రానా దగ్గుబాటి

సినీ నటుడు
(రాణా దగ్గుబాటి నుండి దారిమార్పు చెందింది)

దగ్గుబాటి రామానాయుడు అలియాస్ దగ్గుబాటి రానా భారతీయ బహుభాషా చలనచిత్ర నటుడు, నిర్మాత, పారిశ్రామక వేత్త. ఇతను సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడు. ఆయన సినిమా తెరంగేట్రం లీడర్ అనే తెలుగు సినిమా తో కాగా తమిళం, హిందీ భాషల్లో కూడా వివిధ సినిమాల్లో నటించారు.

దగ్గుబాటి రానా
59వ ఫిలింఫేర్ అవార్డుల విలేఖరుల సమావేశంలో రానా
జననం
దగ్గుబాటి రామానాయుడు

14 డిసెంబరు 1984 [1]
వృత్తినటుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2005-ఇప్పటి వరకు
ఎత్తు6 అ. 2.5 అం. (189.2 cమీ.)
తల్లిదండ్రులుదగ్గుబాటి సురేష్ బాబు
దగ్గుబాటి లక్ష్మి
బంధువులుదగ్గుబాటి రామానాయుడు (తాతయ్య)
దగ్గుబాటి వెంకటేష్ (చిన్నాన్న)
నాగ చైతన్య (అత్త కొడుకు)
వెబ్‌సైటుwww.ranadaggubati.com

రానా సినిమాల్లో విసువల్ ఎఫెక్ట్స్ సమన్వయకర్తగా సుమారు 70 సినిమాలకు పని చేసాడు. ఈయనకి స్పిరిట్ మీడియా అనే సొంత నిర్మాణ సంస్థ ఉంది, ఈ సంస్థ ద్వారా జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాన్ని నిర్మించాడు. ఆ తరువాత 2010 లో నటన ప్రారంభించాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

రానా దగ్గుబాటి, తెలుగు సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు , దగ్గుబాటి లక్ష్మి ల కుమారుడు. ఈయన పాఠశాల విద్యను హైదరాబాద్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, చెన్నై లోని చెట్టినాడ్ విద్యాశ్రమం నుండి అభ్యసించారు. ఆ తరువాత హైదరాబాద్ సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుకున్నాడు. అతను తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు.

రానా తన ప్రేయసి, మిహికా బజాజ్‌తో మే 21, 2020 న నిశ్చితార్థం, ఆగస్టు 8న వివాహం చేసుకున్నాడు. [3][4] ప్రభాస్, కొమ్మిరెడ్డి వెంకట్ రమణారెడ్డి మంచి స్నేహితులు

నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం చిత్రం పాత్ర భాష వివరాలు
2010 లీడర్ అర్జూన్ ప్రసాద్ తెలుగు m:en:Filmfare Award for Best Male Debut – South
CineMAA Award for Best Male Debut
2011 దం మారో దం డిజె జోకి ఫెర్నాండేజ్ హిందీ m:en:Zee Cine Award for Best Male Debut
Nominated - m:en:Filmfare Award for Best Male Debut
2011 నేను నా రాక్షసి అభిమన్యు తెలుగు
2012 నా ఇష్టం గణేశ్ తెలుగు
2012 డిపార్ట్‌మెంట్ శివ్ నారాయణ్ హిందీ
2012 కృష్ణం వందే జగద్గురుం బీటెక్ బాబు తెలుగు m:en:SIIMA Award for Best Actor (Critics) [ఆధారం చూపాలి]
2013 యే జవానీ హై దీవానీ విక్రమ్ హిందీ అతిధి పాత్ర
2013 సమ్తింగ్ సమ్తింగ్ తెలుగు అతిధి పాత్ర
2013 ఆరంభం సంజయ్ తమిళ్ అతిధి పాత్ర
2014 రుద్రమదేవి చాళుక్య వీరభద్రుడు తెలుగు చిత్రీకరణ జరిగింది
2014 తమిళ్
2015 బాహుబలి భల్లాల దేవ తెలుగు చిత్రీకరణ జరిగింది
2015 తమిళం
2017 బాహుబలి 2 భల్లాల దేవ తెలుగు, తమిళ్ హిందీ చిత్రీకరణ జరిగింది
2017 నేనే రాజు నేనే మంత్రి రాధా జోగేంద్ర తెలుగు చిత్రీకరణ జరిగింది
2018 వెల్కమ్ టూ న్యూ యార్క్ రానా దగ్గుబాటి హిందీ
2019 ఎన్.టి.ఆర్. కథానాయకుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగు అతిధి పాత్ర
2019 హౌస్ ఫుల్ 4 రాజా / పప్పు రంగీలా హిందీ
2020 హాతి మేరీ సాతి / కాదన్ / అరణ్య బందేవ్ హిందీ / తమిళ్ / తెలుగు చిత్రీకరణ
2020 హిరణ్య కశ్యప్ హిరణ్య కశ్యప్ తెలుగు చిత్రీకరణ
2021 అరణ్య తెలుగు ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది.
2021 1945 తెలుగు
2022 విరాట పర్వం[5] తెలుగు చిత్రీకరణ

అవార్డులు

మార్చు

ఫిల్మ్ ఫేర్ అవార్డులు

సైమా అవార్డులు

వంశవృక్షం

మార్చు

మూలాలు

మార్చు
  1. "Happy Birthday "Fire Star"". Maastars.com. 14 December 2013.
  2. Rajamani, Radhika (24 November 2009). "An entrepreneur who acts too". Rediff. Archived from the original on 25 October 2010. Retrieved 24 October 2010.
  3. HMTV, Karampoori (8 August 2020). "Rana Daggubati Wedding Ceremony: వైభ‌వంగా రానా, మిహీకాల‌ వివాహం". www.hmtvlive.com. Archived from the original on 13 మే 2021. Retrieved 13 May 2021.
  4. Sakshi (13 May 2021). "రానా అడిగాడు, ఓకే చెప్పాను: మిహికా బజాజ్‌". Sakshi. Archived from the original on 13 మే 2021. Retrieved 13 May 2021.
  5. "Virataparvam Teaser: Rana looks Fierce as Comrade Ravanna". Moviezupp.
  6. Andhra Jyothy (17 September 2023). "దక్షిణాది చిత్రాల ప్రతిభ పట్టం..!". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.

బయటి లంకెలు

మార్చు