వర్షచ్ఛాయా ప్రాంతం

ఎత్తైన ప్రదేశాల వెనుక వైపున ఉన్నందున వర్షం పడని ప్రాంతం

పర్వత ప్రాంతాలకు వెనుక భాగంలో, అంటే మామూలుగా వీచే గాలులకు అవతలి వైపున (దాన్నే లీవార్డ్ సైడ్ అని అంటారు), వర్షపాతం గణనీయంగా తక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని వర్షచ్ఛాయా ప్రాంతం అంటారు.

వర్షచ్ఛాయ ప్రభావం
టిబెట్ పీఠభూమి (మధ్య), వర్షచ్ఛాయకు ఉత్తమ ఉదాహరణ. దక్షిణం నుండి రుతుపవనాలతో వచ్చే వర్షపాతం హిమాలయాలను (దిగువన మంచు రేఖ ద్వారా కనిపించేది) దాటి రాలేదు. దీంతో ఈ పర్వతశ్రేణికి లీవార్డ్ (ఉత్తర) వైపున శుష్క వాతావరణం ఏర్పడి, తారిమ్ బేసిన్ (పైన) ఎడారిగా మారింది.

సముద్రాలు, పెద్ద పెద్ద సరస్సుల వంటి నీటి వనరుల నుండి ఆవిరైన తేమ, సముద్రపు గాలుల ద్వారా పొడిగా, వేడిగా ఉన్న లోతట్టు ప్రాంతాలకు వెళతాయి. ఎత్తైన ప్రాంతాల వద్ద తేమతో కూడిన గాలి శిఖరం వైపు పైకి వెళ్ళి అక్కడ వ్యాకోచించి, చల్లబడుతుంది. దాని లోని తేమ ఘనీభవించి, అవక్షేపించడం ప్రారంభమవుతుంది. ఎత్తైన భూప్రాంతం తగినంత పొడవుగా, వెడల్పుగా ఉన్నట్లయితే గాలి వీచే వైపున (దీన్ని వర్షంవైపు అని అంటారు) అవపాతం కారణంగా పైభాగానికి వెళ్లే ముందే గాలి, తేమను చాలావరకు కోల్పోతుంది. తేమ కోల్పోయిన ఈ గాలి ఈ ఎత్తైన ప్రాంతం నుండి అవతలి వైపు దిగుతున్నప్పుడు, సంకోచించి వేడెక్కుతుంది. అప్పుడు ఉత్పత్తయ్యే ఫోహ్న్ గాలులు కింది దిగుతూ గాలి లోని తేమను గ్రహిస్తూ, ఆ ప్రాంతంలో పొడి వాతావరణంతో కూడిన వర్షచ్ఛాయను ఏర్పరుస్తాయి. ఈ శీతోష్ణస్థితి వలన ఆ ప్రాంతం సాధారణంగా పొదలు-స్టెప్పీలు, జెరిక్ పొదలు లేదా ఎడారుల రూపాన్ని తీసుకుంటుంది.

వెచ్చని తేమ గాలి, ఓరోగ్రాఫిక్ లిఫ్టింగ్ ద్వారా పర్వత శ్రేణి పైభాగం వరకు లేస్తుంది కాబట్టి ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఎత్తు పెరిగేకొద్దీ వాతావరణ పీడనం తగ్గుతుంది కాబట్టి, గాలి అడయబాటిక్‌గా చల్లబడి, అడయబాటిక్ డ్యూ పాయింట్‌కి చేరుకునే స్థాయికి వ్యాకోచిస్తుంది. అడియాబాటిక్ డ్యూ పాయింట్ వద్ద తేమ, పర్వతంపై ఘనీభవించి, పర్వతం పైభాగాన గాలి వీచే వైపున అవక్షేపిసితుంది. అవపాతం కారణంగా తేమను కోల్పోయిన ఈ గాలి లీవార్డ్ వైపు దిగుతుంది. సాధారణంగా, పర్వతపు లీవార్డ్ వైపున అడియాబాటిక్ కంప్రెషన్ కారణంగా కిందికి వస్తున్న గాలి వేడెక్కుతుంది. దీనివలన అది అక్కడి వాతావరణం లోని తేమను పీల్చుకుని, శుష్క ప్రాంతాన్ని సృష్టిస్తుంది.[1]

