లంకలకోడేరు

ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా గ్రామం

లంకలకోడేరు, పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన పాలకొల్లు నుండి 5 కి. మీ. దూరంలో పాలకొల్లు, భీమవరం ప్రధానరహదారిపై పాలకొల్లుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. సీతామాలక్ష్మి సినిమా హీరోయిన్ తాళ్ళూరి రామేశ్వరి తల్లితండ్రుల స్వస్థలం. ఈ గ్రామం వెలివెలి, భగ్గేశ్వరం, దగ్గులూరు, అరట్లకట్ట, కాపవరం, వెంకటాపురం లాంటి దాదాపు ఇరవై గ్రామాలకు కూడలి. లంకలకోడేరు సయ్యపరాజు వెంకట గోపాలకృష్ణంరాజు (వస్తాదు రాజు) స్వస్తలం.లంకలకోడేరు వస్తాదు (ఉస్తాద్) సోదరులు

లంకలకోడేరు
—  రెవిన్యూ గ్రామం  —
లంకలకోడేరు is located in Andhra Pradesh
లంకలకోడేరు
లంకలకోడేరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°31′32″N 81°41′01″E / 16.525658°N 81.683514°E / 16.525658; 81.683514
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం పాలకొల్లు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,759
 - పురుషులు 3,344
 - స్త్రీలు 3,415
 - గృహాల సంఖ్య 1,979
పిన్ కోడ్ 534250
ఎస్.టి.డి కోడ్

1. శ్రీ సయ్యపరాజు వెంకటగోపాలకృష్ణమరాజుగారు

జననము : 1890; నిర్యాణము : 1976.

తల్లి : జిన్నూరు కోసూరి బంగారరాజుగారి కుమార్తె సీతయ్యమ్మగారు; తండ్రి : అచ్యుత రామరాజుగారు.

ఎత్తు : 6 అడుగుల 3 అంగుళములు; బరువు 360 పౌన్లు. విద్యాభ్యాసము 4వ తరగతి వరకు లంకలకోడేరులో.

వీరు 13వ సంవత్సరమునుండి మొగల్తూరులో సాము నేర్చుకొని అసమానమైన ప్రజ్ఞను సంపాదించిరి. 15వ యేటనుండి ఏలూరులో పిన్నంరాజు వెంకట రమణయ్యగారి తాలిమ్ ఖానాలో కుస్తీ నేర్చుకొనుట ప్రారంభించిరి. పాపోలు వీర వెంకయ్యగారి తాలిమ్ ఖానాలోకూడ నేర్చుకొనిరి. అనేక ప్రాంతములనుండి వచ్చిన కుస్తీ వీరులను ఓడించిరి. 1919 వ సం॥లో కాశీ వెళ్ళి తులసీఘాట్లో నుండెడి స్వామినాధ్ గారి తాలిమ్ ఖానాలో 6 మాసములు సుశ్రూష చేసిరి. కాశీలో కుస్తీ పట్లలో ఏకైక వీరుడుగా ఖ్యాతి గాంచి తిరిగి వచ్చిరి. వస్తాదు వెంకట్రాజుగారు (వాడుక నామము) 6 కుస్తీలు పొట్లాడి జయించిరి. వీరిచే ఓడింపబడినవారిలో ముఖ్యులు : 1. పంజాబ్ పహిల్వాన్ పత్తేదిన్ (లంకలకోడేరులో) ; పంజాబ్ పహిల్వాన్ (మహరాష్ట్ర ఛాంపియన్) ఖలీఫా (డెంకాడలో) ; 3. అంబాజీపేట వస్తాదు ధనరాజు (నర్సాపురంలో) ; 4 బందరు - కూర్మయ్య (భీమవరంలో). శ్రీ వస్తాదురాజుగారి బలప్రదర్శనవిశేషములు : ఇనుప గొలుసులు త్రెంపుట, గడ్డపారలు వంచుట, మూడు గునపములను జడవేయుట, చిన్నకారును ఆపుట, నువ్వులను పిండి నూనె తీయుట, మూడు వేళ్ళతో వెండి రూపాయలను వంచుట, నాలుగు గుళ్ళ ఎత్తు బియ్యపు బస్తాను పళ్ళతో పట్టి ఎత్తి గిరగిరా తిప్పుట మున్నగునవి. 1930 సం॥న మదరాసులో జరిగిన వ్యాయామ విద్యా ప్రదర్శనములో కుస్తీ విద్య, బలము, 70 పౌనుల కరేలా తిప్పుట, యోగాసనములు ఈ నాలుగు విద్యలలోనూ వస్తాదురాజుగారే ప్రథమ బహుమతులు బడసిరి. వీరు చింతపఱ్ఱు, జిన్నూరు, కోటపల్లి, మోగల్లు, గరగపఱ్ఱు, కేశవరం, విస్సాకోడేరు, గొరగనమూడి, ర్యాలి, పోడూరు మెదలగు గ్రామములలో తాలిమ్ ఖానాలు స్థాపించి, విద్యనేర్పుటకు ఆయా గ్రామములు వెళ్ళుచుండెడివారు.

