వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 11

Active discussions

బండి ఱసవరించు

~ra వ్రాస్తే ఱ , ~rra వ్రాస్తే ఱ్ర వస్తాయి --వైజాసత్య 04:24, 25 డిసెంబర్ 2008 (UTC) ధన్యవాదాలు సత్యాగారు. కాని నేను ఆడిగింది ఱ కింద ఱ వత్తు. ఱ కంద ర వత్తు కాదు. ఈ ప్రయోగం చేసిన తరువాతనే సహాయం కోసం వ్యాఖ్య వ్రాశాను. దయచేసి చూసి చెప్పగలరు.--SIVA 04:46, 25 డిసెంబర్ 2008 (UTC)

మొలకల గురంచిసవరించు

ధన్యవాదాలు సత్యగారు. విషయం అర్థమయింది. మొలకల విషయంలో నా ఉద్దేశ్యం::

 • మొలకలను 1 నుండి 250, 250 నుండి 500 ఇలా ఉత్సుకత చూపిన సభ్యులకు పంపిణీ చేసి, ఆ సభ్యులను ఆ మొలకల విషయంలో ఒక నిర్దిష్ట భవిష్య కార్యక్రమాన్ని ప్రదిపాదించవలసినదిగా కోరాలి
 • ఈ ప్రతిపాదనలను ఒక ప్రత్యేక పుట ను తయారు చేసి (మొలకల వర్గీకరణ వంటి పేరుతో)అందులో పొందుపరచాలి, మొలకలను తొలగించటం, ఆ విషయం మీద ఇప్పటీకే ఉన్న వ్యాసంతో విలీనం చెయ్యటం వంటి ప్రదిపాదనలను చెయ్యచ్చు.అలా ప్రతిపాదించేటప్పుడు, ఈ పనికి ప్రత్యేకించబడిన సభ్యులు, ఆ మొలక లింక్ ఆ పుటలో తప్పనిసరిగా ఇవ్వాలి.
 • ఇలా చెయ్యబడ్డ ప్రతిపాదనలను పరిశీలించి తగిన చర్య తీసుకోవటానికి ఇద్దరు ముగ్గురు సీనియర్ వికీ సభ్యులు కలసి వారానికి ఒకసారి నిర్ణయం ప్రకటీంచాలి.
 • అటువంటి నిర్ణయం, మొలకలను ఏర్పరిచిన సభ్యునికి తెలియచెయ్యాలి, ఒక మూడు రోజుల వ్యవధి తరువాత, సీనియర్ల కమెటీ చేసిన ప్రకటన ప్రకారం మొదట, ఆ మొలకల మీద బవిష్య కార్యక్రమం ప్రతిపాదించిన సభ్యుడు చర్య తీసుకోవాలి.
 • మొలకల పరిశీలన, సభ్యులకు పంపిణీ చేశేటప్పుడె ఏంత సమయంలో ఆ పని చెయ్యాలి (15-20 రోజులు)తెలియచెయ్యాలి. ఆ సమయంలో ఆ పని జరగక పోతే మరొక 7 రోజుల వ్యవది ఇవ్వాలి. ఆప్పటికి, ఆ పని జరగకపొతే, మరొక సభ్యునికి పంపిణీ చెయ్యాలి
 • దీనికి సాఫ్ట్వేర్ లొ ఈక్రింది అవకాశాలు ఉంటే అంతయినా ఉపకరిస్తుంది:
 • మొలక ఏర్పరిచిన సభ్యునికి, అతను లాగ్ ఇన్ అయిన ప్రతిసారి, అతను ఏర్పరిచిన మొలకలగురించి ఒక రెమైడరు అటోమాటిక్ గా రావడం
 • భవిష్య కార్యక్రమం ప్రత్యేక పుటలో వ్రాయగానే, ఆ మొలక ఏర్పరిచిన సభ్యునికి, ఆ ప్రతిపాదన అతను లాగ్ ఇన్ అయిన వెంటనే అటోమాటిక్ గా సందేశం వెళ్ళటం
 • మొలకలగురించి బాధ్యత అప్పగించబడిన సభ్యునికి, అతను ఇంకా భవిష్య కార్యక్రమం చెయ్యని మొలకల సంఖ్య, తదుపరి చర్య తీసుకొని మొలకల సంఖ్య సందేశంగా అతను లాగ్ ఇన్ అయిన వెంటనే రావటం.

ఈ విధమయిన కార్యాచరణ మనం ఆచరించగలిగితే, మొలకల సంఖ్య గణనీయంగా తగ్గించి, వ్యాసాల సంఖ్యను పెంచవచ్చును. ఈ విషయం దేవా గారికి కూడా తెలియచేసాను. పరిశీలించి తెలియచెయ్యగలరు.--SIVA 04:01, 18 ఏప్రిల్ 2008 (UTC)

మొలకల జాబితా దిశగా, నేనొక చిన్న ప్రయత్నం ఇక్కడ ప్రారంభించాను వికీపీడియా:మొలకల జాబితా, ఆటోమేటిగ్గా గుర్తుచేయటం ఎంతవరకు సాధ్యమౌతుందో పరిశీలించాలి. మీ సూచనలు బాగున్నాయి --వైజాసత్య 04:53, 25 ఏప్రిల్ 2008 (UTC)

రంగారావుగారి వ్యాఖ్యసవరించు

ధన్యవాదములు సత్యా గారూ. నా ఉద్దేశ్యం, ఎవరూ కూడాావతలి వారిని బాధ పెట్టే వ్యాఖ్యలు చెయ్యకూడదని. నలుగురూ కూడి చెయ్యవలసిన పని ఇది. చివరకు అందరికి అమోదయోగ్యమయినది నిలుస్తుంది. మార్పు చేసినవాళ్ళమీద దురుసుగా వ్యాఖ్యలు చెయ్యటం తగదు అన్న విషయం సభ్యుడి/ల కు తెలియాలి. నేనుకూడా అంత కటువుగా జవాబు వ్రాస్తే బాగుండదుకదా! అందుకనే నేను ఈ విషయం ఇతర సభ్యులకు తెలియచేసినది. కాసు బాబు గారు మధ్యవర్తిత్వం నాకు సమ్మతమే. ఈ సంఘటన పర్యవసానం మాత్రం, ఎవరిని కించపరచకుండా ఉండాలి.రచనలు చేసే సభ్యులు, ఇతర సభ్యులు చేసే మార్పులను గౌరవించగలగాలి, అవసరమయితే చర్చ చెయ్యాలి, వ్యాఖ్యలకు చోటు ఉండకూడదు అని నా అభిప్రాయమం --SIVA 19:41, 17 ఏప్రిల్ 2008 (UTC)

"వికీపీడియా:పుస్తకాల వ్యాసాల జాబితా" నేమ్ స్పేసుసవరించు

వైజా సత్యా! పుస్తకాల వ్యాసాల జాబితా ను వికీపీడియా:పుస్తకాల వ్యాసాల జాబితా నేమ్ స్పేసుకు తరలించావు. కాని జాబితాలు "వికీపీడియా:" నేమ్ స్పేసులో ఉండవలసిన అవుసరం లేదనుకొంటాను. దేశాల జాబితాల జాబితాలో ఎన్నో జాబితాలు వ్యాసాలుగానే ఉన్నాయి గదా! ఆంగ్ల వికీలో కూడా ఈ పద్ధతే వాడారనుకొంటాను. --కాసుబాబు 08:27, 3 మార్చి 2008 (UTC)

Bot status for Purbo Tసవరించు

Hi వైజాసత్య దిద్దుబాటు, I am sorry, I cannot write తెలుగు. Hopefully, you can read English. Have a look at వికీపీడియా:Bot/Requests_for_approvals#Purbo_T, please, and possibly grant a bot flag for Purbo T. There are no objections. Thank you. -- Purodha Blissenbach 22:57, 7 మార్చి 2008 (UTC)

తెలుగు పై వ్యాసములుసవరించు

వైజాసత్య గారు,

దినేశ్ కన్నంబాడి అను కన్నడిగుడు తెలుగు భాష పై నేను వ్రాసిన వాక్యములు, చేసిన దిద్దుబాటులను మార్చుచున్డెను. Please see: en:Telugu language, en:Telugu script, en:Bhattiprolu. ఆతని మొండి వాదనలు, ఆతనికి తోడ్పాటుగా మరి ముగ్గురు కన్నడిగులు తెలుగు వ్యాసములలో నన్ను ఒక సంవత్సరముగా మిగుల విసిగించుచుండిరి. వికి లో గల సౌలభ్యములతో నన్ను బహుళ చికాకుపరచి నేను చేసిన అన్ని మార్పులను తొలగంచుచున్నారు. ఈ విషయమున నేను మీ అందరి సహాయము కోరుతున్నాను.Kumarrao 06:13, 11 మార్చి 2008 (UTC)

నాకు దినేశ్ కన్నంబాడి పరిచయమే..ప్రస్తుతం కాస్త బిజీగా ఉన్నాను..వీలు చిక్కగానే చూస్తాను --వైజాసత్య 01:24, 13 మార్చి 2008 (UTC)

