మోపర్రు

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా, అమృతలూరు మండలంలోని గ్రామం

మోపర్రు (మోపఱ్ఱు) బాపట్ల జిల్లా అమృతలూరు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన అమృతలూరు నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తెనాలి నుండి 17 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 972 ఇళ్లతో, 3324 జనాభాతో 877 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1666, ఆడవారి సంఖ్య 1658. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1593 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 14. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590390.[1]. ఎస్.టి.డి.కోడ్ = 08644.

మోపర్రు
పటం
మోపర్రు is located in ఆంధ్రప్రదేశ్
మోపర్రు
మోపర్రు
అక్షాంశ రేఖాంశాలు: 16°6′21.06″N 80°37′15.20″E / 16.1058500°N 80.6208889°E / 16.1058500; 80.6208889
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంఅమృతలూరు
విస్తీర్ణం
8.77 కి.మీ2 (3.39 చ. మై)
జనాభా
 (2011)
3,324
 • జనసాంద్రత380/కి.మీ2 (980/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు1,666
 • స్త్రీలు1,658
 • లింగ నిష్పత్తి995
 • నివాసాలు972
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522312
2011 జనగణన కోడ్590390

గ్రామ చరిత్ర

మార్చు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

మార్చు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామ భౌగోళికం

మార్చు

సమీప గ్రామాలు

మార్చు

ఈ గ్రామానికి సమీపంలో అమృతలూరు, యలవర్రు, మోదుకూరు, ప్యాపర్రు, ఆలపాడు గ్రామాలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి అమృతలూరులో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల తెనాలిలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ పొన్నూరులోను, మేనేజిమెంటు కళాశాల తెనాలిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల పెదపూడిలోను, అనియత విద్యా కేంద్రం తెనాలిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

మోపర్రులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, 8 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు, ఒక నాటు వైద్యుడు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

మార్చు

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

మోపర్రులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో వాణిజ్య బ్యాంకు ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

గ్రామంలో జన్మించిన ప్రముఖులు

మార్చు
దస్త్రం:Smt.Kodali Kamalaamba.jpg
కొడాలి కమలాంబ (కమలమ్మ) ప్రముఖ స్వతంత్ర సమర యోధురాలు
 • కొడాలి కమలాంబ: ప్రముఖ స్వతంత్ర సమర యోధురాలు, క్విట్ ఇండియా ఉధ్యమంలో పాల్గొని 16 నెలలు జైలు శిక్ష అనుభవించారు. సంఘ సంస్కర్త, హేతువాది.[3] ఆమెను జండా కమ్మలమ్మ అనికూడా పిలుస్తారు.
 • కల్లూరి చంద్రమౌళి :మోపర్రు గ్రామంలో వెంకమాంబ, సుదర్శనం దంపతులకు జన్మించాడు.ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది.తొలితరం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఆర్ష విద్యాలంకార బిరుదాంకితుడు. సంయుక్త మద్రాసు రాష్ట్రంలోను, ఆంధ్రరాష్ట్రంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. దేవాదాయ శాఖా మంత్రిగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా పనిచేశాడు.భద్రాచల పుణ్యక్షేత్రాన్ని పునఃనిర్మించి అపర రామదాసుగా కీర్తిగాంచారు.[4]

భూమి వినియోగం

మార్చు

మోపర్రులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 104 హెక్టార్లు
 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 6 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 767 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 767 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

మోపర్రులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 767 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

మోపర్రులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

వరి, మినుము, పెసర

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

మార్చు

వైద్య సౌకర్యాలు

మార్చు

ఈ ఊరిలో అత్యాధునికమైన సదుపాయాలతో కల ప్రభుత్వ ఆసుపత్రి (అత్యవసర శస్త్ర చికిత్సాలయముతో) ఉంది.ఇక్కడ ఆయుర్వేద వైద్యశాల గూడా ఉంది.

