వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 11/పాత చర్చ 5

తాజా వ్యాఖ్య: గమనిక టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య

వీక్షిస్తున్న పేజీ లలో మార్పు - చేర్పులు గురించి

మార్చు

ఒక సందేహం : వీక్షిస్తున్న పేజీ లలో జరిగిన మార్పు - చేర్పులు సంబంధిత సభ్యులకి e-mail ద్వారా notify అయే option ఒకటి ఉండాలి కదా ! నాకెక్కడా కనిపించడం లేదు ... సహాయం చేయగలరు . - mvs

అవునా..అలాంటి ఏర్పాటు ఉందని నాకు తెలియదు. వీక్షిస్తున్న పేజీల్లోని మార్పులు లాగిన్ అయి ఉన్నప్పుడు బొద్దుగా కనిపిస్తాయని మాత్రం తెలుసు. కనుక్కొని తెలియజేస్తా --వైఙాసత్య 13:53, 21 మే 2007 (UTC)Reply

యాంత్రికంగా మొలకల బేరీజు

మార్చు

ప్రదీపు, యాంత్రికంగా మొలకలను బేరీజు వేయటానికి పద్ధతి సిద్ధం చ్స్తున్నావని అనుకుంటున్నాను. ఇది చాలా బాగుంది. అయితే ఒక వ్యాసాన్ని మొలకగా నిర్ణయించటానికి ఎటువంటి నిబంధనలు పాటిస్తున్నావో అని కుతూహలంగా ఉంది. 2 కిలోబైట్ల కన్నా చిన్న వ్యాసాలను మొలకలుగా నిర్ణయిస్తే బాగుంటుందని నా కనిపిస్తుంది. --వైఙాసత్య 12:22, 22 మే 2007 (UTC)Reply

అవును ప్రస్తుతానికి వ్యాసం సైజుని మాత్రమే చూస్తున్నాను. 2KB కంటే తక్కువ ఉంటే గనక మొలక అని బాటుద్వారా నిర్ణయిస్తున్నాను. మనం మార్పులు చేస్తున్నప్పుడు EDITBOXలో ఏదయితే కనబడుతుంఓ దాని size మాత్రమే పరిగణలోకి తీసుకోబడుతుంది. అంటే మూసలు పెట్టటం వలన వచ్చే HTMLని పట్టించుకోదు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 12:34, 22 మే 2007 (UTC)Reply
ఇలా యాంత్రికంగా బేరీజువేసే ప్రక్రియ నిన్న రాత్రే మొదలయింది. ఇంకో 10 - 15 గంటల్లో బాటు మొత్తమన్ని పేజీలను బేరీజు వేసేస్తుంది. ప్రస్తుతం ఇలా యాంత్రికంకా చర్చా పేజీలలో ఉండే మూసల నిర్వహణకు గాను ఒక లైబ్రరీ తయారు చేసే ప్రక్రియలో ఉన్నాను. ఇలాంటి లైబ్రరీని ఉపయోగించి దీనికి సమాధానం చెప్పటానికి ప్రయత్నించవచ్చు. అంతే కాదు మొత్తం ప్రాజెక్టు పేజీలను ఇంకా బాగా నిర్వహించవచ్చు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 13:12, 22 మే 2007 (UTC)Reply
మీ ప్రయత్నం బాగుంది. అవును ఇలా చేయటం వళ్ల చాలా దీర్ఘకాలిక ఉపయోగాలున్నాయి. తక్షణంగా పేజీ డెప్త్ పెరుగుతుంది. కానీ ట్రేడ్ ఆఫ్ గా మార్పుల నిష్పత్తి కొంత వరకు తగ్గుతుంది. అలాగే ఆంగ్ల వికీలో లాగా విషయము వారిగా మొలకలను వర్గీకరించే పద్ధతిని ప్రవేశ పెట్టాలి. ఉదాహరణకు ఆంధ్ర ప్రదేశ్ గ్రామాల మొలకలు, భారతదేశ చరిత్ర మొలకలు --వైఙాసత్య 14:17, 22 మే 2007 (UTC)Reply