అధికారి బాధ్యతల గురించిసవరించు

వైజా సత్యా! వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తిలో నువ్వు మొదలుపెట్టిన ఎర్రలింకుల ఆధారంగా నన్నూ, ప్రదీప్‌నూ అధికారి బాధ్యతలకు ప్రతిపాదించే అభిప్రాయం నీకున్నదనిపించింది (ఇది నిజం కాకపోవచ్చును!). అధికారి బాధ్యతలకు నేను సుముఖంగా లేను. (1) ఇప్పటికే చేయవలసిన పనులు చాంతాడంత ఉన్నాయి. అదనపు బాధ్యతలు తగవు (2) ప్రోగ్రామింగ్, మీడియా వికీ, బాట్ల విషయంలో నాకు అస్సలు అవగాహన లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయమనుకొంటాను. కనుక మన్నించి ఆ ప్రతిపాదన విరమించుకోగలవా? ఇక పోతే ప్రదీప్‌ను అధికారిగా ప్రతిపాదించాలని నేను కొద్ది రోజులుగా అనుకొంటున్నాను. అతని అనుమతి తీసుకొని ప్రతిపాదిస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:00, 12 మార్చి 2008 (UTC)

అవును, నేను మిమ్మల్ని, ప్రదీపును అధికారిగా ప్రతిపాదించాలని అనుకున్నాను. చంద్రకాంతరావు నిర్వాహక ఓటింగు గడువు ముగిసిన అధికారులు అందుబాటులో లేకపోవడంతో కొన్ని రోజులు హోదా ఇవ్వటానికి ఆలస్యం అయ్యింది..ఇంకా బాట్లకు అనుమతులు కూడా పేరుకు పోయాయి. అధికారిగా పెద్దగా అదనపు బాధ్యతలేమీ ఉండవు..నిర్వాహక హోదాలు, బాటు హోదాలు కల్పించడము, సభ్యనామాల్ని మార్చటం తప్ప. అయినా మీరు వద్దనుకుంటే మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను. ప్రదీపును ప్రదిపాదించగలరా..నాకీ మధ్య కొత్త ఉద్యోగం వళ్ళ వీలు చిక్కట్లేదు. నెనర్లు --వైజాసత్య 01:21, 13 మార్చి 2008 (UTC)

నిర్వాహకుల వివరాలుసవరించు

Moderator in name and vandalist in practice. సద్దాం హుస్సేన్ పేజినే అనేక సార్లు వాండలైజ్ చేశావు కదా!

ఇబ్న్ సా'ద్ కోట్స్ కలిగిన లింకు ఎడిట్ చెయ్యడం కూడా అంత అవసరమా? ఇస్లామిక్ చరిత్రకారుడన్నది నిజం కాదా? సభ్యులు:Kumarsarma

వైజా సత్యా! వికీపీడియా చర్చ:నిర్వాహకుల జాబితాలో చిన్న సమాచారం అడిగాను. నీలు దొరికినపుడు చూడ గలవు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:57, 14 మార్చి 2008 (UTC)

ఆంగ్లవికీ అనువాదాలుసవరించు

ఆంగ్లవికీ అనువాదాలని ఎడిట్ చేసె అధికారం తెలుగు వికీ నిర్వాహకులకి ఎక్కడిది? గుర్రం పని గుర్రమే చెయ్యాలి, గాడిద పని గాడిదే చెయ్యాలి.

వాండలిజంసవరించు

ఇంగ్లిష్ వికిపీడియా నుంచి తెచ్చిన పరువు హత్యలు పేజిని కూడా తొలిగించింది ఈ వాండల్. మూలాలని కూడా ఎందుకు తొలిగించావు? నిజాలు వ్రాస్తే అంత భయమా? అందుకే పేజిలని మూలాలు కూడా ఉంచకుండా వాండలైజ్ చేస్తున్నావు? ఏసిడ్ దాడి పేజిని కూడా ఇలాగే చర్చ కూడా లేకుండా వాండలైజ్ చేశావు కదా.

భూస్వామ్య సంస్కృతిని బలంగా నమ్మే వారికి ఈ వ్యాసాలు ఇబ్బంది గానే ఉంటాయి. అందుకే ఆంగ్లవికీపీడియా నుంచి తెచ్చిన వ్యాసాలని తొలిగించాలని కొంతమంది కోరుతున్నారు. మా ఊరిలో అందరూ అజ్ఞానులు కనుక నాకు కూడా అజ్ఞానిగా ఉండటమే ఇష్టం అని అన్నట్టు ఉంది వీరి వాదన. నేను కూడా పుట్టింది పచ్చి మూఢ నమ్మకాల్ని నమ్మేవారున్న పల్లెటూర్లోనే. కానీ నేను ఆ ప్రగతి నిరోధక నమ్మకాల్ని వదిలిపెట్టాను. మీరేమో మా విమర్శలని వ్యక్తిగత అభిప్రాయాలని అంటూ దూషిస్తున్నారు.

ఆ వ్యాసాలతో ఇబ్బందేఁవీ లేదు. నే బట్టిన కుందేలుకు మూడే కాళ్ళూ, అన్ని నేను స్వయంగా కళ్ళతో చూసాను, నేను చూసిందే నిజం అన్నరీతిలో మీరు వ్రాసే శైలే ఇబ్బందిగా ఉంది. ఇది వరకే నేను చెప్పాను కదా, మీరు వికీ నియమాలను అనుసరించి నడుచుకోకపోతే నేను ఈ వ్యాసాలని కాపాడలేనని. నేను మీ వ్యాఖ్యలకు ప్రతిస్పందించడం ఇదే చివరి సారి. --వైజాసత్య 08:24, 27 డిసెంబర్ 2008 (UTC)

Those articles are translations of english wikipedia articles. How can telugu wiki moderators certify the canonicity of english wiki articles? If those articles are objectionable, you should first request anglo-wiki administrators to remove them. You are not privileged to remove those translations.

Every wiki is independent to make it's own decisions. Period! If you don't like. Go fly a kite --వైజాసత్య 09:28, 27 డిసెంబర్ 2008 (UTC)
You are not speaking like an educated woman. Your conduct is like that of a thumb impressioner. So, you are unable to tolerate the knowledge and upholding the ignorance.

ప్రముఖ యూరోపియన్ స్త్రీవాది క్లారా జెట్కిన్ పేజిని కూడా ఇలాగే తొలిగించింది ఈ వాండల్.

నీకు స్త్రీవాదం లాంటివి నచ్చకపోతే అది నీ వ్యక్తిగత అభిప్రాయం. అంత మాత్రాన క్లారా జెట్కిన్ పేజిని తుడిచి పెట్టడం ఏమిటి?

ధన్యవాదాలుసవరించు

అధికారి హోదాకై నేను చేసిన విజ్ఞప్తికి మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు. __మాకినేని ప్రదీపు (+/-మా) 17:24, 20 మార్చి 2008 (UTC)

మతంసవరించు

వైజాసత్య గారు,

మతంఅనే పదాన్ని ఎవరో దుర్వినియొగ పరుస్తూ వ్రాసిన వ్యాసాన్ని లోగడ మీరు తొలగించినట్లు చరిత్ర సూచించుచున్నది. నేను మరలా వ్యాసాన్ని ప్రారంబించి నాను సరిచూడగలరు.

తిరుమల శ్రీనివాస్ 09:33, 24 మార్చి 2008 (UTC)

సమాచారపెట్టె సహాయంసవరించు

వైజా సత్యా!

సభ్యులపై చర్చ:Madhusurapaneni లో ఆయన అడిగిన సహాయం (please tell me how to create an infobox. I am making one for actors! u can mail me at smadpr@gmail.com) మరియు ఆయన చేస్తున్న మూస మూస:సమాచారపట్టిక నటుడు ఒకమారు చూడ గలవు. అతను అడిగిన విషయం నాకు ఏమీ తెలియదు.

అలాగే సభ్యులపై చర్చ:Bojja లో అడిగిన సహాయం కూడా పరిశీలించగలవు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:58, 24 మార్చి 2008 (UTC)

క్రొత్త దళాల ప్రతిపాదనసవరించు

వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు) లో క్రొత్త దళాల ఏర్పాటు ప్రతిపాదించాను. ఒకసారి చూడండి - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:56, 2 ఏప్రిల్ 2008 (UTC)

ఈ వారం సమైక్య కృషిసవరించు

వైజాసత్య గారూ! ఈ వారం సమైక్య కృషిని నడిపించే మార్గంలో వికీపీడియా:ఈ వారం సమైక్య కృషి తయారు చేసాను, మూస:ఈ వారము సమైక్య కృషిలో కూడా మార్పులు చేసాను. ఇకనుండి తెలుగు వికీపీడియాలో ఉన్న మొలకలను అరికట్టడానికి కృషి చేద్దాం. ఇది సఫలీకృతం కావాలంటే దీనికి మీ కృషి చాలా అవసరం. δευ దేవా 20:10, 17 ఏప్రిల్ 2008 (UTC)

కల్లూరి చంద్రమౌళిసవరించు

వైజాసత్య గారు, వ్యాసాన్ని విస్తరించాను. చూడగలరు.Kumarrao 15:58, 20 ఏప్రిల్ 2008 (UTC)

ధన్యవాదాలుసవరించు

వైజాసత్య గారు , సినిమా వ్యాసాలలోనా ప్రయత్నాన్ని గమనించినందుకు ధన్యవాదాలు.Deepasikha 05:03, 21 ఏప్రిల్ 2008 (UTC)