ముఖ్యంగా ప్రభావిత ప్రాంతాలు

మార్చు

భూమధ్యరేఖ ప్రాంతం చుట్టూ ఉన్న బ్యాండ్‌లలో ప్రబలంగా వీచే గాలులు ఉంటాయి. దాదాపు 30° N - 30° S మధ్య ఉండే ప్రాంతాన్ని వ్యాపార పవనాల జోన్ అంటారు. ఈ గాలులు ప్రధానంగా ఉత్తరార్ధగోళంలో ఈశాన్య దిశ నుండి, దక్షిణార్ధగోళంలో ఆగ్నేయం నుండి వీస్తాయి.[2] 30 - 60 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉండే మధ్య అక్షాంశాలలో ప్రధానంగా ఉత్తరార్ధగోళంలో నైరుతి నుండి, దక్షిణార్ధగోళంలో వాయవ్యం నుండి వీచే గాలులను వెస్టర్లీలు అంటారు.[3] మధ్య అక్షాంశాలలో బలమైన పడమటి గాలులు, 30 - 50 డిగ్రీల అక్షాంశాల మధ్య, దక్షిణార్ధగోళంలోని రోరింగ్ నలభైలలో రావచ్చు.[4]

ఆఫ్రికా

మార్చు

ఉత్తర ఆఫ్రికా

మార్చు
 
అట్లాస్ పర్వతాల (పైన) వర్షచ్ఛాయా ప్రభావం వలన సహారా మరింత పొడిగా అవుతుంది.
  • ప్రధాన పర్వత శ్రేణుల (వీటిలో అత్యంత ఎత్తైన ప్రదేశాలు 4,000 మీటర్ల కంటే ఎత్తున ఉంటాయి) వల్ల కలిగే బలమైన వర్షచ్ఛాయా ప్రభావం కారణంగా సహారా మరింత పొడిగా తయారైంది. వాయవ్య దిశలో, అట్లాస్ పర్వతాలు, మొరాకో, అల్జీరియా ట్యునీషియా లకు ఎదురుగా మధ్యధరా తీరాన్ని కవర్ చేస్తాయి. అట్లాస్ పర్వతాల గాలి వైపున, అట్లాంటిక్ మహాసముద్రం నుండి వాయవ్య దిశ నుండి వీచే వెచ్చని, తేమతో కూడిన గాలుల్లో చాలా నీటి ఆవిరి ఉంటుంది. ఇవి పర్వత శ్రేణిపైకి లేచి వ్యాకోచిస్తాయి. దాంతో అవి చల్లబడి, మేఘాలుగా ఘనీభవిస్తాయి. పర్వత శ్రేణిపై భారీ అవపాతం ఏర్పడుతుంది. దీనిని ఓరోగ్రాఫిక్ వర్షపాతం అని పిలుస్తారు. ఈ ప్రక్రియ తర్వాత, గాలి పొడిబారుతుంది. రెండో వైపున చల్లని, పొడి గాలి కిందికి దిగి, సంకోచిస్తూ గాలులు వేడెక్కుతాయి. ఇలా వేడెక్కడం వల్ల తేమ ఆవిరైపోతుంది, మేఘాలు అదృశ్యమవుతాయి. దీంతో వర్షపాతం లేక సహారాలో ఎడారి పరిస్థితులు ఏర్పడతాయి.
  • ఆఫ్రికా కొమ్ము (ఇథియోపియా, ఎరిట్రియా, సోమాలియా, జిబౌటి దేశాలు) లోని ఎడారి ప్రాంతాలైన డానాకిల్ ఎడారి వంటివి ఇథియోపియన్ హైలాండ్స్ వలన ఏర్పడిన వర్షచ్ఛాయా ప్రాంతాలు

