రమీజ్ రాజా
రమీజ్ హసన్ రాజా (జననం 1962, ఆగస్టు 14) పాకిస్తాన్ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్, వ్యాఖ్యాత, యూట్యూబర్, మాజీ క్రికెటర్. 2021 సెప్టెంబరు - 2022 డిసెంబరు మధ్య పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ 35వ ఛైర్మన్‌గా పనిచేశాడు.[2]
రమీజ్ రాజా | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 35వ ఛైర్మన్ | ||||||||||||||||||||||||||||||||||||||||
In office 2021 సెప్టెంబరు 13 – 2022 డిసెంబరు 21 | ||||||||||||||||||||||||||||||||||||||||
Appointed by | ఇమ్రాన్ ఖాన్ | |||||||||||||||||||||||||||||||||||||||
అధ్యక్షుడు | ఆరిఫ్ అల్వీ | |||||||||||||||||||||||||||||||||||||||
ప్రధాన మంత్రి | ఇమ్రాన్ ఖాన్ షెహబాజ్ షరీఫ్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతకు ముందు వారు | ఎహ్సాన్ మణి | |||||||||||||||||||||||||||||||||||||||
తరువాత వారు | నజం సేథి | |||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత వివరాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
జననం | రమీజ్ హసన్ రాజా 1962 ఆగస్టు 14 ఫైసలాబాద్, పంజాబ్, పాకిస్థాన్ | |||||||||||||||||||||||||||||||||||||||
కళాశాల |
| |||||||||||||||||||||||||||||||||||||||
వృత్తి | మాజీ పాకిస్తానీ క్రికెటర్ | |||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు |
| |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 99) | 1984 మార్చి 2 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1997 ఏప్రిల్ 26 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 56) | 1985 ఫిబ్రవరి 6 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1997 సెప్టెంబరు 21 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2006 జనవరి 31 |
రాజా 1980లు - 1990లలో పాకిస్థాన్‌కు (అడపాదడపా కెప్టెన్‌గా) ప్రాతినిధ్యం వహించాడు. ఇతను తన యూట్యూబ్ ఛానెల్ రమీజ్ స్పీక్స్‌లో క్రికెట్ గురించి కూడా మాట్లాడాడు.[3][4]
ప్రారంభ జీవితం, విద్య
మార్చురాజా పంజాబీ కుటుంబంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు భారతదేశ విభజన సమయంలో రాజస్థాన్‌లోని భారతీయ నగరం జైపూర్ నుండి వలస వచ్చారు. ఇతని అత్తగారు ఢిల్లీ నుండి, ఇతని మామ హర్యానాలోని కర్నాల్ నుండి వచ్చారు.[5]
ఇతని తండ్రి సలీమ్ అక్తర్ బ్రిటీష్ వలసరాజ్యాల కాలంలో క్రికెట్ ఆటగాడు. విభజన తర్వాత ముల్తాన్, సర్గోధకు ఆడాడు. ఇతని సోదరుడు వసీం రాజా, ఇతని కజిన్ అతిఫ్ రవూఫ్ పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు కోసం ఆడాడు, మరొక సోదరుడు జయీమ్ రాజా ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా ఆడాడు.
రాజా బహవల్పూర్ లోని సాదిక్ పబ్లిక్ స్కూల్, లాహోర్ లోని ఐచిసన్ కళాశాల, లాహోర్ ప్రభుత్వ కళాశాల విశ్వవిద్యాలయంలలో చదివాడు.[6][7][8]
దేశీయ క్రికెట్
మార్చురమీజ్ 1978లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసాడు. లిస్ట్ ఎలో 9,000 పైగా పరుగులు, ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 10,000 పరుగులు చేశాడు. ఇతను పాకిస్తాన్‌లో 10,000 ఫస్ట్ క్లాస్ పరుగులు సాధించిన కొద్దిమందిలో ఒకడిగా రికార్డు సాధించాడు. ఇంగ్లాండ్‌పై మ్యాచ్ కి ఇతనికి జాతీయ జట్టు నుండి పిలుపు వచ్చింది. ఇతను పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్న ప్రముఖ బ్యాటర్‌గా పరిగణించబడ్డాడు.[9]
అంతర్జాతీయ క్రికెట్
మార్చుఇంగ్లాండ్తో టెస్టు మ్యాచ్‌లో ఆడే అవకాశాన్ని అందుకున్నాడు. అయితే, ప్రతి ఇన్నింగ్స్‌లో 1 పరుగుతో ఔటయ్యాడు. పాకిస్తాన్ జట్టులో పలువురు ఆటగాళ్ళ రిటైర్మెంట్‌తో, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అతని సంవత్సరాల అనుభవం సహాయంతో, రాజా జాతీయ జట్టులో స్థానం సంపాదించగలిగాడు.[10]