నీటి శుద్ధి కేంద్రం

మార్చు

ఈ గ్రామానికి చెందిన కీ.శే.పల్లెంపాటి వెంకటేశ్వర్లు ఙాపకార్ధం అల్లుడు శ్రీ జె.ఎస్.ఆర్.ప్రసాద్ 15 లక్షల రూపాయలు, కొడాలి రమాదేవి ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ కొడాలి గోపాలకృష్ణయ్య పది లక్షల రూపాయలు, ఈ కేంద్ర నిర్మాణానికి అందజేసినారు. ఇదిగాక 20 కిలోవాట్ల సామర్ధ్యంగల ఒక సౌరవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రం గూడా ఏర్పాటుచేస్తున్నారు.

గ్రామ పంచాయతీ

మార్చు
 1. నూతివారిపాలెం మోపర్రు గ్రామ పంచాయతీలోని ఒక శివారు గ్రామం.
 2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలల తూమాటి బాలరాజు, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం

మార్చు

ఈ ఆలయంలో, వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా, 2014, ఏప్రిల్-13, ఆదివారం నాడు స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. సోమవారం గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం రథోత్సవం, విష్ణుసహస్రనామ పారాయణం చేసారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, తీర్ధప్రసాదాలు స్వీకరించరు.

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయo

మార్చు

శ్రీ మహాకాళి, మహాలక్ష్మమ్మ స్వరూపిణి శ్రీ గంగానమ్మ తల్లి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం 2014, ఫిబ్రవరి-20 గురువారం నాడు ఘనంగా నిర్వహించారు.

గ్రామంలోని కాట్రగడ్డ వంశీయుల ఇలవేలుపు అయిన శ్రీ గంగానమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం, 2017, ఫిబ్రవరి-15వతేదీ బుధవారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి, విశేష అలంకరణ చేసారు. అమ్మవారితోపాటు, మహంకాళి, మహాలక్ష్మి పూజలందుకున్నారు. గాయత్రీ హోమం, పూర్ణాహుతి, అన్నసమారాధన నిర్వహించారు. అన్నసమారాధనకు పెదరావూరు గ్రామానికి చెందిన శ్రీ క్రొత్తపల్లి లక్ష్మీనారాయణ ఆర్థిక సహకారం అందించారు.

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం

మార్చు

మోపర్రు గ్రామదేవత శ్రీ అంకమ్మ తల్లికి, 2014, జూలై-27, ఆదివారం నాడు, జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 101 బిందెల నీటితో అభిషేకం చేసారు. తొలిగా గ్రామదేవత ఉత్సవంవిగ్రహంతో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు, తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

