమె జీవిత భాగస్వామి మరణించిన తర్వాత కూడా మరొక వంశానికి చెందిన వ్యక్తిని తిరిగి వివాహం చేసుకోవడానికి ఎప్పటికీ స్వేచ్ఛ ఉండదు.గారోలు ప్రపంచంలో మిగిలి ఉన్న కొన్ని మాతృ సమాజ సమాజాలలో ఒకటి. వ్యక్తులు వారి తల్లుల నుండి వారి వంశబిరుదులను తీసుకుంటారు. సాంప్రదాయకంగా, చిన్న కుమార్తె తన తల్లి నుండి ఆస్తిని వారసత్వంగా పొందుతుంది.కుమారులు యుక్తవయస్సులో తల్లిదండ్రుల ఇంటిని విడిచిపెట్టి, గ్రామంలోని బ్యాచిలర్ డార్మిటరీ (నోక్‌పంటే)లో శిక్షణ పొందుతారు. పెళ్లయ్యాక ఆ వ్యక్తి తన భార్య ఇంట్లోనే ఉంటాడు. గారోలు మాతృస్వామ్య సమాజం మాత్రమే, కానీ మాతృస్వామ్యం వ్యవస్థ కాదు.[5]

డోర్సెగట నృత్యం

మార్చు

డోర్సెగట పండుగ కూడా ఒక నృత్యం, దీనిలో మహిళలు నృత్యం సమయంలో తమ మగ భాగస్వాముల నుండి తలపాగాలను తీయడానికి ప్రయత్నిస్తారు.. స్త్రీలు అలా చేయడంలో విజయం సాధిచే క్రమంలో వారి కదలికలు,ప్రయత్నాలు పేక్షకులకు నవ్వు వస్తుంది.విక్షకులకు పసందైన వినోదం దొరుకుతుంది. [1]మేఘాలయలోని డెరోగట నృత్య వేడుక ఉత్సవంలో మగవారు ధరించే బహుళ వర్ణ తలపాగాలను పడకొట్టే గౌరవనీయమైన అవకాశంస్త్రీలకు దొరికే అరుదైన అవకాశం.అందువల్ల వారు మగవారిపై మహిళలుఆధిక్యత ను చూపే అవకాశం ఇది.చూసేటం దుకు ఇది చాలా సులభమైన పని అనిపిస్తుంది, కానీ ఈ ఆట/వేడుకలో ఒక నిబంధన ఉంది. ఈ ప్రయత్నంలో స్త్రీలు తమ తలలు తప్ప మరే వస్తువు లేదా వారి శరీరంలోని భాగాన్ని ఉపయోగించకుండా మగవారి తలపాగాను పడగొట్టాలి. అది ఇందులో వున్న ప్రత్యెకత.[6]

లాహో నృత్యం

మార్చు
 
లాహో నృత్యం

లాహో నృత్యం నిజానికి బెహ్డియెంఖ్లామ్ పండుగలో ఒక భాగం. లాహో నృత్యాన్ని పురుషులు, మహిళలు ఇద్దరూ వినోదం కోసం చేస్తారు. రంగురంగుల దుస్తులు ధరించి, పురుషులు, మహిళలు ఇద్దరూ ఈ నృత్య రూపంలో చురుకుగా పాల్గొంటారు.ఒక అమ్మాయి రెండు వైపులా ఇద్దరు అబ్బాయిలతో చేతులు కలుపుతూ ఈ నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తుంది. ఒక సంగీత వాయిద్యానికి బదులుగా, నటనలో సహజ ప్రతిభ ఉన్న వ్యక్తి నృత్యం చేస్తున్నప్పుడు జంటలను పఠించడం గమనించదగినది.[1]లాహో నృత్యం మేఘాలయ జానపద నృత్యం. ఈశాన్య రాష్ట్రం ఉత్సవాలు, ఉల్లాస వాతావరణం, సంగీతానికి ప్రసిద్ధి చెందింది. ఈ పండుగలను జరుపుకోవడానికి గిరిజన సంఘాలు గుంపులు గుంపులుగా తరలివస్తాయి. ఈ పండుగ సమావేశాలలో లాహో ఒక ముఖ్యమైన భాగం. ఈ నృత్య ప్రదర్శనలో పురుషులు, మహిళలు ఇద్దరూ పాల్గొంటారు. మహిళలు సాధారణంగా రంగురంగుల దుస్తులతో పాటు బంగారు, వెండి ఆభరణాలను ధరిస్తారు.పురుష ప్రదర్శకులు పరిమిత ఆభరణాలను ఉపయోగిస్తారు.వారి వేషధారణ సంప్రదాయంగా ఉంటుంది, కంటికి ఆకట్టుకునేలా, రంగురంగులగా ఉంటుంది.లాహో నృత్యం ఒక స్త్రీ, మరో వైపు ఇద్దరు పురుషులతో చేతులు కలుపుతూ చేయడంతో మొదలవుతుంది, వారు పూర్తిగా స్టెప్పులు వేస్తారు. వాటి మధ్య సమకాలీకరణ, సామరస్యం గమనించదగినవి.మరొక విశేషమైన విషయం ఏమిటంటే, ఏదైనా సంగీత వాయిద్యాలకు బదులుగా, బలమైన, మధురమైన స్వరం ఉన్న వ్యక్తి నృత్యం పరివారంతో కూడిన నృత్య ప్రదర్శనలో ద్విపదలను పఠిస్తాడు. ఆ వ్యక్తి సాధారణంగా రిబాల్డ్ ద్విపదలను రిథమ్‌తో పఠిస్తాడు. అది ప్రేక్షకులకు మరింత నవ్వును కలిగిస్తుంది.[7]

ఇవికూడ చదవండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Folk Dances of Meghalaya, Expressions of Free-spirited Souls". caleidoscope.in. Retrieved 2024-02-15.
  2. "Behdienkhlam Festival ǀ Publisher= meghalaya.gov.in ǀaccessdate=2024-02-15".
  3. "Nongkrem Dance". meghalaya.gov.in. Retrieved 2024-02-15.
  4. "Festival Shad Suk Mynsiem". meghalayatourism.in. Retrieved 2024-02-15.
  5. 5.0 5.1 "Wangala Dance". drishtiias.com ǀaccessdate=2024-02-15.
  6. "Derogata Dance". dance.anantagroup.com ǀaccessdate=2024-02-15.
  7. "Laho". auchitya.com ǀaccessdate=2024-02-15.