రజితమూర్తి చెట్టెభక్తుల
రంగస్థల, టీవీ, సినీ నటుడు.
(రజితమూర్తి. సిహెచ్ నుండి దారిమార్పు చెందింది)
రజితమూర్తి చెట్టెభక్తుల (జ. ఏప్రిల్ 17, 1950) రంగస్థల, టీవీ, సినీ నటుడు. 2002, 2011 లలో జరిగిన నంది నాటక పరిషత్తులలో ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డులు అందుకున్నాడు.[1][2]
రజితమూర్తి చెట్టెభక్తుల | |
---|---|
జననం | ఏప్రిల్ 17, 1950 రావిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రంగస్థల, టీవీ, సినీ నటుడు |
జననం
మార్చురజితమూర్తి 1950, ఏప్రిల్ 17న పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడు గ్రామంలో జన్మించాడు.
విద్యాభ్యాసం - ఉద్యోగం
మార్చుఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. పూర్తిచేసిన రజితమూర్తి, ఎక్సైజ్ ఇన్సిపెక్టర్ గా పనిచేసి, పదవి విరమణ చేశాడు.
రంగస్థల ప్రస్థానం
మార్చు1966లో రావికొండలరావు పట్టాలు తప్పిన బండి నాటకంతో నాటకరంగంలోకి అడుగుపెట్టాడు. స్పస్టమైన ఉచ్చారణతో సంభాషణలు పలికే రజితమూర్తి దాదాపు అన్ని పరిషత్తుల నాటక ప్రదర్శనల్లో నటించి, ఉత్తమ నటుడు, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ క్యారెక్టర్ నటుడు అవార్డులను అందుకున్నాడు.[3]
నటించినవి
మార్చు- నిషిద్ధాక్షరి
- మానస సరోవరం
- నీతిచంద్రిక
- కాదు సుమా కల
- పడమటి గాలి
- అంబేద్కర్ రాజగృహ ప్రవేశం
- ఆకాశదేవర[4][5]
- వానప్రస్థం
- హింసధ్వని
- యద్భవిష్యం
- శ్రీచక్రం
- శ్రీముఖ వ్యాఘ్రం
- ఎడారి కోయిల
- మాస్క్[6]
బహుమతులు
మార్చు- ఉత్తమ ప్రతి నాయకుడు - ఏడుగుడిసెల పల్లె (నాటకం), నంది నాటక పరిషత్తు - 2002.[7]
- ఉత్తమ ప్రతినాయకుడు - నష్టసరిహారం (నాటిక), నంది నాటక పరిషత్తు - 2011.
- ఉత్తమ ప్రతినాయకుడు - నష్టసరిహారం (నాటిక), పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2012.[8]
పురస్కరాలు
మార్చు- ఉగాది పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు, 11 ఏప్రిల్ 2013)[9]
- గుర్రం జాషువా పురస్కారం (విశ్వశాంతి కళానికేతన్ నాటక పరిషత్తు, వినుకొండ)
- విశిష్ట నటుడు పురస్కారం (కళావాణి, రాజమండ్రి)
- స్వర్ణకంకణం (కాకతీయ కళాపరిషత్తు, నాగభైరువారి పాలెం)
- నట పురస్కారం (సౌజన్య కళామండలి, కడప)
- నట పురస్కారం (తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల ఐక్యవేదిక)
టీవీ రంగం
మార్చు- కుంకుమ రేఖ (ధారావాహిక)
మూలాలు
మార్చు- ↑ రజితమూర్తి. సిహెచ్, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.483
- ↑ ప్రజాశక్తి, జిల్లాలు (6 January 2019). "కళలతోనే అభ్యుదయం". Retrieved 17 April 2020.[permanent dead link]
- ↑ రజితమూర్తి. సిహెచ్, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.483
- ↑ ఆంధ్రభూమి, విశాఖపట్టణం (7 August 2017). "ఆకాశదేవర నాటక సమీక్ష (నాటక సమీక్ష)". www.andhrabhoomi.net. శ్రీమతి కోవిల. Archived from the original on 17 ఏప్రిల్ 2020. Retrieved 17 April 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు. "ప్రతి జిల్లాకు ఆడిటోరియం: రిటైర్డ్ ఐఏఎస్ బలరామయ్య". lit.andhrajyothy.com. Archived from the original on 17 ఏప్రిల్ 2020. Retrieved 17 April 2020.
- ↑ జీవన్నాటకంలో మనిషి పాత్రను ఆవిష్కరించిన 'మాస్క్', విశాలాంధ్ర, కృష్ణాజిల్లా, 29 నవంబరు 2014, పుట. 10
- ↑ నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.702
- ↑ పరిచూరి ఫలితాలు, అభినయ (మే 2012), హైదరాబాదు, పుట.27
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (9 April 2013). "41 మందికి ఉగాది పురస్కారాలు...15 మందికి హంస అవార్డులు". www.sakshieducation.com. Archived from the original on 17 ఏప్రిల్ 2020. Retrieved 17 April 2020.