గ్రామదేవత శ్రీ రావులమ్మ ఆలయం

మార్చు

ప్రముఖులు

మార్చు
 • ఎం.ఎస్.రామారావు
 • మోపర్తి సీతారామారావు
 • కల్లూరి చంద్రమౌళి (1898 - 1992) స్వాతంత్ర్య సమరయోధుడు
 • కొడాలి వీరయ్య శాసనసభ్యులు
 • కొడాలి లక్ష్మీనారాయణ
 • కొడాలి కమలాంబ (కమలమ్మ) -స్వాతంత్ర్య సమర యోధురాలు. కొడాలి కమలాంబ (కమలమ్మ), స్వాతంత్ర్య సమర యోధురాలు.గుంటూరు జిల్లా మోపర్రులో 1915లో జన్మించారు. ఈమె ఐదవ తరగతి వరకు చదువుకొని, ఆపైన తన స్వయంకృషితో హిందీ విశారద పరీక్ష పట్టభద్రురాలై, మహాత్మా గాంధీజీ చేతుల మీదుగా పట్టాను అందుకున్నారు. ఈమె తన 13వ ఏటనే స్వాతంత్ర్య ఉద్యమంలో చేరినారు. క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించారు. బ్రిటిష్ ప్రభుత్వం కమలమ్మను అరెష్టుచేసి రాయవెల్లూరులోని ప్రధాన కారాగారంలో 18 నెలలపాటు నిర్బంధించారు. కారాగారంలోనే ఈమె, ఆకుపసర్లు, ఇటుకలపొడి, ఖద్దరు వస్త్రం ఉపయోగించి జాతీయ జండా తయారుచేసి, చెట్టుపైకి ఎక్కి, జండా ఎగురవేసిన ధీశాలి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, ప్రభుత్వం ఇచ్చుచున్న పింఛనును పేద విద్యార్థులకు, సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించేవారు. గోరా నాస్తిక మిత్ర మండలి స్థాపించి కుల, మత రహిత సమాజంకోసం, శ్రమించారు. గ్రామీణులకు వైద్యం అందించాలనే సదుద్దేశంతో, తన కుమారుడు శ్రీ ధర్మానందరావుచేత 1966లో ఇంకొల్లులో వైద్యశాల ఏర్పాటు చేయించి, వైద్యసేవలు అందించుచున్నారు. 13వ ఏట నుండి, తుదిశ్వాస విడిచేవరకూ ఖద్దరు ధరించిన ఈమె, "విరామమెరుగని పురోగమనం" అను పేరుతో స్వీయచరిత్ర ప్రకటించారు. వీరు తన 99వ ఏట, 2014, జూలై-11న తన స్వగృహం ప్రకాశం జిల్లా ఇంకొల్లులో తుదిశ్వాస విడిచారు. తన మరణానంతరం తన నేత్రాలను విజయవాడలోని స్వేచ్ఛాగోరా ఐ బ్యాంకుకూ, పార్ధివ దేహాన్ని విజయవాడలోని పిన్నమనేని వైద్యకళాశాలకూ అప్పగించాలని వీలునామాలో పేర్కొన్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులు కమలమ్మ భౌతిక కాయాన్ని విజయవాడ తరలించారు. కమలమ్మ మృతదేహంపై జాతీయ జండా కప్పి నివాళులర్పించారు.
 • గుత్తికొండ రామబ్రహ్మం స్వాతంత్ర్య సమర యోధుడు . వీరు గ్రామాభివృద్ధి కొరకు చాలా కృషి చేశారు. వీరి కోడలు (వీరి కుమారుడు డా.రవీంద్రనాధ్ భార్య) శ్రీమతి పద్మావతి ఇప్పటివరకూ గ్రామానికి రు.75 లక్షలు విరాళంగా ఇచ్చారు. మరుగుదొడ్లు నిర్మించుకోవటానికిఒక్కోక్కరికీ వేయి రూపాయల వంతున మొత్తం 500 మందికి ఇచ్చారు. గ్రామంలో పాఠశాల, ఓవర్ హెడ్ ట్యాంకు, శ్మశానవాటిక, హరిజనవాడలో అంగనవాడీ భవనం నిర్మించారు. ఏటా విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించుచున్నారు.
 • కొడాలి సుదర్శన్ బాబు 1999 లోనే కేరళ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు అన్ని అధికారాలూ ఇచ్చి, అభివృద్ధికి చిరునామాగా నిలిచిన రాష్ట్రంగా కేరళ తన పేరు సుస్థిరం చేసుకున్నది. దేశంలోని ఇతర రాష్ట్రాలలో ఈ విధంగా ఎందుకు అమలు చేయుటలేదు - అనే అంశంతో, ఒక అంతర్జాతీయ సదస్సు, 2014, నవంబరు-27,28 తేదీలలో, కేరళ రాష్ట్రంలోని త్రిశ్శూరులో నిర్వహించారు. ఈ సదస్సులో ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, గాంధీజీ కలలుగన్న గ్రామస్వ్యాజ్యం గురించి చర్చించారు. ఈ సదస్సులో మహాత్మా గాంధీ మనుమరాలు శ్రీమతి ఇళా గాంధీ, గాంధీగారి వ్యక్తిగత కారదర్శి శ్రీ వి.కళ్యాణం మరియూ 10 దేశాల నుండి 250 మంది వక్తలు పాల్గొని తమ అభిపాయాలను వెల్లడించారు. ఈ సదస్సులో మోపర్రు గ్రామానికి చెందిన శ్రీ కొడాలి సుదర్శన్ బాబు గూడా పాల్గొని, 1951లో భారత రిపబ్లిక్ లో, గ్రామపంచాయతీల చట్టంపై మాట్లాడినారు. తన స్వగ్రామమైన మోపర్రులో జరిగిన అభివృద్ధిపై పత్ర సమర్పణ చేసారు.
 • పల్లెంపాటి వెంకటేశ్వర్లు:- వీరు 1979లో నల్లగొండ జిల్లాలోని దొండపాడులో కాకతీయ సిమెంట్స్ పరిశ్రమను నెలకొల్పినారు. అంచెలంచెలుగా అభివృద్ధిచెందుతూ, ఖమ్మం జిల్లా కల్లూరులో చక్కెర, విద్యుచ్ఛక్తి పరిశ్రమలను నెలకొల్పారు. 1995లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మనుగా వ్యవహరించారు. వీరి భార్య సామ్రాజ్యం. వెంకటేశ్వర్లు కుమారుడు వీరయ్య ప్రస్తుతం కాకతీయ సిమెంట్స్ సంయుక్త ఎం.డి.గా ఉన్నారు. వీరి పెద్ద కుమార్తె జాస్తి లక్ష్మీ నళిని భర్త సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయిన జాస్తి చలమేశ్వర్. రెండవ కుమార్తె జాస్తి త్రివేణి భర్త కీర్తి ఇండస్ట్రీస్ ఎం.డి. జాస్తి శేషగిరిరావు. మూడవ కుమార్తె జెట్టి శాంతిదేవి భర్త గ్రీన్ సోల్ పవర్ క్రిస్టల్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన జెట్టి శివరామప్రసాద్. నాల్గవ కుమార్తె కోనేరు సుకుమారి భర్త కోనేరు శ్రీనివాస్, అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీరు. ప్రస్తుతం కాకతీయ సిమెంట్స్ ఎం.డి.గా ఉన్న శ్రీ వెంకటేశ్వర్లు, 2016, జనవరి-11వ తేదీనాడు, 90 సంవత్సరల వయస్సులో, హైదరాబాదులో అనారోగ్యంతో కన్నుమూసారు.
 • వేజెండ్ల సాంబశివరావు

