భీమ్లా నాయక్‌ 2022లో విడుదలైన తెలుగు సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించాడు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 జనవరి 12న[1] కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడి ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా 2400 థియేటర్లలో[2] విడుదలైంది.[3][4] ఈ సినిమా మార్చి 25 నుంచి ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కానుంది.[5] ఈ సినిమా బిజు మేనన్, పృథ్వీ ప్రధాన పాత్రల్లో నటించిన అయ్యప్పనుం కోషియుం అనే మలయాళ సినిమాకు పునర్నిర్మాణం.

భీమ్లా నాయక్‌
దర్శకత్వంసాగర్ కె.చంద్ర
స్క్రీన్ ప్లేత్రివిక్రమ్ శ్రీనివాస్
దీనిపై ఆధారితంసచీ దర్శకత్వం వహించిన 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌' మలయాళం సినిమా రీమేక్‌ 
నిర్మాతసూర్యదేవర నాగవంశీ
తారాగణంపవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి
నిత్య మేనన్‌
ఐశ్వర్య రాజేష్
ఛాయాగ్రహణంరవి కె. చంద్రన్
కూర్పునవీన్ నూలి
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీ
2022 ఫిబ్రవరి 25 (2022-02-25)
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణం మార్చు

ఈ సినిమా షూటింగ్ 2021 జనవరి 25న హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు.[6] జనవరి 26 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.[7] ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా 2021 మార్చి చివర్లో షూటింగ్​ను వాయిదా వేసి, జూలై 12 నుంచి షూటింగ్​ను తిరిగి ప్రారంభించారు.[8] ఈ సినిమాలోని ‘సెభాష్‌.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు’ టైటిల్ సాంగ్ పాటను 2021 సెప్టెంబరు 2న విడుదల చేశారు.[9] భీమ్లా నాయక్ ట్రైలర్‌ను 2022 ఫిబ్రవరి 21న విడుదల చేసి[10], ప్రీ రిలీజ్‌ వేడుకను ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీ & పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ప్రత్యేక అతిథిగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలోహైదరాబాద్, యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఫిబ్రవరి 23న నిర్వహించారు.[11] ఈ చిత్రం పది రోజుల్లో ₹167 కోట్ల గ్రాస్‌తో ప్రపంచవ్యాప్తంగా ₹100 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్‌ని వసూలు చేసింది.[12]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

థియేట్రికల్ ట్రైలర్(లు) మార్చు

ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్ మొదట 2022 ఫిబ్రవరి 21 న విడుదల అయ్యింది.[22] అయితే ట్రైలర్ ఆశించినంత రంజుగా లేదని, ముఖ్యంగా తమన్ నేపథ్యసంగీతం చప్పగా ఉందని, త్రివిక్రం మార్కు డైలాగులు వినపడలేదని ట్విట్టర్ వేదికగా పలు విమర్శలు వెల్లువెత్తాయి.[23] ఈ స్పందనను పరిగణ లోకి తీసుకొన్న చిత్ర సాంకేతిక వర్గం 2022 ఫిబ్రవరి 23 న మెరుగైన నేపథ్య సంగీతం, పోరాట సన్నివేశాలు, త్రివిక్రం మార్కు డైలాగులతో రెండవ ట్రైలర్ ను విడుదల చేశారు.[24][25][26]