వస్తాదురాజుగారు 1921 సం॥లో మహాత్మాగాంధీ బెజవాడ వచ్చినపుడు గాంధీకి అంగరక్షకుడుగా నుండి వారిని తమ భుజములపై నిడుకొని తీసికెళ్ళిరి. 1923 సం॥లో మొదటి కాకినాడ కాంగ్రెసు అధ్యక్షుడు మహమ్మద్ ఆలీకి అంగరక్షకుడుగా నుండిరి. 1926లో గాంధీజీ ఆంధ్రదేశ పర్యటనలో నెల్లూరు నుండి విశాఖ వఱకు 6 జిల్లాల పర్యటనలో వారికి అంగరక్షకుడుగ నుండిరి. 1934-35లో మహాత్ముడు హరిజనోద్ధరణకై వచ్చినపుడు కూడా వారికి అంగరక్షకుడు వస్తాదురాజు గారే., రాజుగారు 1947 సం॥లో జయపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు పట్టాభిగారి గోల్కొండ కాంగ్రెస్ అధ్యక్షుడు నెహ్రూగారికిని అంగరక్షకుడు, ఇందిరాగాంధీకి తెలంగాణా వరంగల్ జిల్లా పర్యటనలో అంగరక్షకుడు. లాల్ బహదూర్ శాస్త్రి గారు గుంటూరు వచ్చినపుడు వారికి అంగరక్షకుడు., లాలా లజపతిరాయ్, డాక్టర్ రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి నారాకృష్ణన్, రాజగోపాలాచారి, మురళీ మోహన్ మాలవ్యా, మోతీలాల్ నెహ్రూ, సుభాస్ చంద్రబోస్, వల్లభాయిపటేల్, వి.వి.గిరి మున్నగు ప్రముఖులకు బాడీ గార్డుగా నుండి సేవ చేసిరి. దేశభక్తుడైన వస్త్రాదురాజుగారు పన్నుల నిరాకరణోద్యమ సందర్భమున బులుసు సాంబమూర్తి, కొండా వెంకటప్పయ్యగార్లతో జైలుకువెళ్ళి కష్టములనుభవించిరి. వీరు తామ్రపత్రమును బడసిరి. స్వాతంత్ర్య సమరయోధుడుగా నెల 1కి రూ 200/-లు పెన్షన్ గైకొనిరి.

శ్రీ వస్తాదురాజుగారు విద్యాపోషకుడు, దాత, దైవభక్తి పరాయణుడు, హైస్కూల్ స్థాపనకై రూ 20,000/లు విలువగల భూమి దానం చేశారు. రామకృష్ణ పరమహంస గ్రంథాలయమునకు 35 వేల రూపాయలు గ్రామస్థులనుండి వసూలు చేసిరి. తమ స్వంత ద్రవ్యము 8వేల రూపాయలు వెచ్చించిరి. బ్యాంకు భవన నిర్మాణమునకు రూ.20,000/లు కిమ్మత్తు గల దొడ్డిని దానం చేశారు. వీరి తాతయ్యగారైన తిరుపతిరాజుగారు కటించిన విశ్వేశ్వరాలయమును వీరు పునరుద్ధరించిరి. గ్రామస్థులనుండి చందాలు వసూలు చేసియు, వీరి స్వంతద్రవ్యము కొంత ఖర్చు పెట్టియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాలయమును, పార్వతీదేవి ఆలయమును, హనుమంతుని ఆలయమును కట్టించిరి. శ్రీ వస్తాదురాజు గారు దశావతారములు, భక్త జయదేవు, కిరాతార్జున, చెంచులక్ష్మి, భేతాళలోకం (అరవం) చిత్రాలలో నటించి మెప్పగాంచిరి. శ్రీ సయ్యపరాజ వేంకట గోపాలకృష్ణమరాజుగారు భీమబలుడు; వజ్రకాయుడు; కుస్తీలవీరుడు; ఆంధ్రక్షత్రియ కులమునకు వన్నె తెచ్చిన రాచబిడ్డ.