Bot status BotMultichill

మార్చు

Hi Kajasudhakarababu, thank you for the warm welcome. I do have one question; Do you know where can i apply for bot status? Multichill 13:37, 23 మే 2007 (UTC)Reply

వైఙాసత్యా! ఇది నా చర్చాపేజీలో వ్రాసిన విషయం. జవాబు రాయగలరా? - --కాసుబాబు 17:54, 23 మే 2007 (UTC)Reply

పేరు మార్పు

మార్చు

వైఙాసత్యా! నా సభ్యనామం "Kajasudhakarababu" మరీ పొడుగుగా ఉంది. ఇంగ్లీషులో ఉంది. చిన్నగా ఉండడానికి "కాసుబాబు" అని మార్చగలవా? అలా చేస్తే నా పాత మార్పుల రికార్డు భద్రంగా ఉంటుందా? అలా చేస్తే నేను లాగిన్‌కు క్రొత్త పేరు వాడాలనుకొంటాను. పాస్‌వర్డ్ మార్చాలా? --కాసుబాబు 04:49, 24 మే 2007 (UTC)Reply

పేరు మార్చుకున్నాక మీ దిద్దుబాట్లకు, చర్చకూ ఢోకా ఏమీ ఉండదు. సంకేత పదం మార్చడం, మార్చకపోవడం మీ ఇష్టమనుకుంటా. వికీపీడియా:సభ్యనామం మార్పు చూడండి. __చదువరి (చర్చ, రచనలు) 06:03, 24 మే 2007 (UTC)Reply
మార్చేశా --వైఙాసత్య 18:58, 24 మే 2007 (UTC)Reply

బాటు

మార్చు

మీరు కాని ఇప్పుడు బాటు నడుపుతారా???--మాటలబాబు 19:13, 3 జూన్ 2007 (UTC)Reply

లేదు. కానీ ఎందుకు అడుగుతున్నారు --వైఙాసత్య 19:18, 3 జూన్ 2007 (UTC)Reply
ఈ సందేహం రావడానికి కారణం ఏమిటంటే ప్రదీపుగారు ప్రాజెక్టు మూస తయారు చేశాక బాటు నడుపుతారు. అందుకని అడీగాను, వేరేలా అనుకోకండి. మీరు లంచ్ బ్రేక్ లో ఉన్నారా... ఏమి రాయడం లేదు. కాసుబాబు గారు ఎలాగు వారం సెలవు లో ఉన్నారు వచ్చేవారం కలుస్తానని చెపారు. నేను తెవికీ గూగుల్ గుంపులో చేరడానికి దరఖాస్తు చేశాను. మీరు ఆమౌదిస్తే అక్కడ కూడా చర్చలలో పాలు పంచుకొంటాను. --మాటలబాబు 23:39, 3 జూన్ 2007 (UTC)Reply

బహిష్క్రించరు

మార్చు

ఇది వైజా సత్యాగారికి మిరు నాసభ్యత్వ పేజీలకు లింకులు బాగా ఇచ్చారే.. నేను తెలియక రెండు పేజిలు తయారు చేశాను