Meta CheckUserసవరించు

నాకు Gopikrishna123 (చర్చదిద్దుబాట్లు) మరియు మౌర్యుడు (చర్చదిద్దుబాట్లు) sockpuppets అని అనుమానం వచ్చి, మెటాలో CheckUser విజ్ఞప్తి చేసాను. ఒక సారి చూడండి. చర్చసాయీరచనలు 12:01, 28 ఏప్రిల్ 2008 (UTC)

తెవికీ పాలసీలపై ఒక చర్చసవరించు

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 07:32, 29 ఏప్రిల్ 2008 (UTC)

విన్నపంసవరించు

నాకు ఇష్టమయితే నా నిర్వాహక హోదాను ఉపసంహరిచమని నన్ను మిమ్మల్ని అడగమని కాసుబాబుగారు చెప్పారు. నాకయితే నిర్వాహక హోదా కోల్పోవాలని లేదు. కానీ ఒకవేళ మీరందరు కలిసి నిర్ణయం తీసుకుంటే దానికి బద్దుడను.నా అంగీకారాన్ని ఇక్కడే తెలియ జేస్తున్నానునా హోదాను వెనక్కు తీసుకున్నా సాధారణ సభ్యునిగా దిద్దుబాట్లు కొనసాగిస్తాను. రవిచంద్ర(చర్చ) 09:43, 29 ఏప్రిల్ 2008 (UTC)

నిర్వహకహోదా తొలగించే హక్కులు తెవికీ అధికారులకు కూడా లేవు. నిర్వాహకహోదా తొలగించాలంటే సముదాయం చర్చ, ఓటింగు జరగాలి. ఆ చర్చ మరియు ఓటింగు ఫలితాన్ని మెటాలోని ఒక స్టీవార్డుకు విన్నవించి నిర్వాహకహక్కులు తొలగించమని నివేదించుకోవాలి. కానీ, మీకు నిర్వాహకహోదా కోల్పోవాలని లేనప్పుడు అలాంటి చర్చను మీరు ప్రారంభించకండి. ఇతర సభ్యులెవరైనా తొలగింపు చర్చను ప్రారంభిస్తే అప్పుడు దానిపై చర్చించవచ్చు. --వైజాసత్య 03:27, 30 ఏప్రిల్ 2008 (UTC)

తెలుగు వికీపీడియా ట్రాఫిక్సవరించు

ఈ విషయం మీకు తెలిసే ఉండొచ్చు. నేనెప్పటినుంచో తెలుసుకోవాలనుకుంటున్న తెలుగు వికీపీడియా ట్రాఫిక్ en:User:Henric నడుపుతున్న బీటా వెర్షన్‌లో ఉన్నది. ఇది మీకు మరియు ఇతర నిర్వాహకులకు ఉపయోగపడవచ్చు. అందులో రికార్డయిన దాని ప్రకారం మొదటిపేజీకి అత్యధికంగా 3 ఫిబ్రవరి 2008న 7,700 హిట్స్ వచ్చాయి. Hopefully this should be my last edit on telugu wikipedia. δευ దేవా 16:09, 1 మే 2008 (UTC)

నాకు తెలియదు, ఈ విషయం తెలియజేసినందుకు కృతజ్ఞతలు. తెలుగు వికీపీడీయా నుండి నిష్క్రమించాలనుకోవటం మీ వ్యక్తిగత నిర్ణయం. దాన్ని గౌరవిస్తాను కానీ నిష్క్రమణ కేవలం తెలుగు వికీ నుండేనా లేక మొత్తం వికీపీడియా నుండో తెలియజేస్తే సంతోషిస్తాను --వైజాసత్య 01:45, 2 మే 2008 (UTC)

క్రొత్త సినిమాలకు పేజీలుసవరించు

వైజా సత్యా!

మనం ఇంతకు ముందు 2000 సంవత్సరం వరకు సినిమా పేజీలు సృష్టించామనుకొంటాను. తరువాతి సినిమాలకు కూడా పేజీలు సృష్టిస్తే కనీసం సమాచారం సమగ్రంగా ఉంటుంది కదా? అవుసరమైతే నేను అనువదిస్తాను. ఈ మధ్య వచ్చిన సినిమాల గురించి మరిచిపోక మునుపే వాటి గురించి వ్యాసాలు వ్రాసే అవకాశం ఉంటుంది. వీటి గురించి ఇప్పుడు నెట్లో కూడా సమాచారం లభించే అవకాశం ఉంది. తరువాత అది కష్టం కావచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:50, 4 మే 2008 (UTC)

అవును, బాగా గుర్తుచేశారు. నేను జాబితాలు సంపాదించి ఆ పని మీద ఉంటా --వైజాసత్య 05:59, 4 మే 2008 (UTC)

రచ్చ బండసవరించు

మొదటి పేజీలో రచ్చబండ కనిపించడం లేదు. ఇదివరకు ఒకసారి ఈ సమస్య తలెత్తితే కాష్ రిఫ్రెష్ చేసుకోమన్నారు. కానీ ఇప్పుడు అలా చేసినా కనిపించడం లేదు. నేను కూడా మొదటి పేజీ సోర్సును పరిశీలించాను. అంతు చిక్కడం లేదు. ఇది ఏమైనా బ్రౌజర్ కు సంబంధించిన సమస్యా? తెలియ జేయగలరు. రవిచంద్ర(చర్చ) 09:16, 6 మే 2008 (UTC)

ఎడమవేపు మార్గదర్శకము నుంచి పైకి మార్చారా? నేను సరిగా చూడలేదు. అక్కడే ఉంది లెండి. రవిచంద్ర(చర్చ) 09:44, 6 మే 2008 (UTC)

ధన్యవాదాలుసవరించు

పైజాసత్య గారూ, నమస్కారం, మీప్రోత్సాహానికి మన॰పూర్వక ధన్యవాదాలు. తెవికీ 40,000 వ్యాసాల మైలురాయికి చేరుకోవడం హర్షణీయం, ఆ మైలురాయి దగ్గర నేను వ్రాసిన వ్యాసం వుండడం నా అదృష్టం. తెవికీ విజ్ఞానదాయకంగా రూపొందించడంలో మీ పాత్ర 'తలమానికం', మీ సూచనలకు ఎల్లప్పుడూ స్వాగతం. మిత్రుడు నిసార్ అహ్మద్ 11:49, 9 మే 2008 (UTC)

లైసెన్సు వివరాలుసవరించు

బొమ్మ:Nizamabad.jpg లో నేను పెట్టిన FAIR USE RATIONALE చూడండి. ఇది ఓకేనా! అలాగయితే మిగిలిన మండలాల బొమ్మలకు కూడా ఈ నోటీసు పెడదాము. (ఒక మూస ఉంటే మరీ మంచిది) --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:41, 14 మే 2008 (UTC)

మండలాల బొమ్మలు సొంతగా తయారుచేసినవి కాబట్టి వాటికి ఫెయిర్ యూజ్ అవసరం లేదనుకుంటా..కానీ ఈ జిల్లా పటాలు ఏమి చెయ్యాలో తెలియట్లేదు. ప్రస్తుతానికి మీరు వ్రాసింది బాగానే ఉంది. --వైజాసత్య 05:02, 16 మే 2008 (UTC)
ప్రస్తుతానికి నేను వ్రాసింది వాడుదాము. నేను వ్రాసిన విషయం ఆధారంగా {{Fair use admin division outline}} అనే మూసను తయారు చేయగలరా? వర్గం:కాపీహక్కులు సందిగ్ధంలో ఉన్న బొమ్మలు లిస్టును కుదించడానికి ప్రయత్నిస్తున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:27, 16 మే 2008 (UTC)
ఇంకొక సంగతి - బొమ్మ:1Mukhadwaram.jpgలో నేను {{GFDL assumed}} అనే మూసను పెట్టాను. ఒకమారు చూసి మీ అభిప్రాయం చెప్పండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:44, 16 మే 2008 (UTC)
Fair use admin division outline తయారు చేస్తాను. ఈ జీఎఫ్డీఎల్ అజ్యూమ్డ్ తాత్కాళికంగా ఫర్వాలేదు కానీ. వీలైనంతవరకు అలాంటి జాబితా పెరగకుండా చూసుకోవాలి. సమస్యల్లా ఎక్కడ వస్తుందంటే వికీపీడియాలో ఉన్నవన్నీ ఉచితం అని జనాలు అనుకుంటారు. అలా వికీపీడియాలో ఉన్న బొమ్మని వందలాది ఇతర సైట్లు ఉపయోగించుకుంటారు. ఆ తర్వాత దాని కాపీహక్కులు ఉన్నాయని తొలగించేసినా, అనేక ఇతర సైట్లలో ఆపాటికే చేరటం వల్ల హక్కుదారుని హక్కులకు భంగంకలుగుతుంది. కందర్ప గారు నాకు తెలుసు. ఆయన తరఫున నేను కొన్ని బొమల్ని అప్లోడు కూడా చేశాను. ఆయన అనుమతి తీసుకొని ఈ బొమ్మ లైసెన్సు మార్చేస్తా. --వైజాసత్య 05:54, 16 మే 2008 (UTC)
అవును. అసలు GFDL assumed అనే concept కూడా సమంజసం కాదనిపిస్తుంది. దాని బదులు Fair Use Assumed అని వ్రాస్తే మధ్యస్తంగా ఉంటుందనుకొంటున్నాను. కందర్ప గారు మాత్రమే కాదు. ఇంకా చాలా బొమ్మలు అలా ఉన్నాయి. అప్పట్లో కాపీ హక్కులు గురించి దృఢమైన సూచనలు ఇవ్వనందువలన వాళ్ళు కాపీ హక్కుల ట్యాగ్‌‍లు పెట్టలేదు. కనుక ఆ బొమ్మలు తొలగిస్తే కూడా వారి అభీష్టానికి విరుద్ధంగా నడచుకొన్నట్లవుతుంది అనుకొంటున్నాను. ఇక పోతే పాలిసీల మూసలు ఇదివరకు ఉన్నవి నేను గమనించలేదు. నకళ్ళను తొలగిస్తాను లేదా దారి మారుస్తాను. పాలిసీల పేజీలు వ్యవస్థీకరించడానికి కొంత సమయం పడుతుంది కాని అవసరమనిపిస్తుంది. ఒక దశకు వచ్చినాక చర్చకు ప్రతిపాదిస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:39, 20 మే 2008 (UTC)
బొమ్మ:Telugulipi evolution.jpg కాపీ హక్కుల గురించి ఏమయినా ట్యాగ్ పెట్టగలవా? ఎందుకంటే అది ఇంగ్లీషు వికీపీడియాలో పెట్టాలనుకొన్నాను. కుమారరావు గారి కోరిక మేరకు. అలాగే సమయం దొరికితే en:Talk:Telugu script కూడా చూడగలవు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:39, 20 మే 2008 (UTC)
సభ్యులపై చర్చ:Vu3ktb లో మీ వ్యాఖ్యపై నా అభిప్రాయం --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:16, 22 మే 2008 (UTC)