గ్రామ విశేషాలు

మార్చు

గ్రామంలో విద్యాధికులు ఎక్కువ.

కొడాలి రమాదేవి అనాధాశ్రమం

మార్చు

వందేళ్ళ వటవృక్షం

మార్చు

మోపర్రు గ్రామంలోని మర్లగుంట చెరువు ప్రక్కనే ప్రధాన రహదారి వెంట, వనంలా ఉన్న నూరు వసంతాల ఈ మర్రిమాను, తన విశాలమైన ఊడలు, కొమ్మలతో చూపరులను ఆకర్షించడమేగాక, బాటసారులకు సేద తీర్చుచున్నది. ఎండ, వానల నుండి పలువురికి రక్షణ కలిగించుచున్నది.

గ్రామాభివృద్ధి

మార్చు

ప్రవాస భారతీయులు, దాత డాక్టర్ గుత్తికొండ రవీంద్రనాథ్, పద్మావతి దంపతులు, తమ కుటుంబసభ్యుల సహకారంతో గ్రామాభివృద్ధికి విశేషకృషి చేస్తున్నారు.

గణాంకాలు

మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3450. ఇందులో పురుషుల సంఖ్య 1740, స్త్రీల సంఖ్య 1710, గ్రామంలో నివాస గృహాలు 946 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 877 హెక్టారులు.

మూలాలు

మార్చు
 1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.
 3. "శ్రీమతి కొడాలి కమలాంబ". Archived from the original on 2016-03-05. Retrieved 2021-07-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 4. బొర్రా, గోవర్దన్ (2010). శ్రీ కల్లూరి చంద్రమౌళి జీవిత చరిత్ర-. tenali: kodaali sudarsan. pp. 1–226.
"https://te.wikipedia.org/w/index.php?title=మోపర్రు&oldid=4261868" నుండి వెలికితీశారు