  • పిచ్చి రాజూ అని ఒకటి,[1]
  • ఇంకొకటి తుగక్ల్ అనే పేజి,[2]
దానిని మీరు నా సభ్యత్వా పేజికి ఎవరికీ తెలియకుండా లింకు బాగాకలిపారు. మాకు పేజిలు సృష్టించే అవకాశం తప్పితే నిర్మూలించే అవకాశం లేదు , ఆ పేజీల్ను నిర్మూలించలెకపోయాను.
దానిని మీరు ఈ అవకాశాన్ని జాగ్రత్త వినియౌగించుకొని నా పేజి కి జత చేశారు. నిర్వాహక హోదా లో ఊండి ఇటువంటి పను చెయ్యవచ్చా..దయచేసి మీకు కూడా ఒక విన్నపం నన్ను బహిష్కరించండి. అప్పుడెప్పుడొ బహిష్కరిస్తాను లేదా ఎందుకు బహిష్కరించకోడదొ అని ప్రదీపు గారు అన్నారు అదెదొ ఇప్పుడు చేసేయ్యంది. కాసుబాబు గారు విదేశాలనుండి తిరిగి వచ్చాకా నేను ఎఖ్కడ ఉన్నను అని చూస్తారు ఆ సమ్యానికి నెను బహిష్కరించబడి సేద తీరుతూ ఊంటాను. ప్లీజ్ ప్లీజ్ బహిష్క్రించరు... --మాటలబాబు 12:20, 5 జూన్ 2007 (UTC)Reply
అవి మీరు ప్రయోగాలకోసం చేసుకొన్న మూసలని మీ సభ్యుని పేజీకి తరలించా (నేను ప్రయోగాత్మక మూసలను అలానే నా సభ్య పేజీ కింద పరీక్షిస్తుంటా). అన్యధా భావించవద్దు. నాకింక ఏ దురుద్దేశము లేదు. క్షమాపణలతో అవి తొలగించేస్తా. మీరు ఇంతకు ముందే తొలగించాలని ప్రయత్నించి ఉంటే ఎవరైనా నిర్వాహకున్ని అడగాల్సింది. బహిష్కరణ నా ఇచ్ఛాపూర్వకంగా నేను చెయ్యలేను. అంతగా మీరు ఇక్కడ పనిచెయ్యకూడదని అనుకుంటే అది మీ ఇష్టం --వైఙాసత్య 12:30, 5 జూన్ 2007 (UTC)Reply

రవీ, జమైకా గురించిన ఈ తమిళ [జమైకా] పుటను గమనించగలరు. అలాగే మన [రష్యా] పుట. తమిళ పేజీలోని క్రింది టెంప్లేటు (మూస?) చాలా నచ్చింది. ఒకసారి గమనించ ప్రార్థన. --నాగడు 03:14, 7 జూన్ 2007 (UTC)Reply

అవును బాగుంది. ఖచ్చితంగా అందులో మీకు నచ్చిన విషయాలేంటో రాస్తే అవి మన మూసలో పొందుపరచడానికి ప్రయత్నిస్తా. విభాగానికి విభాగానికి స్పష్టమైన గీత ఉండటం అని నాకు ఒక మార్పు గోచరిస్తుంది. ఆ మార్పు తెవికీ మూసలో కూడా చేస్తాను. --వైఙాసత్య 03:23, 7 జూన్ 2007 (UTC)Reply
ఇది చూసి సభ్యుడు:వైఙాసత్య/ఇసుకపెట్టె6 బాగుందేమో చెప్పండి. బాగుందంటే అనువదించి ఇప్పుడున్న మూసను కొత్తమూసతో మార్చేస్తా --వైఙాసత్య 03:35, 7 జూన్ 2007 (UTC)Reply

Bot statut

మార్చు

Hi ! My primary account have bot statut but I will now edit on my bot account User:Le Pied-bot (list of flag). Can you please switch the bot flag from my primary account User:EDUCA33E to my bot account User:Le Pied-bot ? Cordialy, EDUCA33E 05:05, 7 జూన్ 2007 (UTC)Reply

done --వైఙాసత్య 06:34, 7 జూన్ 2007 (UTC)Reply

బాటు అభ్యర్ధన

మార్చు

ప్రదీపు, మీకు వీలైతే {{"[[Category:":"[[వర్గం:", "[[category:":"[[వర్గం:", "[[Image:":"[[బొమ్మ:", "[[image:":"[[బొమ్మ:"}} ఈ రిప్లేస్ స్క్రిప్టు అన్ని వ్యాసాలపై నడపగలరా? --వైఙాసత్య 03:14, 7 జూన్ 2007 (UTC)Reply