ఆటోమాటిక్ సభ్యులుసవరించు

ఈ రెండుమూడు రోజుల్లోనూ చాలా మంది క్రొత్త సభ్యులు "Account created automatically" అన్న వ్యాఖ్యతో నమోదు అవుతున్నారు. దీని అర్ధం ఏమిటి? ఇదేమైనా స్పామ్ లాంటిదా? ఏమి చేయాలి? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:43, 27 మే 2008 (UTC)

కాదు, వికీపీడియా ఇప్పుడు అన్ని ప్రాజెక్టుల్లోని సభ్యుల అకౌంట్లను ఏకీకృతం చేస్తోంది. అంటే ఒకే సభ్యనామంతో ఏ వికీ ప్రాజెక్టులోనైనా లాగినయ్యే సౌకర్యం ఉంది. అభిరుచుల్లో గ్లోబల్ ఖాతాను నిర్వహించుకునే అవకాశం ఉంది. అలాగే ఇది చూడండి [1]. ఈ ఆటోమేటిక్ సభ్యులు వేరే ఏదైనా వికీలో సభ్యులై ఉండి, అన్నీ వికీల్లో సభ్యనామం సృష్టించమని ఎక్కడో నొక్కి ఉంటారు (నాకూ ఇది ఎలా చెయ్యాలో వివరాలు పూర్తిగా తెలియదు) --వైజాసత్య 23:01, 27 మే 2008 (UTC)

వైజాసత్య గారికి కృతజ్ఞతలు,అభినందనలు :-)సవరించు

నేను రఘు గారి ఫోటో(http://ilovehyderabad.com/interviews/interviews-i-write-with-the-light.html) నుండి సేకరించాను. మీరు తెలియపరచినట్టు నేను సోర్సు ఇవ్వటం మరచినట్టు ఉన్నాను.తెలియ పరచినందుకు కృతజ్ఞతలు. నాకు అర్థం కాని విషయం రఘు గారి వ్యక్తిగత విషయాలు (ఎవరి ద్వారా వి.ఎస్.ఆర్ స్వామి గారి దగ్గర చేరింది) ఎలా తెలుసుకున్నారు.తెవికి లో మీ కృషి చూస్తుంటే మీ కింత ఓపికా,శక్తి ఎలా వొచ్చాయో అని ఆచర్య మేస్తుంది.మీ కృషి కి అభినందనలు. నేను ఎం.వి.రఘు గారి దగ్గర పనిచేశాను.ఆయన అవార్డ్ ఫోటోలు,వర్కింగ్ స్టిల్ల్స్,కామేరామన్ గా చేసిన సినిమాల వివరాలు వ్యక్తీ గతంగా సేకరించి అప్లోడ్ చేస్తే సోర్సు ఎలా ఇవ్వాలో సందేహం.తీర్చగలరు. వ్యక్తిగతంగా సేకరించాను అని తెలిపితే వుంచుతారా?! లేక కాపీ హక్కుల గొడవ కారణముతో తీసేస్తార!? కొందరు ఘనులు వున్నారు తెసేసేదానికి.అందుకే సందేహం వాసు. bojja 13:42, 2 జూన్ 2008 (UTC)

మీరు పైన ఇచ్చిన లింకులోని ఇంటర్యూలో రఘుగారు స్వయంగా చిత్రరంగములో ఎలా ప్రవేశించారో చెప్పారు. నేను అదే చేర్చాను తప్పు నాకు ప్రత్యేకంగా ఏమీ తెలీదు. మీరు రఘుగారు స్వయంగా తెలుసుకాబట్టి స్వయంగా సంపాదించిన ఫోటోలు పెడితే సదుపయోగం ద్వారా తెచ్చుకున్నవి తీసెయ్యవచ్చు. మూలాలని నమ్మశక్యం కానీ విషయాలకు, వివాదాస్పదమైన విషయాలకు మరీ గుచ్చి అడుగుతారు. కానీ మీరు రఘుగారి గురించి వ్రాసే మామూలు సమాచారానికి అంత ఖచ్చితంగా మూలాలు అక్కర్లేదు కానీ మీరు వ్రాసిన వాటికి వీలైతే వాటిని బలపరుస్తూ ఎక్కడైనా తర్వాత సమాచారం కనిపిస్తే దాన్నే మూలంగా ఉదహరించవచ్చు. ఫోటోలకు ఎలాగు వ్యక్తిగతంగా సేకరించినట్టు అప్లోడ్ చేస్తారు. సమాచారానికి అలా వ్రాయవలసిన అవసరం లేదు. సొంతగా సమాచారం సేకరించడానికి, ప్రాథమిక రచనకు ఒక సన్ననిగీత ఉంది. సొంతగా సమాచారం సేకరించాం అంటే క్షుణ్ణంగా పరిశీలించని వాళ్ళు అది ప్రాథమిక రచన అని పొరబడి తీసివేసే అవకాశం ఉంది. ఉదాహరణకి రఘు గారి పుట్టినరోజును ఆయన్ని అడిగి మీరే సొంతగా సేకరించారనుకోండి అది మూలాలు లేకపోయినా ప్రాథమిక రచన కాదు ఎందుకంటే మీరు ప్రపంచములో మొట్టమొదటిసారి రఘుగారి పుట్టినరోజు ఇది అని కనుక్కోవటం లేదుకదా. ఇంకో సంబంధిత ఉదాహరణలో పోతన పుట్టిన రోజును వివిధ చారిత్రక, శాసన, సాహితీ ఆధారాలతో ఫలానాతేదీ అని మీరు నిగ్గుతేల్చారనుకోండి అది మీరు వికీపీడియాలో చేర్చటానికి లేదు. వికీపీడియాలో ఆ విషయం చేర్చటానికి మీరుదాన్ని ఇంకెక్కడైనా ప్రాధమికంగా ప్రచురించి ఉండాలి. --వైజాసత్య 00:30, 3 జూన్ 2008 (UTC)

3 లక్షో దిద్దుబాటుసవరించు

తెలుగు వికీపీడియా 3 లక్షల దిద్దుబాట్లను దాటేసిందని ఇవాళే గమనించాను. వికీపీడియా:వికీపీడియా మైలురాళ్ళు పేజీలో 3లక్షో దిద్దుబాటును ఎవరు చేసారనే దానిని మార్చాను. ఒకసారి గమనించి మీ సలహాలను కూడా ఇవ్వండి. --మాకినేని ప్రదీపు (+/-మా) 11:24, 3 జూన్ 2008 (UTC)

సినిమా మూస, వగైరాసవరించు

 • {{సినిమా}} మూసలో ఏదో పొరపాటున్నట్లుంది. "year" పరామితికి సంబంధించినది. చూడగలరా?
 • ఫైర్‌ఫాక్స్-3 పెట్టుకొన్నాక ఎడిట్ పెట్టెపైన "తెలుగులో వ్రాయడానికి టిక్కు పెట్టండి" చెక్ బాక్సు రావడం లేదు. పైన ఉండాల్సిన బటన్స్‌లో కూడా కొన్ని కనిపించడంలేదు. దీన్ని గురించి ఏమయినా తెలుసా?