పాటల జాబితా మార్చు

1: అంత ఇష్టమేందయ్య , గానం.చిత్ర

2: ఓ సందమామ

3: బీమ్లా నాయక్ టైటిల్ సాంగ్

4: లాలా భీమ్లా

మూలాలు మార్చు

  1. Sakshi (15 August 2021). "పవన్‌-రానా మల్టీస్టారర్‌ మూవీ టైటిల్‌ ఇదే". Archived from the original on 16 August 2021. Retrieved 16 August 2021.
  2. 10TV (25 February 2022). "హిందీలో రిలీజ్ కాని భీమ్లా నాయక్.. కారణం ఇదే! | Hindi Version Of Bheemla Nayak Film Not Releasing In Theatres" (in telugu). Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. V6 Velugu (15 January 2022). "భీమ్లా నాయక్ నుంచి పవర్ ఫుల్ పోస్టర్" (in ఇంగ్లీష్). Archived from the original on 15 జనవరి 2022. Retrieved 15 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Bheemla Nayak Review: Pawan Kalyan and Rana deliver breathtaking performances". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-02-25. Retrieved 2022-03-03.
  5. Andhra Jyothy (18 March 2022). "ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.!". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
  6. 10TV (21 December 2020). "రానా - పవన్ సినిమా ప్రారంభం" (in telugu). Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  7. The Indian Express (25 January 2021). "Pawan Kalyan-Rana Daggubati film goes on the floor" (in ఇంగ్లీష్). Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.
  8. The Times of India (6 July 2021). "PSPK Rana Movie: Pawan Kalyan to resume the film shooting from July 12?" (in ఇంగ్లీష్). Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.
  9. Eenadu (2 September 2021). "Happy Birthday Pawan Kalyan: వినరా సాంబ... భీమ్లా నాయక్‌ వచ్చేశాడు..! - telugu news bheemlanayak title song out now". Archived from the original on 2 September 2021. Retrieved 2 September 2021.
  10. HMTV (21 February 2022). "భీమ్లా నాయక్‌ ట్రైలర్‌ వచ్చేసింది". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
  11. TeluguTV9 Telugu (23 February 2022). "ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించిన భీమ్లానాయక్ప్రీరిలీజ్ ఈవెంట్". Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  12. "Bheemla Nayak Closing Collections Worldwide" (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-04-06. Retrieved 2022-04-05.[permanent dead link]
  13. Eenadu (23 February 2022). "అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ Vs భీమ్లా నాయక్‌.. ఎవరు ఏ పాత్రలు చేశారంటే?". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
  14. Namasthe Telangana (20 September 2021). "డేనియల్‌ శేఖర్‌ ఆగయా". Archived from the original on 21 September 2021. Retrieved 21 September 2021.
  15. TV9 Telugu (29 July 2021). "Rana Daggubati: ఆయనకు ఉన్న గొప్ప లక్షణం అదే.. పవన్ పై రానా ఇంట్రస్టింగ్ కామెంట్స్". Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  16. Andhra Jyothy (3 October 2021). "రానా జోడీగా సంయుక్త మీనన్ ఖాయం". Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.
  17. 10TV (8 December 2021). "భీమ్లాలో బ్రహ్మానందం." (in telugu). Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  18. TV5 News (25 February 2022). "భీమ్లా నాయక్ లో పవన్ పక్కన నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా!!" (in ఇంగ్లీష్). Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  19. Namasthe Telangana (28 February 2022). "పవన్‌ మాటలు బాధ్యత పెంచాయి". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
  20. The Times of India (15 July 2021). "Ravi K Chandran to replace Prasad Murella as the cinematographer of 'PSPK Rana Movie'? - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 16 August 2021. Retrieved 16 August 2021.
  21. Andrajyothy (13 November 2021). "'భీమ్లా నాయక్‌': సినిమాటోగ్రాఫర్‌కు పవన్ అభినందనలు". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
  22. Entertainments, Sithara (21 February 2022). "Bheemla Nayak Official Trailer". youtube.com. Retrieved 24 February 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  23. DN, Sindujaa (24 February 2022). "Bheemla Nayak's Second Trailer: Repair Well Done!!". indiaherald.com. Retrieved 24 February 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  24. Entertainments, Sithara (23 February 2022). "#BheemlaNayak Release Trailer | Pawan Kalyan, Rana Daggubati | Trivikram | SaagarKChandra | ThamanS". youtube.com. Retrieved 24 February 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  25. .com, Mirchi9 (23 February 2022). "Trailer Talk 2: Hits It Out Of The Park". mirchi9.com. Retrieved 24 February 2022.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: url-status (link)
  26. Chanti, Rajitha (23 February 2022). "Bheemla Nayak New Trailer: భీమ్లా నాయక్ కొత్త ట్రైలర్ రిలీజ్.. ఫ్యాన్స్‏కు ఇక పూనకాలే." tv9telugu.com. Retrieved 24 February 2022.