వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్

తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని సుబేదారి ప్రాంతంలో ఉన్న పురాతన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల

వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని సుబేదారి ప్రాంతంలో ఉన్న పురాతన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల.[1] ఈ కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు అందించబడుతున్నాయి. దీనిని కాకతీయ విశ్వవిద్యాలయపు రెండవ ప్రాంగణం అని కూడా పిలుస్తారు.[2]

వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్
రకంఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్
స్థాపితం1927
స్థానంసుబేదారి, హన్మకొండ, తెలంగాణ, భారతదేశం
17°59′35″N 79°32′46″E / 17.993°N 79.546°E / 17.993; 79.546
కాంపస్పట్టణ
అనుబంధాలుకాకతీయ విశ్వవిద్యాలయం

చరిత్ర

మార్చు

కాలేజియేట్ ఉన్నత పాఠశాలగా ప్రారంభించబడిన ఈ కళాశాల, 1927వ సంవత్సరంలో అభివృద్ధి చేయబడింది. దీనిని 1954లో హన్మకొండ నుండి ప్రస్తుతమున్న స్థానానికి మార్చారు. 1959లో ఉస్మానియా విశ్వవిద్యాలయం కళాశాలగా అప్‌గ్రేడ్ చేయబడింది. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఫ్యాకల్టీలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోంది. కాకతీయ విశ్వవిద్యాలయం స్థాపించబడిన తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1976, ఆగస్టు 19న కాకతీయ విశ్వవిద్యాలయానికి బదిలీ చేయబడింది. 1995లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు కూడా చేర్చబడ్డాయి.

ప్రాంగణం

మార్చు

వరంగల్ లోని 163వ జాతీయ రహదారిలో ఈ కళాశాల ఉంది. ఇందులో ఆంగ్ల భాషా ప్రయోగశాల, లైబ్రరీ రీడింగ్ హాల్‌లు, ఇంటర్నెట్ సదుపాయం, ఎయిర్ కండిషన్డ్ సెమినార్ హాల్, కంప్యూటర్ ల్యాబ్‌లు, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ లాబొరేటరీలతోపాటు ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ వంటి ల్యాబ్‌లు కూడా ఉన్నాయి. 70 సంవత్సరాల పూర్వం నిర్మించిన ఆడిటోరియం, యాంఫిథియేటర్, హెల్త్ సెంటర్, మల్టీ-జిమ్, ఆట స్థలం మొదలైన సదుపాయాలు ఇందులో ఉన్నాయి. కళాశాల ప్రాంగణం మొత్తంలో హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉంది.

విద్యావేత్తలు

మార్చు

ఈ కళాశాలలో బయోటెక్నాలజీ, బిజినెస్ మేనేజ్‌మెంట్, కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, హిందీ, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, మైక్రోబయాలజీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, సోషల్ వర్క్, స్టాటిస్టిక్స్‌తోపాటు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వంటి 29 కోర్సులు, కోర్సు కాంబినేషన్లను ఉన్నాయి.

పూర్వ విద్యార్థులు

మార్చు

ఈ కళాశాలతో చదువుకున్న వారిలో కొందరు ప్రతిష్ఠాత్మకమైన పదవుల్లో ఉన్నారు. భారత మాజీ ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు, వైస్-ఛాన్సలర్లు, ఐఎఎస్/ఐపిఎస్ అధికారులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, వైద్యులు, ఇంజనీర్లు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు మొదలైనవారు ఉన్నారు.

పూర్వ విద్యార్థులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "PVNR centre a boost to Telangana studies: KU V-C". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-06-28. Retrieved 2021-08-25.
  2. "Kakatiya University, Warangal-506009, Telangana, India". kakatiya.ac.in. Retrieved 2021-08-25.
  3. "Former Telangana University V-C dies of cardiac arrest". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-05-12. Retrieved 2021-08-25.
  4. "Nand Kishore profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-08-25.
  5. "Full Scorecard of Delhi vs Rajasthan Group A 2015/16 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-08-25.
  6. "Kakatiya University, Warangal-506009, Telangana, India". kakatiya.ac.in. Retrieved 2021-08-25.
  7. "National Institute of Technology | Warangal". www.nitw.ac.in (in ఇంగ్లీష్). Retrieved 2021-08-25.
  8. "National Institute of Technology | Warangal". www.nitw.ac.in (in ఇంగ్లీష్). Retrieved 2021-08-25.
  9. "National Institute of Technology | Warangal". www.nitw.ac.in. Retrieved 2021-08-25.
  10. "Prof. Suresh K Golle". BGU Bhubaneswar |MBA |BBA |BCom |BBALLB |BAJMC |BA Eco|BSc Data Science (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-25.