రెడ్ (2021 సినిమా)
రెడ్ 2021లో తెలుగులో విడుదలైన సినిమా. తమిళంలో 2019లో విడుదలైన ‘తడమ్’ సినిమా ఆధారంగా శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై తెలుగులో 'రెడ్' పేరుతో స్రవంతి రవికిశోర్ నిర్మించిన ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. రామ్, నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 14న విడుదలైంది.[1]
రెడ్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | కిషోర్ తిరుమల |
దృశ్య రచయిత | కిషోర్ తిరుమల |
ఆధారం | తమిళ సినిమా ‘తడమ్’ |
నిర్మాత | స్రవంతి రవి కిషోర్ |
తారాగణం | రామ్ నివేదా పేతురాజ్ మాళవికా శర్మ అమృత అయ్యర్ |
ఛాయాగ్రహణం | సమీర్ రెడ్డి |
కూర్పు | జునైద్ సిద్ధిఖ్ |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 2021 జనవరి 14 |
సినిమా నిడివి | 146 నిమిషాలు |
దేశం | ![]() |
భాష | తెలుగు |
కథసవరించు
సిద్ధార్థ (రామ్) ఇంజినీరింగ్ పూర్తిచేసి సొంతంగా కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టుకొని వర్క్ చేస్తుంటాడు. మహిమ (మాళవికా శర్మ)ను ప్రేమించి పెళ్ళాడాలని అనుకుంటాడు. ఆదిత్య (రామ్ ద్విపాత్రాభినయం), అతని స్నేహితుడు వేమ (సత్య)తో కలిసి మోసాలకి పాల్పడుతుంటాడు. వేమ తన అప్పుల్ని తీర్చడం కోసమని దాచుకున్న రూ.8 లక్షల మొత్తాన్ని ఆదిత్య పేకాటలో పోగొడతాడు. ఆ తర్వాత ఆ డబ్బు ఎలా సర్దాలో తెలియక సతమతమవుతాడు. వాళ్ళు డబ్బు కోసం ఇబ్బందిపడుతున్నసమయంలో ఆదిత్యకు, గాయత్రి (అమృతా అయ్యర్) ఎదురవుతుంది. ఈ క్రమంలో బీచ్ రోడ్డులో ఓ హత్య జరుగుతుంది. ఈ హత్య చేసిందెవరు? పరిశోధనలో ఎలాంటి నిజాలు తెలిశాయి ? అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులుసవరించు
- రామ్
- నివేదా పేతురాజ్
- మాళవికా శర్మ
- అమృత అయ్యర్
- సంపత్ రాజ్
- నాజర్
- సత్య
- హెబ్బా పటేల్ - 'డింఛక్' గీతంతో
- సోనియా అగర్వాల్
- పవిత్ర లోకేష్
- రవిప్రకాష్
సాంకేతిక నిపుణులుసవరించు
- బ్యానర్: శ్రీ స్రవంతి మూవీస్
- నిర్మాత: స్రవంతి రవికిశోర్
- కథ: మాగిజ్ తిరుమేని
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిషోర్ తిరుమల
- సంగీతం: మణిశర్మ
- సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
- ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖ్
పాటలుసవరించు
No. | Title | Lyrics | గాయకులు | Length |
---|---|---|---|---|
1. | "నువ్వే నువ్వే" | రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి | 4:12 | |
2. | "డించక్ డించక్ [3]" | సాకేత్ కొమండూరి, కీర్తన శర్మ | 5:20 | |
3. | "కౌన్ అచ్చా కౌన్ లుచ్చా" | అనురాగ్ కులకర్ణి | 4:23 | |
4. | "మౌనంగా ఉన్న" | దినకర్, నూతన మోహన్ | 4:27 | |
Total length: | 18:20 |
మూలాలుసవరించు
- ↑ Zee News Telugu (25 October 2020). "సంక్రాంతి బరిలోనే రామ్ సినిమా". Archived from the original on 10 November 2021. Retrieved 10 November 2021.
- ↑ TV9 Telugu (14 January 2021). "మూవీ రివ్యూ: 'థ్రిల్'ను పెంచే 'రెడ్' మూవీ.. ఉస్తాద్ 'రామ్' డబుల్ యాక్షన్ అదుర్స్." Archived from the original on 10 November 2021. Retrieved 10 November 2021.
- ↑ Zee News Telugu (15 May 2020). "హెబ్బా పటేల్‌తో రామ్ 'డించక్ డించక్' మసాలా సాంగ్". Archived from the original on 10 November 2021. Retrieved 10 November 2021.