అలాగే నడుపుతాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 12:01, 7 జూన్ 2007 (UTC)Reply

purge

మార్చు

మేష్టారు, మెదటి పేజిలొ ఉన్న విశేష వ్యాసాన్ని కొద్దిగా purge చెయ్యరా, ఉన్న వ్యాసానికి అక్కడ ఉన్న విషానికి తేడా ఉంది. నేను purge చెయ్యలేక పోయాను.--మాటలబాబు 14:22, 9 జూన్ 2007 (UTC)Reply

మేష్టారూ , ఈ వారం శీర్షిక వ్యాసాన్ని నిర్వాహాకులు మాత్రమే నిర్ణించాలా, సభ్యులు కూడా నిర్ణయింవచ్చా.. ఇంకో విషయం ఆ విషయాన్ని సభ్యులకి వదిలి పెడితే వారు వ్రాసిన అన్ని వ్యాసాలకు ఆ శిర్షిక తగిలించే అవకాశం ఉందేమౌ, బాలు గారి గురించి నాసందేహం....పేరు లోని intials es.pI or es.pi-- ఎస్.పీ.లేదా ఎస్.పి., నేను అనుకోవడం ఎస్.పి.--మాటలబాబు 05:41, 10 జూన్ 2007 (UTC)Reply
నిర్వాహకులకు మాత్రమే జరిగే చర్చలు వికీపీడియాలో ఏవీ లేవు. దానిదేముందు బాలు పేజీకి ఇంకో రెండు దారిమార్పులవుతాయి (పరిశీలించి తగుమార్పులు చేస్తాను) --వైజాసత్య 05:45, 10 జూన్ 2007 (UTC)Reply
నిర్వాహకులకు మాత్రమే జరిగే చర్చలు వికీపీడియాలో ఏవీ లేవు. దీని అర్థం నాకు అర్థం కావడం లేదు.. దయ చేసి దీని అర్థాన్ని చెప్పారా...--మాటలబాబు 06:00, 10 జూన్ 2007 (UTC)Reply
అన్నీ చర్చల్లో, నిర్ణయాల్లో అందరూ ఆహ్వానితులే (అఖరికి అజ్ఞాత సభ్యులతో సహా..ఓటింగు నిర్వాహించవలసి వస్తే మాత్రం ఆకాశ రామన్నలు ఓటేసే అవకాశముండదు) --వైజాసత్య 06:06, 10 జూన్ 2007 (UTC)Reply

ఎన్ని గంటలు

మార్చు

మేష్టరు, నేను ఎప్పుడు చూసిన మీరు ఏదో ప్రాజెక్టు మీద దృష్టి సారించి మార్పులుయ్ చేర్పులు చేస్తున్నట్లు కనిపిస్తు ఉంటారు.ఏమి అనుకోక పోతే మీకో ప్రశ్న. మీరు రోజు ఎన్ని గంటలు తెవికి కి వెచ్చిస్తారు, ఈ ప్రశ్న నేను కాసు బాబు గారిని కూడా అడిగాను ఆయన్ నాకు 0-4 గంటలు అని చెప్పారు. --మాటలబాబు 21:50, 11 జూన్ 2007 (UTC)Reply