ఉ॥ మించి పరాక్రమించి మనమే మొనగాండ్ర మటంచు కండలన్ బెంచిన వీరమల్లు రగుపించినచో కరచాలనంబుగా వించినరీతి హస్తములు వేగ గ్రహించియు రక్త ధార గార్పించిన నెందరీవరకు భీతిలుచున్ బిరుదుల్ మెడల్సు ల ర్పించి సలామొనర్చుచును వెన్కకు మళ్ళిరొ లెక్కియున్నదే !

— కవిరాజు తోటకూర సూర్యనారాయణ రాజు

2. శ్రీ సయ్యపరాజు రామగోపాలకృష్ణమరాజుగారు (జననము: 1892)

వీరు వస్తాదు వేంకటగోపాలకృష్ణమరాజుగారి అనుజుడు. వీరుకూడ మిక్కిలి బలశాలి. ఇనుపగొలుసులు తెంపేవారు. కుస్తీలలో ఆరితేరినవారు. అన్నగారికి 'అదితి' (అభ్యాసము) ఇచ్చేవారు. ఒక పంజాబ్ పహిల్వాన్ ను వీరు కుస్తీలో జయించారు. వెంకటగోపాలకృష్ణమ రాజుగారు, రామగోపాలకృష్ణమరాజుగారూ 'వస్తాదు సోదరులు' అను బిరుదములో రాణకెక్కిరి. 'దశావతారములు' చిత్రములో అన్నగారితో పాటు వీరుకూడా నటించారు. 1921 సం॥లో వాడపల్లిలో గాంధీగారి ఫోటో పెట్టుటకు ప్రభుత్వం అభ్యంతర పరచిన సందర్భమున జరిగిన పోట్లాటలో పాల్గొన్నందులకు వీరు రాజమండ్రి జైలులో 3 మాసములు కఠినశిక్ష అనుభవించారు.

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7154. ఇందులో పురుషుల సంఖ్య 3597, మహిళల సంఖ్య 3557, గ్రామంలో నివాస గృహాలు 1892 ఉన్నాయి.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1979 ఇళ్లతో, 6759 జనాభాతో 1121 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3344, ఆడవారి సంఖ్య 3415. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2419 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 26. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588777[1]

దేవాలయాలు

మార్చు
  • గ్రామకూడలిలో శివాలయం బహుప్రసిద్ధం. అందులోనే సబ్రమణ్వేశ్వర ఆలయం ఉంది. సుబ్రహ్మణ్యషష్ఠి ఉత్సవాలను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు.
  • గ్రామకూడలిలో వీరమ్మ పేరంటాలు వారి ఆలయం కూడా ఉంది . ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో వారం రోజులు ఉత్సవాలు నిర్వహిస్తారు.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

మార్చు

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. రైల్వే స్టేషన్ ఉంది. ట్రాక్టరు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

రైలు వసతి

మార్చు
 
లంకలకోడేరు రైల్వే స్టేషన్ సైన్ బోర్టు చిత్రం

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల పాలకొల్లు లోను, ఇంజనీరింగ్ కళాశాల, మేనేజిమెంటు కళాశాల, భీమవరం లోనూ ఉన్నాయి. పాలీటెక్నిక్‌ వీరవాసరం లోను, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఎస్.చిక్కాలలోను, అనియత విద్యా కేంద్రం పాలకొల్లులోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల, ఏలూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

లంకలకోడేరులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ, పశు వైద్యశాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో 3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఉంది. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

లంకలకోడేరులో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 9 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

లంకలకోడేరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 188 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 932 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 932 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

లంకలకోడేరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 932 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

లంకలకోడేరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

వరి, కొబ్బరి, చేపల పెంపకం

పారిశ్రామిక ఉత్పత్తులు

మార్చు

బియ్యం

చేతివృత్తులవారి ఉత్పత్తులు

మార్చు

లేసులు

మూలాలు

మార్చు
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

మార్చు