రాజా ది గ్రేట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 2017లో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో రవితేజ, మెహరీన్, ప్రకాష్ రాజ్, రాధిక ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించాడు. సాయి కార్తీక్ సంగీతాన్నందించాడు. ఈ చిత్రంలో రవితేజ అంధుడైన యువకుడి పాత్ర పోషించాడు.

రాజా ది గ్రేట్
థియేట్రికల్ రిలీజ్ పోస్టర్
దర్శకత్వంఅనిల్ రావిపూడి
రచనఅనిల్ రావిపూడి
నిర్మాతదిల్ రాజు
తారాగణంరవితేజ (నటుడు)
మెహ్రీన్ పిర్‌జాద
ప్రకాష్ రాజ్
సంగీతంసాయి కార్తీక్
నిర్మాణ
సంస్థ
దేశంభారతదేశం
భాషతెలుగు

ప్ర‌కాష్ రాజ్‌ ఒక నిజాయితీ గ‌ల పోలీస్ ఆఫీస‌ర్, పెద్ద గూండా దేవ‌రాజ్‌(వివాన్ బాట్నే)కు ఎదురు తిరిగి క్ర‌మంలో అత‌ని త‌మ్ముణ్ని ఎన్‌కౌంట‌ర్‌లో చంపేస్తాడు. దాంతో ప్ర‌కాష్ రాజ్ బృందాన్ని ఆ గూండా చంపేస్తాడు. ప్ర‌కాష్ రాజ్ కుమార్తె ల‌క్కీ(మెహ‌రీన్‌)ను చంపాల‌ని చూస్తాడు. ల‌క్కీ త‌ప్పించుకుని డార్జిలింగ్కు వెళ్లిపోతుంది. ల‌క్కీకి స్పెష‌ల్ సెక్యూరిటీని అరెంజ్ చేయ‌డానికి ఐజీ(సంప‌త్‌) ఆలోచిస్తాడు. ఆ క్ర‌మంలో ముగ్గురు పోలీస్ అధికారులను నియమిస్తాడు. పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అనంత ల‌క్ష్మి(రాధిక‌)కు త‌న కొడుకు రాజా ది గ్రేట్‌(ర‌వితేజ‌)ని పోలీస్ అధికారి చేయాల‌ని పెద్ద కోరిక ఉంటుంది. అయితే రాజా అంధుడు కావ‌డంతో పోలీసులు ఆమెకోరిక తిర‌స్క‌రిస్తుంటారు. రాజా అంధుడైన‌ప్ప‌టికీ ప్రత్యేక శిక్షణ తీసుకోవ‌డం వ‌ల్ల చాలా చురుకుగా ఉండ‌ట‌మే కాకుండా, చూపుండేవారు కూడా చేయ‌లేని ప‌నుల‌ను చేసేస్తుంటాడు. అనంత ల‌క్ష్మి పోరు ప‌డ‌లేక ఐజీ, రాజాను ల‌క్కీని కాపాడే టీంలో భాగం చేస్తాడు. ల‌క్కీ.., డార్జిలింగ్‌లో ఉంద‌ని తెలుసుకున్న దేవ‌రాజ్ అక్క‌డి త‌న మ‌నుషుల‌ను పంపుతాడు. కానీ రాజా ఆమెను కాపాడుతాడు. అంతే కాకుండా భ‌యంతో ప‌రుగుపెట్ట‌కుండా ఫైట్ చేద్దామ‌ని ల‌క్కీకి ధైర్య‌మిస్తాడు. రాజా ఇచ్చిన ధైర్యంతో ల‌క్కీ త‌న ఊరికి వ‌స్తుంది? అప్పుడు ఆమె ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటుంది? ల‌క్కీని చంప‌డానికి దేవ‌రాజ్ ఏం చేస్తాడు? అనేది మిగిలిన కథలో భాగం.

తారాగణం

మార్చు

పాటల జాబితా

మార్చు
  • రాజా ది గ్రేట్ , రచన: కాసర్ల శ్యామ్ , గానం.రవితేజ , ఎల్.వి . రేవంత్ , కె.సాకేత్ , శ్రీకృష్ణ
  • నాకే నే నచ్చేస్తున్నా , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం . సమీర భరద్వాజ్ , ఎం.ఎల్ . శ్రుతి
  • చిన్నారి, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. హరిచరన్, దివిజ కార్తీక్
  • అల్లాబీ అల్లాబీ, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. యాజీన్ నిజార్ , ఆదిత్య అయ్యంగార్, శ్రీకృష్ణ
  • ఎన్నియలోఎన్నియలో ,రచన: కాసర్ల శ్యామ్ , గానం.సాయికార్తీక్ .

సాంకేతికవర్గం

మార్చు

మూలాలు

మార్చు
  1. "Raja The Great Telugu Movie". FilmiBeat.

బయటి లింకులు

మార్చు