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:34, 19 జూన్ 2008 (UTC)

సినిమా మూసను సరి చేస్తాను. ఫైరుఫాక్సు మూడుతో నాకు అదే సమస్య. యూజర్ స్క్రిప్టులేవి పనిచేస్తున్నట్టులేవు. ఒక వారం నుండి ఇండిక్ ఇన్పుట్ తో మార్పులు చేర్పులు చేస్తున్నా. ప్రదీపుని కనుక్కోవాలి --వైజాసత్య 00:30, 20 జూన్ 2008 (UTC)
సినిమా మూసలో పైన సినిమా పేరు ప్రక్క ఆ సంవత్సరం సినిమాల జాబితా వ్యాసంకు లింకు బ్రాకెట్లలో వస్తున్నది. ఇది ఓకే. దీనికి అదనంగా "వర్గం:ఫలాని సంవత్సరం సినిమాలు" కూడా ఇదివరకు వచ్చేది. ఇప్పుడు రావడం లేదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:44, 20 జూన్ 2008 (UTC)

థాంక్స్సవరించు

వైజాసత్యగారు! నా పునరాగమనాన్ని మళ్ళీ స్వాగతిస్తున్నందుకు థాంక్స్ δευ దేవా 08:22, 23 జూన్ 2008 (UTC)

సత్యా గారూ ఉన్నవ లక్ష్మీ నారాయణ పంతులు గారిని గురించిన వ్యాసం వికీలో ఉందా?. నేను ఎక్కడ సెర్చ్ చేసినా లభ్యం కాలేదు(గూగుల్లో కూడా. కొంచెంచూసి చెప్పగలరా--విశ్వనాధ్. 06:46, 30 జూన్ 2008 (UTC)

కోహినూరు వజ్రముసవరించు

కోహినూర్ వజ్రం అనే వ్యాసమున్నదని తెలియక మొదలుపెట్టాను. రెండూ కలిపివేయండి. ఎలా చేయాలో నాకు తెలియదు.Kumarrao 05:19, 7 జూలై 2008 (UTC)

మొదటి పేజీ కాలమ్ సైజులుసవరించు

వైజా సత్యా, మొదటి పేజీలో - నా కంప్యూటర్‌లో - ఎడమ ప్రక్క కాలమ్ (స్వాగతం, ఈ వారం బొమ్మ, మార్గ దర్శిని ఉన్న కాలమ్), కుడి ప్రక్క కాలమ్ (ఈ వారం వ్యాసం, మీకు తెలుసా, చరిత్రలో ఈ రోజు ఉన్న కాలమ్) కంటే ఎక్కువ వెడల్పుగా అనిపిస్తుంది. రెండు కాలమ్‌లూ ఒకే సైజు ఉంటే బాగుంటుందనుకొంటున్నాను. చూడ గలరా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 07:12, 7 జూలై 2008 (UTC)

pdf ఫైళ్ళ వినియోగంసవరించు

వైజా సత్యా! రహమతుల్లా గారు కొన్ని pdf ఫైళ్ళు అప్‌లోడ్ చేశారు. ఇంకా ఇతరులు కూడా చేసి ఉండొచ్చు. ఇలాంటి వాటిని ఎలా ఉపయోగించాలి? నాకు అర్ధం కాలేదు. ఆంగ్ల వికీలో ఇందుకు సంబంధించిన సూచనల పేజీ ఏదైనా ఉంటే నాకు లింకు ఇవ్వ గలవా? నేను వెతికితే దొరుకలేదు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:04, 9 జూలై 2008 (UTC)

రహంతుల్లా గారు తమ సొంతరచనలను ఇక్కడ అప్లోడ్ చేసినట్టున్నారు. వాటిని తొలగించాలి. వికీపీడియాలో ఫీ.డీ.ఎఫ్ ల తో పనిలేదు. ఎందుకంటే అవి కనిపించవు కూడాను. అంత ప్రాముఖ్యమై అవి భద్రపరచయోగ్యమైన పీ.డీ.ఎఫ్లైతే కామన్స్లో ఎక్కించాలి. అయినా బొమ్మలగాగానీ, పాఠ్యముగాగానీ కాకుండా ఫీడిఎఫ్లను భద్రపరచవలసిన సందర్భాలు చాలా అరుదు. వికీసోర్సులో కూడా ఎక్కించవచ్చు. కానీ అక్కడా వీటిని నేరుగా చూసే సౌలభ్యంలేదు. ఈ విషయమై ఇక్కడ కొంత చర్చ జరిగింది చూడండి. ఇవి ఆయన సొంత రచనలై కాపీహక్కులు త్యజించే పక్షాన కామన్స్లో అప్లోడ్ చేయటం మంచి పద్ధతి. --వైజాసత్య 23:46, 11 జూలై 2008 (UTC)

నా సభ్యనామం తెలుగులోసవరించు

వైజాసత్య గారూ నమస్తే, నా సభ్యనామం ఆంగ్లంలో "Ahmadnisar" అని యున్నది, దానిని 'తెలుగు' లో "అహ్మద్ నిసార్" గా చూడదలచుకున్నాను. దానిని మార్చాలంటే తెవికీ అధికార్లకు తెలియజేయాలని గమనించాను, మీరు నా సభ్యనామాన్ని తెలుగులో మార్పు చేయాలని కోరుకుంటున్నాను. మిత్రుడు నిసార్ అహ్మద్ 14:09, 11 జూలై 2008 (UTC)

మీ పేరును తెలుగులోకి మార్చాను. లాగిన్ అయ్యి చూసుకోండి :-) --వైజాసత్య 23:33, 11 జూలై 2008 (UTC)
ధన్యవాదాలు. ఇంకో చిన్న ప్రశ్న, లాగిన్ అవ్వాలని, సభ్యనామం 'అహ్మద్ నిసార్' అని టైపు చేస్తే, ఆంగ్లంలో 'Ahmadnisar' అని టైపు అవుచున్నది. వేరేచోట 'అహ్మద్ నిసార్' టైపు చేసి కాపీ చేసి పేస్ట్ చేసి లాగిన్ అయ్యాను. సభ్యనామాన్ని డైరెక్టుగా తెలుగులో టైపు చెయ్యలేమా? ఏదైనా మార్గం చూపండి, ధన్యవాదాలు. మిత్రుడు నిసార్ అహ్మద్ 09:15, 12 జూలై 2008 (UTC)

TUSC token c3c30de9345269abe92bf98ec2e9e9feసవరించు

I am now proud owner of a TUSC account!

మూలాలుసవరించు

అన్ని వ్యాసాలలో తగు చోట్లమూలాలు పొందుపరచి తిరగ వ్రాస్తాను.Kumarrao 15:47, 18 జూలై 2008 (UTC)

మీ పేరుసవరించు

వైజా సత్య గారూ! మీ అసలు పేరు రవి యా! ఊరికే తెలుసుకుందామని. నా పేరు కూడా రవి కదా! అందుకని :-)

రవిచంద్ర(చర్చ) 03:57, 6 ఆగష్టు 2008 (UTC)

అవును నా పేరు రవి వైజాసత్య :-) --వైజాసత్య 23:02, 6 ఆగష్టు 2008 (UTC)

Attn Pleaseసవరించు

Look here చర్చసాయీరచనలు 15:58, 9 ఆగష్టు 2008 (UTC)

వైజాసత్య గారు! ఒక చిన్న సమస్యండి. స్క్రిప్ట్ లాగిన్ అయి ఉంటేనే పనిచేస్తున్నట్టుంది. ఒకసారి వేదిక:ఆంధ్ర ప్రదేశ్/బొమ్మ ఈ పేజీ లాగిన్ అయి మళ్ళీ లాగ్ అవుట్ అయి చూడండి, మీకర్థమవుతుంది, సమస్యేమిటో! హెడర్ మాయమవుతుంది, లాగ్ అవుట్ అవగానే! మీరు వేరే ఫైల్ లో పేస్ట్ చెయ్యాలేమో! మీడియావికీ:Common.css కి బదులు మీడియావికీ:Monobook.css లో చెయ్యాలేమో! δευ దేవా 22:39, 9 ఆగష్టు 2008 (UTC)
నాకు లాగవుట్ అయినా హెడర్ బాగానే కనిపిస్తుంది. common.css లో అతికిస్తేనే అందరికీ వర్తిస్తుంది. ఒక్కొక్క సభ్యుడు ప్రత్యేక డిజైను మార్పులు చేసుకోవటానికే మోనోబుక్.సిఎసెస్ వాడాలి. ఇంకా మీరు తయారు చేసిన హెడర్ను కూడా కామన్ సిఎసెస్ లో అతికించా --వైజాసత్య 19:54, 10 ఆగష్టు 2008 (UTC)
thanks Vyzasatya. I dont know why but I am not able to type in telugu properly. త్తీల్లూగ్గూ this is what I am getting when I try to type telugu in telugu script. Every key press is giving double characters. δευ దేవా 22:49, 10 ఆగష్టు 2008 (UTC)

Bot username renameసవరించు

Hi, I'd like my bot సభ్యులు:కంప్యూటరు to be renamed to User:タチコマ robot. This rename request is per my wikimedia wide bot username rename. I have decided to have a single username to more efficiently use SUL. Thanks.

 • If this is not the right place to make this request, please move it to the right place.