వీలు దొరికినప్పుడల్లా ;-) ఇన్ని గంటలనీ చెప్పలేను ప్రయోగాల మధ్యలో, పరిశోధనా వ్యాసాం రాస్తూ బోరుకొట్టినప్పుడు. వీలైనప్పుడల్లా ఒక లుక్కేస్తుంటాను --వైజాసత్య 03:05, 12 జూన్ 2007 (UTC)Reply
మీరు ఏం ప్రయౌగాలు చేస్తారు, పరిశోధనావ్యాసం అంటే ఏమిటీ? నాకు కొద్దిగా ఆదిశంకరులు వ్యాసం లొ ఉన్న పట్టికని సరిచేసి పెట్టరు. మీరు ఒక లుక్కు వేసి సమాచారం ఎక్కువగా ఉందేమౌ చెప్పరు.ఇంకా ఇప్పుడున్నంత విషయం రాయాలని తపన. ఆదిశంకరులు వ్యాసమ్ ఆంగ్లవికీ లొ విశేష వ్యాసం గా ప్రదర్శించబడింది. తెలుగు లొ కూడా ప్రదర్శించబడాలని కోరిక..--మాటలబాబు 01:32, 15 జూన్ 2007 (UTC)Reply
నేను మొక్కలలో జన్యుశాస్త్ర పరిశోధనలు చేస్తుంటాను. అలాగే, తప్పుకుండా ఆదిశంకరాచార్య వ్యాసాన్ని ఇక్కడా విశేష వ్యాసం చేద్దాం --వైజాసత్య 03:31, 15 జూన్ 2007 (UTC)Reply

తొలగించు

మార్చు

మీకు తొలగించవలసిన వ్యాసాల చిట్టా రెడి చేశాను, వాటి పని కానియండి--మాటలబాబు 15:07, 15 జూన్ 2007 (UTC)Reply

తప్పకుండా తొలగిస్తా. మీ కొక చిట్కా {{తొలగించు}} మూసకు ఒక పెరామీటరు కూడా ఇవ్వవచ్చు ఇలా {{తొలగించు|కారణం}} --వైజాసత్య 15:12, 15 జూన్ 2007 (UTC)Reply

బాటు

మార్చు
మీరు మీరు మాట్లాడేసుకొని బాటు ని నడపడం అన్యాయం నాకు చెప్పచ్చు కదా నేను సహాయం చేస్తాను. మీరే చూస్తున్నారు గా నేను తెవికీ కోసం అకుంఠిత దీక్షతో శ్రమిస్తున్నాను --మాటలబాబు 15:28, 16 జూన్ 2007 (UTC)Reply
మీరు చర్చ:ఆది శంకరాచార్యులు లొ పాల్గొనడం లేదే.అభిప్రాయాలు వెలిబుచ్చండి. --మాటలబాబు 16:07, 17 జూన్ 2007 (UTC)Reply
మాటలబాబు గారూ, నాకా విషయాలపై పెద్దగా అవగాహన లేదు. అందుకే చర్చలో పాల్గొనలేదు. చదువరి గారు చూస్తున్నారుగా!! --వైజాసత్య 18:05, 17 జూన్ 2007 (UTC)Reply

కొమర్రాజు లక్ష్మణ రావు విజ్ఞాన సార్వస్వం

మార్చు

ఇది ప్రస్తుతం PDFగా లభిస్తుంది. లైసెన్సుకూడా పబ్లిక్‌డొమైనులోనే లభిస్తుంది అని అనుకుంటున్నాను. దీనిని వికీపుస్తకాలలో ఎక్కించటం మొదలు పేడితే ఎలా ఉంటుంది. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 14:04, 18 జూన్ 2007 (UTC)Reply

మనిద్దం ఒకేలా ఆలోచిస్తున్నాం. నేను మొదటి 100 పేజీల డీజేవీయూ ఫైలు సోర్స్ లో ఎక్కించాను. అందులోనుండి యూనీకోడీకరించటానికి మచ్చుకు ఒక సైడ్ బై సైడు ప్రివ్యూ పేజీ ఒకటి చేశాను కూడా ఇది చూడండి. [3] --వైజాసత్య 14:36, 18 జూన్ 2007 (UTC)Reply
ఇదేదో చాలా బాగుంది "పేజి" నేంస్పేసు గురించి అర్ధం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. DJVU ఫార్మాటు ఉపయోగించి పుస్తకాలను వికీపీడియాలోకి చాలా సులువుగా ఎక్కించవచన్న మాట. తెలుగు OCR కూడా ఒకటి ఉంతే బాగుంటుది ఈ పనికి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 16:59, 18 జూన్ 2007 (UTC)Reply
ఆలోచనల్లో మీ ఇద్దరు చాలా ముందున్నారు. ప్రదీపన్నట్టు OCR ఉంటే చాలా బాగుంటుంది. ఆ విజ్ఞాన సర్వస్వం పుస్తకం మొత్తాన్ని పెట్టాలంటే మహాభారతం లాంటి యజ్ఞం చెయ్యాల్సిందే అనుకుంటాను. అన్నట్టు రవీ, అందులో ఆ భూతద్దం అంశం మాత్రం అదిరింది. __చదువరి (చర్చరచనలు) 17:12, 18 జూన్ 2007 (UTC)Reply

