యస్ నేనంటే నేనే
(1994 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం విజయనిర్మల
తారాగణం కృష్ణ,
రంభ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ విజయకృష్ణ ఆర్ట్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

అప్పాజీ, బాబాజీ ఇద్దరూ అన్నదమ్ములు. ఇద్దరికీ కూతుళ్ళే. అప్పాజీకి రాజకీయాలంటే ఇష్టం. సర్పంచి నుండి ఎం.ఎల్.ఎ. దాక ఎదిగి మంత్రి కావాలని అతని ఆశ. ఎం.పి.అవుతాడు. అప్పాజీ, బాబాజీ ఇద్దరూ బియ్యంలో రాళ్ళు కలిపి ఎగుమతి చేయడం, బిస్లెరీ నీళ్ళ సీసాల్లో సారా కలిపి అమ్మడం, దొంగ నోట్లను ముద్రించడం వంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తుంటారు. చంద్రం కళ్ళముందు జరిగే అన్యాయాలను ఎదుర్కోవడంతో అతడికి రౌడీ ముద్రవేస్తారు ఈ అన్నదమ్ములు. అప్పాజీ కుటుంబానికి చంద్రం తండ్రి రఘురామయ్య సేవచేస్తూ ఎంతో ఋణపడినట్లుగా భావిస్తుంటాడు. అందుచేత అప్పాజీ విరుద్ధంగా చంద్రం చేసే పనులను వారిస్తుంటాడు. చిన్నప్పుడే చంద్రం అప్పాజీ ఆంబోతుని వదిలి ఓ చిన్నరైతుని చంపించడం కళ్ళారా చూసి ఉండడంతో అది మనసు మీద ముద్ర వేసుకుని, పెద్దయిన తర్వాత ఆ రైతు కొడుకు బుచ్చయ్యను హెచ్చరించడం కూడా జరిగింది. అప్పాజీ కొలువులో ఉన్న ఈ బుచ్చబ్బాయి అసలు విషయం తెలుసుకున్న తర్వాత అప్పాజీ పథకాలన్నీ చంద్రానికి చేరవేసి దూతగా మారతాడు. తమ పనులకు అడ్డం పడే చంద్రాన్ని బుట్టలో వేయడానికి తమ కంపెనీలోనే ఉద్యోగం ఇస్తాడు అప్పాజీ. బాబాజీ కూతురు రాణి కోరిన మీదట ఆ ఉద్యోగంలో చేరిన చంద్రాన్ని బిస్లెరి సీసాల రగడలో చంపబోతే, ఆ గునపానికి రాణి అడ్డుపడి ప్రాణాన్ని కోల్పోతుంది. అయితే ఈ హత్య చంద్రం చేయించాడని అతడిని జైలులో పెట్టిస్తారు. చంద్రం జైల్లో నుండి పరారవుతాడు. అయితే చంద్రాన్ని చంపడానికి ఓ బాంబు పెట్టిన అప్పాజీ మనుషులు దాన్ని పేల్చి పిడుగు పడిందని నమ్మిస్తారు. చంద్రం మరణించాడని జనం నమ్ముతారు. ఫ్లాష్ బ్యాక్‌లో చంద్రం తల్లి సీతామహాలక్ష్మి తన తండ్రిని కాదని తన తండ్రి వద్ద పనిచేస్తున్న రఘురామయ్యను పెళ్ళి చేసుకుంటుంది. సీతామహాలక్ష్మికి పుట్టిన బిడ్డను పెంచుకోవడానికి ఆమె తండ్రి ఆస్పత్రి నర్సు సహాయంతో అప్పుడే పుట్టిన కవల బిడ్డలలో ఒక బిడ్డను తీసుకుని శ్రీహర్ష అని నామకరణం చేసుకుని పెంచుకుంటే రెండవ బిడ్డ చంద్రంగా తల్లి దగ్గర పెరుగుతాడు. ఈ విషయం ఒక్క చంద్రం తాతకు తప్ప ఎవరికీ తెలియదు. ఆ శ్రీహర్షని మళ్ళీ బాబాజీ ముఠావాళ్ళే మరోకారణంతో బాంబు పెట్టి చంపుతారు. ఇప్పుడు అదే పోలికతో ఉన్న చంద్రం జైల్లో ఉన్నాడని తెలుసుకున్న అతని తాత అతడిని జైలు నుండి తప్పించి తన దగ్గర ఉంచుకుని శ్రీహర్షగా పిలుచుకుంటాడు. ఇక్కడ కూడా శ్రీహర్షగా చంద్రం విలన్ల పథకాలకు అడ్డం పడటం, బాధితులను ఆదుకోవడం లాంటివి చేస్తూ ఉంటాడు. చదువుకోవడానికి విశాఖపట్నం వచ్చిన అప్పాజీ కూతురు శ్రీలేఖ శ్రీహర్షగా చలామణీ అవుతున్న చంద్రాన్ని ప్రేమిస్తుంది. చివరికి చంద్రం తన నిజస్వరూపం ప్రదర్శించి దుష్టశిక్షణ చేయడం పతాక సన్నివేశం.[1]

పాటలు

మార్చు
  1. బంగినపల్లి మామిడి పండు
  2. పుణ్యం చేసిన పుట్టిల్లా
  3. ప్రేమ ప్రేమ
  4. నేనంటే నేనే

మూలాలు

మార్చు
  1. గుడిపూడి శ్రీహరి. "సినిమా రివ్యూ ఫరవాలేదనిపించే యస్ నేనంటే నేనే". సితార. Retrieved 29 August 2020.

బయటిలింకులు

మార్చు