-- Cat chi? 15:48, 13 ఆగష్టు 2008 (UTC)

Done per m:Steward requests/Username changes. —Pathoschild 00:13:54, 06 సెప్టెంబర్ 2008 (UTC)

SUL requestసవరించు

Dear bureaucrat. This is joseph from Turkish Wikipedia. I want to usurp the account named locally as "joseph" for SUL merge. Here is confirmation Thanks. (any message here please) --88.227.206.227 16:58, 17 ఆగష్టు 2008 (UTC)

వివరణసవరించు

కళింగ యుద్ధం చర్చ తొలగించడం పొరపాటయితే మన్నించండి. సదరు సభ్యుడే ఇతర చోట్ల అసభ్యకరమైన పదజాలం వాడాడు. అందుకని తుడిచి వేశాను. వాటిని తుడిచేయడం తప్పు కాదనుకుంటాను. రవిచంద్ర(చర్చ) 10:11, 30 ఆగష్టు 2008 (UTC)

సభ్యుని పేరు మార్పుసవరించు

సభ్యులు:Suresh kalavala వారి సభ్యత్వం పేరు మార్చుకోవాలనుకొంటున్నారు. ఒకసారి వారి సభ్యపేజీని చూడండి.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:40, 31 ఆగష్టు 2008 (UTC)

మూస:భారత స్థల సమాచారపెట్టెసవరించు

రవి గారూ! ఈ మూసలో ఇంక్లూడ్ ఓన్లీ వర్గం మార్చాలేమో! నేను ప్రయత్నించాను కానీ ఆ మూస రక్షిత మూస అనుకుంటా! చదలాడ చూడండి మీకు అర్థం అవుతుంది. వర్గం Villages in ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది. దాన్ని జిల్లాకు గానీ మండలానికి గానీ మార్చాలి మరియు తెలుగులోకి అనువదించాలి. అర్థమైందనుకుంటా! δευ దేవా 20:00, 1 సెప్టెంబర్ 2008 (UTC)

సత్యగారు నేను నా పేరు తెలుగులో మార్ఛుకోవాలి అని అనుకుఛున్నాను, నా లాగిన్ పేరు అశోక్ శ్రీపాద (ashok Sreepaada) అని కావాలి. కాకుంటే ఇక్కడ శ తరువాత ర రావడం లెదు. దయచేసి మార్చగలరు. కృతజ్ఞతలో .అశోక్ 16:25, 17 సెప్టెంబర్ 2008 (UTC)


కృతజ్ణతలుసవరించు

సత్య గారు నా పేరు మార్ఛినందుకు దన్యవాదములు. అశోక్ 12:18, 18 సెప్టెంబర్ 2008 (UTC)

కృతజ్ఞతలుసవరించు

చూడముచ్చటైన వన్నెలతారను బహుకరించిన వైజాసత్యా గారికి కృతజ్ఞతలు. -- C.Chandra Kanth Rao(చర్చ) 15:51, 2 నవంబర్ 2008 (UTC)

శివ కృతజ్ఞతలుసవరించు

సత్య గారూ! నమస్తే. నాకు సభ్యుల తరఫున మీరు ఇచ్చిన 'తెలుగు పతకం' అనందంతో తలమునకలవుతూ వినమ్రంగా స్వీకరించాను. నేను వ్రాసిన, వ్రాస్తున్న వ్యాసాలకు ఇది ఒక ఊహించని ఆదరణ, ఒక అద్భుతమైన ప్రోత్సాహపూర్వమైన ప్రేరణ. ధన్యవాదములు.--SIVA 05:07, 3 నవంబర్ 2008 (UTC)

Bot flag for Luckas-botసవరించు

Hi. I made a request here and the bureaucrat Mpradeep left the following message: "Bot status granted for telugu wikipedia. Thanks for working with telugu wikipedia. ", but he forgot to give me the bot flag. Please, give me bot status and to the others users who are waiting. Luckas Blade 15:01, 9 నవంబర్ 2008 (UTC)

సరిదిద్ద గలరుసవరించు

పైజాసత్యా గారు నమస్తే, స్వర్గం వ్యాసపు చర్చా పేజీలో 'స్వర్గం (సినిమా)' చర్చ యున్నది. సరిదిద్ద గలరు. నిసార్ అహ్మద్ 12:48, 10 నవంబర్ 2008 (UTC)

గమనించ వలెనుసవరించు

రవీ (వైజా సత్య) ‍మరియు రవీ (రవి చంద్ర) ! నేను డిసెంబరు మాసంలో ఆఫీసు పనిలో బిజీగా ఉంటాను. 2009 జనవరి, ఫిబ్రవరి నెలల్లో సెలవు లేదా పని వత్తిడిలో ఉంటాను. కనుక ఈ విషయాలు గమనించగలరు. (1) ఈ వారం వ్యాసం, ఈ వారం బొమ్మలు 52 వారాల వరకు సిద్ధం చేస్తాను. 2009 బొమ్మలు, వ్యాసాలు కొంత కాలం మీరు చూసుకోండి. (2) ఈ రోజు చిట్కా ఖాళీగా ఉన్న రోజులలో రవి పూర్తి చేయగలడనుకొంటాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:01, 24 నవంబర్ 2008 (UTC)

Thanksసవరించు

Thanks వైజా సత్య గారూ. I wish to type in English till the time I get used to typing in Telugu. Hope you would not mind. Nkamatam 19:34, 3 డిసెంబర్ 2008 (UTC)

అనామక సభ్యుడుసవరించు

వైజాసత్య గారూ! అనామక సభ్యుని వ్యవహారం శృతి మించుతున్నది. కనీసం చర్చించకుండా ఇష్టం వచ్చినట్లు మార్పులు చేస్తున్నారు. ఏదో ఒక చర్య తీసుకోవాలి. రవిచంద్ర(చర్చ) 05:10, 4 డిసెంబర్ 2008 (UTC)

సూచనసవరించు

వైజాసత్య గారు, మీ సూచన అంగీకరిస్తాను. కానీ చారిత్రక సత్యాలకు, సమకాలీన దారుణాలకు కారణభూతమైన మూలాలకు శాంతి ముసుగు కప్పి, నిజాన్ని ఒప్పుకొనే ధైర్యము లేని కుహనా ఉదారవాదులు అసలు తీవ్రవాదులకన్నా అపాయకరము. ఇట్టివారి అసలు స్వరూపము నిజాలను దాచడానికి చేయు ప్రయత్నములలోనే బయలు పడుతుంది. నిజము చెప్పుట విషము కక్కుట కాదు. మత మౌఢ్యాన్ని మనసులో దాచి దారుణమారణ కాండలకు కుంటిసాకులు వెదకుట అసలైన విషస్వభావము.Kumarrao 10:36, 5 డిసెంబర్ 2008 (UTC)

మాతృభాషా 'ప్రేమికుల'కు పరభాషలపై, పరదేశములపై, పరతత్వములపై ప్రేమ దేనిని సూచిస్తుందో?Kumarrao 11:39, 5 డిసెంబర్ 2008 (UTC)
తెలుగు వికీపీడియాలో తెలుగు బాష, తెలుగు సంస్కృతి, తెలుగు నేల, తెలుగు వ్యక్తులకు సంబంధించిన వ్యాసాలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, ఇవ్వాల్సి ఉంటుందని నేను ఇది వరకే తెలియజేశాను. అది హద్దులు దాటినట్లు ఎప్పుడో గమనించాను. కుమారరావు గారికి తెలుగు బాషపై మమకారం అతని రచనల ద్వారా ఎప్పుడో గ్రహించాను. ఆంగ్ల వికీలో తెలుగు బాషపై కన్నడిగులు జర్పిన దాడిపై అవిశ్రాంత పోరాటం జరిపిన సభ్యుడతను. -- C.Chandra Kanth Rao(చర్చ) 13:51, 5 డిసెంబర్ 2008 (UTC)
కుమారరావు గారూ, పై ఒక్క వ్యాక్యం అర్ధం చేసుకోవటానికి చాలా కష్టపడ్డాను. అక్కడ చాలా ఎమోషన్స్ కనిపించాయి. నేను చారిత్రక సత్వాన్ని ఎప్పుడూ కప్పిపెట్టమని చెప్పలేదు. జడ్జిగా తీర్పు మాత్రం ఇవ్వద్దని చెప్పాను అంతే తైమూర్ లంగ్ వ్యాసాన్ని కాస్త సమగ్రంగా వ్రాయాలి అన్నాను. ఇలాంటి అప్రత్యక్షణా సంభాషణ మాధ్యమంతో అక్షరాలకు ఎమోషన్స్ జోడించడం వళ్ళ అపార్ధం చేసుకొనే అవకాశాలు మెండు. --వైజాసత్య 15:09, 5 డిసెంబర్ 2008 (UTC)
వైజసత్య గారు, నేను పైన వ్రాసినదేదీ మీ గురించి ఉద్దేశించినది గాదు. "తెలుగు భాషా ప్రేమికులు" కొందరు తెలుగు వికీలో పరభాషలపై, పరవేషాలపై, పరతత్వాలపై, పరదేశాలపై మెండైన ప్రేమ ఒలకబోస్తూ ఉదారవాదులుగా చలామణీ అవుతున్నారు. వారి గురించి మాత్రమే. నేను అనేది కూడ చార్రిత్రక సత్యాలను గుర్తించమనే. చరిత్ర ఏదోఒకనాటికి తీర్పునిస్తుంది. అప్పటిదాకా మతము పేరుమీద మానవ జాతిని అంతము చేబూనిన విషశక్తులు భూమాతను ఉండనిస్తే. Kumarrao 15:49, 5 డిసెంబర్ 2008 (UTC)

