మోపిదేవి వెంకటరమణ
మోపీదేవి వెంకటరమణారావు అంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకుడు, ఉమ్మడి అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎక్సైజ్ మంత్రిగా ఉన్నారు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ఓడరేవులు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల మంత్రిగా కూడా పనిచేశారు. 2020 రాజ్యసభ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ నుండి భారత పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభ,ఎగువ సభ లకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీసభ్యునిగా ఎన్నికయ్యాడు[1]. ఇతను విజయవాడలోని లయోలా డిగ్రీ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.
మోపిదేవి వెంకటరమణ | |||
పార్లెమెంటు సభ్యుడు, రాజ్యసభ
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 19 జూన్ 2020 | |||
ముందు | మొహమ్మద్ ఆలీ ఖాన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఆంధ్రప్రదేశ్ | ||
పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్ శాఖా మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 8 జూన్ 2019 - జూన్ 2020 | |||
ముందు | ఆదినారాయణ రెడ్డి | ||
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ్యుడు
| |||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | దేవినేని మల్లిఖార్జున రావు | ||
తరువాత | అనగాని సత్యప్రసాద్ | ||
నియోజకవర్గం | రేపల్లె | ||
పదవీ కాలం 1999 – 2009 | |||
ముందు | సీతారామమ్మ ఏవూరు | ||
నియోజకవర్గం | కూచినపూడి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 6 ఆగష్టు 1962 నిజాంపట్నం | ||
రాజకీయ పార్టీ | వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | రాఘవయ్య, నాగులమ్మ | ||
జీవిత భాగస్వామి | అరుణభాస్కరి | ||
సంతానం | రాజీవ్(కుమారుడు), జస్మిత(కుమార్తె) | ||
నివాసం | నిజాంపట్నం, గుంటూరు |
రాజకీయ జీవితం
మార్చుమోపిదేవి వెంకటరమణ గారు అగ్నికులక్షత్రియ (బిసి) సామాజికవర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు. రఘుకుల గోత్రిజ్ఞులు. 1989, 1994లో కూచినపూడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. 1999, 2004లో కుచినపూడి నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. 2009లో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2014, 2019లో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓడిపోయాడు. ఆయన 2020లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[2][3]
మూలాలు
మార్చు- ↑ "Mopidevi Venkata Ramana Rao(Yuvajana Sramika Rythu Congress Party):Constituency- REPALLE(GUNTUR) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-06-03.
- ↑ Telugu, TV9 (2020-06-19). "ముగిసిన ఏపీ రాజ్యసభ పోలింగ్". TV9 Telugu. Retrieved 2021-06-03.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (10 March 2020). "'మంచి అవకాశం.. సీఎంకు కృతజ్ఞతలు'". Sakshi. Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.