వద్దిపర్తి పద్మాకర్

వద్దిపర్తి పద్మాకర్ పేరుపొందిన అవధాని, ఆధ్యాత్మిక ప్రవచనకారుడు.[1]

వద్దిపర్తి పద్మాకర్.jpg

జీవిత విశేషాలుసవరించు

వద్దిపర్తి పద్మాకర్ 1966, జనవరి 1న పశ్చిమ గోదావరి జిల్లా, జోగన్నపాలెంలో వద్దిపర్తి చలపతిరావు, శేషమణి దంపతులకు జన్మించాడు[2]. తెలుగు, సంస్కృత భాషలలో ఎం.ఎ. చేశాడు. హిందీ భాషలో సాహిత్యరత్న పట్టాను పొందారు. బి.యిడి శిక్షణ పూర్తి చేసిన తర్వాత ఏలూరులోని సి.ఆర్.రెడ్డి (కట్టమంచి రామలింగారెడ్డి) కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా చేరి 1993 నుండి 2004 వరకు పనిచేశారు.

అవధానాలుసవరించు

ఈయన 1225కి పైగా అష్టావధానాలను, 11 శతావధానాలను, 1 త్రిభాషా సహస్రావధానం చేశారు. కొండపి మురళీకృష్ణతో కలిసి జంటగా కొన్ని అవధానాలను నిర్వహించారు. 756 పద్యాలను ఏకబిగిన 207 నిమిషాలలో ధారణ చేసిన ప్రతిభాశాలి.

ఇంతేకాక ఈయన 90 నిమిషాలలో 180పద్యాలను ఆశువుగా చెప్పగలిగిన కవి. ఏలూరు, విశాఖపట్నం, తాడేపల్లిగూడెం, చల్లపల్లి, గుంటూరు, రాజమండ్రి, నరసరావుపేట, హైదరాబాదు, సికిందరాబాదులతో పాటు సింగపూరు, అమెరికా వంటి దేశాలలో కూడా ఇతడు అవధానాలను చేశారు. ఆగ్రాలోని హిందీ డైరెక్టరేట్‌లో హిందీలో అవధానం చేసి మెప్పించారు.

సాహిత్యరూపకాలుసవరించు

ఇతడు వందలాది సాహిత్యరూపకాలలో పాల్గొన్నారు. భువనవిజయంలో తెనాలి రామకృష్ణుడు, అవధాని విజయంలో చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, సుధర్మసభలో నారదుడు వంటి పాత్రలకు వద్దిపర్తి పద్మాకర్ ప్రసిద్ధుడు.

ఆధ్యాత్మికరంగంసవరించు

వద్దిపర్తి పద్మాకర్ ప్రణవపీఠం స్థాపించి అనేకమంది శిష్యులకు మంత్రోపదేశం చేశారు. భారత, భాగవత, రామాయణాదులే కాక అష్టాదశ పురణాల గురించి అనర్గళంగా ఉపన్యసించగలరు. ఆంధ్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలోను, నైమిశారణ్యం, శుకస్థల్, బృందావనం, వింధ్యాచలం మొదలైన పుణ్యక్షేత్రాలలోను, సింగపూర్, అమెరికా, దుబాయ్ వంటి దేశాలలోను దేవీభాగవత ప్రవచనాలు, అష్టాదశ పురాణప్రవచనాలు, లలితాసహస్రనామ భాష్యాలు, భాగవత సప్తాహాలు నిర్వహించారు.

రచనలుసవరించు

 1. శ్రీనీలకంఠేశ్వర వైభవము
 2. కలకింకిణులు
 3. శ్రీ సత్యసాయి సప్తశతి
 4. హనుమన్మహిమ
 5. మానవకథ
 6. ఐశ్వర్యయోగం [3]

సత్కారాలు,పురస్కారాలుసవరించు

 1. శ్రీ నన్నయ భట్టారక పీఠంవారి సాహిత్యపురస్కారం
 2. ఆంధ్రసారస్వత సమితి మచిలీపట్నం వారి ఉగాది పురస్కారం
 3. పల్లకీ ఊరేగింపు, రథారోహణ, సువర్ణకంకణ ధారణ, గజారోహణ, పౌరసన్మానాలు
 4. ఏలూరు గండపెండేర సత్కారం [1]
 5. సత్యసాయిబాబా, గణపతి సచ్చిదానందస్వామి, విశ్వయోగి విశ్వంజీ, వాడేకర్ మహరాజ్ వంటి ప్రముఖ పీఠాధిపతులచే సత్కారం మొదలైనవి.

బిరుదులుసవరించు

 1. అభినవశుక
 2. ఆంధ్రమురారి
 3. ఆంధ్రభాషాభూషణ
 4. సరస్వతీపుత్ర
 5. కవిరాజశేఖర
 6. అవధానకోకిల
 7. ధారణాచిత్రగుప్త
 8. భాగవత కళ్యాణకృష్ణ
 9. పంచామృతప్రవచక
 10. సహస్రపద్మ
 11. పౌరాణిక సార్వభౌమ
 12. ధారణా వేదావధాననిధి
 13. సమర్థ సద్గురు మున్నగునవి.

మచ్చుతునకసవరించు

ఇతని పద్యకళా ప్రావీణ్యాన్ని తెలియజేసే ఒక ఉదాహరణ:

పద్యము భారతీసతికి పాదయుగంబునఁబెట్టినట్టి నై
వేద్యము శ్రోత్రతాజన వివేకము, నవ్య మనోహరమ్ముగా
చోద్యముఁగొల్పు చుండు, కవిసూరి జనాళికి, పూర్ణ భావ
సం హృద్యము, పూర్వరాడ్జన వరిష్ఠ విశిష్ఠ వరప్రసాదమున్.

మూలాలుసవరించు

 1. "Dharma Sandehalu (ధర్మ సందేహాలు) by Sri Vaddiparti Padmakar Garu". Archived from the original on 2016-03-05. Retrieved 2015-09-27.
 2. "తెలుగుపెన్నిధి జాలస్థలిలో పద్మాకర్ గారి జీవన విశేషాలు". Archived from the original on 2015-06-23. Retrieved 2015-09-25.
 3. "కినిగె లో పుస్తక వివరాలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-09-27.
 • వద్దిపర్తి పద్మాకర్ రచనలు Online stores www.Devullu.com

బాహ్య లింకులుసవరించు

ఇతర లింకులుసవరించు