సి.పి.బ్రౌన్ కు తెలుగు భాష మీద, బ్రజ్‌నారాయణ్ చక్‌బస్త్ కు ఉర్దూభాష మీదా, ఆర్.కే. నారాయణ్ కు ఇంగ్లీషు భాష మీద, ప్రేమ ఎందుకు పుట్టుకువచ్చిందో, దేనిని సూచిస్తుందో?????? పర.. పర.. పర.. పదాలు ఉపయోగించే బ్రిటిష్ తత్వజ్ఞులకు (విభజించు పాలించు అనే నైజం ఉన్నవారికి) అర్థం కావాలంటే ఏమీ చేయాలో నాకు తెలియదు. ఎవరైనా తెలిపితే, సంతోషంగా స్వీకరిస్తాను. పరాయి వాడికి ప్రేమించలేనివాడు (నా పక్కింటి వాడు హిందూ సోదరుడు), పరాయి భాషను ప్రేమించలేనివాడు (నాకు తెలుగు పరాయిభాష అనేవారికి ఇదో జవాబు, నేను చదివింది తెలుగు మీడియంలో), అసలు సమాజాన్ని ప్రేమించగలడా?. నేను తెలుగులో కవితలు వ్రాయగలను, నా హిందూ సోదరుడు 'అనిల్' ఉర్దూలో కవితలు వ్రాయగలడు, మేమంతా అనుమానించబడేవాళ్ళు అన్నమాట. బాగుంది, చక్కటి తర్కం. ఒకరి నైజాన్ని వారు ఎంత దాపెట్టాలన్నా వారు దాయలేరు, బయట పడిపోతారు, అందరూ గమనిస్తున్నారు. నిసార్ అహ్మద్ 15:53, 5 డిసెంబర్ 2008 (UTC)

పదాలను, వాక్యాలను తలమీద నిలబెట్టి అర్ధం చేసుకుంటే వచ్చే తిప్పలివే. వ్యక్తులు గానీ, దేశాలు గానీ, మతాలుగానీ చేతలని బట్టి మాత్రమే తీర్పు పొందుతాయి. మాటలనిబట్టి కాదు.Kumarrao 16:34, 5 డిసెంబర్ 2008 (UTC)

సుత్తి - మేకు - తత్వవేత్తసవరించు

"సుత్తి ఉన్నవాడికి సమస్యలన్నీ మేకుల్లానే కనబడతాయని ఒక తత్త్వవేత్త అన్నారు." ఎవరో కొంచెం తెలుపగలరు. సుత్తి ఉన్నవాడు నిజంగానే సమస్యల మేకులను బలంగా కొట్టి సమస్యలను ఇంకా జటిలం చేస్తాడు. ఎంత సుతిమెత్తని వ్యాఖ్య, బాగున్నది.

భర్తృహరి గారి సంసృత కవిత్వాన్ని తర్జుమా చేస్తూ ముహమ్మద్ ఇక్బాల్ ఈ విధంగా కవిత వ్రాస్తారు;

"ఫూల్ కీ పత్తీ సె కట్ సక్తాహై హీరే కా జిగర్ ;;; మర్‌దె నాదాఁ పర్ కలామె నర్మ్ ఒ నాజుక్ బే అసర్"

తాత్పర్యం : వజ్రపు (కఠినమైన) హృదయం, (నాజూకైన) పూరేకులతో కోయబడచ్చు గానీ ;;; మార్ఖుడి (మర్‌దె నాదాఁ) పై నాజూకైన మాటలు వ్యర్థమౌతాయి. నిసార్ అహ్మద్ 11:06, 5 డిసెంబర్ 2008 (UTC)

సత్యా గారూ మీ మెయి ఐడి కావాలి కొన్ని వికీకి సంభందం కాని విషయాలు అడిగేందుకు. నామెయిల్ bkviswanadh@gmail కు పంపగలరు.కృతజ్నతలు.విశ్వనాధ్.

స్వాగతం స్క్రిప్టుసవరించు

ప్రదీప్, ఒకసారి స్వాగతం స్క్రిప్టు నడపగలరా? చాలా స్వాగతాలు పెండిగులో ఉన్నట్టున్నాయి --వైజాసత్య 06:40, 11 డిసెంబర్ 2008 (UTC)

ఆ స్క్రిప్టు ఎక్కడో పోయింది! మళ్లీ రాసి నడుపుతాను ఒక సారి. __మాకినేని ప్రదీపు (+/-మా) 14:18, 11 డిసెంబర్ 2008 (UTC)
(1) ప్రదీప్! నేను manual గా ఇప్పటికి పెండింగులో ఉన్న స్వాగత సందేశాలు పూర్తి చేస్తాను. (2) వైజాసత్యా! "క్రైస్తవులపై అకృత్యాలు", "ముస్లిములపై అకృత్యాలు" - ఈ వ్యాసాలు తొలగించడానికి ఇచ్చిన కారణం ("ఆంగ్లంలో ఉన్నది") అంత సబబుగా అనిపించడంలేదు. అనువాదానికి తగిన సమయం ఇవ్వలేదు గదా? కనీసం రెండు వారాలయినా వేచి ఉండడం మంచిది. (అసలు అవి ఎప్పుడు ప్రారంభించారో నాకు తెలియదు)--కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:02, 12 డిసెంబర్ 2008 (UTC)
అవును అక్కడ కొద్దిగా తొందరపాటుగా వ్యవహరించినట్టు ఉన్నా. గుర్తుచేసినందుకు కృతజ్ఞతలు --వైజాసత్య 15:29, 12 డిసెంబర్ 2008 (UTC)
పునస్థాపించవచ్చును --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:13, 12 డిసెంబర్ 2008 (UTC)

ఒకసారి మూస:తెలుగు సినిమా సందడి చూడగలరా? అది వాడిన పేజీలలో full page widhthలో వస్తున్నట్లున్నది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:30, 13 డిసెంబర్ 2008 (UTC)

అభినందనలుసవరించు

గత కొన్నిరోజులుగా తెవికీలో నెలకొనివున్న అయోమయాన్ని, తెవికీని తీర్చిదిద్దుటలో మీరు తీసుకున్న చర్యలకు అభినందనలు. సోదరుడు. నిసార్ అహ్మద్ 05:08, 14 డిసెంబర్ 2008 (UTC)

మీ స్వాగతానికి నా కృతజ్ఞతలు. ఇప్పుడు తెలుగులో టైపు చేయడం చాలా హాయిగా ఉంది. మీ నిర్వహణలో తెవికీ 50,000 వ్యాసాలకు చేరువైనందుకు నా అభినందనలు - ఈ మైలురాయిని చేరుకోవడానికి ఉడతాభక్తిగా నా సహాయం అందిస్తాను. ఏకవచన ప్రయోగం కొంచెం ఇబ్బందిగా ఉంది. :-) --Gurubrahma 08:20, 14 డిసెంబర్ 2008 (UTC)

విమర్శలుసవరించు

రహంతుల్లా గారు ఏదో కథ విని ఎదో చెప్పారని ఈదీ అమీన్ పేజి ఎందుకు ఎడిట్ చేశారు? ఈదీ అమీన్ నిజంగా నర మాంసం తినే వాడు. వాడు శవాలని కోసి ఫ్రిజ్ లో పెట్టి రాత్రి డిన్నర్ చేసుకునేవాడు.

నేను ఎవరి కథలు విని ఈదీ అమీన్ వ్యాసం దిద్దలేదు. మీరు చెబుతన్న "కథ"నే నిజం అని ఎందుకు నమ్మాలి? --వైజాసత్య 06:47, 21 డిసెంబర్ 2008 (UTC)

ఇవేమి వ్యాసాలుసవరించు

వైజాసత్య గారు, ఇటీవల అతికొద్ది సమాచారంతో హేతువాదులు సృష్టిస్తున్న వ్యాసాలు చాలా వస్తున్నాయి. ఇలాంటి చిన్న చిన్న వ్యాసాల వల్ల ఉపయోగం లేనేలేదు. అతడు హేతువాదు, అతడు ఈ పుస్తకాన్ని రచించాడు అని రాస్తే సరిపోతుందా! విజ్ఞానసర్వస్వం యొక్క అసలు లక్ష్యం ఏమిటి? ఆ వ్యాసాల వలన ఎవరికి ప్రయోజనం? ఇలా చేయడం పిల్లచేష్టలు తప్ప మరేమీకాదు!! తనవాదాన్ని వినిపించడానికి తప్ప మరేమీ పనికిరావు!!!ఈ వ్యాసాలపై ఒకసారి దృష్టిసారించండి. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:34, 27 డిసెంబర్ 2008 (UTC)

హేతువాదుల వ్యాసాలను విస్తరిస్తామని రహంతుల్లా గారు కొంత సమయం ఇవ్వమని అడగడం నేను వాటిని తుడిచివెయ్యలేదు. ఏదో ఒక వ్యాసం యొక్క చర్చా పేజీలో ఈ సంభాషణ జరిగింది. ఇలాంటి కేవలం హేతువాది అయినంత మాత్రాన వ్యాసాలు సృష్టించలేము. ప్రతి ఒక్కరు ఏదో ఒక వాదులే అంత మాత్రం చేత వాళ్లకు పేజీలు సృష్టించలేము. ఈ దిశగా విషయ ప్రాధాన్యత పాలసీలను నిర్ణయించేందుకు నేను వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)లో కొన్ని ప్రతిపాదనలు చేశాను. వాడికి జోడింపులు, చర్చలు, విస్తరణలలో మీరు పాల్గొనండి --వైజాసత్య 20:43, 27 డిసెంబర్ 2008 (UTC)
 • పింగళి దశరధరామ్ గురించి నేను చెప్పింది తక్కువ.ఇతరులు చెప్పింది ఎక్కువ.వ్యాసాలకు మొదట్లోనే ఎక్కువ సమాచారం కావాలంటే దొరకదు.కాలక్రమేణా తల ఒక చెయ్యి వేసి వ్యాసానికి వన్నె తెస్తారు.కొంత సమయం కేటాయించండి.ఆసమయం లోపు తగినంత ఎక్కువ సమాచారం ఆ వ్యాసానికి ఎవరూ జోడించలేకపోతే ఆ వ్యాసాన్ని తొలగించండి.లేదా ఒక ముఖ్య శీర్షికలో ఇలాంటి వ్యక్తుల సమాచారం ఉప శీర్షికలుగా పేర్కొనవచ్చు.--Nrahamthulla 02:08, 28 డిసెంబర్ 2008 (UTC)

