రత్నమాలా ప్రకాష్

రత్నమాలా ప్రకాష్ ఒక భారతీయ గాయని. ఈమె కన్నడ భాషలో పాటలు పాడుతుంది. ఈమె సినిమా నేపథ్య గానంతో పాటు కన్నడ లలిత గీతాలు (సుగమ సంగీతం) పాడటంలో నేర్పరి. ఈమె తండ్రి ఆర్.కె.శ్రీకంఠన్ పేరుమోసిన కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసుడు.[1] 2016లో ఈమెకు కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతర ముఖ్యమైన సంప్రదాయ సంగీత రీతులు విభాగంలో సుగమ సంగీతంలో ఈమె చేసిన కృషికి గుర్తింపుగా సంగీత నాటక అకాడమీ అవార్డును ప్రకటించింది.[2]

రత్నమాలా ప్రకాష్
వ్యక్తిగత సమాచారం
ఇతర పేర్లుహాడు హక్కి (పాడే పక్షి), వాయిస్ ఆఫ్ కర్ణాటక, రత్నక్క
జననం (1952-08-19) 1952 ఆగస్టు 19 (వయసు 72)
కర్ణాటక రాష్ట్రం, భారతదేశం
సంగీత శైలిలలిత సంగీతం, సినిమా సంగీతం
వృత్తినేపథ్యగాయిని

వృత్తి

మార్చు

ఈమె అనేక భావగీతాలతో పాటుగా అనేక సినిమా పాటలను కూడా పాడింది. ఈమె మొదటి సారిగా రాజ్‌కుమార్‌తో కలిసి గురి సినిమాలో పాడింది. ఈమె ఎల్.వైద్యనాథన్, సి.అశ్వథ్, రాజన్ - నాగేంద్ర, హంసలేఖ, ఇళయరాజా, శంకర్ గణేష్, మనోరంజన్ ప్రభాకర్, పి.వజ్రప్ప మొదలైన వారి సంగీత దర్శకత్వంలో పనిచేసింది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె. జె. ఏసుదాసు, ఎం.రంగారావు, విజయభాస్కర్, శంకర్ మహదేవన్, రాజేష్ కృష్ణన్, మంజులా గురురాజ్, మాస్టర్ శర్మ, వినోద్ రాజ్, రాంప్రసాద్, పి.బి.శ్రీనివాస్, రాజ్‌కుమార్ మొదలైన గాయకులతో కలిసి పాటలను పాడింది. ఈమె సదా, రమ్యకృష్ణ, రవళి, చారులత, విజయలక్ష్మి, బి.జయశ్రీ, ప్రేమ, శాంతమ్మ, మాధురి, కల్పన, భవ్య, గౌతమి, చంద్రలేఖ, అర్చన, భారతీ విష్ణువర్ధన్, హేమా చౌదరి, అభినయ మొదలైన నటీమణులు నటించిన పాటలను పాడింది.

ఈమె లలిత గీతాలు అనేక సి.డి.లలో, కేసెట్లలో రికార్డు అయ్యాయి. ఈమె సోవియట్ రష్యాలో జరిగిన భారత ఉత్సవాలలో పండిట్ రవిశంకర్ ట్రూపులో పాల్గొని పాడింది. దుబాయి, సింగపూరు, షార్జా, అబూదాబి, అమెరికాలోని ఫీనిక్స్, హోస్టన్ మొదలైన ప్రాంతాలలో తన లలిత సంగీత కచేరీలు నిర్వహించింది.

అవార్డులు

మార్చు

జాతీయ అవార్డులు:

  1. 2016 - సంగీత నాటక అకాడమీ అవార్డు ఇతర ముఖ్యమైన సంప్రదాయ సంగీతరీతులు - సుగమ సంగీతం [3]

రాష్ట్రస్థాయి అవార్డులు:

  1. 2016 -కర్ణాటక ప్రభుత్వం, సాంస్కృతిక విభాగం వారిచే సంత శిశునాళ షరీఫ్ అవార్డు[4]
  2. 1991 - కర్ణాటక ప్రభుత్వంచే రాజ్యోత్సవ ప్రశస్తి [5]
  3. 1990 - కర్ణాటక సంగీత నృత్య అకాడమీ వారిచే కర్ణాటక కళాశ్రీ అవార్డు

ఇతర అవార్డులు:

  1. 2017 - ఆళ్వాస్ నుడిసిరి అవార్డు[6]
  2. 2014 - రోటరీ క్లబ్ వారి వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు
  3. 2012 - Artist of The Year award by Bala Samaja
  4. కె.ఎస్.నరసింహస్వామి ప్రతిష్టాన అవార్డు
  5. డి సుబ్బరామయ్య ట్రస్ట్ వారిచే ఎక్సలెంట్ అచీవ్‌మెంట్ ఇన్ సుగమ సంగీత
  6. 2010 - హనగల్ ఫౌండేషన్ వారిచే కృష్ణ హనగల్ అవార్డు[7]

మూలాలు

మార్చు
  1. "Haadu Hakki gets feted". The Hindu. 2014-02-06. Retrieved 2015-07-22.
  2. "Awardees list". Sangeet Natak Academy official website. Archived from the original on 6 ఫిబ్రవరి 2021. Retrieved 25 February 2021.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-05-06. Retrieved 2021-04-08.
  4. https://www.deccanherald.com/content/580274/t-chowdiah-award-tabla-artiste.html
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-03-01. Retrieved 2021-04-08.
  6. https://starofmysore.com/three-day-alvas-nudisiri-moodbidri-dec-1/
  7. http://www.thehindu.com/todays-paper/tp-national/tp-karnataka/ratnamala-prakash-presented-award/article760350.ece