రమీజ్ 13 సంవత్సరాలపాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 57 టెస్ట్ మ్యాచ్‌లలో కెరీర్ సగటు 31.83తో రెండు సెంచరీలు చేశాడు. వన్డే ఇంటర్నేషనల్ ఎరీనాలో, అతను 198 మ్యాచ్‌లు ఆడి 9 సెంచరీలు చేశాడు.[11]1987 ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకున్న జాతీయ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన 1992 ప్రపంచ కప్‌లో 2 సెంచరీలు (అజేయంగా నిలిచిన న్యూజిలాండ్‌పై ఒక సెంచరీతోపాటు) సాధించాడు. టోర్నమెంట్ సెమీ-ఫైనల్స్‌లో పాకిస్థాన్‌కు చోటు కల్పించిన మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనకు అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌లో పాకిస్థాన్‌కు ప్రపంచకప్‌ను అందించిన ఫైనల్ క్యాచ్‌ను రమీజ్ అందుకున్నాడు. ఇది అతని క్రికెట్ కెరీర్‌ను ఉన్నత స్థానానికి చేర్చింది. ఈ విజయం సాధించిన ఒక సంవత్సరంలోనే అతను ఫామ్‌ను కోల్పోయి, జాతీయ జట్టు నుండి తొలగించబడ్డాడు.[9][12]
వ్యాఖ్యాన వృత్తి
మార్చు2006లో పాకిస్థాన్‌తో జరిగిన ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో టెస్ట్ మ్యాచ్ స్పెషల్, స్కై స్పోర్ట్స్‌లో వ్యాఖ్యాతగా పనిచేశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పనిచేశాడు. అయితే పెరుగుతున్న మీడియా కట్టుబాట్లను పేర్కొంటూ 2004 ఆగస్టులో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇతను పాకిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటనలతోపాటు అనేక దేశవాళీ టోర్నమెంట్‌లు, అంతర్జాతీయ ఐసీసీ టోర్నమెంట్‌లలో వ్యాఖ్యానించడం కొనసాగిస్తున్నాడు.[13][14]
మూలాలు
మార్చు- ↑ "Cricketing dynasties of 2 families".
- ↑ "Pakistan Cricket Board chairman Ramiz Raja sacked, Najam Sethi to take over PCB top job".
- ↑ "Ramiz Raja formally elected as PCBchairman". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-08.
- ↑ Dawn.com (13 September 2021). "Ramiz Raja elected new PCB chairman 'unanimously and unopposed'". DAWN.COM (in ఇంగ్లీష్). Retrieved 2023-09-08.
- ↑ Inzamam-ul-Haq, 28 May 1997, Outlook India.
- ↑ "GC University Lahore produces five prime ministers of country: grand celebration to mark 148th birthday – Business Recorder". Retrieved 2023-09-08.
- ↑ "Happy Birthday GCU". The Nation (in ఇంగ్లీష్). 1 January 2014. Retrieved 2023-09-08.
- ↑ "Board Of Governors | Pakistan Cricket Board (PCB) Official Website". www.pcb.com.pk. Retrieved 2023-09-08.
- ↑ 9.0 9.1 "Pakistan lauds 'King of Entertainment' Sehwag". The Hindu. PTI. 9 December 2011. ISSN 0971-751X. Retrieved 2023-09-08.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ "Rameez Raja launches attack on Mohsin Khan". The Hindu. PTI. 28 June 2012. ISSN 0971-751X. Retrieved 2023-09-08.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ "Ramiz Raja batting bowling stats, averages and cricket statistics, 2022". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-08.
- ↑ "Rameez Raja Profile - Cricket Player,Pakistan|Rameez Raja Stats, Ranking, Records inCricket -NDTV Sports". NDTVSports.com (in ఇంగ్లీష్). Retrieved 2023-09-08.
- ↑ Editorial (1 May 2015). "Rameez Raja's nine hilarious commentary moments". India News, Breaking News, Entertainment News | India.com (in ఇంగ్లీష్). Retrieved 2023-09-08.
- ↑ Mustafi, Suvajit (30 April 2015). "Rameez Raja's nine hilarious commentary moments". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2023-09-08.
బాహ్య లింకులు
మార్చు- రమీజ్ రాజా at ESPNcricinfo
- Ramiz Raja on