తెలుగు వికీపీడియాకు మారుపేరు వైజాసత్య గారుసవరించు

ప్రారంభం నుంచి తెలుగు వికీపీడియాకు అహర్నిషలు కృషిచేసిన వైజాసత్య గారి పైన కొందరు పిచ్చిపట్టిన అనామక వ్యక్తులు విమర్శలు చేయడం భాధ కలుగుతుంది. ఇది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేనేలేదు. తెలుగు వికీపీడియన్ల సంపూర్ణ మద్దతు అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వైజాసత్య గారికి ఉంటుంది. వైజాసత్య గారు ఏది చేసిననూ అది తెవికీ అభివృద్ధికేనన్న మాట సంపూర్ణ తెలుగు సమాజానికి తెలుసు. తెలుగు వీపీడియాపై విమర్శలు చేసిన పిచ్చి వ్యక్తికి ఏ మాత్రం జ్ఞానం ఉన్నా ఇక ఈ విజ్ఞానసర్వస్వం లోకి రానేకూడదు. అతను చేసిన అన్ని రచనలకు ఇక తొలిగించడమే తరువాయి. దీనికి చర్చ కూడా అనవసరం. తెలుగు వికీపీడియాకు వ్యతిరేకంగా నీచవ్యాఖ్యలు చేసిన అతడి రచనలను మనం మాత్రం ఎందుకుంచాలి. సభ్యులందరూ దీన్ని గమనించగలరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 08:57, 28 డిసెంబర్ 2008 (UTC)

చంద్రకాంతరావు గారూ, మీ అభిమానానికి కృతజ్ఞతలు. తెవికీ మారుపేరు వైజాసత్య అనటం నాకు నచ్చలేదు. ప్రారంభంలో నేను, చదువరి గారూ తెవికీ సగం మొత్తం మనిద్దరమే అనుకొని వాపోయాము. అలా అనుకోవటం కూడా మిగిలిన సభ్యులందరినీ అవమానపరిచినట్టువుతుంది. ఇది వరకు నేను చెప్పినట్టుగానే అజ్ఞాత సభ్యులు ప్రారంభించినా చాలా వ్యాసాలకు సూత్రప్రాయంగా అభ్యంతరమేమీ లేదు. కానీ అవి వ్రాసిన తీరు బాగాలేదు. వీలైనవాటిని సరిదిద్దాలి. మరీ విస్తరణకు కానీ సవరణకు కానీ నోచుకోవనుకున్న వాటిని తొలగించాలి. తెవికీని మార్క్సిస్టు ప్రచారానికి వేదిక చేసేందుకు ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. సరైన పద్ధతిలో వామపక్ష, నాస్తిక మరియు హేతువాద అంశాలు కూడా పొందుపరచాలి. --వైజాసత్య 09:15, 28 డిసెంబర్ 2008 (UTC)
వైజాసత్య గారు, ప్రారంభం సంగతి నాకు అంతగా తెలియదు కాని నేను తెవికీలో చేరినప్పటి నుంచి చూస్తున్నాను మీ అంతటి కృషి చేసినవారెవరూ తెవికీలో లేరని. అంతమాత్రానా ఇతర సభ్యులను తక్కువచూపు చూసినట్లు కాదు కాని మీ అసమాన కృషికి ఎలా పేరుపెట్టాలో అర్థం కాక ఆ టైటిల్ ఉంచాను. ఇక అనామక సభ్యుడి రచనలు ఉండకూడదని కాదు కాని అవి పక్షపాతంతో, కొందరిని నొప్పించేవిగా, అర్థంపర్థం లేనివిగా, అతిచిన్నవిగా, మతాలకు-సంస్కృతికి వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకే కొన్నింటిని వికీకరించి అనవసర వ్యాసాలను తొలిగించడానికి ప్రయత్నంచేద్దాం. -- C.Chandra Kanth Rao(చర్చ) 09:33, 28 డిసెంబర్ 2008 (UTC)

I translated those pages from Anglo-Wikipedia. If there is any objection with those pages, you should request Anglo-Wikipedia administrators to remove those pages. How can telugu Wikipedia administrators decide the canonicity of Anglo-Wikipedia articles> [Kumarsarma]

పైజాసత్య గారుసవరించు

ఈ మధ్య తెవికీకి ఓ జాడ్యం దాపురించింది, ఈ జాడ్యాన్ని దూరం చేయుటకు, తెవికీ సభ్యులు చేపట్టిన పనులు అపూర్వం. ప్రత్యేకంగా 'పైజాసత్య'గారు, మహాభారత యుద్ధంలో అర్జునునిలా కృషి సల్పుతున్నారు. వీరికి మన॰పూర్వక అభినందనలు. తెవికీ సభ్యులంతా వీరివెంట ఉన్నారని నా ప్రగాఢ నమ్మకం. పైజాసత్యగారూ, మీరు నిర్భయంగా అప్రతిహతంగా మీ నిర్వాహక కార్యక్రమాలు నిర్వహించండి. మీవెంట మేమున్నాం. నిసార్ అహ్మద్ 09:11, 28 డిసెంబర్ 2008 (UTC)

క్లారా జెట్కిన్సవరించు

వైజాసత్యగారు, నా చర్చాపేజీ పై ఒక ఐపి సభ్యుని చర్చ ఇది - [2]. తొలగించబడిన పేజీ కావున అందులో విషయమేమిటో నాకు తెలియట్లేదు. కానీ, క్లారా జెట్కిన్ మాత్రం పేరున్న మహిళ. ఆవిడ పై ఆవికీలోని వ్యాసం ఇదిగో - en:Clara Zetkin. --Gurubrahma 10:28, 28 డిసెంబర్ 2008 (UTC)

There are people who cannot tolerate feminism and they consider it as western culture. When I had translated the article on paganism, then also they expressed their intolerance. Kumarsarma

గురుబ్రహ్మ గారూ, ఆ పేజీలో పెద్ద విషయమేమీ లేదు. ఈమె ఫలానా దేశపు స్త్రీవాది అని ఉంది. ఈ సభ్యునితో ఇంతకు ముందు సహనంతో పనిచేసే ప్రయత్నం ఇక్కడ జరిగింది. వాడుకరి_చర్చ:Kumarsarma. అనేక ఐ.పీలు మార్చుకొని వికీ నియమాలను ఉల్లంఘిస్తుంటే చెక్ యూజర్ కూడా చేయించాను. వికీపీడియాలో సభ్యులు తక్కువ ఉన్నారు కాబట్టి పెద్దసంఖ్యలో ప్రాపంగాండా వ్యాసాలు సృష్టించి మొత్తం తెవికీని మార్కిస్టు ప్రచారోద్యమ సాధనంగా మలిచే ప్రయత్నం చేశారు. మీ పేజీలో వ్రాసిన సందేశాన్నే ఒక 50 యాధృఛ్ఛిక పేజీల్లోనూ ఇష్టమెచ్చినట్టు అతికించాడు. ఇతని ఆంగ్ల వికీ పేజీలో స్వయంగా ఐ.ఎస్.పీ ఆపరేటర్ అని చెప్పుకున్నాడు. open proxy ఉపయోగిస్తున్నాడనుకుంటా. --వైజాసత్య 16:51, 28 డిసెంబర్ 2008 (UTC)


I think you are not aware about DHCP. I have 5 DHCP servers. 95% of the dial up internet connections in my district are connected to my servers only. We have bulk number of IPs assigned to our servers. Dynamic IP addresses automatically change whenever client is reconnected. There is nothing such as altering IPs. Few of our clients were given static IP and ADSL routers for cost of pay. Others use dial up DHCP connections. Even the client computer used in my home uses dial up DHCP. So, IP addresses often changed.

అవునా! --వైజాసత్య 05:38, 29 డిసెంబర్ 2008 (UTC)
 • సత్యాగారు నేను ఎక్కువగా వికీలో రాయడం కుదరకున్నా రోజూ చూస్తూ ఉమ్టాను. మీరు కాసుబాబు లామ్టి వారు నిరంతరం శ్రమించకుంటే తెలుగువికీ అనేది చాలా బాషలవారికి తెలియదు అన్నట్టే ఉండేది. నిశ్వార్ధంగా పనిచేసే మీలాంటి వారిని గురించి తక్కువచేసి మాట్లాడే వారెవరయినా వారు వికీ అభివృద్దిని అడ్డ్డుకొనేవారికిందే లెక్క. వారిమీద వారి రాతలపై ఎవరు ఎలాంటి చర్యతీసుకొన్నా దానికి నా సంపూర్ణ మద్దతుంటుంది. మామూలు సభ్యులు సైతం ఇలాంతి వారిపై ఎలాంటి చర్య తీసుకోవాలో తెలీయ చెప్పండి దానిని అమలుపరుద్దాం మీ కృషికి అభినందనలతో....విశ్వనాధ్. 08:24, 29 డిసెంబర్ 2008 (UTC)
Return to the user page of "వైజాసత్య/పాత చర్చ 11".