ఆసియా

మార్చు

మధ్య, ఉత్తర ఆసియా

మార్చు
  • హిమాలయాలు దానికి సంబంధించిన శ్రేణులు మంగోలియా లోని గోబీ ఎడారితో సహా మంగోలియా లోని ఉత్తర-మధ్య నుండి వాయవ్య చైనాలోని పాక్షిక-శుష్క స్టెప్పీలతో సహా మధ్య ఆసియాలో శుష్క పరిస్థితులకు దోహదం చేస్తాయి.
  • తూర్పు సైబీరియాలోని వెర్ఖోయాన్స్క్ శ్రేణి ఉత్తరార్ధగోళంలో అత్యంత శీతల ప్రదేశం. ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రం నుండి తేమతో కూడిన ఆగ్నేయ గాలులు లీనా నది లోయకు చేరుకోవడానికి ముందే, శీతాకాలంలో ఖండాంతర గాలి వలన ఏర్పడిన తీవ్రమైన సైబీరియన్ హై కారణంగా, తీరప్రాంత పర్వతాలపై తేమను కోల్పోతాయి. సఖా రిపబ్లిక్ (యాకుటియా)లో దీని ప్రభావం ఏమిటంటే, యాకుట్స్క్, వెర్ఖోయాన్స్క్, ఒమియాకాన్‌లలో అత్యంత శీతలమైన నెలలో సగటు ఉష్ణోగ్రత −38 °C (−36 °F) కంటే తక్కువగా ఉంటుంది.

తూర్పు ఆసియా

మార్చు
  • ఓర్డోస్ ఎడారి అనేది కారా-నరిన్-ఉలా, షీటెనులా, యిన్ పర్వతాలతో వంటి పర్వతాల వలన వర్షచ్ఛాయ ఏర్పడుతుంది.
  • మయన్మార్ మధ్య ప్రాంతం అరకాన్ పర్వతాల వర్షచ్ఛాయలో ఉంది. రాఖైన్ రాష్ట్ర తీరంలో 5.5 మీటర్లు (220 అం.) వర్షపాతం ఉండగా, ఈ ప్రాంతంలో దాదాపు 750 మిల్లీమీటర్లు (30 అం.) మాత్రమే వర్షం పడుతుంది.
  • సైబీరియాలో ఉద్భవించే వాయవ్య గాలులను శీతాకాలంలో జపనీస్ ఆల్ప్స్‌తో సహా చుట్టుపక్కల పర్వత శ్రేణులు అడ్డగించడం వలన, జపాన్‌లోని టోక్యో చుట్టూ ఉన్న మైదానాల్లో - కాంటో మైదానం అంటారు - దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది.

దక్షిణాసియా

మార్చు
 
పశ్చిమ కనుమల తూర్పు ప్రాంతాలు వర్షచ్ఛాయలో ఉన్నాయి, చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది.
  • సహ్యాద్రికి తూర్పు వైపు దక్కన్ పీఠభూమిలో ఉన్న విదర్భ, ఉత్తర కర్ణాటక, రాయలసీమ, పశ్చిమ తమిళనాడు.
  • పాకిస్తాన్‌లోని గిల్గిత్, చిత్రాల్ వర్షచ్ఛాయా ప్రాంతాలు.
  • థార్ ఎడారి ఆగ్నేయంలో ఆరావళి శ్రేణులు, ఈశాన్యంలో హిమాలయాలు, పశ్చిమాన కిర్తార్, సులైమాన్ శ్రేణుల వలన వర్షచ్ఛాయ ఏర్పడింది.
  • శ్రీలంకలోని సెంట్రల్ హైలాండ్స్ వలన ద్వీపం లోని ఈశాన్య భాగాలు వర్షచ్ఛాయలో ఉన్నాయి. వేసవిలో వచ్చే రుతుపవన వర్షాలు ఇక్కడ తక్కువగా ఉంటాయి. అయితే, శరదృతువు, శీతాకాలంలో వచ్చే అవపాతం ఎక్కువగా ఉంటుంది.






ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Whiteman, C. David (2000). Mountain Meteorology: Fundamentals and Applications. Oxford University Press. ISBN 0-19-513271-8.
  2. Glossary of Meteorology (2009). "trade winds". Glossary of Meteorology. American Meteorological Society. Retrieved 4 July 2021.
  3. Glossary of Meteorology (2009). "westerlies". Glossary of Meteorology. American Meteorological Society. Retrieved 4 July 2021.
  4. Glossary of Meteorology (2009). "roaring forties". Glossary of Meteorology. American Meteorological Society. Retrieved 4 July 2021.