లక్ష్మీనగర్ కాలనీ (మెహదీపట్నం)

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఒక గేటెడ్ కమ్యూనిటీ.

లక్ష్మీనగర్ కాలనీ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఒక గేటెడ్ కమ్యూనిటీ. హైదరాబాద్ నుండి బెంగుళూరుకు వెళ్ళే రింగ్ రోడ్‌లో మెహదీపట్నం సమీపంలోని గుడిమల్కాపూర్ క్రాస్‌రోడ్‌కు దగ్గరలో ఉంది. ఈ కాలనీలో 30–40 ఇండిపెండెంట్ బంగ్లాలు ఉన్నాయి. ఇక్కడికి పశ్చిమాన సరిహద్దులో పెద్ద భారతీయ సైనిక స్థావరం ఉంది.

లక్ష్మీనగర్ కాలనీ
సమీపప్రాంతం
లక్ష్మీనగర్ కాలనీ is located in Telangana
లక్ష్మీనగర్ కాలనీ
లక్ష్మీనగర్ కాలనీ
తెలంగాణలో ప్రాంతం
లక్ష్మీనగర్ కాలనీ is located in India
లక్ష్మీనగర్ కాలనీ
లక్ష్మీనగర్ కాలనీ
లక్ష్మీనగర్ కాలనీ (India)
Coordinates: 17°23′13″N 78°25′44″E / 17.387081°N 78.428843°E / 17.387081; 78.428843
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
500 028
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు
శాసనసభ నియోజకవర్గంకార్వాన్
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

సమీప ప్రాంతాలు మార్చు

ఇక్కడికి సమీపంలో వెంకటరావు నగర్, సప్తగిరి కాలనీ, ప్రకాష్ నగర్, సాయిబాబా నగర్ కాలనీ ఫేజ్-1, రామారావు నగర్ కాలనీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[1]

వాణిజ్య ప్రాంతం మార్చు

మెహదీపట్నం, గుడిమల్కాపూర్‌కు సమీపంలో ఉన్నందున ఈ ప్రాంతంలో అనేక దుకాణాలు ఉన్నాయి. ఇక్కడినుండి నానల్‌నగర్‌కు రోడ్డుమార్గం కూడా ఉంది.

ప్రార్థనా మందిరాలు మార్చు

  • అయ్యప్పస్వామి దేవాలయం
  • దుర్గ దేవాలయం
  • షిర్డీ సాయిబాబా దేవాలయం
  • యునాని మసీదు
  • మస్జిద్-ఎ-గౌసియా

విద్యాసంస్థలు మార్చు

  • శ్రీ చైతన్య మెడికల్ అకాడమీ
  • సెయింట్ అల్ఫోనాస్ హైస్కూల్
  • నేతాజీ ఉన్నత పాఠశాల

రవాణా మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రాంతం మీదుగా ఆల్విన్ కాలనీ, సికింద్రాబాద్, జగద్గిరిగుట్ట, ఇసిఐఎల్, లింగంపల్లి, భెల్, మెహదీపట్నం మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[2]

బ్యాడ్మింటన్‌ కోర్టు మార్చు

లక్ష్మీనగర్‌లో ఏర్పాటుచేసిన బ్యాడ్మింటన్‌ కోర్టును 2022 ఫిబ్రవరి 20న జూబ్లీహిల్స్​‍ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ ప్రారంభించాడు.[3]

మూలాలు మార్చు

  1. "Laxminagar Colony Locality". www.onefivenine.com. Archived from the original on 2017-08-25. Retrieved 2022-10-14.
  2. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-10-14.
  3. telugu, NT News (2022-02-20). "Badminton court | షేక్‌పేట్‌ లక్ష్మీనగర్‌ కాలనీలో బ్యాడ్మింటన్‌ కోర్టు ప్రారంభం". Namasthe Telangana. Archived from the original on 2022-10-14. Retrieved 2022-10-14.