శాంతి మంత్రం

మార్చు

నా సభ్యత్వ పేజి లొని శాంతి మంత్రం కొద్దిగా పైకి వచ్చే ఏర్పాటు మీరు ఏమైనా చేయగలరా అది చూసినప్పుడల్లా నాకు మానసిక ఉత్సాహం కల్గుతుంది--మాటలబాబు 21:13, 19 జూన్ 2007 (UTC)Reply

వికీసోర్సు common.css

మార్చు

వికీసోర్సులో common.cssపై మీకు ఒక అభ్యర్ధన చేసాను చూడండి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 19:36, 20 జూన్ 2007 (UTC)Reply

ఉక్కిరి బిక్కిరి

మార్చు

ప్రదీప్ గారు మిమ్మల్మి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయక మునుపే మీరు అప్లోడ్ చేసిన బొమ్మల కాపీరైటు ప్రకటిస్తున్నారా--మాటలబాబు 20:34, 21 జూన్ 2007 (UTC)Reply

అవునవును. అదీ కాక రౌండు టేబుల్ బొమ్మల గురించి వెతుకుతుంటే భారతదేశంలో 60 సంవత్సరాలు పైబడిన ఛాయాచిత్రాలు పబ్లిక్ డొమైన్ కు చెందుతాయని ఖచ్చితంగా తెలిసింది --వైజాసత్య 20:37, 21 జూన్ 2007 (UTC)Reply
వర్గం ఎలా తయారు చెయ్యాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను, మూస అయితే తయారు చేశాను కాని (ఆంగ్లవికీ నుండి తెచ్చి) వికీపీడీయా లొ కొరబడుతున్న బొమ్మలు అనే వర్గాన్ని తయారు చెయ్యలేక పోతున్నాను.--మాటలబాబు 14:04, 22 జూన్ 2007 (UTC)Reply
వర్గాలు తయారు చెయ్యటానికి సులువైన పద్ధతి ఇది. [[వర్గం:వికీపీడీయా లొ కొరబడుతున్న బొమ్మలు]] అని ఒక లింకు రాసి భద్రపరచండి. ఇక ఆ పేజీ చివరి భాగాన ఈ ఎర్రలింకు కనిపిస్తుంది. అందులోకెళ్లి [[వర్గం:వికీపీడియా నిర్వహణ]] అని రాసి భద్రపరచండి. ఇక వర్గం తయారైనట్టే..లేదా ఆ ఎర్ర లింకులో..ఏదో ఒక చిన్నపదం (అఆఇఈ) రాసి భద్రపరచండి..కానీ ముందు చెప్పిన విధమే ఉత్తమం అంటే ఒక వర్గాన్ని తయారు చెయ్యాలంటే దానికి దాని పై వర్గాన్ని తగిలించటమే..బాగా తికమకపెట్టానా? ప్రయత్నించి చూడండి --వైజాసత్య 14:11, 22 జూన్ 2007 (UTC)Reply
బావుంది కాని చర్చా పేజి లో మూస పెట్టె పెడితే తనంటతానే వికీపీడీయా వర్గీకరించాలి కదా.. వర్గీకరిస్తుందా లేదా!!--మాటలబాబు 14:17, 22 జూన్ 2007 (UTC)Reply
వర్గీకరించాలి...కానీ ఈ పార్సర్ ఫంక్షన్లతో క్లిష్టమైన మూసను తెనిగీకరించటంలో ఏదో చిన్న తప్పు దొర్లింది. మూసను సరళీకరించా ఇప్పుడు వస్తుంది చూడండి --వైజాసత్య 14:24, 22 జూన్ 2007 (UTC)Reply
