అభినయ భారతదేశ సినిమా నటి, మోడల్. ఈమె చక్కని ప్రతిభావంతురాలైన నటి ఐనప్పటికీ ఈమె పుట్టుకతోనే మూగది, ఈమెకు వినబడదు.[1][2][3][4] ఈమె 2009 లో "నాదోదిగల్" అనే చిత్రంతో రంగప్రవేశం చేసింది. ఈమె తెలుగు, కన్నడ చిత్రాలలో ప్రముఖ పాత్రలు పోషించింది.

అభినయ
నటీమణి "అభినయ"
జననం
అభినయ ఆనంద్

వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2009–ప్రస్తుతం వరకు

కెరీర్ మార్చు

ఆమె తండ్రి 2006 లో "ఎ.ఆర్.మురుగదాస్" దర్శకత్వం వహించిన తెలుగు సినిమా "స్టాలిన్"లో సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రను పోషించారు. అభినయ తనతో పాటు కలసి నటించడం గమనించిన తండ్రి ఆమెను "ఎం.శశికుమార్"కు పరిచయం చేశారు. శశికుమార్ ఆమెకు "నాదోదిగల్" చిత్రంలో పరిచయం చేశారు.ఈ చిత్రానికి "సముతిరాకని" దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో "అభినయ" నటన అనేక మంది మన్ననలంచుకుంది. ఆపై ఆమెను ఆచిత్రానికి తెలుగు రీమేక్ చేసినపుడు "శంభో శివ శంభో"లో నటించింది. కన్నడ సినిమా "హుడుగారు"లో ఇదే పాత్రను పోషించారు. ఆమెకు రెండు ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. అవి "నాదిడిగాల్", "శంభో శివ శంభో" చిత్రాలలో విశేష ప్రతిభకు గానూ వచ్చాయి. ఈమె 2010 లో శశికుమార్ దర్శకత్వంలోని "ఈశాన్" చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. 2011 లో "ఎ.ఆర్. మురుగదాస్" ప్రముఖ నటుడు సూర్యతో కలసి నటించే అవకాశం కల్పించాడు.[5] ఈమె ప్రస్తుతం "ద రిపోర్టర్",[6] "దమ్ము" చిత్రాలలో నటిస్తుంది. దమ్ము చిత్రంలో జూనియర్ ఎన్.టి.ఆర్ కు సోదరి పాత్రను పోషించారు.[7] ఈమె "గౌతం మెనాన్" నిర్మిస్తున్న ప్రభుదెవా దర్శకత్వంలో గల సినిమాలో కూడా నటిస్తున్నారు.[8]

ఈమె వెంకటేష్, మహేష్ బాబు నటించిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రంలో వారికి సోదరిగా నటించారు.

నటించిన చిత్రాలు మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్ర భాష గమనికలు
2008 నేనింతే సినిమా నిర్మాత కూతురు తెలుగు
కింగ్ శ్రావణి స్నేహితురాలు
సంగమం సంస్కృతీ మిత్రుడు
2009 నాడోడిగల్ పవిత్ర నటరాజ్ తమిళం ప్రధాన నటిగా తమిళ అరంగేట్రం; ఉత్తమ మహిళా తొలి నటిగా

ఫిల్మ్‌ఫేర్ అవార్డు - ఉత్తమ సహాయ నటిగా సౌత్ విజయ్ అవార్డు

ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు - తమిళం నామినేట్ ఉత్తమ తొలి నటిగా విజయ్ అవార్డు

2010 ఆయిరతిల్ ఒరువన్ చోళుని కూతురు తమిళం
శంభో శివ శంభో పవిత్ర తెలుగు తెలుగులో ప్రధాన నటిగా డెబ్యూ; ఉత్తమ సహాయ నటిగా

ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తెలుగు

ఈసన్ పూరాణి తమిళం
2011 హుడుగారు పవిత్ర కన్నడ కన్నడ అరంగేట్రం; నామినేట్ చేయబడింది

ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు – కన్నడ

7 అమ్ అరివు బోధిధర్మ భార్య తమిళం తెలుగులో 7th సెన్స్
2012 దమ్ము రామచంద్ర సోదరి తెలుగు
ఢమరుకం శైలూ తెలుగు
జీనియస్ యాసిర్ సోదరి తెలుగు
2013 ఐజాక్ న్యూటన్ S/O ఫిలిపోస్ అన్నీ మలయాళం మలయాళ రంగ ప్రవేశం
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిన్ని తెలుగు
మహంకాళి అభినయ తెలుగు అతిథి పాత్ర
2014 వీరం పూంగోతై తమిళం తెలుగులో వీరుడొక్కడే
1 బై టూ రజియా మలయాళం
పూజై దుర్గ తమిళం తెలుగులో పూజ
2015 ది రిపోర్టర్ సారా మలయాళం
షమితాబ్ అభినయ హిందీ హిందీ అరంగేట్రం
థాని ఒరువన్ డా.మణిమేకలై తమిళం
తక్క తక్క ఇంధు తమిళం
2016 అడిడా మేళం దేవకి తమిళం
ధృవ డా.అక్షర తెలుగు
2017 కుటీరం 23 అభినయ తమిళం క్రైమ్ 23 (తెలుగు)
నిశబ్ధం ఆదిరా తమిళం
సెంజిత్తలే ఎన్ కధలా సోనా తమిళం
రాజు గారి గది 2 కిరణ్ తెలుగు ప్రతికూల పాత్ర
విజితిరు రేడియో సిటీ ఆర్జే తమిళం
2018 కిచ్చు సూరి భార్య కన్నడ
2020 ఇరత్తయ్యర్ అమృత తమిళం
2021 ఆటో రామన్న కన్నడ
2022 సీతా రామం నూర్ జహాన్ కోడలు తెలుగు
2023 కుట్రం పురింతల్ ఉమా తమిళం
2023 మార్క్ ఆంటోని వేదవల్లి తమిళం
2024 గామి దుర్గ తెలుగు
ఫ్యామిలీ స్టార్ తెలుగు

వెబ్‌ సిరీస్‌ మార్చు

సంవత్సరం పేరు పాత్ర భాష లభ్యత గమనికలు
2023 మాన్షన్ 24 రాధ తెలుగు డిస్నీ+హాట్‌స్టార్ వెబ్ అరంగేట్రం; 203 & 605 ఎపిసోడ్‌ల క్రింద కనిపిస్తుంది.

మూలాలు మార్చు

  1. "Nadodigal Abhinaya gets more offers". Southdreamz. 16 July 2009. Archived from the original on 21 ఆగస్టు 2011. Retrieved 10 February 2010.
  2. Rajamani, Radhika (30 June 2009). "Nadodigal's special heroine". Rediff. Retrieved 10 February 2010.
  3. "'Nadodigal' Abhinaya does the talking through lap-top". Chennaionline. Archived from the original on 23 జనవరి 2010. Retrieved 31 మార్చి 2014.
  4. Borah, Prabalika M. (28 January 2010). "Fighting odds". The Hindu. Chennai, India. Archived from the original on 19 అక్టోబరు 2010. Retrieved 10 February 2010.
  5. Chowdhary, Y. Sunitha (4 April 2011). "Set for a bigger role". The Hindu. Chennai, India.
  6. "Team 'Nadodigal' reunites for Mollywood". IndiaGlitz. Archived from the original on 24 సెప్టెంబరు 2011. Retrieved 20 September 2011.
  7. Chowdhary, Y. Sunita (19 November 2011). "Itsy bitsy". The Hindu. Chennai, India. Archived from the original on 20 నవంబరు 2011. Retrieved 31 మార్చి 2014.
  8. "Gautham Menon's next two". Behindwoods. Retrieved 17 April 2012.

ఇతర లింకులు మార్చు