లక్ష్మీభూపాల్

(లక్ష్మి భూపాల నుండి దారిమార్పు చెందింది)

లక్ష్మీభూపాల్ (యతిరాజు భూపాల్) తెలుగు సినిమా సంభాషణ రచయిత, గీత రచయిత. చందమామ, అలా మొదలైంది, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు సహా 50కి పైగా సినిమాలకు సంభాషణల రచయితగా, అనేక పాటలకు గీతకర్తగా పనిచేశాడు.

లక్ష్మీభూపాల్
జననంయతిరాజు భూపాల్
15 సెప్టెంబర్ 1975
ఏలూరు
నివాస ప్రాంతంహైదరాబాద్
ఇతర పేర్లుయతిరాజ్ లక్కీ భూపాల్, యతిరాజు
వృత్తితెలుగు సినిమా సంభాషణ రచయిత
తండ్రిపెద్దిరాజు
తల్లికనకలక్ష్మి

2005లో సంభవామి యుగే యుగే సినిమా సంభాషణల రచయితగా తన కెరీర్ ప్రారంభించిన లక్ష్మీభూపాల్, చందమామ (2007), అలా మొదలైంది (2011), కళ్యాణ వైభోగమే (2016), నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలకు సంభాషణల రచన చేసి పేరొందారు. 50కి పైగా సినిమాలకు సంభాషణల రచయితగా పేరొందారు.

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

లక్ష్మీభూపాల్ అసలు పేరు యతిరాజ్, ఆయన ఇంటిపేరు భూపాల్. ఆయన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందినవాడు. ఆయన తల్లిదండ్రులు పెద్దిరాజు, కనకలక్ష్మి. తండ్రి ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేసేవారు. లక్ష్మీభూపాల్ తండ్రి ఆయన ఇంటరులో ఉండగా తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు మీదపడ్డాయి.[1]

తొలినాళ్ళు

మార్చు

చిరుద్యోగాలు

మార్చు

చిన్నప్పటి నుంచీ బొమ్మలు వేయడం ఆసక్తి ఉండడంతో ఏదోక పనిచేసి సంపాదించాల్సిన ఆ దశలో హోర్డింగులు, బ్యానర్లు, సైన్ బోర్డులకు పెయింటింగులు వేసే పనిచేపట్టాడు. ఆ తర్వాత ఏ.పి.యస్.ఆర్.టి.సిలో తండ్రి మరణించే సమయానికి ఉద్యోగంలో ఉండడంతో ఆర్టీసీలో లక్ష్మీభూపాల్ కి మెకానిక్ గా ఉద్యోగం దొరికింది. కానీ ఆ ఉద్యోగం తనకి సరిపడదని, అందులో సంతృప్తి లభించదని అర్థం చేసుకుని చేరిన మూడు సంవత్సరాలకే ఉద్యోగాన్ని వదిలేశాడు. [1]

క్రియేటివ్ రంగంలోకి

మార్చు

సిటీకేబుల్లో ఉద్యోగంలో చేరాడు. జెమినీ, ఈటీవీల్లో ప్రోగ్రాములు డిజైన్ చేసే జీకే అనే మిత్రునికి సహాయకునిగా హైదరాబాద్ వచ్చేశాడు. అదే కాలంలో కె. రాఘవేంద్రరరావు విజన్ 2020 కోసం నిర్మించిన ప్రకటనల టీంలలో ఒకదానిలో పనిచేశాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కోసం కూడా ప్రకటన రూపొందించారు. ఇలా నిలదొక్కుకున్న దశలోనే ఏలూరు వెళ్ళి నాలుగు సంవత్సరాల పాటు అక్కడే ఉండాల్సివచ్చింది.[1]

సినీ రంగం

మార్చు

నాలుగేళ్ళ తర్వాత హైదరాబాద్ వచ్చాకా కూడా జీకే తన వద్ద ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇవ్వడంతో తిరిగి క్రియేటివ్ రంగంలోకి అడుగుపెట్టాడు. ఈ దశలో నటుడు లక్ష్మీపతి సినిమాలకు రచయితగా ప్రయత్నించమని సూచిస్తూ దర్శకుడు రవిబాబుకు పరిచయం చేశాడు. రవిబాబు అప్పుడు తను తీస్తున్న సోగ్గాడు సినిమాకు రచనా బృందంలోకి లక్ష్మీభూపాల్ ను తీసుకున్నాడు. సంభవామి యుగే యుగే సినిమాకు రచయితగా పనిచేయగా, తొలిసారి క్రెడిట్స్ ఇచ్చారు. ఈ దశలో సినిమాలతో పాటుగా ఎఫ్.ఎం.రేడియోలో స్క్రిప్టులకు రచయితగా పనిచేశారు. ఎఫ్.ఎం.లో ‘మేనేజర్‌ మాణిక్యం’, ‘బేబీ మమ్మీ’, ‘చంటీ బంటీ’ వంటి కార్యక్రమాలకు ఆయన రాసిన స్క్రిప్టులు బాగా పేరుతీసుకువచ్చాయి.