చర్చా పేజిలని మాత్రమే వర్గీకరిస్తోంది , ప్రధాన వ్యాస పేజి ని వర్గీకరించడం లేదు--మాటలబాబు 14:26, 22 జూన్ 2007 (UTC)Reply
మరి మనం మూసను పెట్టింది చర్చా పేజీలోనే కదా అందుకని. వ్యాసంలో ఇలాంటి నిర్వహణా మూసలు పెడితే చదవడానికి బాగుండదని చర్చాపేజీలో చేరుస్తున్నాం. అయినా చర్చాపేజీలో ఉందటే అది ఆ ఫలానా వ్యాసానికి సంబంధించిందనేగా అర్ధం --వైజాసత్య 14:29, 22 జూన్ 2007 (UTC)Reply
సరి సరి ఈ రోజు వర్గం అనే కొత్త విషయాన్ని నేర్చు కొన్నాను. మీ సహాయానికి కృతజ్ఞతలు. దాన్ని చిట్కాల లో చేర్చ మని నా మనవి--మాటలబాబు 14:33, 22 జూన్ 2007 (UTC)Reply
ఒకసారి నేను చేస్తున్న శుద్ది మూస పై ఒక కన్ను వెయ్యరా--మాటలబాబు 18:00, 24 జూన్ 2007 (UTC)Reply
సత్య గారికి ధన్యవాదాలు--మాటలబాబు 20:34, 24 జూన్ 2007 (UTC)Reply
సత్యా గారు బాగున్నారా!! నేను ఒక బొమ్మ చిత్రించాను బాగా రాలేదు కాని ఎదో వచ్చింది, కాని విశ్వామిత్రుడి వ్యాసం బొమ్మ లేకుండా ఉండడం చూసి తాత్కాలికంగా అక్కడ బొమ్మ చేర్చాను, నాకు తెవికీ లొ పని చేయడం భలే సరదా గా ఉంది--మాటలబాబు 15:52, 26 జూన్ 2007 (UTC)Reply

గమనిక

మార్చు

మాటలబాబు గారూ, మీరు దిద్దుతున్న వ్యాసాలలో ప్ర"యో"గం (prayOgam) వంటి పదాలలో ప్ర"యౌ"గం (prayaugam) అని తరచూ రాస్తుండటం గమనించాను. జాగ్రత్త వహించగలరు --వైజాసత్య 15:52, 26 జూన్ 2007 (UTC)Reply

నన్ను భయపెడుతున్నారా జాగ్రత్త వహించగలరు అని వ్రాస్తున్నారు, ఏదొవచ్చిరాని తెలుగులొ వ్రాస్తున్నాను, సరిచేయాలి కాని జాగ్రత్తఅంటే ఎలా..అందుకే కదా అచ్చు తప్పులు అనే మూసను కూడా తయారు చేశాము --మాటలబాబు 15:57, 26 జూన్ 2007 (UTC)Reply
అయ్యో, నేను సరిగా వ్యక్తపరిచినట్లు లేను. తప్పుగా అర్ధం చేసుకోవద్దని..ఇది హెచ్చరిక ఏమాత్రం కాదు. మీరు గమనించలేదేమోనని తెలియజేశానంతే..నా వచ్చీరానీ తెలుగుతో చాలా ఇబ్బందులే వస్తున్నాయి..నేనే జాగ్రత్తగా ఉండాలి --వైజాసత్య 16:03, 26 జూన్ 2007 (UTC)Reply
Return to the user page of "వైజాసత్య/పాత చర్చ 11/పాత చర్చ 5".