ఎఫ్.ఎం. కార్యక్రమాల రచయితగా అతని ప్రతిభను గుర్తించిన ఉత్తేజ్ లక్ష్మీభూపాల్ ను కృష్ణవంశీకి పరిచయం చేశారు. లక్ష్మీభూపాల్ ప్రతిభ, శైలి నచ్చి ఆయనను చందమామ సినిమాకి రచయితగా తీసుకున్నారు. తొలినాళ్ళలో ఆయన తన స్వంతపేరైన యతిరాజు, ఇంటిపేరైన భూపాల్, అమ్మ పేరును స్ఫురిస్తూ లక్కీతో కలిపి యతిరాజ్ లక్కీ భూపాల్ అన్న స్క్రీన్ నేమ్ ఉపయోగించేవారు. ఈ సినిమాకే ఆయన పేరును కృష్ణవంశీ లక్ష్మీభూపాల్ గా మార్చారు. ఆ సినిమాలు లక్ష్మీభూపాల్ మాటలు చాలా పేరుతీసుకువచ్చాయి. అలా మొదలైంది, కళ్యాణ వైభోగమే వంటి సినిమాలకు చేసిన రచన కూడా ప్రశంసలు, గుర్తింపు తీసుకువచ్చింది. తేజ దర్శకత్వంలో, రానా కథానాయకుడిగా నిర్మితమైన నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రాసిన రాజకీయ వ్యంగ్యాస్త్రాల సంభాషణలు ఆయనను సినిమా పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ సుప్రఖ్యాతుణ్ణి చేశాయి.[2]

సినీ గీత రచయితగా ‘జజ్జనక జజ్జనక’ (మహాత్మ), ఏదో అనుకుంటే (అలా మొదలైంది), ‘నువ్‌నా తెల్ల పిల్ల బుజ్జిపిల్లా’ (పోటుగాడు), ఏజన్మ బంధమో (కళ్యాణ వైభోగమే) మొదలైన పాటలు రాశారు. మా ముగ్గురి లవ్ స్టోరీ (2017-) అనే వెబ్ సీరీస్ కి సంభాషణలు అందిస్తున్నారు.[1]

సినిమాల జాబితా

మార్చు
  • సోగ్గాడు – 2005 మార్చి 31
  • సంభవామి యుగే యుగే – 2006 మార్చి 10
  • సీతారాముడు – 2006 సెప్టెంబరు 1.
  • చక్రి – 2006 నవంబరు 20.
  • అమృత వర్షం – 2006.
  • భూకైలాస్ – 2007 మే 25.
  • చందమామ – 2007 జూన్ 19 (అమెజాన్ ప్రైమ్ వీడియో) //ఈ చిత్రం నుండి అతని పేరును క్రియేటివ్ డైరెక్టర్ “కృష్ణవంశీ” గారు “లక్ష్మీభూపాల”గా మార్చారు. ఆయన ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాటను రాశారు & ఇది 'లక్ష్మీ భూపాల'లోని మొదటి పాట.//
  • బలాదూర్ - 2008 ఆగస్టు 24.
  • శశిరేఖా పరిణయం – 2009 జనవరి 1 (అమెజాన్ ప్రైమ్ వీడియో).
  • బోణి – 2009.
  • కలవరమాయే మదిలో – 2009 జూలై 17.
  • జల్లు - 2009 జూలై 29.
  • మహాత్మా – 2009 అక్టోబరు 2 (అమెజాన్ ప్రైమ్ వీడియో).
  • నిన్ను కలిశాక – 2009 అక్టోబరు 2 //ఈ సినిమాలో ఆయన 6 పాటలు రాశారు.//
  • మరోచరిత్ర – 2010 మార్చి 25 (అమెజాన్ ప్రైమ్ వీడియో).
  • అలా మొదలైంది – 2010 ఫిబ్రవరి 6 (అమెజాన్ ప్రైమ్ వీడియో, ZEE5)
  • Mr. నోకియా – 2012 మార్చి 8 (ZEE5).
  • ఊ కొడతారా ఉలిక్కి పడతారా - 2012 జూలై 27
  • అందాల రాక్షసి – 2012 ఆగస్టు 10 (Netflix, అమెజాన్ ప్రైమ్ వీడియో)
  • బ్యాక్ బెంచ్ స్టూడెంట్ – 2013 మార్చి 15 // ఈ సినిమాలో ఆయన 3 పాటలు రాశారు.//
  • ప్రతిఘటన – 2014 ఏప్రిల్ 18
  • టెర్రర్ – 2016 ఫిబ్రవరి 26 (అమెజాన్ ప్రైమ్ వీడియో).
  • కల్యాణ వైభోగమే – 2016 మార్చి 4 (Zee5)
  • తుంటరి – 2016 మార్చి 11 //3 వారాల్లో బ్యాక్ టు బ్యాక్ 3 హిట్స్.//
  • ద్వారక – 2017 మార్చి 3 (అమెజాన్ ప్రైమ్ వీడియో, MX Player).
  • నేనే రాజు నేనే మంత్రి – 2017 ఆగస్టు 11 (అమెజాన్ ప్రైమ్ వీడియో).
  • వినరా సోదర వీర కుమారా – 2019 మార్చి 15 (అమెజాన్ ప్రైమ్ వీడియో).
  • సీత - 2019 మే 24 (అమెజాన్ ప్రైమ్ వీడియో).
  • ఓ బేబీ - 2019 జూలై 5 (Netflix).
  • అద్భుతం - 19 Nov 2021 (Disney Hotstar)
  • గుర్తుందా శీతాకాలం - 2022 డిసెంబరు 9 (అమెజాన్ ప్రైమ్ వీడియో).
  • శేఖర్ - 2022 మే 20

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "రవిబాబుని తిట్టేద్దామనుకున్నా!". Archived from the original on 2018-02-01. Retrieved 2018-02-01.
  2. "నేనే రాజు నేనే మంత్రి మూవీ రివ్యూ". 2017-08-11. Archived from the original on 2017-10-13. Retrieved 2018-02-01.